డైలీ సీరియల్

పంచతంత్రం-17

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అప్పుడు సమయం ఉదయం ఎనిమిది గంటలు అవుతోంది.
వేడి వేడి కాఫీ తాగుతూ ఆలోచిస్తోంది గోపిక. అకస్మాత్తుగా ఆమెకు మందాకిని గుర్తుకువచ్చింది. వెంటనే మందాకినికి ఫోన్ చేసింది. వెంటనే లైన్లోకి వచ్చింది మందాకిని. ‘‘నీతో మాట్లాడాలి చాలా అర్జంట్!.’’ అంటూ మందాకినితో చెప్పింది గోపిక.
‘‘సరే! వెంటనే రా!’’అంటూ సమాధానం చెప్పింది మందాకిని.
మందాకిని చెల్లెలు రాధిక, గోపిక ఇద్దరూ క్లాస్‌మేట్స్. గోపిక కంటే ఐదేళ్లు మందాకిని పెద్దది. ఐనా మందాకినితో గోపికకు మంచి స్నేహం ఉంది.
ఇంటర్ తర్వాత జెఎన్‌టియులో ఫొటోగ్రఫీ డిగ్రీ చేసింది మందాకిని. తర్వాత ఉద్యోగంకోసం ప్రయత్నించకుండా ముంబైలో సినిమాలకు పనిచేసే ఒక కెమెరామెన్ దగ్గర కొన్నాళ్ళు అసిస్టెంట్‌గా పనిచేసింది. ప్రస్తుతం హైదాబాద్‌లో ఒక కెమెరా యూనిట్ పెట్టింది. సినిమా షూటింగ్‌లకు, షార్ట్ ఫిలిమ్స్ తీసేవాళ్లకు కెమెరాలు అద్దెకు ఇస్తుంటుంది.
సాధారణంగా షూటింగ్స్ ఉదయం ఆరు, ఏడూ గంటలకే మొదలవుతాయి. ఒకోసారి అవుట్‌డోర్ షూటింగ్స్‌కి ఉదయం ఐదింటికే కెమెరాలు అందచేయాలి. అందుకని ఎర్లీగా ఆఫీస్ ఓపెన్ చేస్తుంది మందాకిని.
సరిగ్గా అరగంట తర్వాత మందాకినిని కలిసింది గోపిక. అప్పటికే అక్కడ కస్టమర్లు ఉన్నారు. వాళ్ళను పంపించిన తర్వాత.
‘‘ఏంటి విశేషం? నువ్వుకూడా ఏదన్నా సినిమా తీస్తున్నావా?’’అంటూ నవ్వుతూ గోపికను అడిగింది మందాకిని.
‘‘అలాంటిదేం లేదు. నాకు అర్జెంటుగా ఒక డ్రోన్ కావాలి’’అంటూ చెప్పి తన రిక్వైర్‌మెంట్స్ కూడా మందాకినితో చెప్పింది గోపిక.
ఈమధ్య సినిమా షూటింగ్స్‌కూ, పెళ్ళిళ్ళకూ, సభలూ, సమావేశాలను చిత్రీకరించడానికి డ్రోన్‌లను వాడుతున్నారు. మందాకిని దగ్గర రకరకాల డ్రోన్స్ ఉన్నాయ్. కెమెరా ఎక్విప్‌మెంట్‌తోపాటు డ్రోన్లుకూడా అద్దెకు ఇస్తుంటుంది మందాకిని. ఆమెవద్ద గోపికకు కావలసిన డ్రోన్ ఉంది. ఆమె దాన్ని గోపికకు ఇచ్చి-
‘‘ఇది లేటెస్ట్ మోడల్...! ఇప్పుడు వచ్చే ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అన్నీ యూజర్ ఫ్రెండ్లీగా ఉంటున్నాయి... పిల్లలు కూడా దీన్ని ఆపరేట్ చెయ్యవచ్చు. ఎందుకైనా మంచిదని యూజర్‌గైడ్ కూడా ఇస్తున్నాను’’ అంటూ ఆ డ్రోన్‌ను ఎలా ఉపయోగించాలో వివరించింది.
* * *
సెల్‌ఫోన్ మోగటంతో చాయ్ కప్పు పక్కన పెట్టి, డిస్‌ప్లే యూనిట్ వైపు చూసాడు పండిట్. వెంటనే ఫోన్ రిసీవ్ చేసుకుని...
‘‘ఏంటన్నా?... ఇంత పొద్దునే్న??’’అంటూ అడిగాడు.
అవతలి వైపునుంచి బాల్‌రాజ్ మాట్లాడుతున్నాడు.
‘‘రాత్రినుంచి ట్రైచేస్తున్నా! ఫోన్ తియ్యటం లేదేంటి?’’
‘‘మందు ఎక్కువైంది... బాగా నిద్ర పట్టింది... చెప్పు!’’
‘‘నాది...ఇంకో ఫోన్ నంబర్ నీకు తెలుసుగా...! దాన్ని ట్రాక్ చెయ్యాలి!’’
‘‘్ఫన్ పోగొట్టుకున్నావా?’’
‘‘అవును!’’
‘‘ఆ సిమ్ము బ్లాక్ చేసి ఇంకో సిమ్ము తీసుకో.’’
