డైలీ సీరియల్

పంచతంత్రం - 31

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొంత సమయం గడిచాక బైరాయినుంచి మిస్సుడు కాల్ వచ్చింది.
దుర్గారావ్ అన్నాడు-
‘‘ఆ బాల్‌రాజ్ గ్యాంగ్ బయలుదేరినట్టున్నారు... బైరాగిగారు మిస్సుడు కాల్ ఇచ్చాడు... నీతో నేను కూడా వస్తా. మనం నీ బైక్ మీద వెడదాం’’ అన్నాడు దుర్గారావ్.
రెండు నిమిషాల తర్వాత ఇద్దరూ పోలీస్‌స్టేషన్‌నుంచి బయటకు నడిచారు.
వాళ్ళు సివిల్ డ్రస్‌లో ఉన్నారు.
వాళ్ళని హరీష్ ఫాలో అవసాగాడు.
* * *
అప్పటిదాకా కూర్చుని టివి చూస్తున్న నిరంజన్ లేచాడు. డ్రెస్ చేసుకున్నాడు. జర్కిన్ ధరించాడు. టేబుల్ సొరుగులోఉన్న ఐదొందల నోటుతీసి జెర్కిన్ పాకెట్‌లో ఉంచుకున్నాడు. చేతులకు నలుపురంగు గ్లౌజులు తొడుక్కున్నాడు. నలుపురంగు స్పెక్ట్స్ పెట్టుకున్నాడు. తర్వాత సెల్ ఫోన్ తీసుకుని బాల్‌రాజ్‌కు రింగ్ చేసి-
‘‘మీరు నేను చెప్పిన స్పాట్‌కు వెళ్ళండి. వేలాయుధం బయలుదేరాడు. అతడు ఇచ్చిన డైమండ్స్ తీసుకున్న తర్వాత ఇంటికి వెళ్ళండి, నేను చెప్పిన తర్వాత నా దగ్గరికి వచ్చి డైమండ్స్ ఇవ్వండి.’’
చెప్పటం ముగించాడు నిరంజన్.
తర్వాత హరేరామ్‌కు ఫోన్ చేసాడు.
‘‘నేను చెప్పిన స్పాట్‌కు వెళ్ళు. అక్కడికి వచ్చిన ముగ్గురు వ్యక్తులకు నీ దగ్గర ఉన్న పాకెట్ ఇయ్యి. వాళ్ళు ఇచ్చిన సూట్ కేసులు తీసుకో. వాటితో నీ ఇంటికి వెళ్ళు. నేను చెప్పిన తర్వాత నా దగ్గరకు వాటిని తీసుకురా!...’’ అంటూ చెప్పాడు.
తర్వాత మరో నంబర్‌కి రింగ్ చేసాడు.
వైకుంఠం అనే వ్యక్తి లైన్‌లోకి వచ్చాడు.
వైకుంఠం ఒక గూండా.
‘‘ఎక్కడ ఉన్నావ్?’’ అంటూ వైకుంఠాన్ని అడిగాడు నిరంజన్.
‘‘బ్యాంకుదగ్గర ఉన్నాఅన్నా!’’
నిరంజన్ అన్నాడు.
‘‘నీకు ఆ కొండాపూర్, అలకాపూర్ స్థలాల గురించి చెప్పాను గుర్తుందా?’’
‘‘ఉంది అన్నా!... వాళ్ళ ఫుల్ డీటెయిల్స్ అన్నీ చెప్పావు కదన్నా!... వాళ్ళని కాంటాక్ట్ చెయ్యమనంటావా?’’
‘‘అవును!.... వెంటనే వెళ్లు... రిజిస్ట్రార్ మనవాడే... వెంటనే పని అవుతుంది...’’
నిరంజన్ బయటకువచ్చి షెడ్‌వైపు నడిచాడు. అక్కడ టార్పాలిన్ కవర్ కప్పిన వాహనం ఒకటి ఉంది.
నిరంజన్ ఆ కవర్ తొలగించాడు. ఒక అంబులెన్స్ బయటపడింది. టార్పాలిన్‌ను మడత పెట్టి ఓ పక్కన పెట్టి, ఆ అంబులెన్సు నడుపుతూ బయలుదేరాడు నిరంజన్.
