డైలీ సీరియల్

యువర్స్ లవ్వింగ్లీ...2

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అపుడు సమయం రాత్రి తొమ్మిది గంటలు దాటుతోంది. ‘ఈవినింగ్’ అంటే చీకటి రాత్రులనీ, ‘నైట్’ అంటే అర్థరాత్రి దాటిన తెల్లవారు ఝాము అనీ అర్థాలు మారిపోయినట్లనిపిస్తుంది అక్కడి వాతావరణాన్ని చూస్తే.
‘‘గుడీవినింగ్ బోయ్స్ అండ్ గాళ్స్’’ అంటూ మైకులో గొంతు చించుకుని అరుస్తున్నాడు డీజే. అతని గొంతులో శృతి కలుపుతున్నారు అక్కడ చేరిన అమ్మాయిలూ, అబ్బాయిలూ. పున్నమి వెనె్నలని ‘రీమిక్స్’ చేసినట్లుగా మెరుస్తూ వుంది అక్కడ పరుచుకున్న మసక వెలుతురు.
స్పీకర్లలోంచి పెద్దగా వినిపిస్తున్న పాప్ మ్యూజిక్, లయబద్ధంగా వినిపిస్తున్న డ్రమ్ బీట్స్ అక్కడున్న వాళ్ళ ఒంట్లోని రక్తాన్ని పరుగులు తీయిస్తూ ఎక్కడిదో తెలియని ఒక కుదుపుని బలవంతంగా శరీరంలోకి నెట్టుతూ ఒక రకమైన ఉత్సాహాన్ని కలిగిస్తోంది. పార్టీ పతాక స్థాయికి వెళ్ళినపుడు ఆ ఊపు ఎలా వుంటుం దో అంచనా వేయడం అసాధ్యం. అదంతా తల్చుకుని ఉద్వేగంగా వున్నారు అందరూ.
ద్వారాల దగ్గర ఎదురుచూస్తున్న అబ్బాయిల్లో సమయం గడుస్తున్న కొద్దీ అసహనం పెరిగిపోతోంది. తమ గర్ల్‌ఫ్రెండ్ లోనికి అడుగుపెట్టగానే ఆనందం పట్టలేని కొందరు అబ్బాయిలు అమాంతం వాళ్ళని కౌగిలించుకుంటున్నారు. వాళ్ళనలాగే హత్తుకున్నట్లుగా పట్టుకుని లోనికి తీసుకెళ్తున్నారు. ఒంటరిగా వున్న అబ్బాయిలంతా దాదాపు తపస్సు చేస్తున్న ఋషుల్లా ఒకవైపు తలవంచి దీక్షగా సెల్‌ఫోన్‌లో ఆగకుండా మాట్లాడుతూనే వున్నారు.
సన్నజాజి తీగలా నాజూకుగా వున్న అమ్మాయిలూ, నాజూకుదనంలో వాళ్ళతో పోటీ పడుతూనే శరీర సౌష్టవంలో మాత్రం తమ ప్రత్యేకతని చూపుకుంటున్న అబ్బాయిలూ నిలబడీ కూర్చునీ, డాన్స్‌ఫ్లోర్‌లో ఒకళ్ళనొకళ్ళు పట్టుకుని డాన్స్ చేస్తూ గుసగుసలాడుకుంటున్నారు.
రెచ్చగొట్టే ఆ వాతావరణం అంటే చాలా ఇష్టం భరణికి. ఒక మూలగా వున్న టేబిల్ దగ్గర కూర్చుని డ్రింక్ సిప్ చేస్తూ ఆ వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నాడతను.
అతని పక్కనే కూర్చున్న సంధ్య అతనే్న ఆరాధనగా చూస్తోంది. ఆమె చాలా సంతోషంగా వుందని ఆమె ముఖం చూస్తేనే తెలుస్తోంది. ఆమె అక్కడికి రావడం అది మొదటిసారి కాదు.. అంతకుముందు చాలా సార్లు వచ్చింది. కానీ అప్పుడు రాజేష్‌తో వచ్చేది, ఇప్పుడు భరణితో వచ్చింది. అదే తేడా. ఆ తేడా ఆమెకి చాలా బావుంది. భరణి రాజేష్‌లా పిరికివాడు కాదు, ధైర్యవంతుడు.
ఆమె చేయి భరణి చేతిలో వుంది. నాజూకైన తన చేతివేళ్ళని బలంగా పెనవేసుకున్నట్లున్న అతని వేళ్ళ స్పర్శ ఆమెకేదో తెలియని ఆనందాన్నిస్తోంది. ఆమె భుజాలు అతని ఛాతీకి రాసుకుంటున్నాయి. అతను అల్లరిగా ఆమె కళ్ళలోకి చూసాడు. తన చేతిని ఆమె చేతిలోంచి తీసుకుని ఈసారి ఆమె భుజం చుట్టూ వేసి ఆమెని మరింత దగ్గరగా తీసుకున్నాడు.
శరీరానికి బలంగా తగిలిన అతని పక్కటెముకల స్పర్శకి ఒక్కసారిగా గుండె ఝల్లుమన్నట్లైంది ఆమెకి.
