డైలీ సీరియల్

యాజ్ఞసేని--112

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందుచేత పట్టుదలతో దానిపై పరాక్రమాన్ని చూపడానికి పోతున్నాను. ఈ సమయంలో నా రథానికి బృహన్నల సారథి అయితే అందరూ నవ్వుతారు. నగరంలో సారథులు కరువయ్యారా అని అంటారు’’ అని అనగా
‘‘ఓ ఉత్తరా! కురుసైన్యమే గాదు, ముల్లోకాలు ఒకేమారు మీదపడ్డా-సరే, రథం బృహన్నలవశమై సాగితే చాలు గెలుపు తప్పదు. అతడి పరాక్రమం నాకుముందే బాగా తెలుసు. ఏ కారణం వలననో దేహంలోయేదోకొద్ది మార్పు కనిపించగానే సహజంగా వున్న పరాక్రమం తగ్గిపోతుందా?’’ అని ద్రౌపది అన్నది.
బృహన్నలను సారథిగా చేసికొనేందుకు మనసు ఒక ప్రక్క అనుమానిస్తున్నా అప్పటికి వేరేవాళ్ళు లేకపోవడంతో ఉత్తరుడు అతడినే పిలవటానికి విధిలేక ఒప్పుకొన్నట్లు చెప్పాడు. ఉత్తరుడు అలా తానొప్పుకొన్నట్లు చెప్పగానే ఉత్తర బృహన్నలను పిలవడానికి వెళ్ళింది.
‘‘గురువర్యా! మా అన్నగారి సారథి ఒక యుద్ధంలో చనిపోయాడు. తనకు సరిపోయే సారథి దొరక్కపోవడంతో మరెవరినీ నియమించలేదు. ఇప్పుడు కౌరవులు మా ఆలమందలను పట్టుకొన్నారనే వార్త వచ్చింది. సారథి లేక దిగులు పడుతున్న మా అన్నకు సైరంధ్రి నీ నేర్పును గురించి తెలియపరచింది. అందుకు సంతోషించిన మా అన్నగారు నిన్ను తీసికొని రావడానికి నున్న పంపాడు. ఈ ఆపద నుండి కాపాడాలి. నీవు దీనికి ఒప్పుకొనకపోతే రినా మీద నీకు వాత్సల్యం లేదని అనుకోవలసి వస్తుంది’’ అని అన్నది. బృహన్నల అందుకు నవ్వుతూ
‘‘ఓ రాకుమారీ! సారథ్యం చేసే నేర్పు నాకు ఉన్నదా? నీ మాట కాదనటానికి నాకు భయంగా ఉన్నది. సరే. అట్లా జరగాలని ఉందేమో? ఓ ఉత్తరా! నీవు నన్ను వేడుకొన్నావు గనుక రథసారథ్యం ఒకటేమిటి, ఎంత కష్టమైనా యేపనైనా చేసి నీకు సంతోషాన్ని కలిగిస్తాను’’ అని అన్నాడు.
అలా అంటూ బృహన్నల ఉత్తరుడి వద్దకు బయలుదేరాడు. అల్లంత దూరాననే బృహన్నలను చూచిన ఉత్తరుడు గౌరవంతో
‘‘ఓ బృహన్నలా! కౌరవులతో నాకు కయ్యం వచ్చింది. నీవు నాకు రథాన్ని తోలాలి. త్వరగా రావాలి! కవచాన్ని ధరించి రథాన్ని ఎక్కాలి. తప్పించుకొనాలనుకుంటే నీకు వీలుపడదు. నీ పరాక్రమాన్నీ, గొప్పదనాన్నీ, బాహుబలాన్నీ, సారథ్యంలోని చాతుర్యాన్నీ గురించి సైరంధ్రి నాకు ముందే చెప్పింది.’’ అని అన్నాడు.
ఉత్తర కుమారుడి మాటలకు ఎదురుచెప్పటానికి జంకినట్లు జంకి బృహన్నల ఒప్పుకొన్నాడు.
యుద్ధానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్న సారథి అయిన బృహన్నలను చూచి ఉత్తరా, ఆమె చెలికత్తెలు
‘‘కురు వీరులను జయించి, వాళ్ళ తలపాగాలలో రంగురంగులతో మెఱసేటటువంటి, కన్నుల కింపుగా వుండేవాటిని, వాసి తెలిసి బొమ్మపొత్తికలకు తీసికొని రండి’’ అని అన్నారు.
***
ఉత్తరుడు అర్జునుని రథసారథిగా చేసికొని కురుసైన్యాన్ని యెదుర్కొనటానికి బయలుదేరివెళ్ళాడు. నేల రుూనినట్లుగా కనిపించిన ‘కురుసైన్యాన్ని’ చూచిన ఉత్తరుడు నఖశిఖ పర్యంతం భయకంపితుడైనాడు. అప్పటివరకు పలికిన ప్రగల్భాలు యెటుపోయాయో? కురు సైన్యాన్ని తాను యెదిరించి పోరాడలేనని రథాన్ని దిగి పారిపోవడం మొదలెట్టాడు. అప్పుడు అర్జునుడు ఉత్తరుడి వెంట పడి పరుగెత్తి అతడిని పట్టుకొని తాను అర్జునుడిననీ, కంకుడు ధర్మరాజనీ, వల్లభుడు భీమసేనుడనీ, దామగ్రంథి, తంత్రీపాలురు నకుల సహదేవులనీ తెలియపరచి, తాము అజ్ఞాత వాసాన్ని విరటుని కొలువులో యే ఆటంకాలు లేకుండా పూర్తిచేశామని చెప్పాడు. ఉత్తరుని నమ్మించటానికి తనకు గల పది నామాలను వివరించి, అతడిని శమీవృక్షం వద్దకు కొనిపోయి తన గాండీవాన్ని తెప్పించుకొన్నాడు.
ఉత్తరుని తనకు రథసారథిగా చేసికొని కురు సైన్యాన్ని ఒక్కడే ఓడించి ఆవుల మందలను వెనుకకు మరలించుకొని విరాట నగరానికి వచ్చాడు. ఉత్తరుడు విరాట రాజుకు, అసలు విషయాన్ని వివరించి చెప్పి కొలువులో వున్న ధర్మరాజ భీమనకుల సహదేవులు యెవరో తెలియజెప్పాడు.
సంతోషించిన విరాటరాజు ‘ఉత్తర’ను అర్జునునికి యివ్వజూపగా అర్జునుడు వలదని ఆ ఉత్తరను తన కుమారుడైన ‘అభిమన్యునకు’ యిచ్చి వివాహం జరిపించాడు. వివాహానికి పాంచాల, యాదవరాజులందరూ వచ్చారు.
..........................ఇంకావుంది

--త్రోవగుంట వేంకట సుబ్రహ్మణ్యము