డైలీ సీరియల్

పంచతంత్రం--19

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెట్లమధ్యలో డ్రోన్ ముందుకు వెడుతోంది. ఇయర్‌ఫోన్స్‌లోంచి పక్షుల అరుపులూ, గాలి వీచే శబ్దం వినపడుతోంది. ఇద్దరూ ఆ శబ్దం వింటున్నారు. ఆ శబ్దాల్లోనుంచి అకస్మాత్తుగా.
‘‘అబ్బా ఒదులు! ఎవరన్నా చూస్తారేమో!!’’అంటున్న ఓ యువతి కంఠం వినిపించింది.
ఆ మాటలు విని కార్తీక్, గోపిక ఇద్దరూ ఉలిక్కిపడ్డారు. వెంటనే మానిటర్లోకి చూస్తూ డ్రోన్‌ని కుడివైపు తిప్పాడు కార్తీక్.
అప్పుడు కనిపించారు ఒక యువతీ, ఒక యువకుడూ, పున్నాగ చెట్టు కింద డిసెంబర్ పూల పొద పక్కన కూర్చుని ఉన్నారు.
ఇద్దరూ స్టూడెంట్స్‌లా కనపడుతున్నారు.
‘‘ఇక్కడ ఎవరూ లేరు!. ఎవరూ రారు!!’’ అంటూ ఆ యువకుడు ఛటుక్కున ఆ యువతి ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకుని ఆమె పెదాల మీద గాఢంగా ముద్దుపెట్టుకున్నాడు. అసంకల్పితంగా ఆ యువతి అతడిని ఇద్దరిమధ్యా గాలి చొరపడనంత గట్టిగా కౌగిలించుకుంది... అది సుదీర్ఘ చుంబనం.
గోపిక ఆశ్చర్యంగా వాళ్లనే చూస్తోంది. కార్తీక్ పరిస్థితి కూడా అలాగే ఉంది. కొన్ని క్షణాల తర్వాత ఇద్దరూ స్పృహలోకి వచ్చారు. ఇద్దరూ ఒకళ్ళ ముఖం ఒకళ్ళు చూసుకోలేకపోతున్నారు. గోపిక ముఖం సిగ్గుతో ఎర్రబడింది. ఆమె బుగ్గల్లోకి రక్తం వేగంగా ప్రవహించింది. అలాంటి దృశ్యాలు ఆమె హాలీవుడ్ సినిమాల్లో చూసింది. కానీ లైవ్‌లో చూడటం ఆమెకు అదే మొదటిసారి. కార్తీక్‌కి కూడా అదే ఫస్ట్‌టైం.
ఆ షాక్‌నుంచి కార్తీక్ వెంటనే తేరుకున్నాడు. అతడి ముఖంలో చిరునవ్వు ప్రత్యక్షం అయింది. గోపిక పెదాలుకూడా చిరునవ్వుతో విచ్చుకున్నాయి. అంతలోనే ఆమె ఆ చిరునవ్వును అణచిపెడుతూ కార్తీక్ వంక ఓరగా చూసింది.
అదే సమయంలోకార్తీక్ కూడా ఆమె వంక చూసాడు. ఇద్దరి చూపులూ క్షణకాలం కలుసుకున్నాయి.
ఠక్కున కళ్ళు తిప్పుకుంది గోపిక. జాయ్‌స్టిక్‌తో డ్రోన్‌ని ఎడమవైపు తిప్పుతూ అప్రయత్నంగా గోపికవైపు జరిగాడు కార్తీక్. ఆమె సిగ్గు పడుతూ తలవంచుకుంది. సరిగ్గా అపుడు ఏదో అనుమానంతో మానిటర్ వైపుచూసిన కార్తీక్ షాక్ అయ్యాడు. మానిటర్‌లో కనపడుతున్నారు బాల్‌రాజ్, బైరాగి, పఠాన్. ముగ్గురి చేతుల్లోనూ పటాకా కత్తులు వేళ్ళాడుతున్నాయి. వాళ్ళు కార్తీక్, గోపికలకు దాదాపు ముప్ఫై అడుగుల దూరంలో ఉన్నారు. ముగ్గురూ వేగంగా నడుస్తున్నారు.
