డైలీ సీరియల్

పంచతంత్రం-27

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రత్తాలువైపు చూసి చెప్పాడు మహేంద్ర.
‘‘బట్టలు కట్టుకుని దొడ్డిదారిన వెళ్ళిపో!. ఇక్కడ జరిగింది ఎవరికైనా చెప్తే ఛస్తావ్....! వెళ్లేటప్పుడు తలుపువేసి వెళ్ళు.’’
రెండు నిమిషాల్లో దుస్తులు ధరించి, దొడ్డిదారిన పరుగుపెడుతూ, తలుపులాంటి తడికను దగ్గరకునెట్టి పారిపోయింది రత్తాలు.
అప్పటికే హరీష్, రవిలు యాక్టివేట్ చేసిన రెండు డ్రోన్‌లూ ఆ గుడిసె పెరట్లోకి ప్రవేశించాయి. భయంతో ఉన్న రత్తాలు వాటిని గమనించలేదు.
‘‘నాతో చేతులు కలిపితే నీకే మంచిది. లేదనుకో! నీతోపాటు నీ గర్ల్‌ఫ్రెండ్‌ని కూడా చంపేస్తా.. తేల్చుకో!’’ హెచ్చరించాడు మహేంద్ర.
మూలుగుతూ అన్నాడు. బైరాగి.
‘‘అన్నా! మమ్మల్ని ఏమీ చెయ్యవద్దు. నీకు ఏం కావాలో చెప్పు!’’
‘‘నీ బాస్ నిరంజన్‌గాడి దగ్గర చాలా బ్లాక్‌మనీ ఉంది. ... ఆ డబ్బుతో వాడు ఏంచెయ్యబోతున్నాడో చెప్పు...!
బ్యాంకుల దగ్గర కూలీల్ని నిలబెట్టి పాత నోట్లు ఎక్స్‌ఛేంజ్ చేయించటం లాంటి రొటీన్ చెత్త ఆన్సర్లు చెప్పవద్దు. నాకు అసలు మేటర్ కావాలి.’’
మహేంద్రకు కావలసిన మేటర్ చెప్పసాగాడు బైరాగి.
అంతా విన్న తర్వాత అడిగాడు మహేంద్ర.
‘‘ఐతే ఆ వేలాయుధం రేపే వస్తున్నదన్నమాట...? వాడు ఎలా ఉంటాడు?’’
‘‘తెలియదు! నేనే కాదు నిరంజన్‌కి కూడా వాడు ఎలా ఉంటాడో తెలియదు.’’అంటూ భయంగా చెప్పాడు బైరాగి. నవ్వుతూ అన్నాడు మహేంద్ర.
‘‘్భయపడకు! మనం ఇద్దరం ఇకనుంచి పార్ట్‌నర్స్... ఆ డైమండ్స్ మన చేతికి వచ్చాక వాటిని ఫిఫ్టీ, ఫిప్టీ చేసుకుందాం... లేచి బట్టలు తొడుక్కో!’’
బైరాగి దుస్తులు ధరించాడు.
మహేంద్ర బైరాగికి తన ఫోన్ నంబర్ ఇచ్చి, తను అతడి ఫోన్ నంబర్ తీసుకున్నాడు.
‘‘టచ్‌లో ఉందాం!’’అంటూ బైరాగితో చెప్పి వీధి గుమ్మంలోనుంచి వేగంగా బయటకు వెళ్ళిపోయాడు మహేంద్ర.
మహేంద్రకూ, బైరాగికీ జరిగిన సంభాషణ మొత్తం హెడ్‌ఫోన్స్‌లో రవి, హరీష్‌లకు వినపడింది.
* * *
కార్తీక్, అతడి ఫ్రెండ్స్, గోపిక టెలికాన్ఫరెన్సులో మాట్లాడుకున్నారు.
కార్తీక్ చెపుతున్నాడు.
‘‘మనం అందరం ఒకేచోట మీటింగ్ పెట్టుకుని మాట్లాడుకోవద్దు. మన పని పూర్తిఅయ్యేదాకా ఇలాగే డిస్కస్ చేసుకుందాం. ఇవ్వాళ కూడా రిజిస్ట్రేషన్స్ ఆగిపోయాయి. రేపు చాలా ముఖ్యమైన రోజు. వేలాయుధం అనేవాడు డైమండ్స్‌తో వస్తున్నాడు. నిరంజన్ తనదగ్గర ఉన్న డబ్బులంతా డైమండ్స్‌లోకి మార్చుకుంటున్నాడు. మనకు ఇదే మంచి సమయం. రేపు అందరం మార్నింగ్ ఐదుగంటలకే రంగంలోకి దిగుదాం. రేపుకూడా నేను నిరంజన్ ఇంటిదగ్గర బీటువేస్తాను. బాల్‌రాజ్, పఠాన్‌లను జైరాం, బైరాగిని రవి, ఎస్‌ఐ మహేంద్రను హరీష్ ఫాలో అవుతారు... పోలీస్‌స్టేషన్ దగ్గర