డైలీ సీరియల్

యాజ్ఞసేని--132

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వ్యాసుని, నారదుని, తపోధనులైన మార్కండేయ మహర్షిని, భరద్వాజుని, యాజ్ఞవల్క్యుని రుచిగల పదార్థాలతో భుజింపచేశాడు. ఇదంతా శ్రీకృష్ణుని వుద్దేశించి చేసినదే. శ్రీకృష్ణుని నామాన్ని కీర్తిస్తూ బ్రాహ్మణ శ్రేష్ఠులకు రత్నాలనూ, వస్త్రాలనూ, గ్రామాలనూ, గుఱ్ఱాలనూ, రథాలనూ, వందల వేలకొలది స్ర్తిలను, గోవులనూ దానంచేశాడు.
అటుపిమ్మట గురువైన కృపాచార్యుని పూజించాడు. పురజనులతోసహా పరిక్షిత్తును ఆయనకు శిష్యునిగా సమర్పించాడు.
ఆపై పురజనులను, మంత్రులను రప్పించి తానుచేయదల్చుకొన్న విషయమంతా చెప్పాడు. వారందరూ ధర్మరాజు మాటను వినినంతనే తీవ్రంగా కలత చెందారు. ‘‘అలాచేయవద్దని’’ ప్రజలనగా వారి మాటను మన్నించలేదు. కారణం తనకు కాలపరిభ్రమణంలో సంభవించే ధర్మస్వరూపం తెల్సుగనుక.
అర్జునుని భార్య అయిన ఉలూపి తండ్రివద్దకు నాగలోకానికి వెళ్ళింది. మరొక భార్య అయిన చిత్రాంగద తన కుమారుడైన బభ్రువాహనుని మణిపురానికి చేరింది.
ధర్మరాజు పౌరులను, జానపదులను వొప్పించి వారి అనుమతితో వెళ్ళిపోవడానికే నిశ్చయించుకొన్నాడు. వారి సోదరులుగూడా అదే నిర్ణయించుకొన్నారు. ధర్మరాజు అంతట తన శరీరాన్నుండి ఆభరణాలను తీసివేసి వల్కలాల ధరించాడు. అదేరీతిగా భీమార్జున నకుల సహదేవులుగూడా, యశస్విని అయిన ద్రౌపదికూడా అందరూ వల్కలాలు ధరించారు.
గతంలో జూదంలో వోడిపోయినప్పుడు వెళ్ళినట్లుగా ద్రౌపదితోసహా ఆరుగురై బయలుదేరినప్పుడు స్ర్తిలందరూ రోధించారు.
స్వర్గారోహణము
అయిదుగురు సోదరులు, అరవదిగా ద్రౌపది, ఏడవదిగా ఒక కుక్క (శునకం) కలసి బయలుదేరారు.
కొంతదూరం వారిని అనుసరించి వచ్చిన నగరవాసులందరూ వెనుదిరిగారు.
కృపాచార్యుడు, యుయుత్సుడు కూడా వెనుదిరిగారు.
నాగకన్య ఉలూపి గంగలో ప్రవేశించింది.
చిత్రాంగద మణిపూర నగరానికి కొడుకు వద్దకు వెళ్ళిపోయింది.
మిగిలిన తల్లులు అందరూ పరిక్షిత్తు చుట్టూ నిలిచి కొంత దడవుకు వెనుదిరిగారు. (సుభద్ర, ఉత్తర)
పాండవులు, ద్రౌపది వుపవాస వ్రతాన్ని పాటిస్తూ తూర్పుదిశగా బయలుదేరారు. యోగయుక్తులై త్యాగధర్మాన్ని పాటిస్తూ అనేక దేశాలను, నదులను, సముద్రాలను సందర్శించారు.
ముందు యుధిష్ఠిరుడు, ఆ వెనుక భీమసేనుడు, అతని వెంట అర్జునుడు, అర్జునుని అనుసరిస్తూ క్రమంగా నకులసహదేవులు నడువసాగారు. పద్మదళేక్షణ, స్ర్తిజాతిలో మేటిఅయిన ద్రౌపది వారందరి వెనుక నడవసాగింది. ఆ పాండవులను ఒక కుక్కకూడా అనుసరించింది. తదుపరి వారు దక్షిణాభిముఖులై వెళ్లారు. పిదప లవణసముద్రపు ఉత్తర తీరంపై నైరృతిమూలవైపుగా ముందుకుసాగారు.
మరలా కేవలం పడమటివైపునకు తిరిగారు. సాగరంలో మునిగివున్న ద్వారకాపురిని చూచారు. తదుపరి భూప్రదక్షిణ చేయదలచి ఉత్తర దిక్కుగా నడవసాగారు.
మనసులను నియంత్రించుకొని వారు ఉత్తర దిక్కుననున్న ‘‘హిమగిరిని చూశారు. మహా పర్వతమైన మేరువును’’ చూచారు. యోగధర్మంలో నిలచి వారందరూ వేగంగా నడుస్తుండగా యోగం సడలి మహాపతివ్రత అయిన ద్రౌపది నేలగూలింది. అది చూచిన భీమసేనుడు ద్రౌపదిని చూపిస్తూ ధర్మరాజుతో
‘‘రాజా! ఈ రాజకుమారి ఏ అధర్మమూ చేయలేదు. ఈ ద్రౌపది నేలపడిపోవడానికి కారణమేమిటో చెప్పుము’’ అని అడిగాడు. అప్పుడు యుధిష్ఠిరుడు-
‘‘పురుష శ్రేష్ఠా! ఈమెకు అర్జునునిపై పక్షపాతమెక్కువ. దీనివలననే ఆమె చేసిన పుణ్యాలు ఫలించకపోవడం సంభవించి ఇలాంటి దురవస్థ సంభవించింది. దాని ఫలితాన్న ఈమె యిప్పుడిలా అనుభవిస్తున్నది’’ అంటూ ఆమె వైపు చూడకుండానే ఆమె శవాన్ని వదలిపెట్టి ధర్మరాజు మనస్సును ఏకాగ్రతతో నిలబడి ముందుకు సాగాడు.
ఆపై పండితుడైన సహదేవుడు నేలపై పడిపోగా చూచిన భీముడు ధర్మరాజుతో ‘‘మనందరినీ సేవిస్తూ అహంకారం లేకుండా జీవించిన ఈ మాద్రి సుతుడు ఎందుకు నేలపై బడ్డాడు. తెలిస్తే చెప్పుము?’’ అని అడిగాడు.
‘‘ఇతడు ఇతరులనెవ్వరినీ తనంత మేధావిగా భావించలేదు. ఆ దోషంవలన పడిపోయాడు’’ అని సమాధానం చెప్పాడు ధర్మరాజు.
వారు అట్లా ముందుకు సాగిపోతుండగా నకులుడు పడిపోగా భీముడు ధర్మరాజుతో ‘‘ఈ నకులుడు ధర్మాన్ని ఎప్పుడూ భంగపరచనివాడు. మన ఆదేశాలను తప్పక పాటించేవాడు. సాటిలేని సౌందర్యవంతుడు ఎందుకు నేలబడిపోయాడు?’’ అని అడిగాడు.
..........................ఇంకావుంది

--త్రోవగుంట వేంకట సుబ్రహ్మణ్యము