డైలీ సీరియల్

పంచతంత్రం--16

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సైబర్‌క్రైమ్ డిపార్ట్‌మెంట్‌లో కానిస్టేబుల్ స్థాయిలో పనిచేస్తుంటాడు పండిట్. అవసరం అయినప్పుడు పండిట్ సహాయం తీసుకుంటూ ఉంటాడు నిరంజన్ అతడి గ్యాంగ్ మెంబర్స్.
‘‘అలాగే అన్నా! ఆ పండిట్‌ని కలుస్తా’’అంటూ చెప్పాడు బాల్‌రాజ్.
‘‘నేను వస్తున్నా! అక్కడే ఉండండి..!!’’ అంటూ చెప్పి కార్‌లో బయలుదేరాడు నిరంజన్.
తాను వస్తున్నట్టు నిరంజన్ చెప్పగానే-
‘‘జరిగింది అంతా అన్నకు చెప్పకండి!. కాలుజారి మ్యాన్ హోల్లో పడ్డాను అని అన్నతో చెపుతా’’అంటూ పఠాన్, బైరాగిలతో అన్నాడు బాల్‌రాజ్.
అందుకు వాళ్ళు అంగీకరించారు.
సరిగ్గా అరగంట తర్వాత బాల్‌రాజ్ ఇంటివద్దకు చేరుకున్నాడు నిరంజన్. అప్పటికి బాల్‌రాజ్ ఇల్లు పూర్తిగా తగలపడిపోయింది. డ్రైనేజిలో మునిగి దుర్గంధం వెదజల్లుతున్న బాల్‌రాజ్‌ను చూసి షాక్ అయి ముక్కు మూసుకున్నాడు నిరంజన్.
‘‘కాలు జారి, డ్రైనేజీలో పడిపోయాను అన్నా!?’’అంటూ చెప్పాడు బాల్‌రాజ్ ముక్కుమూసుకున్న నిరంజన్‌తో. ఇంట్లో కరెన్సీ ఎంత ఉంది? కోపంగా అడిగాడు నిరంజన్.
‘‘రెండు కోట్లు ఉంటుంది అన్నా.. మొత్తం బూడిద అయిపోయిందన్నా...! అంతేకాదన్నా! పది కోట్ల రూపాయల తాలూకు ప్రామిసరీ నోట్లుకూడా తగలబడి పోయాయన్నా!... అన్నా!... షార్ట్ సర్క్యూట్ అయింది అన్నా!’’అంటూ ఏడుపు గొంతుతో చెప్పాడు బాల్‌రాజ్.
నిరంజన్‌కి బాల్‌రాజ్‌ని పట్టుకుని బాగా తన్నాలి అని ఉన్నది. కానీ ఈ పరిస్థితుల్లో బాల్‌రాజ్‌ని ముట్టుకోవటం అసంభవం. దాంతో బాల్‌రాజ్‌ని తనే్న పనికి స్వస్తిచెప్పాడు నిరంజన్.
‘‘అన్నా!... డ్రైనేజీలో పడి దెబ్బలు బాగా తగిలాయి. ఆ కొండాపూర్, అలకాపూర్ రిజిస్ట్రేషన్స్ ఒకరోజు పోస్ట్ఫోన్ చేద్దాం అన్నా!’’అంటూ అడిగాడు బాల్‌రాజ్.
అందుకు నిరంజన్ అంగీకరించాడు.
తర్వాత అనుమానంగా గాజు పెంకులతో గాయపడిన పఠాన్, బైరాగిల వైపు చూస్తూ అడిగాడు నిరంజన్.
‘‘మరి వీళ్లకు ఎందుకు దెబ్బలు తగిలాయి?’’
‘‘ఇల్లు తగలపడుతుంటే... మంటల్ని ఆర్పడానికి ప్రయత్నించారన్నా!’’
‘‘సరే! ఇకనుంచి జాగ్రత్తగా ఉండు!!’’ అంటూ వార్నింగ్ ఇచ్చి అక్కడినుంచి బయలుదేరాడు నిరంజన్.
నిరంజన్ బయలుదేరగానే పఠాన్, బైరాగిలతో అన్నాడు బాల్‌రాజ్.
‘‘డ్రైనేజీలో పడితే పడ్డానుగాని, అన్న నుంచి తన్నులు తప్పించుకున్నా’’అంటూ చెప్పి హి...హి...హి... అంటూ నవ్వాడు.
ఓ పక్కగా నిలబడి బాల్‌రాజ్, నిరంజన్, బైరాగిలను గమనిస్తున్నారు కార్తిక్, అతడి మిత్రులు.
కొత్తగా వచ్చిన వ్యక్తితో బాల్‌రాజ్, నిరంజన్, బైరాగి భయంగా, గౌరవంగా మాట్లాడుతుండటంతో అతడే నిరంజన్ అని వాళ్ళు నిర్ధారించుకున్నారు.
నిరంజన్ కారులో బయలుదేరగానే వాళ్ళు అతడిని బైక్‌మీద వెంబడించసాగారు.
ఓ అరగంట తర్వాత నిరంజన్ తన ఇంటికి చేరుకున్నాడు.
ఆ తర్వాత కార్తీక్ అతడి ఫ్రెండ్స్ తమ ఇళ్లకు చేరుకున్నారు.
