డైలీ సీరియల్

యాజ్ఞసేని -- 107

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇదివరలో స్ర్తిలు నన్ను వలచి వచ్చి నాకు లంచాలిచ్చేవారు. నా పొందు కోరేవారు. నా సౌందర్యం చూచిన స్ర్తి నన్నుదప్ప మరొకరిని యెందుకు లెక్కస్తుంది. నా తెలివితేటలుచూచి యానందించిన స్ర్తి విరహాగ్నిలో పడి వేగిపోకుండా యెట్లాయుండగలదు? నేను యింతవరకు వనితలనాకర్షిస్తూ వచ్చాను. కానీ నేడు నీవొక్కతివే నన్నాకర్షించి యేలుకొన్నావు. ఇంతకంటే నేనే మి చెప్పగల వాడను.’’ అని కీచకుడన్నాడు.
‘‘నా వంటి స్ర్తి యెక్కడ వెదికినా నీకు దొరకదు. తెలియక మాట్లడుతున్నావు. నా శరీరంతో నీ శరీరం తగిలినప్పుడు నీ శరీరం యేమవుతుందో దానిని నీవు తెలిసికొంటావు. నన్ను మిగిలిన సామాన్య స్ర్తిలతో పోల్చుకొన్నానో, నీవు తప్పుచేసినట్లే సుమా! నన్కొకసారి సృజించిన తరువాత, నీవు మరొక యాడుదాని పొందును కోరలేవు. మరింకెవరిపైన యాసక్తిని చూపలేవు!’’ అని పలుకుతూ శయ్యపై నుండి భీముడు తటాలున లేచాడు.
కీచకుడి మనస్సు కలత చెందేటట్లు అట్టహాసం చేసి తన భుజబలం చేత అతడి తల పట్టివంచాడు. కీచకుడు కూడా తన బలాన్ని కూడగట్టుకొని వెనుకాడకుండా గట్టిగా విడిపించుకొన్నాడు. అతడు గంధర్వుడను కొన్నాడు.
భీముడి భుజాలను తన చేతులతో పట్టి బలవంతంగా లాగి నేలమీద పడవేసి అతడి శరీరాన్ని తన మోకాళ్ళతో అదిమి పెట్టాడు. భీముడు దెబ్బతిన్న పామువలె చప్పన లేచి కోపంతో శరీరావయవాలతో విజృంభించి కీచకుడి బాహువులను పట్టుకొన్నాడు. కొంతసేపు యిద్దరూ అనాయాసంగా భుజబలాల ఆడంబరంతో ఒకరినొకరు త్రోసికొంటూ భయంకరంగా పోరాడారు.
ఆ సమయంలో తానటువంటిచోట వున్నానని యితరులు తెలిసికొంటారేమోనని కీచకుడు, అజ్ఞాతవాస ప్రతిజ్ఞకు భంగం కలుగుతుందేమోనని భీమసేనుడు లోలోన జంకుతూనే చప్పుడుగాకుండా పిడికిలి పోట్లదెబ్బలతో పోరాడారు. ఎన్ని విధాలైనా ఒకరినొకరు తగ్గలేదు. ఆయా సమయాలలో కోపంతో యిరువురూ ఒకరికి మరొకరు అసాధ్యులైపోరాడారు. ఇలా ఒకరితో ఒకరు పోరాడగా భీముడి భుజశక్తి క్రమంగా పెరగసాగి, నీచుడైన కీచకుడి భుజశక్తి తగ్గసాగింది.
అప్పుడు కీచకుడు బలహీనపడటం గ్రహించిన భీముడు సింహం జింకమీద పడి వెంటనే దానిని నేలమీద పడవేసి భయంకరంగా దానిని మొత్తమెలా ఆక్రమిస్తుందో అట్లా కీచకుడిని పొడిచిపెట్టాడు. అయినా కీచకుడు తనశక్తినంతా కూడగట్టుకొని పెనగి పైకి లేచాడు. కీచకుడు తప్పించుకొనచూచినా, భీముడు మిక్కిలి కోపంతో అతడి ఆయువుపట్టులో దారుణంగా పొడువగా కీచకుడి కనుగ్రుడ్లు బయటికి వచ్చి నేలమీద పడి తన్నుకున్నాడు.
వివిధ రత్నాలంకార భూషితుడైన కీచకుడిని భీముడు పడగట్టి చంపాడు. అతడిని సమీపించి అతడి కళేబరాన్ని పట్టుకొని తల, చేతులు, పాదాలను మొండెంలోనికి చొచ్చుకొనేటట్లుగా దూర్చి నిండు సంచీవలెయున్న శవాన్ని నేలమీద పడవేసి నలిపి, గుండ్రని మాంసపు ముద్దగా చేశాడు.
భీముడి బలంమీద నమ్మకం కలిగినప్పటికీ, కీచకుడిని చంపగలడో లేడో అనే భయం ద్రౌపదికి కలిగింది. కీచకుడి చావు చూడటం ఎప్పుడా అని తొందరపడుతున్న ద్రౌపదికి కీచకుడు చచ్చాడని చెప్పి, దీపం పెద్దదిచేసి, కీచకుడి శవాన్ని ద్రౌపదికి చూపించాడు. ద్రౌపది ఆశ్చర్యంతో వింతగా పడియున్న కీచకుడి శవాన్ని చూచింది. అలా చూస్తూ వెళ్లి మెటికలు విరుస్తూ తలవూపి ముక్కుమీద వేలువేసుకొని.... ‘‘ఓరీ కీచకా! దీని కొరకేనా యింత చేశావు? ఇకనైనా శాంతంగా ఉండుము. అట్లా విజృంభిస్తే యిట్లానే జరుగుతుంది’’ అని అంటుండగా భీముడు.
‘‘నేను అనుకున్న పనిని నెరవేర్చాను. భార్య అవమానాన్నీ, దుఃఖ భారాన్నీ పోగొట్టాను’’ అని మనస్సులో అనుకొంటూ ద్రౌపదిని చూచి
‘‘ఓ పద్మముఖీ! గుండెలో ములికి వంటి నీ దుఃఖం తీరిందా? నా బలోద్రేకం నీ మనసుమెచ్చిందా? నీకోపం శాంతించిందా? దుష్టుడూ, నీచుడూ అయిన కీచకుడి భంగపాటు చూచావు గదా? సంతోషం కలిగిందా? దుర్భుద్దితోనీ పొందుగోరి వారికీ, ఎంతటి బలవంతుడైనా, నా చేతిలో చావుదప్పదు. అది అంతే’’ అని అన్నాడు అందుకు ద్రౌపది
‘‘ప్రభూ! నిన్ను విరటుడి కొలువులో అంత కోపోద్రేకం కలిగినా కలతత పడకుండా నిగ్రహించు కొని నిలిచిన నీ ధీరస్వభావ మహిమ చూడ నాతరమా?
..........................ఇంకావుంది