డైలీ సీరియల్

పంచతంత్రం--26

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బైరాగి ఒక మురికివాడలోకి ప్రవేశించాడు. ఆ మురికివాడ పెద్దను కలిసి, అతనికి కొన్ని పాత నోట్లు ఇచ్చాడు. ఆ డబ్బు ఆ మురికివాడలోని జన్‌ధన్ ఖాతాలు ఉన్న వ్యక్తుల ఖాతాల్లో వేయమన్నాడు. అందుకు ఆ మురికివాడ పెద్ద అంగీకరించాడు. అతడికి బైరాగి కొన్ని పాత నోట్లు కమిషన్‌గా ఇచ్చి, వాటిని పోస్ట్‌ఆఫీసుల్లో ఎక్స్‌ఛేంజ్ చేసుకోమని చెప్పాడు.
రవి దూరంగా నిలబడి బైరాగిని పరిశీలిస్తున్నాడు.
తర్వాత బైరాగి బయలుదేరి, ఆ మురికివాడకు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న కల్లు కాంపౌండ్‌లో దూరాడు.
రవి ఆ కల్లు కాంపౌండ్ బయట నిలబడి బైరాగికోసం ఎదురుచూడసాగాడు.
కల్లు కాంపౌండ్‌లో ఒక బెంచిమీద కూర్చుని కల్లు సీసాకు ఆర్డర్ చెప్పాడు బైరాగి. తను ఆర్డర్ చేసిన కల్లుసీసా చేతికి అందగానే కల్లు తాగుతూ ఎవరికోసమో ఎదురుచూడసాగాడు.
* * *
స్కూటర్ మీద మందాకిని వద్దకు చేరుకుంది గోపిక.
మందాకిని దగ్గర మైక్రోసైజ్‌లో ఉన్న డ్రోన్స్ ఇంకో అరడజను ఉన్నాయ్. వాటిల్లోనుంచి హారిక నాలుగు డ్రోన్స్ తీసుకుంది. వచ్చేటప్పుడు మెగా సైజు పాలిథిన్ బాగ్ తెచ్చుకుంది హారిక. వాటిని ఆ బాగ్‌లో సర్దుకుని దాన్ని స్కూటర్ వెనక సీట్‌మీద పెట్టి, పడిపోకుండా తాడుతో కట్టుకుని తన ఇంటికి బయలుదేరింది గోపిక. కొంత దూరం వెళ్ళాక ఏదో ఆలోచన వచ్చి కార్తీక్‌కి ఫోన్ చేసింది.
కార్తీక్ మాట ఫోన్‌లో వినపడగానే-
‘‘దొరికాయ్...! నాలుగు... తీసుకువస్తున్నా’’అని అతడితో చెప్పింది.
* * *
బైక్‌మీద వెడుతున్న ఎస్‌ఐ మహేంద్రకూ, తనకూ దూరం ఉండేట్లు జాగ్రత్తపడుతూ అతడిని అనుసరించసాగాడు హరీష్. మహేంద్ర ఒక కల్లు కాంపౌండ్ దగ్గర బైక్ ఆపి ఎవరికోసమో నిరీక్షించసాగాడు. అతడిని ఫాలో అవుతూ వచ్చిన హరీష్‌కు ఆ పక్కనే నిలబడి ఉన్న రవి కనిపించాడు. అతడిని చూసిన వెంటనే ఆశ్చర్యపోయాడు హరీష్. జేబులోంచి సెల్ తీసి రవికి రింగ్ చేసాడు. రవి లైన్లోకి రాగానే చెప్పాడు.
‘‘నేను కూడా ఇక్కడే ఉన్నాను. వాడు...! అదిగో నీకు కుడివైపున ఉన్న ఆ అరటి పళ్ళ బండి దగ్గర ఎస్‌ఐ మహేంద్ర ఉన్నాడు. నేను నీకు ఎడమవైపున ఉన్నాను.
ఆ మాట వినగానే రవి ఆశ్చర్యపోయాడు. అతడు తల తిప్పి కుడివైపు చూసాడు. అతడికి మహేంద్ర కనిపించాడు. తర్వాత ఓరకంటితో ఎడమవైపు చూసిన అతడికి హరీష్ కనిపించాడు.
రవి చెప్పాడు
‘‘నా కాండిడేట్ బైరాగిగాడు కల్లు కాంపౌండ్‌లో ఉన్నాడు. మహేంద్రగాడు కూడా వాడికోసమే వచ్చినట్టున్నాడు. నువ్వు ఫోన్ కట్ చెయ్! నేను కార్తీక్‌తో మాట్లాడతా!’’
హరీష్ ఫోన్ కట్ చేసాడు.
రవి కార్తీక్‌కి ఫోన్ చేసాడు. థియేటర్లో సినిమా చూస్తున్న కార్తీక్ బయటికి వచ్చి మాట్లాడాడు. తాము ఎక్కడ ఉన్నామో చెప్పి పరిస్థితి వివరించాడు రవి.
అంతా విన్న తర్వాత చెప్పాడు కార్తీక్.
