డైలీ సీరియల్

యాజ్ఞసేని--120

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘కృష్ణా! నీకేది యిష్టమైతే అదే చేయి. నీకు శుభం కలుగుగాక! కౌరవులవద్దకు బయలుదేరుము. క్షేమంగా మరల వచ్చిన నిన్ను నేను చూడగలగాలి. భరత వంశానికి కలిగిన సంకట స్థితిని పోగొట్టుము.
కృష్ణా! మమ్ములను యెరుగుదువు. శత్రువులను యెరుగుదువు. అంసిద్దినీ యెరుగుదువు. మాటాడటం యెరుగుదువు. ఏయే మాటలవలన మాకు మేలు జరుగుతుందో ఆ మాటలనే సుయోధనునికి చెప్పుము. కేశవా! లలితమైనా, కఠినమైనా సరే ధర్మబద్ధమైన హితకరమైన పలుకులనే పలుకుము’’ అని ధర్మరాజు పలికాడు.
తదుపరి భీమసేనుని అభిప్రాయాన్ని తెలుసుకొన్నాడు శ్రీకృష్ణుడు. అప్పుడు అర్జునుడన్నాడు
‘‘వృష్టివంశనందనా! పాండవులకు తగినదనీ, చేయదగినదనీ నీవు భావించిన దానినే వెంటనే చేయవలసినది. మా తక్షణ కర్తవ్యంగా దానినే నిర్ణయించుము.’’
నకులుడు అన్నాడు ‘‘కేశవా! ధర్మరాజును, భీముని, ఓటమి యెరుగని అర్జునునీ, సహదేవుని, నన్ను, నిన్ను, బలరాముని, సాత్యకిని, విరాటుని, మంత్రి మండలితో కూడిన ద్రుపదుని, ధృష్టద్యుమ్నుని, కాశీచేదిరాజులని, ధృష్టకేశుని రక్తమాంసాలుగల ఏనరుడు యుద్ధంలో యెదిరించగలడు. వాసుదేవా! నీవు వెళ్ళితే చాలు. ధర్మరాజు కోరిక నెరవేరినట్లే. భీష్మద్రోణవిదురకృపాచార్య బాహ్లికాదులు నీవు చెప్పే మాటలను అర్ధంచేసికొనగలుగుతారు. కానీ ధృతరాష్ఠ్రుడు, పాపబుద్ధి అయిన సుయోధనునికీ, అతడి అమాత్యులకు నచ్చజెప్పగలడు. జనార్థనా! నీవు వక్తవై, విదురుడు శ్రోతయై అర్థసాధనకు పూనుకొంటే సాధించలేని కార్యమేముంటుంది’’ అని. తదుపరి సహదేవుడు కృష్ణునితో
‘‘వాసుదేవా! యుధిష్ఠిరుడు చెప్పిన విషయమంతా సనాతన ధర్మం. యుద్ధం జరిగేటట్లే నీవు ప్రయత్నించాలి. కౌరవులు పాండవులతో సంధిని కోరుకొన్నా, నీవు వారితో యుద్ధం జరిగేటట్లు యో జన చే యాలి. నాడు సభలో ఆ పరిస్థితిలోవున్న ద్రౌపదిని చూసి దుర్యోధనునిపై నాకు కలిగిన కోపము అతడిని చంపకుండా యెలా శాంతిస్తుంది? కృష్ణా! భీముడు, అర్జునుడు, ధర్మరాజు, రుూ ముగ్గురూ ఒకవేళ ధర్మమార్గాన్ని అనుసరించినా నేను మాత్రం ధర్మాన్ని వదలి యుద్ధంలో పోరాడాలనే కోరుకొంటున్నాను’’ అని అన్నాడు.
యాజ్ఞసేని (ద్రౌపది) ఆవేదన, ఆక్రోశం
ధర్మము, అర్థములతో హితకరమైన ధర్మరాజు మాటలను విని నల్లగా, పొవుగా వ్రేలాడుచున్న కురులుగల ద్రౌపది దుఃఖిస్తూ సహదేవునీ, సాత్యకినీ ప్రశంసించి చప్పగా చల్లారిన భీమునిగాంచి గుండెలో కుమిలి పోవుచూ కోపంతో అక్కడే కూర్చొని వున్న శ్రీకృష్ణవాసుదేవునితో
‘‘కృష్ణా ఔ వాసుదేవా! రాజైన ధర్మరాజు సోదరుడైన దుర్యోధనాదుల మీద తనకున్న ప్రేమాతిశయం వలన తానింతవరకు పొందిన అవమాన పరంపరలను సహించకుండా వుంటాడా?
మాధవా! ధర్మయెరింగిన వాడా! మధుసూధనా! పాండుకుమారులను ధృతరాష్ట్రుని పుత్రుడు వంచనకు లోబరచి యెట్లు సుఖమునకు దూరం చేసెనో నీకు తెలిసినదేగదా?
పాండవులు రాజ్యంలో భాగం తీసికొనకుండా వారితో పొత్తుకు అంగీకరిస్తే, లోకులు పాండవులెంత అవివేకులు, అసమర్థులు, యెంత సిగ్గులేనివారు, శౌర్యహీనులో అని నిందించరా? గౌరవం చెడి పోయేటట్లు తాము తక్కువవారమని ఏయల నిరూపించుకొనవలెను? సంధి కౌరవులకే లాభదాయకము. సంధి పొసగనప్పుడు యుద్ధంలో కౌరవులను దండించవలెనన్న తలంపు పాండవులకు వుంటే వారిని గెలవటంలో అనుమానానికి అవకాశమేలేదు. ఏ తప్పుచేసినా మన్నించి విడిచిపెట్టటానికి దుర్యోధనాధులు బ్రాహ్మణులా?
కేశవా! దుర్మార్గుడైన ఆ సుయోధనుని మనసులో భయమన్నది లేదు. నీ హితవచనాలను వింటాడా? అనుసరిస్తాడా? దురహంకారమే ప్రదర్శిస్తాడు. ఆ కురు సభలో యుద్ధంచేసే సూచనలేమైనా యేర్పడితే అప్పటికైనా ఈ పాండవులు యుద్ధానికి సిద్ధపడతారా? లేక అడవులకు పోవటానికే అంగీకరిస్తారా?
వాసుదేవా! అవి స్థలను, వృకస్థలము, మాకంది, వారణావతము, కడకు అయిదవది యేదియో ఒకటి మాకిండని దుర్యోధనునికి వాని చెలికాండ్రు చెప్పవలయును.
..........................ఇంకావుంది

--త్రోవగుంట వేంకట సుబ్రహ్మణ్యము