డైలీ సీరియల్

బంగారుకల 31

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ సువిశాల విజయనగర సామ్రాజ్యం మంచి చెడ్డలు నాకన్నా నీకన్నా అప్పాజీవారికి బాగా తెలుసు. నువ్వు నిశ్చితంగా ఉండొచ్చు’’ తీవ్రంగా హెచ్చరించిందామె. వల జారిపోయింది.
వీరేంద్రుడు దెబ్బతిన్న పులిలా చూశాడు. అతని మొహం కోపంతో జేవురించింది.
‘‘జగన్నాథ! నువ్వింత అమాయకురాలివి కాబట్టే రాజుగారు ఆడింది ఆట, పాడింది పాట అయింది. ఆ దేవదాసీని గజపతుల ఇంటి ఆడపడుచుతో సమానంగా కూచోబెట్టాడు. రేపు నీ కుమారుని పట్ట్భాషేకం ఏం జరుగుతుందో! దానిని కళ్ళారా చూడాలనే నా తాపత్రయం. నీ పుట్టింటి బంధువును కదా. శ్రేయస్సు కోరి చెప్పాను. నీ యిష్టం తల్లీ’’ వీరేంద్రుడు విస విసా వెళ్లిపోయాడు.
చాటునుంచి అంతా వింటున్న మంజరి వ్యధ చెందింది.
వీరేంద్రుడు వెళ్లిపోయాక అన్నపూర్ణాదేవి సుదీర్ఘమైన ఆలోచనలో పడటం మంజరి గ్రహించింది. ఆ సమయంలో తాను తెచ్చిన విషాద వార్తను వినిపించటం ఎలా?
చీకటి పడినా ఎవరూ దీపాలు వెలిగించలేదు. అన్నపూర్ణాదేవి చుట్టూ చూసింది. కటిక చీకటి. దూరాన హాజారా రామ దేవాలయంలోంచి చిరువెలుగు కన్పిస్తున్నది. ధ్వజస్తంభం గంటల చప్పుడు మనసుకు ప్రశాంతతను ప్రసాదిస్తోంది.
‘‘ఎవరక్కడ?’’ అన్నపూర్ణాదేవి పిలిచింది. ఎవరూ పపలుకలేదు. మరోసారి పిలిచింది. పరిచారిక వచ్చింది చిన్నదీపంతో.
‘‘దీపాలు వెలిగించలేదు. ఇదేమిటీ దివ్వె?’’ తీవ్రంగా అడిగింది అన్నపూర్ణాదేవి.
‘‘దేవీ! ఒక సంతాపవార్త. చిన్నాదేవిగారు అస్తమించారు. రాజమందిరాలన్నింటిలో దీపాల ఉజ్వలత తగ్గించమని తిమ్మరుసుగారు సెలవిచ్చారు’’ మెల్లగా చెప్పి దీపం ఉంచి పరిచారిక వెళ్లిపోయింది.
ఈ వార్తకు అన్నపూర్ణాదేవి మ్రాన్పడి పోయింది.
చిన్నాదేవి ఎంతటి కళాసౌందర్యగని! ఆమెను అంతా దేవదాసి అంటారు. ఆమె ఎవరికి ఎక్కడ పుట్టిందో తెలీదు. ఆమె నాట్యం, సంస్కారం, రాజసం వెలయాలనిపించవు. పెంచిన తల్లి నేర్పిన విద్యగాక జన్మతః అబ్బిన సంస్కారాలు ఆమెకు వనె్న తెచ్చాయి. స్ర్తిలయిన తామే ఆమె పట్ల ఆకర్షితులయితే కళాపిపాసి అయిన ప్రభువు ఆమెను వలచుటలో వింతలేదు. తామందరికన్నా ముందు రాయల మనసు దోచిన అదృష్టవంతురాలు. కొన్ని దినాలుగా అస్వస్థురాలుగా ఉన్నదామె. తాను ఒకసారి చూడబోతే!
‘‘సోదరీ! నాకిక సెలవు’’ అని కన్నీరు నింపుకుంది.
తన మనస్సెంత కలవరపడింది. ఆమెనెంతో ఓదార్చింది. రాజవైద్యులను ఆమె అనారోగ్యం గురించి అడిగి తెలుసుకుంటున్నది. ఈనాటికీ విషాదాన్ని ప్రభువు ఓర్వగలడా! ‘చిన్నాజీ’ అని ఆప్యాయంగా ఆమెను ఒడి చేర్చే ప్రభువు దుఃఖాన్ని తామెందరు రాణులున్నా తీర్చలేరు. శ్రీకృష్ణదేవరాయలవారి జీవితంలో చిన్నాదేవి స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. ఆలోచిస్తుండగా పరిచారిక వచ్చింది.