‘‘పోలీస్‌ల కూడా ఇన్వాల్వ్ అయ్యారు. కేర్‌ఫుల్‌గా ఉండండి... గోపికకు డ్రోన్స్ దొరికాయ్. తను బయలుదేరింది. తనకు ఫోన్‌చేసి మీదగ్గరకు పంపిస్తా. ఒకవేళ తను వచ్చేలోపు మీరు అక్కడనుంచి వెళ్ళిపోతే... ఆ విషయం తనకు ఫోన్‌లో చెప్పండి.’’ అంటూ చెప్పి, ఫోన్ కట్‌చేసి, గోపికకు ఫోన్‌చేసి, ఆమెను కల్లుకాంపౌండ్ దగ్గరకు వెళ్లి, అక్కడున్న హరీష్, రవిలకు డ్రోన్స్ ఇవ్వమని చెప్పాడు కార్తీక్.
ఓ ఇరవై నిమిషాల తర్వాత గోపిక హరీష్, రవిలను కలిసి, వాళ్లకు డ్రోన్స్ ఇచ్చి వెళ్ళిపోయింది గోపిక. మరొక్క పది నిమిషాలు గడిచాయి.
బైరాగి గర్ల్‌ఫ్రెండ్ రత్తాలు చేతిలో చీకుల బుట్టతో కల్లుకాంపౌండ్‌లోకి ప్రవేశించింది. ఆమెను చూడగానే బైరాగి ముఖం వికసించింది. బైరాగిణి గమనించింది రత్తాలు. ఆమె నేరుగా బైరాగి దగ్గరకు వెళ్ళింది.
‘‘మా అమ్మ ఇంట్లోనే ఉంది. కాసేపు అయ్యాక అది ఎండు చేపలు అమ్మడానికి బయలుదేరుతుంది. అప్పుడు మనం వెడదాం.’’
బైరాగి అందుకు అంగీకరించాడు.
సరిగ్గా అరగంట తర్వాత రత్తాలుతో తన బైక్‌మీద బయలుదేరాడు బైరాగి.
వాళ్ళను మహేంద్ర, రవి హరీష్ వెంబడించసాగారు.
* * *
ఓ నాలా పక్కన ఉన్న మురికివాడలో ఉంది రత్తాలు గుడిసె. ఆ గుడిసెకు కొద్దిదూరంలో బైక్ ఆపాడు బైరాగి. ముందుగా రత్తాలు గుడిసెలోకి నడిచింది. ఐదు నిమిషాల తర్వాత బైరాగి ఆ గుడిసెలోకి ప్రవేశించాడు. వాళ్ళను ఫాలోఅవుతూ వచ్చిన మహేంద్ర కొద్ది నిమిషాలు ఆగాడు.
రత్తాలు గుడిసెకు వెనకవైపు వంద అడుగుల దూరంలో ఉన్నది ఏపుగా, మహావృక్షంలా పెరిగిన ఒక మర్రిచెట్టు. ఆ మర్రిచెట్టుకూ రత్తాలు గుడిసెకూ మధ్య ప్రదేశం రాళ్ళూరప్పలు పిచ్చిమొక్కలతో నిండి ఉంది.
రవి, హరీష్‌లు ఆ మర్రి చెట్టు వెనక్కు చేరుకున్నారు. తమ దగ్గరి ఉన్న డ్రోన్స్ బయటకుతీసి వాటిని యాక్టివేట్ చేశారు.
గుడిసెలోకి వెళ్లిన వెంటనే తలుపువేసి, గొళ్ళెంపెట్టే రత్తాలుని బిగియారా కౌగిలించుకున్నాడు బైరాగి. ఆమె పెదాల మీద ముద్దులుపెడుతూ పక్కనే ఉన్న చాప మీదకు ఆమెను నెట్టాడు బైరాగి. రత్తాలు వెల్లికిలా పడిపోయింది. బైరాగి దుస్తులు విప్పుకుని ఆమెమీదకు ఒరిగి కోర్కె తీర్చుకోసాగాడు.
తన్మయంతో కళ్ళుమూసుకున్న రత్తాలుకు ఏదో అలికిడి అయిన అనిపించి కళ్ళు తెరిచింది.
తనను ఆక్రమించిన బైరాగి భుజాలమీదుగా చూసిన ఆమెకు కనిపించాడు మహేంద్ర.
అతడిని చూడగానే ఆమెకు భయం వేసింది.
అదే సమయంలో బైరాగి తల వెనక పడింది బలమైన దెబ్బ.
ఆ గుడిసె దొడ్డివైపు గుమ్మంలోంచి లోపలికి వచ్చాడు మహేంద్ర. అతడు రివాల్వర్‌ను వెనక్కి తిప్పి, రివాల్వర్ మడమతో బైరాగి తలమీద బలంగా కొట్టాడు. ఆ దెబ్బతో బైరాగిలో ఉద్రేకం ఒక్కసారిగా వదిలిపోయింది.
రత్తాలు అతడిని పక్కకునెట్టి, నేలమీద పడి ఉన్న చీర అందుకుని చుట్టుకుంది.
పక్కకుదొర్లిన బైరాగికి కనిపించాడు మహేంద్ర.
రివాల్వర్ బైరాగివైపు ఎయిమ్‌చేసి హెచ్చరించాడు మహేంద్ర.
‘‘అరిస్తే ఛస్తావ్...!’’
అలా చెపుతూనే బైరాగి తొడలమధ్య బూటు కాలితో బలంగా ఒక్క తన్ను తన్నాడు మహేంద్ర.
కెవ్వున వస్తున్న అరుపును అణుచుకుంటూ తొడల మధ్య చేతులతో నొక్కుకుంటూ మహేంద్రవైపు దీనంగా చూసాడు బైరాగి.

-సశేషం

-జి.వి.అమరేశ్వరరావు