డైలీ సీరియల్

పంచతంత్రం-29

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆఫీస్ రూమ్ ఇవతల పెద్ద హాల్ ఒకటి ఉంది. ఆ హాల్లో వున్న టేబుల్ క్రిందకు డ్రోన్‌ని పోనించాడు కార్తీక్. అక్కడి నుంచి నిరంజన్, హరేరామ్‌లు స్పష్టంగా కనపడుతున్నారు.
‘‘అన్నా.. ఇవ్వాళ టిఫిన్ ఏం చేయమంటావ్?’’ అంటూ అడిగాడు హరేరామ్.
‘‘ఇవ్వాళ టిఫిన్ వద్దు. నీకు ఓ పని చెపుతా అది చెయ్యి!’’
‘‘అలాగే అన్నా!’’
టేబుల్‌మీద వున్న ఒక అట్టపెట్టె వైపు చూపిస్తూ అన్నాడు నిరంజన్.
‘‘అది ఓపెన్ చెయ్యి! అందులో ఒక్క మాస్క్, జర్కిన్, ప్యాంటు, బూట్లు, గ్లోవ్స్ ఉన్నాయ్ అవి బయటకు తియ్యి’’.
అట్టపెట్టె ఓపెన్ చేసి, అందులోంచి నిరంజన్ చెప్పిన వస్తువులు అన్నీ బయటకుతీసాడు హరేరామ్. అంతలోనే నిరంజన్‌కు ఏదో గుర్తుకు వచ్చింది.
వెంటనే హరేరామ్ ‘‘ఆ మాస్క్ తొడుక్కుని చూస్తూ ఉండు. నేను ఇప్పుడే వస్తా!’’అంటూ చెప్పాడు నిరంజన్.
నిరంజన్ హాల్లోకి వచ్చి, హాల్‌కు కుడివైపున ఉన్న గదిలోకి వెళ్ళాడు.
టేబుల్ కింద ఉన్న డ్రోన్ యాంగిల్ మార్చాడు కార్తీక్. ఇప్పుడు ఆ గదిలో ఉన్న నిరంజన్ కదిలికలు కార్తీక్‌కి స్పష్టంగా కనపడుతున్నాయి.
ఆ గదిలో ఒక పెద్ద టేబుల్ ఉంది.
ఆ టేబుల్ సొరుగులోంచి తాళంవేసి ఉన్న చిన్న ఐరన్‌బాక్స్ ఒకటి తీసాడు. దానికి కాంబినేషన్ తాళంవేసి ఉంది. నంబర్లు తిప్పి తాళం తెరిచి, లోపల్నుంచి ఒక లావుపాటి పర్సు ఒకటి తీసి, దాన్ని తెరిచాడు. ఆ పర్సులోంచి కొన్ని వజ్రాలని తీసి చూసాడు. తర్వాత నవ్వుకుంటూ ఆ వజ్రాలని మళ్ళీ పర్సులోవేసి, జిప్‌తో పర్సుమూసేసి, ఆ పర్సును బాక్స్‌లోవేసి, బాక్స్‌ను కాంబినేషన్ లాక్‌తో మూసేసి, ఆ బాక్స్ తీసుకుని ఆఫీస్ రూమ్‌లోకి వచ్చాడు.
మళ్ళీ డ్రోన్ ముఖాన్ని ఆఫీస్ రూమ్‌వైపు తిప్పాడు కార్తీక్.పి. ఆఫీస్ రూమ్‌లో ఉన్న నిరంజన్, హరేరామ్‌లు తనకు కనపడే విధంగా డ్రోన్ యాంగిల్ మార్చాడు. ఆఫీస్‌రూమ్‌లోకి నిరంజన్ వచ్చిన సమయానికి తన ముఖానికి పుర్రె మాస్క్‌పెట్టుకుని ఉన్నాడు హరేరామ్.
హరేరామ్‌తో అన్నాడు నిరంజన్-
‘‘నీకు అది బాగా సూట్ అయ్యింది. ఇక దాన్ని తియ్యి.’’
హరేరామ్ మాస్క్ తీసేసి, దాన్ని జేబులో పెట్టుకున్నాడు.
‘‘నువ్వు బయలుదేరు!. నేరుగా మీ ఇంటికి వెళ్ళు. నేను ఫోన్ చేయగానే, ఆ జర్కిన్, ప్యాంటు, బూట్లు, మాస్క్, గ్లోవ్స్ తొడుక్కుని, హెల్మెట్ పెట్టుకుని పోచమ్మ టెంపుల్ వెనక ఎదురుచూస్తూ ఉండు.. నిన్ను ముగ్గురు మనుషులు కలుస్తారు. నీకు నేను ఇచ్చిన బాక్స్ ఆ మనుషులకు ఇవ్వు. వాళ్ళు నీకు రెండు సూట్‌కేసులు ఇస్తారు. వాటిని తీసుకుని నాకు ఫోన్ చెయ్యి. గుర్తుపెట్టుకో...! వాళ్ళు నీ ముఖం చూస్తే నీకు ప్రమాదం. ఆ మాస్క్ పెట్టుకుని, తలకు హెల్మెట్ తగిలించుకో...! వాళ్ళు నిన్ను కలసిన టైంలో నీ సెల్‌ఫోన్ స్విచ్ ఆఫ్ చెయ్యి.. అసలు ఏమీమాట్లాడకు. నోరు విప్పితే ప్రమాదం. నిమిషంలో మొత్తం ట్రాన్సాక్షన్ అయిపోవాలి. పని అయిన తర్వాత నాకు ఫోన్ చెయ్యి. ఈ పని కరక్ట్‌గాచేస్తే లక్షల ఖరీదుచేసే ఒక డైమండ్‌ని నీకు బహుమతిగా ఇస్తా!... నీ మోటార్ సైకిల్ ఇక్కడే ఉంచు. ఎదురుగా రోడ్డుపక్కనే ఉన్న రామాలయంముందు ఆల్టోకారు పార్క్‌చేసి ఉంటుంది. అది వేసుకుని వెళ్ళు...’’