ఆమె ఆలోచిస్తూండగానే భరణి చేతులు చనువుగా ఆమె భుజం మీదనుంచి క్రిందికి దిగి జీన్స్ పాంట్‌కీ టాప్‌కి మధ్య పల్చని ఆమె నడుము ఒంపులో నాట్యం చేయసాగాయి. ఆ చర్యకి ఆమె ఆలోచనలు స్తంభించినట్లైంది.
చూస్తుండగానే అక్కడ జనం పెరిగిపోయారు. డిమ్ లైట్లకి తోడుగా రంగు రంగుల ఫోకస్ లైట్ల తాలూకు వెలుతురు అల్లిబిల్లిగా క్రిందా పైనా తిరుగుతూ వాళ్ళమీద ఆడుకోసాగాయి. మ్యూజిక్ వేగం హెచ్చింది. మధ్య మధ్యలో వినిపిస్తున్న డ్రమ్ బీట్స్, ప్లే చేస్తున్న పాటల్లోని పదాలని కొద్దిగా మార్చి మధ్య మధ్యలో అల్లరిగా గొంతు కలుపుతున్న డీజే ఉత్సాహం, వేగంగా డిస్క్‌లను మారుస్తూ ఒక పాటలో మరో పాట మిక్స్ చేస్తున్న విధానం అందరిలోనూ అదోరకమైన ఊపుని తీసుకువస్తోంది.
డాన్స్ ఫ్లోర్ క్రమంగా నిండిపోతోంది. సంగీతం చెవులు చిల్లులు పడేలా వినిపిస్తోంది. తన అరుపులతోనూ, వాయిద్యాలతోనూ డాన్స్ చేసే వాళ్ళని రెచ్చగొడుతున్నాడు డీజే. దాదాపు అందరూ డాన్స్ ఫ్లోర్‌మీదకి చేరిపోయారు. ఒకరినొకరు తాకుతున్నట్లుగానే ఊగిపోతూ డాన్స్ చేయసాగారు.
భరణి అలాగే సంధ్య నడుము చుట్టూ చేయి వేసి డాన్స్ ఫ్లోర్‌వైపు నడిపించాడు. అక్కడికి చాలాసార్లు వచ్చింది కానీ ఎప్పుడూ డాన్స్ చేయలేదామె.
భరణి రెండు చేతులతో ఆమె నడుముని పట్టుకుని కొంచెం ముందుకు వంగి బొంగరాన్ని తిప్పినట్లామెని గిరగిరా తిప్పాడు. అతనలా తిప్పగానే తన రెండు చేతులూ పైకెత్తి బొమ్మలా తిరిగిందామె.
ఆమెనలా చూస్తుంటే భరణీ కళ్ళు మెరిసాయి. తను మొదటిసారి ఇంజనీరింగ్ కాలేజీలో చూసిన లంగా ఓణీ వేసుకుని బిడియంతో ముడుచుకుపోయే సంధ్య గుర్తుకువచ్చింది. ఆమే ఈమె అంటే ఎవరూ నమ్మరు. అతనికి గర్వంగా అనిపించింది. అమాంతం ముందుకు వంగి ఆమె నడుము పట్టుకుని ఆమెని విల్లులా వంచి ఆమెమీదికి వంగాడు.
క్షణంలో వెయ్యోవంతు సమయంలో అతని పెదవులు ఆమె మెడ ఒంపుకి క్రింద భాగాన్ని ముద్దాడాయి. మరుక్షణంలో ఏమీ జరగనట్లుగానే ఆమె నడుమీద చేతులేసి డాన్స్ చేయసాగాడు. వాళ్ళ జంటని చూసిన చుట్టుప్రక్కవాళ్ళు తాము డాన్స్ చేయడం కూడా మర్చిపోయి వాళ్ళ చుట్టూ చేరి చప్పట్లుకొడుతూ వాళ్ళని ఎంకరేజ్ చేయసాగారు. అలాగే ఎంతసేపు డాన్స్ చేసారో వాళ్ళకే తెలియదు. క్రమంగా మ్యూజిక్ కన్నా డాన్స్.. డాన్స్‌కన్నా ఆ డాన్స్ చేస్తున్న వాళ్ళలో కనిపిస్తున్న ఊపు, ఒంపుసొంపులు, డాన్స్ చేస్తున్నపుడు తగిలే తమ స్నేహితుల శరీర స్పర్శ వాళ్ళ ఆనందానికి కారణమై థ్రిల్‌నివ్వసాగాయి.
అలా డాన్స్ చేసి చేసి అంతా బాగా అలసిపోయారు. ఆ ఏసీ వాతావరణంలో చెమట కూడా ఒంటికి చల్లగా తగులుతూ సౌకర్యవంతంగా వున్నట్టనపిస్తోంది.
డిమ్‌లైట్ వెలుగులో సంధ్యని పట్టుకుని తనవైపు తిప్పుకున్నాడు భరణి.
‘‘నీకో నిజం చెప్పమన్నావా సంధ్యా?’’ అన్నాడు దాదాపుగా ఆమె ముఖంమీద ముఖంపెడుతూ. అతనంత దగ్గరగా వచ్చేసరికి సంధ్య సిగ్గుగా తలదించుకుంది.

ఇంకా ఉంది

వరలక్ష్మి మురళీకృష్ణ