వాళ్లకు ఎడమవైపున ఉన్నది డ్రోన్. దానికి వాళ్ళు చాలా దగ్గరగా ఉన్నారు. కానీ వాళ్ళు దాన్ని గమనించలేదు. క్షణంలో రియాక్ట్ అయ్యాడు కార్తీక్.
వేగంగా అక్కడ ఉన్న బ్యాగ్‌ను అందుకున్నాడు, గోపిక చెయ్యి పట్టుకుని తను ప్రక్కన ఉన్న పొదల్లోకి తప్పుకుంటూ, ఆమెను కూడా పొదచాటుకు లాగాడు.
‘‘వద్దు...!’’ అంటూ ఏదో చెప్పబోయింది గోపిక.
ఛటుక్కున చేతులతో బలంగా ఆమె నోరు మూసేసాడు కార్తీక్. కానీ గోపిక అతడు తనను ఏదో చేయబోతున్నాడు అని ఊహించుకుంది. ఆమె అతడిని నెట్టేయడానికి ప్రయత్నించ సాగింది. అప్పుడు ఆమె చెవిదగ్గర నోరుపెట్టి ఆమెకు మాత్రమే వినిపించేటట్టు మెల్లగా అన్నాడు కార్తీక్.
‘‘బాల్‌రాజ్...! బాల్‌రాజ్‌గాడు.....!’’
ఆ పేరు వింటూనే ఎలర్ట్ అయింది గోపిక.
ఆమె కదలటం ఆపి చూసింది.
అప్పటికి పది అడుగుల దూరంలోకి వచ్చేసారు బాల్‌రాజ్ అతడి అనుచరులు. వాళ్ళ చేతుల్లోకి పొడవాటి కత్తులను చూడగానే ఆమెకు భయంవేసింది. కార్తీక్ నడుంచుట్టూ చెయ్యివేసి అతడికి దగ్గరగా జరిగింది. ఆమె గుండె వేగంగా కొట్టుకుంటోంది. బలంగా ఊపిరి పీలుస్తోంది.
ఇప్పుడు గూండాలు ముగ్గురూ మరింత దగ్గిరగా వచ్చారు. వాళ్ళ చేతుల్లో వేలాడుతున్న పటాకా కత్తులు బాగా దగ్గరగా కనపడుతున్నాయి. దట్టంగా, అల్లిబిల్లిగా అల్లుకున్న పూపొద సందుల్లోనించి వాళ్ళు కనపడుతున్నారు. ఊపిరి కూడా పీల్చటం ఆపి చూస్తోంది గోపిక. ఆమె గుండె చప్పుడు ఆమెకే వినపడుతోంది.
ఆ సమయంలో ఎండుటాకుల మీద ఏదో శబ్దం.
ఆ శబ్దం బాల్‌రాజ్ గ్యాంగ్ వెనకనుంచి వస్తోంది.
ఆ శబ్దం వింటూనే రియాక్ట్ అయ్యాడు పఠాన్. అతడు తన చేతిలోని పటాకా కత్తి గురిచూసి విసిరాడు. వేగంగా దూసుకువెళ్ళింది పటాకా కత్తి. మరుక్షణం ఎండుటాకుల మీద కదులుతున్న కుందేలు తల తెగి కింద పడింది. ఆ దృశ్యంచూసి గోపిక భయంతో వణికిపోయింది.
నవ్వుతూ అన్నాడు బైరాగి ‘‘కుందేలన్నా...!’’
ఆ ముగ్గురూ మెల్లగా కదిలి ఎడమవైపు తిరిగారు.
అదే సమయంలో కార్తీక్ ఆలోచిస్తున్నాడు.
