డైలీ సీరియల్

యాజ్ఞసేని--130

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యుయుత్సుడు, సంజయుడు, యశస్విని అయిన గాంధారీదేవి మొదలైనవారు ధృతరాష్ట్రునివైపు కూర్చున్నారు.
పట్ట్భాషేకానికి కావలసిన వస్తువులన్నీ సిద్ధపరిచారు. అప్పుడు పురోహితుడైన ‘్ధమ్యుడు’ శ్రీకృష్ణుని అనుమతితీసికొని ఈశాన్యంవైపు చూచే వేదిక నేర్పరిచాడు. అగ్నికాంతులుగల ‘సర్వతోభద్ర’మనే ఆసనం మీద ‘‘్ధర్మరాజును, ద్రౌపదిని’’ కూర్చుండబెట్టాడు. మంత్రపూర్వకంగా దౌమ్యుడు అగ్నిహోమం చేశాడు.
తదుపరి శ్రీకృష్ణుడు లేచి పూజింపబడిన శంఖం తీసుకొని ధర్మరాజును భూమికి రాజుగా అభిషేకించాడు. ధృతరాష్ట్రుడు, ప్రజలు కూడా ధర్మరాజును అభిషేకించారు. శ్రీకృష్ణుని అనుమతితో తమ్ములతో కూడిన ధర్మరాజు పాంచజన్యంతో అభిషిక్తుడై, రాజై అమృతముఖుడయ్యాడు.
పిమ్మట ధర్మరాజు కర్తవ్య నిర్ణయంచేశాడు. భీమసేనుని యువరాజుగా నియమించాడు.
కార్యాలోచనం చేయడంలోనూ, నిశ్చయించడంలోనూ, విదురుని నియోగించాడు.
చేసిన పనిని, చేయవలసిన పనిని రెంటినీ తెలిసికొనడానికి, ఆదాయవ్యయాలు ఆలోచించటానికి సకల సద్గుణవంతుడైన సంజయుని నియమించాడు.
సైనికుల కార్యాలను పర్యవేక్షించడంలో నకులుని నియమించాడు.
శత్రుసేనలను అడ్డుకొనటంలోనూ, దుష్టసంహారంలోనూ అర్జునుని నియమించాడు.
నిత్యమూ తనవద్దనే వుండునట్లుగా సహదేవుని ఆజ్ఞాపించాడు. సర్వకాల సర్వావస్తలలోనూ రాజును అతడే రక్షిస్తూ వుండాలి.
ద్విజులకు సంబంధించిన దేవకార్యాలలోనూ, యితర కార్యాలలోనూ, ఉత్తముడూ ప్రజ్ఞాహితుడైన ధౌమ్యుని నియమించాడు.
తదుపరి విదుర సంజయయుయుత్సులను చూచి
‘‘ప్రతిరోజూ లేచి శ్రద్ధతో నా తండ్రి అయిన ధృతరాష్ట్రుని కార్యాలు మీరు పొరబడకుండా సముచితంగాచూస్తూ వుండాలి. పౌర జానపదుల కార్యాలన్నీ తెలియజెప్పి ధృతరాష్ట్రుని అనుమతితో మీరు ఆచరించాలి’’ అని అన్నాడు.

(59)
అంపశయ్యపై వున్న ‘‘్భష్మపితామహుని’’వద్దకు ధర్మరాజు వచ్చాడు. వినయంతో భీష్ముని చూపుకు అందేటంతదూరంలో ముందుగా నిలుచున్నాడు. భీష్ముని పాదాలనంటి నమస్కరించాడు. భీష్ముడు ధర్మరాజుని చూచి యెంతో సంతోషించాడు. ధర్మరాజు తలను మూర్కొని
‘‘కూర్చో! అని అన్నాడు. నాయనా! ధర్మరాజా! భయంలేకుండా నన్ను అడుగుము’’అని అన్నాడు. ధర్మరాజు శ్రీకృష్ణునికి నమస్కరించి, పితామహునుకి ‘‘అహంభో అభివాదయే’’అని నమస్కరించాడు. గురువులందరినీ గౌరవించాడు. తదుపరి పితామహుని ప్రశ్నించాడు.
పితామహా! ధర్మవేత్తలు ‘రాజులకు’్ధర్మమే అన్నింటికంటే గొప్పదని అంటారు. ఆ ధర్మం చాలా బాధమయినదనీ నేను భావిస్తున్నాను. దీని గురించి నాకు వివరంగా చెప్పుము. రాజధర్మాల గురించి విశేషంగా చెప్పుము. లోకానికంతటికినీ రాజధర్మమే గతి. పరాయణం. కురూత్తమా! రాజధర్మాలలో ధర్మం, అర్థం, కామం అనేవి వున్నాయి. మోక్షధర్మం కూడా స్పష్టంగా అంతా అందులోనే వున్నది. లోకానికి ధర్మం చెప్పబడింది. రాజధర్మం లోకులను సన్మార్గంలో నడిపిస్తుంది. లోకాన్ని బాధించే పాపాన్ని దూరంచేస్తాయి. పితామహా! నాకోసం రాజధర్మాలను ఉపదేశించుము’’అని ప్రార్థించాడు.
అప్పుడు ధర్మరాజు అడిగి ప్రశ్నలకు భీష్మపితామహుడు ప్రీతిజెంది ధర్మరాజుకు
రాజుయొక్క ధర్మానుకూల ప్రవర్తన గురించి, రాజ్యరక్షాసాధనముల గురించి, నీతిశాస్తచ్రరిత్ర గురించి, వర్ణ్ధర్మముల గురించి, ఆశ్రమ ధర్మముల గురించి, వర్ణాశ్రమ ధర్మములలో రాజధర్మ వైశిష్ట్యము గురించి, బ్రాహ్మణ ధర్మములు, కర్తవ్యపాలన గురించి, రాజధర్మము, ఆశ్రమ ధర్మాల గురించి,
రాష్ట్ర ప్రజల కర్తవ్యము గురించి, రాజుకు వుండవలసిన ముప్పది ఆరు గుణముల గురించి, సచివ(మంత్రి) అక్షణముల గురించి, సభాసదులు, సహాయకులు, స్నేహితులు, సేనాధిపతులు, మంత్రులు యెటువంటి వారుండాలో, వారి వివరాలను గురించి రాజ సహాయకుల గుణాల గురించి సవివరంగా బోధించాడు.
***************
కాలగతి యెంతో సూక్ష్మమైనది.
ధృతరాష్ట్ర మహారాజు భార్య గాంధారితో, పాండురాజు పత్ని కుంతీదేవితో కలిసి గంగాస్నానమాచరించి వస్తుండగా, అంతకుముందు ఆయన యాజకులు నిర్జన వనంలో వదలిపెట్టిన అగ్నియే పెరిగి వనమంతా వ్యాపించింది. వనమంతా వ్యాపించిన అగ్నినుండి వారు తప్పించుకోలేకపోయారు.

..........................ఇంకావుంది

--త్రోవగుంట వేంకట సుబ్రహ్మణ్యము