అంటూ చెప్పి ఆల్టో కారు కీస్ హరేరామ్‌కి ఇచ్చాడు నిరంజన్.
డైమండ్ బహుమతిగాఇస్తా అనగానే హరేరామ్‌కు ఆనందం వేసింది. అతడు తల ఊపి, నిరంజన్ ఇచ్చిన వస్తువులను తీసుకుని బయటకు నడిచాడు. అతడు రామాలయం ముందున్న ఆల్టోలో బయలుదేరాడు. హరేరామ్ వెళ్లిపోయిన తర్వాత మళ్ళీ కుడివైపు గదిలోకి వచ్చాడు నిరంజన్.
ఆ గదిలో ఓ పక్కగా ఉన్న రెండు సూట్‌కేసులు తీసి టేబుల్‌మీద పెట్టాడు. వాటిని తెరిచి, పాత డైలీ పేపర్లు, చిత్తుకాగితాలతో వాటిని నింపాడు. సూట్ కేసులను మూసి, వాటికి ఉన్న కాంబినేషన్ లాక్‌తో తాళం వేసాడు నిరంజన్. తర్వాత ఆ సూట్‌కేసులను తీసుకుని ఆఫీస్‌రూమ్‌లోకి వచ్చి, వాటిని ఒక పక్కనపెట్టి, కూర్చుని ఎదురుగాఉన్న టివి ఆన్ చేసాడు.
ఒక గంట తర్వాత, పఠాన్, బాల్‌రాజ్‌లు ప్రయాణిస్తున్న జీప్, బైరాగి ప్రయాణిస్తున్న బైక్ నిరంజన్ ఇంటిముందు ఆగాయి. రెండు నిమిషాల తర్వాత జైరాం డ్రైవ్‌చేస్తున్న బైక్ వచ్చి నిరంజన్ ఇంటికి కొద్ది దూరంలో ఆగింది. జైరాం కిందికి దిగి బైక్ రిపేర్ చేస్తున్నట్టు నటించ సాగాడు.
జైరాం వచ్చిన నిమిషం తర్వాత రవి వచ్చాడు. అతడు సెల్‌ఫోన్లో మాట్లాడుతున్నట్టు నటించసాగాడు.
జైరాం, రవిలకు చాటుగాఉన్న కార్తీక్ కనిపించలేదు. కానీ అతడు అక్కడే ఎక్కడో ఉంటాడు అని వాళ్ళకు తెలుసు.
నేరుగా నిరంజన్ ఇంట్లోకి ప్రవేశించారు బాల్‌రాజ్ అతడి అనుచరులు. వాళ్ళు మొదట హాల్లోకి ప్రవేశించారు. తర్వాత ఆఫీస్ రూమ్‌వైపు కదిలారు. ఆ టైములో నిరంజన్ బాత్‌రూమ్‌లో ఉన్నాడు. ఆఫీస్‌లో నిరంజన్ లేకపోవటంతో హాల్‌లోనే ఆగారు.
వాళ్ళను గమనిస్తూనే టేబుల్ కిందఉన్న డ్రోన్‌ను పక్కకు జరిపాడు కార్తీక్.
బైరాగి అన్నాడు. ‘‘దోమ సౌండ్. ఇదే సౌండ్ ఎక్కడో విన్నా!’’
‘‘నోరు ముయ్‌బే...! ఇక్కడ దోమలు ఎక్కడ ఉన్నాయ్?’’అన్నాడు బాల్‌రాజ్. బైరాగి అనుమానంగా టేబుల్‌వైపు వెళ్లి, టేబుల్ వెనక్కి చూసాడు. అక్కడ ల్యాండ్ అయిఉన్న డ్రోన్ అతడికి కనపడింది.
‘‘అన్నా! ఏంటిది?’’ అన్నాడు.
అదే సమయంలో బాత్రూంనుంచి నిరంజన్ బయటకువస్తున్న శబ్దం వాళ్లకు వినపడింది.
వెంటనే...
‘‘రాబే! అన్న వచ్చాడు!’’అంటూ ముందుకు కదిలాడు బాల్‌రాజ్. వెంటనే వాళ్ళ వెనక పరిగెత్తాడు బైరాగి.
తన ముందు నిలబడి ఉన్న బాల్‌రాజ్ అతడి అనుచరులవైపు చూసి, చిన్నగా నవ్వి, మూడు అట్టపెట్టెలు తీసి వాళ్ళముందుపెట్టి చెప్పాడు నిరంజన్-
‘‘వీటిని ఓపెన్ చెయ్యండి! లోపల మాస్క్‌లు, జర్కిన్లు, ప్యాంట్లు, బూట్లు, గ్లోవ్స్ ఉన్నాయ్ అవి బయటకు తియ్యండి.’’

-సశేషం

-జి.వి.అమరేశ్వరరావు