‘‘నేనే పెద్ద బద్మాష్ గాడిని!... నా ఫోన్ ఎవడో కొట్టేసాడు... ఆడెవడో చూడాలి అనుకుంటున్నాను. నేనే స్వయంగా వాడిని పట్టుకోవాలి.’’
‘‘సరే నేను డ్యూటీకి బయలుదేరుతున్నా... మొదట నీ పనే చూస్తా.’’
‘‘ఓకే! సాయంత్రం మా బైరాగిగాడో... పఠాన్‌గాడో నిన్ను కలుస్తారు’’అంటూ చెప్పి సంభాషణ ముగించాడు బాల్‌రాజ్.
* * *
బదరీనాథ్ ఫొటో ఎక్విప్‌మెంట్ అనే బోర్డు ఉన్న షాప్‌లో కార్తీక్‌తో చెపుతున్నాడు సేల్స్‌మాన్.
‘‘మీ రిక్వైర్‌మెంట్స్‌తో ఉన్న డ్రోన్ రెడీగా లేదు సర్. డ్రోన్లలో లార్జి, బిగ్, మీడియం, స్మాల్, మినీ, మైక్రో అనే రకాలు ఉంటాయి. మీరు అడిగేది మైక్రోటైపు. ముందుగా ఆర్డర్ పెడితే వారంనుంచి రెండువారాలలో సప్లయ్ చేస్తాం. ఫిఫ్టీ పర్సంట్ అడ్వాన్స్ పే చెయ్యాలి.
‘‘నాకు అంత టైంలేదు...!...’’అంటూ కార్తీక్ ఇంకా ఏదో చెప్పబోతుండగా జేబులోఉన్న సెల్ మోగింది. అవతలనుంచి గోపిక మాట్లాడుతోంది.
‘‘కార్తీక్...! మనకు కావలసింది దొరికింది. నా ఫ్రెండ్ వాళ్ళ అక్క మందాకినికి కెమెరా యూనిట్ ఉంది...’’ ఆమె చెప్పటం పూర్తిచేసే లోగానే అన్నాడు కార్తీక్.
‘‘ఓకే మనం ఎక్కడ కలుద్దాం?’’
‘‘మన ఏరియాలో... కుసుమ హరనాథ దేవాలయం ఉంది కదా, అక్కడ ఎల్లో కలర్ డ్రెస్‌లో నిలబడి ఉంటా. మనం అక్కడ కలుద్దాం’’అన్నది గోపిక.
‘‘సరే!...’’అన్నాడు కార్తీక్.
ఐతే తాను తొడుక్కున్న డ్రెస్ కలర్ గోపిక ఎందుకు చెప్పిందో కార్తీక్‌కి అర్ధంకాలేదు.
* * *
కొద్ది నిమిషాల తర్వాత కుసుమ హరనాథ దేవాలయం దగ్గరకు చేరుకున్నాడు కార్తీక్.
అక్కడ ఎల్లో కలర్ కుర్తా, పైజామా ధరించిన గోపిక చేతిలో బ్యాగ్‌తో నిలబడి ఉంది. ఎవరూ గుర్తుపట్టకుండా ఆమె తన ముఖం చుట్టూ చున్నీ చుట్టుకుని ఉంది. ఆమె ఫోన్లో తనతో తన డ్రెస్ వివరాలు ఎందుకు చెప్పిందో గ్రహించాడు కార్తీక్. అతడు ఆమెదగ్గర బైక్ ఆపాడు. ఆమె ఎక్కగానే బైక్‌ను ముందుకు పోనించాడు.
అతడు బైక్ నడుపుతుండగా చెప్పింది గోపిక.
‘‘్థ్యంక్యూ కార్తీక్!... నిన్నవాడు ఫోన్ చేసాడు... రిజిస్ట్రేషన్ రేపటికి పోస్ట్ఫోన్ అయింది.’’ కార్తీక్ నవ్వి చెప్పాడు.
‘‘నీక్కూడా థాంక్స్!... మనవాళ్ళందరూ ఊరంతా తిరుగుతున్నారు... నాక్కూడా దొరకలేదు. చివరకు నువ్వు సాధించావ్...! మనం దీన్ని ట్రయల్ రన్ వేద్దాం.’’
బైక్‌మీద వెడుతూనే జైరాం, హరీష్, రవిలతో ఫోన్లో కాంటాక్ట్ చేశాడు కార్తీక్.
వాళ్ళు అంతా చాలా దూరంలో ఉన్నారు.
ఇక తిరగనవసరం లేదు అనీ, డ్రోన్ దొరికింది అనీ వాళ్లకు చెప్పి వాళ్ళు ఎక్కడికి రావాలో వివరించాడు కార్తీక్. ఇంజనీరింగ్ కాలేజీ వెనక అడవి లాంటి ప్రదేశంలో, పొదలచాటున బైక్ ఆపాడు కార్తీక్. బాగా వెతికి చూస్తే తప్ప అక్కడ బైక్ ఉన్నట్లు ఎవరికీ తెలియదు.
బైక్ దిగిన గోపిక ముఖం కనపడకుండా చుట్టుకున్న చున్నీతీసి భుజాల మీద వేసుకుంది.
ఇద్దరూ ఆ అడవిలాంటి ప్రదేశంలోకి ప్రవేశించారు. రకరకాల మొక్కలు, వృక్షాలు, పక్షులతో నిండిపోయి ఉందాప్రదేశం. పక్షులు వీనులవిందుగా అరుస్తున్నాయి.
-సశేషం

-జి.వి.అమరేశ్వరరావు