హరీష్ బీటువేస్తాడు... రవీ! బైరాగిని నువ్వు జాగ్రత్తగా అబ్జర్వ్ చెయ్యి. వాడు ఏ క్షణమైనా మహేంద్రను కాంటాక్ట్ చేస్తాడు. అందరూ వాటర్, డ్రైఫ్రూట్స్, బిస్కెట్స్ దగ్గర ఉంచుకోండి. ఫుడ్డుకొట్టే టైం కూడా దొరక్కపోవచ్చు. సెల్‌ఫోన్స్ ఫుల్‌ఛార్జ్ పెట్టండి. పవర్ బ్యాంకులను దగ్గర ఉంచుకోండి. టాక్‌టైం వేయించండి. బైక్స్‌లో ఫుల్‌గా ఫ్యూయల్ కొట్టించండి. ముఖం కనపడకుండా మాస్కులు పెట్టుకుని హెల్మెట్స్ ధరించండి. మనం ఎవరమో, ఎలా ఉంటామో శత్రువులకు తెలియకూడదు. బైక్స్ రిజిస్ట్రేషన్ నంబర్లు మార్చండి. దారిలో బైక్స్‌కి ట్రబుల్ రావచ్చు... చిన్నచిన్న రిపేర్స్ చేయటానికి అవసరంఅయిన స్పాన్సర్స్ దగ్గర ఉంచుకోండి. సెల్‌ఫోన్స్ వైబ్రేషన్స్‌లో పెట్టండి.. గుర్తుంచుకోండి నిరంజన్ వాళ్ళ దగ్గరా, దుర్గారావు, మహేంద్రల దగ్గరా మారణాయుధాలు ఉంటాయి. మనం నిరాయుధులం... గోపిక... ఇంటి దగ్గరే ఉంటుంది... అవసరం ఐతే తన హెల్ప్‌కూడా తీసుకుందాం’’ చెప్పటం ముగించాడు కార్తీక్.
అదే సమయంలో మహేంద్ర, దుర్గారావ్‌ల మధ్య మీటింగ్ జరుగుతోంది.
ఆరోజు జరిగినదంతా దుర్గారావుకి వివరించాడు మహేంద్ర.
‘‘ఓకే!.... ఆ నిరంజన్‌గాడి పని రేపటితో ఔట్!... డైమండ్స్‌ని చెరిసగం పంచుకుందాం. ఈ విషయం మన ఇద్దరిమధ్యే ఉండాలి.’’
చెప్పటం ముగించాడు దుర్గారావ్.
* * *
ఉదయం ఐదు గంటల సమయం.
ఆ ప్రాంతం అంతా చీకటిగా, నిర్మానుష్యంగా ఉంది. చలికాలం కావటంతో ఇంకా మార్నింగ్‌వాక్‌కి కూడా ఎవరూ బయలుదేరలేదు. అప్పటికే అక్కడకు చేరుకున్నాడు కార్తీక్. బైక్‌ను రోడ్డుపక్కన ఉన్న బడ్డీకొట్టువెనక పార్క్‌చేసాడు. తనదగ్గర ఉన్న డ్రోన్‌ను యాక్టివేట్ చేసి, జాయ్‌స్టిక్‌తో అదుపుచేస్తూ దాన్ని ముందుకుపోనించాడు. రోడ్డు అవతల ఉన్నది నిరంజన్ ఇల్లు. డ్రోన్ నిశ్శబ్దంగా కదులుతూ ఆ ఇంటి ఆవరణలోకి ప్రవేశించింది. మానిటర్‌లో ఇంటి ఆవరణ కనపడుతోంది. కార్తీక్ గమనించాడు. ఓ పక్కన వాహనాలు ఆపడానికి ఒక షెడ్ ఉంది ఆ షెడ్ పైకప్పు మీద డ్రోన్‌ని ల్యాండ్ చేసాడు. కార్తీక్, హెడ్‌సెట్ పెట్టుకుని, ఓపికగా ఎదురుచూడసాగాడు.
పఠాన్ ఇంటిముందు చాటుగా నిలబడి ఉన్నారు జైరాం. రవి, జైరాం తన దగ్గరున్న డ్రోన్ యాక్టివేట్ చేసి, దాన్ని పఠాన్ ఇంటి ఆవరణలోకి పోనించి, విండో సన్‌షేడ్ మీద ల్యాండ్ చేసాడు.
* * *
మహేంద్ర, దుర్గారావ్‌లు పనిచేసే పోలీస్‌స్టేషన్ ముందునుంచి మెల్లగా వెడుతోంది హరీష్ నడుపుతున్న బైక్. అతడు ఆ బైక్ మీద కొంత దూరం వెళ్లి తనకు అనువుఅయిన ప్రదేశంలో ఆగి, మహేంద్రకోసం ఎదురు చూడసాగాడు.
ఒక గంట తర్వాత బైక్‌మీద వచ్చాడు మహేంద్ర. మరో అరగంట తర్వాత జీప్‌లో వచ్చాడు దుర్గారావ్. వాళ్ళను గమనించాడు హరీష్.
* * *

-జి.వి.అమరేశ్వరరావు