పోలీసులు నోట్ల మార్పిడి ముఠాలను పట్టుకునే ప్రయత్నంలో అనుమానం వచ్చిన వాహనాలను ఆపుతున్నారు. పోలీసులనుంచి ప్రాబ్లమ్‌రాకుండా అంబులెన్స్‌లో బయలుదేరాడు నిరంజన్.
నిరంజన్ ప్లాన్ కార్తీక్‌కు అర్ధం అయింది.
* * *
నిరంజన్ నుంచి ఫోన్‌రాగానే బాల్‌రాజ్, పఠాన్, బైరాగి, హరేరామ్, వైకుంఠం మొదలైనవాళ్ళు అంతా బయలుదేరారు.
బాల్‌రాజ్, పఠాన్, బైరాగిలను జైరాం, రవి ఫాలో అవుతున్నారు.
నిరంజన్‌ను ఫాలోఅవుతున్న కార్తీక్ దగ్గర సెల్‌ఫోన్ మోగింది. అవతల నుంచి హరీష్ గొంతు వినపడింది.
‘‘మహేంద్ర...! వాడితోపాటు ఇంకో పోలీస్‌వాడు బైక్‌మీద బయలుదేరారు.’’
మహేంద్రకు బైరాగి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు అని కార్తీక్‌కు అర్ధం అయింది.
‘‘ఓకే!... జాగ్రత్తగా ఉండు!’’ అని హరీష్‌తో చెప్పి ఫోన్ కట్ చేసాడు కార్తీక్.
అతడు కట్‌చేసిన వెంటనే మళ్ళీ ఫోన్ మోగింది.
అవతలనుంచి సాఫ్ట్‌వేర్ కంపెనీ హెచ్‌ఆర్ డిపార్ట్‌మెంట్ ప్లేస్‌మెంట్‌వాళ్ళు లైన్‌లో ఉన్నారు.
‘‘సర్!.... మీరు ఇవ్వాళ... టెలిఫోన్ ఇంటర్వ్యూ తీసుకోవటానికి అభ్యంతరం లేదుగా?’’
రెండు క్షణాలు ఆలోచించి చెప్పాడు కార్తీక్.
‘‘లేదు! ఇంటర్వ్యూ ఎప్పుడు?’’
‘‘ఇంకో గంటలో ఉండవచ్చు. ఇంటర్వ్యూ చేసేది అమెరికానుంచి అక్కడి మేనేజర్ మైక్‌జోన్స్ ఇంటర్వ్యూ చేస్తారు.’’ ఫోన్ కట్ అయింది.
* * *
కాలింగ్ బెల్ మోగింది.
గోపిక తండ్రి రఘురాం తలుపుతెరిచాడు.
ఎదురుగా నిలబడి ఉన్నాడు వైకుంఠం.
రఘురామ్ ఇంటి ముందు అతడు తీసుకువచ్చిన ఇన్నోవా పార్క్‌చేసి ఉంది. అందులో ఉన్నారు కార్తీక్, జైరాం, రవి, హరీష్‌ల తండ్రులు.
వైకుంఠాన్ని రఘురాం ఎప్పుడూ చూసి ఉండలేదు. కానీ వైకుంఠాన్ని చూడగానే రఘురామ్‌కి భయం వేసింది.
కరుగ్గా చెప్పాడు వైకుంఠం-
‘‘ఆ కొండాపూర్ రిజిస్ట్రేషన్స్...! ఇవ్వాళే ఐపోవాలి!’’
వినయంగా అన్నాడు రఘురామ్.
‘‘రండి! వచ్చి కూర్చోండి!... బట్టలు మార్చుకుని వస్తాను.’’ వైకుంఠం లోపలికి వచ్చి కూర్చున్నాడు.
ముందు గదిలోంచి తన తండ్రి రఘురాం, వైకుంఠంల మాటలు గోపికకు వినపడుతున్నాయి. గోపిక కర్టైన్ చాటునుంచి చూసింది.
ఆమెకు వైకుంఠం కనిపించాడు.
వీధిలో ఆగి ఉన్న ఇన్నోవాలో కార్తీక్ అతడి మిత్రుల తండ్రులు కూర్చుని ఉండటం గమనించింది గోపిక.
ఆమెకు విషయం అర్థం అయింది.

-సశేషం

-జి.వి.అమరేశ్వరరావు