కార్తీక్‌తో చెప్పాడు వాసుదేవరావు.
‘‘ఆ బాల్‌రాజ్‌నుంచి ఫోన్ వచ్చింది... రిజిస్ట్రేషన్ ఒకరోజు పోస్ట్ఫోన్ అయింది.’’
ఈ మాట వినగానే కార్తీక్ ముఖంలో చిరునవ్వు ప్రత్యక్షం అయింది.
* * *
తెల్లవారుఝామున ఐదు గంటల సమయం.
జైరాం గాఢంగా నిద్రపోతున్నాడు. పక్కనే టీపాయ్ మీద ఉన్న సెల్‌ఫోన్ మోగింది. ఐదారుసార్లు రింగ్ అయిన తర్వాత బద్ధకంగా కళ్లుతెరిచి ఫోన్ అందుకుని చూసాడు. స్క్రీన్‌మీద కార్తీక్ పేరు కనపడింది. వెంటనే అతడి నిద్ర మత్తు ఒక్కసారిగా వదిలిపోయింది. ఫోన్ రిసీవ్ చేసుకుని-
‘‘హలో...!’’ అన్నాడు జైరాం.
అవతలి నుంచి కార్తీక్ గొంతు వినపడింది.
‘‘మనవాళ్ళు అందరినీ కాన్ఫరెన్స్‌లో పెట్టా!... గోపిక కూడా లైన్‌లో ఉంది.’’
‘‘ఈ టైములో ఫోన్ చేసాడంటే ఏదో విశేషం ఉండి ఉంటుంది.’’ అనుకుంటూ...
‘‘ఊఁ! సడన్‌గా ఏదన్న ఐడియా వచ్చిందా?’’అన్నాడు జైరాం.
కార్తీక్ చెప్పసాగాడు.
‘‘... రిజిస్ట్రేషన్స్ ఒక్కరోజు ఆగాయి... మనకు ఇంకా ఇరవై నాలుగు గంటల సమయం ఉంది....’’
‘‘ఆ టైం సరిపోతుందా?’’ అన్నాడు జైరాం.
సమాధానంగా చెప్పాడు కార్తీక్.
‘‘ఒక్కరోజులో ఎంతో చెయ్యవచ్చు...’’
క్షణం ఆగి కొనసాగించాడు కార్తీక్.
‘‘ఏం చెయ్యాలా?... అని ఆలోచిస్తూ పడుకున్నా.. నిద్రలో కూడా ఏవో ఆలోచనలు... అకస్మాత్తుగా అరగంట క్రితం ఒక ఐడియా వచ్చింది...’’
‘‘అంటే...! తెల్లవారుఝామున నాలుగున్నరకి!’’
‘‘అవును...!... ఆ నిరంజన్‌గాడు తనదగ్గర డబ్బు ఉండటంతో... మనల్ని, జనాన్ని బాధపెడుతున్నాడు... వాడి దగ్గర అసలు డబ్బే లేకుండా చేస్తే... ఎలా వుంటుంది?’’
జైరాం ఏదో అనబోయాడు. అంతలో కాన్ఫరెన్స్‌లో ఉన్న గోపిక కంఠం వినపడింది.
‘‘ఐడియా బాగుంది!. ఏం చేద్దామో చెప్పు...!’’
‘‘వాడి గురించి మనకు తెలిసింది చాలా తక్కువ!... పెద్దనోట్ల రద్దు తర్వాత, బ్లాక్‌మనీని వైట్ చేసుకునే ప్రయత్నంలో వాడి దృష్టి మన మీద పడింది. వాడి నెక్స్ట్ స్టెప్ మనకు తెలియాలి. దాన్నిబట్టి... మనం రియాక్ట్ అవ్వాలి. గుర్తుపెట్టుకోండి. మనం ఎవరమో వాడికి తెలియకూడదు.’’
‘‘ఓకే! నీ ఐడియా ఏంటో చెప్పు?’’ రవి గొంతు వినపడింది.
‘‘డ్రోన్...! మనకు ఒక డ్రోన్ కావాలి..’’
ఆ మాటకు కాన్ఫరెన్స్‌లో ఉన్న మిగిలిన వాళ్ళు అంతా ఆశ్చర్యపోయారు.
గోపిక అడిగింది.
‘‘డ్రోన్... అంటే... యుద్ధంలో ఉపయోగిస్తారే... అదేనా?...’’
‘‘కాదు....! పెళ్లిళ్లలో వీడియో కవరేజ్‌కి ఉపయోగించే డ్రోన్... ఎంత చిన్న సైజ్‌లో ఉంటే అంత మంచిది. బ్లాక్ ఆర్ బ్లూకలర్స్‌లో ఉంటే బెటర్. అది నిశ్శబ్దంగా పనిచేయాలి. బ్యాటరీ బ్యాక్‌అప్ బాగుండాలి. సిగ్నల్ రేడియస్ పెద్దదిగా ఉండాలి... దాని జాయ్‌స్టిక్ చిన్నదిగా ఉండాలి. మనం దాన్ని అద్దెకు తీసుకుందాం, లేదా కొనేద్దాం... అందరూ ఆ పనిమీద ఉండండి. నేను కూడా నా ట్రయల్స్‌లో ఉంటాను. ఎవరికి ముందు దొరికినా వెంటనే కాంటాక్ట్‌లోకి రండి.’’
కార్తీక్ చెప్పటం ముగించాడు.
-సశేషం

-జి.వి.అమరేశ్వరరావు