‘‘అమ్మా! మేనా సిద్ధం’’
అన్నపూర్ణాదేవి మేలిముసుగు సవరించుకుని జగన్నాథుని కోసారి నమస్కరించి మేనా ఎక్కింది. స్వంత సోదరి మరణవార్త విన్నంతగా ఆమె మనస్సు తల్లడిల్లిపోతున్నది. చిన్నాదేవి మందిరం ముందు మేనా ఆగింది. మూర్త్భీవించిన విషాద దేవాలయంలా ఉన్న ఆ మందిరంలోకి అన్నపూర్ణాదేవి దుఃఖితయై అడుగుపెట్టింది.
విచిలితుడైన ప్రభువుని చూసి మరింతగా కన్నీరు పెట్టిందామె. శ్రీవారిని పలకరించే సాహసం ఎవరికీ లేదు. శ్రీకృష్ణదేవరాయ ప్రభువు అనుంగు దేవేరి చిన్నాదేవిని సాగనంపటానికి అంతిమ ఏర్పాట్లు అప్పటికే మొదలైనాయి.
***
చిన్నాదేవి మరణించిన దుఃఖం నుంచి రాయలు ఇంకా కోలుకోలేదు. వీరేంద్రునికిది మహదవకాశం. రాజ్యాధికారానికి సంబంధించిన ప్రతి అంశంలోనూ తిమ్మరుసుకు అతడు అవరోధాలు కల్పిస్తున్నాడు. రామలింగేశ్వర నాయకుడు, గండమ నాయకుడు మొదలైన సేనా నాయకులతో వారి ఇష్టా ఇష్టాలతో నిమిత్తం లేకుండా మంతనాలు చేయాలని ప్రయత్నిస్తున్నాడు వీరేంద్రుడు.
తిమ్మరుసు మంత్రి తీవ్ర దుఃఖాంధ్రకారంలో మునిగిపోయిన రాజును చైతన్యవంతుడ్ని చేయటానికి చాలా ప్రయత్నిస్తున్నారు.
శని వీరేంద్రుని రూపంలో విజయనగరంలో తిరుగుతున్నది. అతడు అనుక్షణం రాజ్యాన్ని ఏ విధంగా అల్లకల్లోలం చేయాలా అని ఆలోచిస్తున్నాడు. కానీ అడుగడుగునా మహామంత్రే అతనికి అడ్డంకిగా మారాడు. అంతకుమించి అత్యంత విశ్వాసపాత్రులుగా ఉండే సైన్యాధిపతులు.
సహోద్యోగులు కూడా కంటకప్రాయంగా ఉన్నారు. వీరేంద్రుడేది మాట్లాడినా రాజ్యక్షేమం గురించే అన్నట్లు ప్రవర్తించేవాడు. అన్నిటా తానే ఉండేవాడు. అయినా అతనిమీద ఎవరికీ సదభిప్రాయం కలుగలేదు. తిమ్మరుసుకు మాత్రం వీరేంద్రుడేదో దూరాలోచనలో ఉన్నాడని అర్థమవుతున్నది.
***
మంజరి చంద్రప్పలు సుదీర్ఘాలోచనలో విచారంగా ఉన్నారు.
‘‘నువ్వు చెప్పింది అక్షరాలా నిజం. వీరేంద్రుడు కాలసర్పం. నేను రాయలవారి అంగరక్షకుడిగా ఉన్నాను కదా! నిరంతరం ప్రభువు చెంత ఉండటంవల్ల వాడు ప్రభువుల వార్కి తిమ్మరుసు మహామంత్రి గురించి విషం ఎక్కించే ప్రయత్నం చేయటం చూస్తున్నాను. ప్రభువు వీరేంద్రుని మాటలు నమ్మినట్లు కనపడరు.
కానీ చెప్పగా చెప్పగా ఎవరికైనా చెడు తలపులు వస్తాయని నా భయం’’ చంద్రప్ప మంజరికి చెప్పాడు.
‘‘రాయలవార్కి తిమ్మరసుల వారు తండ్రితో సమానం. అంతకంటే ఎక్కువే! అయినా ఆలోచించాల్సిందే! ఈ వీరేంద్రుడు అన్నపూర్ణాదేవిగారు పద్మమహల్‌లో విడిది చేసినపుడు కూడా వదిలిపెట్టలేదు.

- ఇంకా ఉంది

-చిల్లర భవానీదేవి