‘‘ఈ టైముకి తన ఫ్రెండ్స్ కూడా ఇక్కడికి వచ్చి వుంటారు. తనకోసం వెతుకుతారు. తను కనపడకపోతే తనకు ఫోన్ చేస్తారు.’’
ఈ ఆలోచన రాగానే జేబులో ఉన్న తన సెల్‌ఫోన్ తీసి దాన్ని మ్యూట్‌లో పెట్టాడు. అతడు చేస్తున్న పని గమనించిన గోపిక తన ఫోన్ స్విచ్‌ఆఫ్ చేసింది. కార్తీక్ తన దగ్గర ఉన్న బాల్‌రాజ్ ఫోన్ తీసి దాన్ని షట్‌డౌన్ చేసాడు. తర్వాత తన ఫోన్‌లో వేగంగా ఎస్‌ఎంఎస్ టైప్ చేయసాగాడు. సరిగ్గా అదే సమయంలో జైరాం, హరీష్, రవి బైక్స్‌మీద ఇంజనీరింగ్ కాలేజీ వెనక్కి చేరుకున్నారు. చెట్లచాటున వాళ్ళ బైక్స్ పార్క్‌చేశారు.
‘‘ఒరే జైరామ్ ఆ కార్తీక్ గాడికి ఫోన్ చెయ్యిరా.. ఎటుపక్క ఉన్నాడో!’’ అంటూ చెప్పాడు హరీష్.
రవి అనుమానంగా ఓవైపు చూస్తూ అన్నాడు. ‘‘అది ఆ బాల్‌రాజ్ గాడి జీప్ అనుకుంటా!’’ జైరాం, హరీష్ అటు చూసారు.
హరీష్ అన్నాడు. ‘‘మనవాళ్ళు లోపల ఉన్నారు...!’’
సరిగ్గా అప్పుడే వాళ్ళ ముగ్గురి దగ్గరా ఉన్న ఫోన్స్‌కు ఒకేసారి ఎస్‌ఎంఎస్‌లు వచ్చాయి. ముగ్గురూ ఆశ్చర్యపోతూ ఫోన్స్ తీసి చూసారు. ఎస్‌ఎంఎస్ చదివిన జైరాం కంగారుగా అన్నాడు.
‘‘ఆ బాల్‌రాజ్ అతడి గ్యాంగ్ ఇక్కడే ఉన్నారు... మనలని లోపలకు రావద్దు అంటూ కార్తీక్ ఎస్‌ఎంఎస్ పంపించాడు... ఇప్పుడు ఏం చేద్దాం?’’
అంతలో మరో ఎంఎస్‌ఎస్ వచ్చింది. అది చదివి చెప్పాడు రవి.
‘‘తాను వాళ్ళని ట్రాక్ చేస్తాడట. మనం వస్తే డిస్ట్రబెన్స్ అవుతుందట.’’
‘‘మనం వెళదాం! సైలెంట్‌గా మూవ్ అవుదాం! వాళ్ళని ట్రాక్ చెయ్యటంకంటే, మనవాళ్ల సేఫ్టీ ముఖ్యం అన్నాడు జైరాం.
చివరకు ముగ్గురూ లోపలికి నడిచారు.
* * *
కార్తీక్‌ని బల్లిలా అతుక్కుని, భయాన్ని కంట్రోల్ చేసుకుంటూ బాల్‌రాజ్, బైరాగి, పఠాన్‌ల వైపు చూస్తోంది గోపిక. వాళ్ళు ఆ ప్రాంతాన్ని పరిశీలిస్తూ శబ్దం కాకుండా నడుస్తున్నారు. వాళ్ళు కొంత దూరం వెళ్ళగానే జాయ్ స్టిక్‌ని ఆపరేట్ చెయ్యటం మొదలుపెట్టాడు కార్తీక్. అప్పటిదాకా డ్రోన్ గాలిలో నిలబడి ఉంది.

-సశేషం

-జి.వి.అమరేశ్వరరావు