డైలీ సీరియల్

యాజ్ఞసేని - 131

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధృతరాష్ట్రుడు యోగనిష్ఠుడై ఆ అగ్నియందే సంయోగం చెందాడు. పుత్రులను కోల్పోయిన మహాపతివ్రత అయిన గాంధారి భర్త సేవావ్రతంలో నిలిచి పతిననుసరించి ఆ అగ్నిలోనే తానూ సంయోగం చెందింది. ఉత్తమ లోకాలకు వెళ్ళింది.
అటులనే కుంతీదేవి పుత్రులైన ధర్మరాజభీమార్జున నకుల సహదేవులు బ్రతికి వుండగానే రాజ్యాన్ని వీడి, వనవాసాన్ని యెన్నుకొన్నది. ధృతరాష్ట్ర గాంధారిలతోపాటు అనాథవలె అగ్నిలో దగ్ధమైంది. కుంతీదేవిని అగ్ని చుట్టుముట్టినందువలన మహాభయాన్ని పొంది ‘‘హా! నాయనా! ధర్మరాజా!’’అని ఆక్రోశించింది.
ధృతరాష్ట్రుడు గాంధారి, కుంతీదేవి సహితంగా అగ్నిలో సంయోగం చెందారని మహర్షి నారదుడు ధర్మరాజుకు తెలియపరచాడు. ధర్మరాజు తమ్ములతో భార్య ద్రౌపదితోకలిసి బయలుదేరి గంగ దగ్గరకు చేరాడు. యుయుత్సుని ముందు నిలుపుకొని ధృతరాష్ట్రునికి, గాంధారికి జలాంజలి నిప్పించాడు. తాను తన తల్లి కుంతీదేవికి తమ్ముళ్ళతో కలిసి జలాంజలినిచ్చాడు. వారివారి పేర్లను విడివిడిగా సంకీర్తించి దానాలు చేశాడు.
శ్రీకృష్ణబలరాములు కూడా తమతమ శరీరాలను విడిచి వారి ధామానికి చేరారు. యదువంశీయులందరూ దైవాంశ సంభూతులు. దేవదేవుడైన శ్రీకృష్ణునితో కలిసి వచ్చారు. కలిసి వెళ్ళిపోయారు.
(60)
శ్రీకృష్ణ బలరాములు, తక్కిన యాదవులు గతించిన విషయాలను, వ్యాసమహర్షి హిత వచనాలను, ద్వారకానగరంనుండి తిరిగి వచ్చిన అర్జునుని ద్వారా ధర్మరాజు విన్నాడు. వ్యాసమహర్షి అర్జునునితో
‘‘్ధనంజయా! అన్నింటికి కాలమే మూలం. సర్వ జగత్తుకుకూడా కాలమే మూలం. కాలమే అన్నింటికీ వుపసంహరిస్తుంది. ఒకప్పుడు బలశాలియై, అంతలోనే దుర్భలవౌతుంది. ఒకప్పుడు తానే మొత్తాన్ని శాసిస్తుంది. ఇతరుల ఆదేశాలకు లొంగిపోతుంది. నీ అస్త్రాలు పని ముగించుకొని వెళ్ళిపోయాయి. మరలా సమయం వచ్చినప్పుడు నీ చేతికి రాగలవు. ఉత్తమగతిని పొందటానికి కూడా యిదే తగిన కాలం’’అని అన్నాడు.
తదుపరి అర్జునుడు హస్తినాపురానికి తిరిగి వచ్చాడు. ధర్మరాజు మనసును ప్రయాణానికి సిద్ధపరచాడు. పిమ్మట అర్జునునితో
‘‘కాల పురుషుడు అన్ని భూతాలనుదాల్చి పరిపక్వం చేస్తాడు. ఇప్పుడు నా బుద్ధికి కర్మను సంపూర్ణంగా త్యజించడం మాత్రమే తగిన పనిగా తోచుచున్నది.’’అని అనగా అర్జునుడు
‘‘రాజా! కాలాన్ని యేమనగలము? ఎట్లా వర్ణించగలం.? కాలాన్ని పోలింది కాలం మాత్రమే. కాక మరోదాని లీలలున్నాయా? కాబట్టి యిట్లా చేయడమే మంచిది!అని అన్నాడు.
అర్జునుని మాటలు మనఃపూర్వకంగా మెచ్చుకొన్న ధర్మరాజు భీమ నకుల సహదేవులను పిలిపించి జరిగినవారికి సంపూర్ణంగా తెలియపరచాడు. వారుకూడా అనుకూలంగా వుండటాన్ని చూచి ప్రసన్నుడయ్యాడు. తదుపరి యుయుత్సుడిని పిలిపించి విషయాన్ని వివరించాడు
యుయుత్సుడికి రాజ్యాన్ని పాలించే పద్ధతిని సిద్ధంచేసికొని యెట్లా పాలన చేయాలో స్పష్టంగా నేర్పించాడు. అంతఃపురంలో యెట్లా వర్తించాలో కూడా స్నేహభావంతో బోధించాడు.
అట్లా సోదరుడైన యుయుత్సుని కురుసామ్రాజ్యానికి పెద్దదిక్కుగా నియమించాడు. సైన్యాన్ని యేర్పాటుచేశాడు.
పెద్దలు ప్రస్తుతింపగా పరిక్షిత్తును భరతభూమికి రాజుగా అభిషేకించాడు ధర్మరాజు. అతడికి గౌరవనీయమైన సామ్రాజ్యపాలనా రీతులను బోధించాడు. ఉదాత్తురాలైన సుభద్రను పిలిపించాడు. ఆమెతో ‘‘అమ్మా! సుభద్రా! నీ పౌత్రుడు ఈరోజు కురు సామ్రాజ్యభారాన్ని మోసేవాడయ్యాడు. యాదవ వంశశ్రేష్టుడైన ‘‘వజ్రునికి’’ ఇంద్రప్రస్థం పట్టంకట్టాను. ఇట్లా కురుయాదవ వంశాలను, హస్తినాపురంలో పరీక్షిత్తును శుక్రప్రస్థంలో వజ్రుని నీవురక్షించాలి. నీవు దృఢమైన ధైర్యాన్ని కలిగివుండాలి.’’ అని బోధించాడు.
సుభద్ర కూడా తమను వెంబడించి రాకుండా తగిన నియమాన్ని యేర్పరచి వూరట చెందాడు.
తదుపరి భారత రణంలో మృతి చెందిన బంధువులకు, రోకటిపోరులో (యాదవులకు పుట్టిన రోకలి) నశించిన యదుసమూహానికి పుణ్యలోకప్రాప్తి కలిగించేందుకు అనేక దానాలను హృదయపూర్వకంగా చేశాడు.
ధీమంతుడైన వాసుదేవునికి, వృద్ధుడైన మేనమామకు(వసుదేవునికి) బలరామాదులకు సోదరులతో కలిసి జాలాంజలి సమర్పించాడు. వారి నుద్దేశించి యధావిధిగా శ్రార్ధకర్మను కూడా చేశాడు.

........................................ఇంకా వుంది

--త్రోవగుంట వేంకట సుబ్రహ్మణ్యము