డైలీ సీరియల్

యాజ్ఞసేని--116

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీష్మద్రోణ కృపాశ్వత్ధామ కర్ణశల్యుడూ, దుర్యోధనుడూ, అతడి తమ్ములూ, బాహ్లికుడూ, సోమదత్తుడూ, వీరంతా జయింపశక్యంగాని వారు. కావున యిరుపక్షాలవారికీ పోరాడటం వలన మేలు కలుగదు’’ అని అనగా ధర్మజుడు.
‘‘సంజయా! వినుము. ఇప్పటిదాకా మమ్ములను పొగడి, పిమ్ముట కౌరవులను యుద్ధంలో గెలవటం అసాధ్యమని పొందికగా నీవన్నమాట నేనరంగీకరించను. పక్షపాత బుద్ధి విడిచిపెట్టము. ధృతరాష్ట్రుడికి వివేకం ఉన్నట్లయితే, ‘‘రండి’’ అనిమమ్ములను పిలిపించి, వాళ్ళకు భాగం యివ్వండి అని తన కొడుకులకు చెప్పి, ఇంద్రప్రస్థమో, మరేయింకో పట్టణమో మాకు యిచ్చి పంపటం మంచిది గదా! అని సుతిమెత్తగా అన్నాడు.
ధర్మరాజు పలికిన పలుకులకు సంజయుడు
‘‘కౌరవులు దుష్టస్వభావులై మీకు రాజ్యభాగం యివ్వక చెడిపోవాలనుకొన్నా, మీ సత్ప్రవర్తనకు భయంకరమైన నెత్తుటి కూటికంటే బిచ్చపు కూడు తినటం మేలు. మంచిది. రాజసూయయాగం చేసిన ప్రుణ్యాత్ముడవు. నీ మంచి నడవడి హింసతో కలుషితం కాగూడదు. కపటజూదంలో ఓడినా, లోకులచేత తిట్లుతిన్నా, అడవులలో కష్టపడివున్నా, నీవు ఓరిమియే ధనంగా యిన్నిపాట్లు పడ్డావు. అలాంటి బ్రతుకు బ్రతికి చివరకు క్రూరకర్మకు ఆస్పదమైన యుద్ధమార్గం అవలంభించి బంధువులను, పెద్దలను, గురువులను వెదకి చంపడం శోభించదు. అందువల్ల కలిగే సుఖం సుఖంగాదు. అలాంటి సౌఖ్యం పెద్దలు నిరసించేది. కాబట్టి కోపాన్ని శమింపజేసి శాంతంగా మునుపటి వలనే బ్రతకడం మంచిది’’ అని ధృతరాష్ట్రుడి అభిప్రాయాన్ని విడమర్చి పలికాడు.
సంజయుడు చెప్పిన సారాంశమంతా ధర్మరాజు తమ్ములతో కలిసి యుద్ధానికి పూనుకొనక మళ్ళీ అడవులకో, మరెక్కడికైనా పోయి బిచ్చపుకూడు తింటూ బ్రతకడం మంచిదని.
సంజయుని మాటలకు ధర్మరాజు సంజయునితో
‘‘సంజయా! శ్రీకృష్ణుడు విద్వాంసుడని తెలుసుకో. అతడు కర్మాచరణం యొక్క నిశ్చయాన్ని యెరిగినవాడు. అట్టి శ్రీకృష్ణుడు మా అందరికినీ ప్రీతిపాత్రుడు. శ్రేష్టుడు. ఇతని ఆజ్ఞను నేను వుల్లంఘించలేను’’ అని అనగా శ్రీకృష్ణుడు కలుగజేసుకొని సంజయుని చూచి
‘‘సంజయా! నీవు వివేకివి. అన్నీ యెరింగినవాడివి. అపుడు సభామధ్యంలో కౌరవులు చేసిన పని యెంతటి పాపంతో నిండిందో నీకు తెలుసుగదా? ద్రౌపది పాండవులకు ప్రియమైన భార్య. యశస్విని, శీలవతి, సదాచార సంపత్తిగలది. అట్టి ద్రౌపదిని సభామధ్యలోనికి లాకొచ్చారు. వదిన గారనే మర్యాద కూడా లేకుండా యేకవస్త్ర అయిన ద్రౌపదిని దుశ్శాసనుడు అక్రమంగా మామగార్ల యెదుటనే సభా మధ్యంలోనికి లాగికొనివచ్చి వలువలు వలుస్తుండగా ఒక్క ‘విదురుడు’ మాత్రమే దుర్యోధనునికి ధర్మహితమైన మాటలు చెప్పి అన్యాయాన్ని వ్యతిరేకించాడు. సంజయా! ద్యూతసభలో జరిగిన అన్యాయం గుర్తులేక ధర్మరాజుకు ధర్మోపదేశం చేస్తున్నావు. జరిగిన ప్రతి విషయం నీకు తెలిసినదే గదా? ఏది ధర్మమో, యేది అధర్మాచరణమో నీవెరుంగుదువు...
సంజయా! ధర్మంగా నడుచుకొనే పాండవులు శాంతికొరకై సంధికి సిద్ధంగా ఉన్నారు. యుద్ధం చేయటానికైనా సమర్థులైన యోధులు. ఈ రెండు పరిస్థితులను గ్రహించి ధృతరాష్ట్రునికి వున్నదున్నట్లుగా తెలియపరచుము’’ అని అన్నాడు.
తదుపరి సంజయుడు యుధిష్టిరుడిని చూచి
‘‘రాజశ్రేష్టా! నీకు శుభమగుగాక! ఇక వెళ్ళి వస్తాను. నా మాటలు నీకు కష్టం కలిగించి వుంటాయి. నేను మానసికావేగంతో అలా మాట్లాడానుగాని నిన్ను కష్టపెట్టాలనే కోరిక నాకేమాత్రమూ లేదు. శ్రీకృష్ణుని, భీమార్జుననకుల సహదేవులను, సాత్యకిచేకితానులను వీడ్కొని వెళ్ళుచున్నాను. నీకు శుభమగాగాక! క్షత్రియులారా! మీరంతా నన్ను సౌమ్యంగా, ప్రసన్నంగా చూడండి.’’ అని బల్కి వెళ్ళడానికి సెలవు కోరాడు.
‘‘సంజయా! నీకు శుభమగుగాక! నీవిక వెళ్ళవచ్చును. విద్వాంసుడా! నీవు మాకు ఆ నిష్టాన్ని యెప్పుడూ తలపెట్టవు. కౌరవులు, మేము కూడా నిన్ను చిత్తశుద్దిగల, తటస్త సభ్యుడవని భావిస్తాము. నీవు కూడా మాకు విశ్వసింప దగినవాడవు. ప్రీతిపాత్రుడవు.
భీష్మపితామహునికి, కృపాచార్యునికి నా పేర పాదాభివందనం చెయ్యి. ప్రసన్న చిత్తుడైన గురు ద్రోణాచార్యునకు మా నమస్కారాలను తెలియజేయుము.
..........................ఇంకావుంది

--త్రోవగుంట వేంకట సుబ్రహ్మణ్యము