డైలీ సీరియల్

పంచతంత్రం-33

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక పోలీస్ జీప్ వేగంగా రిజిస్ట్రార్ ఆఫీస్ ఆవరణలోకి దూసుకువచ్చింది. అరడజను మంది పోలీస్‌లు జీప్‌లోంచి కిందికి దూకారు. వాళ్లకు కనపడింది ఎదురుగా పార్క్‌చేసి ఉన్న ఇన్నోవా. వాళ్ళు అటువైపు వేగంగా నడిచారు.
వైకుంఠం ఆలోచిస్తున్నాడు. తాను పరిగెత్తి తప్పించుకుంటే పోలీసులు ఛేజ్ చేసి అరెస్ట్‌చేస్తారు. తాను ఏమీతెలియనట్టు కామ్‌గా ఉంటే వాళ్ళు ఇన్నోవాని స్వాధీనం చేసుకుని తీసుకుపోతారు.
ఇలా ఆలోచించిన తర్వాత కాంటీన్‌లోనే నిలబడి జరిగేది చూడసాగాడు వైకుంఠం.
పోలీస్‌లు ఇన్నోవా దగ్గరకు వెళ్లి, ఆ పక్కన ఉన్న జనాన్ని అడిగారు.
‘‘ఈ కార్‌లో ఎవరు వచ్చారు?’’
అక్కడి జనం- ఇదేదో పోలీస్ కేసు మనకెందుకు తలనెప్పి అనుకుని మాట్లాడకుండా ఊరుకున్నారు.
అప్పుడు ముఖం చుట్టూ చున్నీ చుట్టుకుని తలమీద హెల్మెట్ పెట్టుకున్న గోపిక ఒక అడుగు ముందుకువేసి, ‘‘అదుగో...! అతడే ఈ కార్లో వచ్చాడు’’అంటూ, కాంటీన్‌లో చాయ్ తాగుతున్న వైకుంఠంని పోలీస్‌లకు చూపించింది.
ఈ దృశ్యం చూసిన వెంటనే చాయ్ కప్పువిసిరేసి, ఒక్కసారిగా పారిపోవటం ప్రారంభించాడు వైకుంఠం. కానీ అతడి ప్రయత్నం ఫలించలేదు. పోలీసులు అతడిని చుట్టుముట్టి అరెస్ట్‌చేశారు.
ఇన్నోవాలో పోలీస్‌లకు ఐదు లక్షల విలువైన పాత నోట్లు, ఐదు లక్షల విలువైన కొత్తనోట్లు దొరికాయి.
వైకుంఠంను పోలీసులు అరెస్ట్‌చేయటం వాసుదేవరావు మొదలైనవాళ్ళు గమనించారు.
రిజిస్ట్రేషన్స్ ఆగిపోవటంతో-
‘‘అంతా ఆ ఆంజనేయస్వామి మహాత్యం!.’’అంటూ తన మిత్రులతో చెప్పాడు వాసుదేవరావు.
తర్వాత గోపిక కార్తీక్‌కు ఫోన్‌చేసి చెప్పింది.
‘‘నీ ఊహ కరెక్ట్ అయింది. వాడి కార్‌లో డబ్బు దొరికింది... నాదో డౌట్....! ... వాడి కార్‌లో డబ్బులేకపోతే నువ్వు ఏం చేసేవాడివి?’’
కార్తీక్ నవ్వి చెప్పాడు.
‘‘రిజిస్ట్రార్ ఆఫీస్ వెనక... ఒక పెద్ద షెడ్ ఉంది. దానినిండా పనికిరాని పాత చెక్క చెత్త సామాను పడి ఉంది. ఆ సామాను మీద కిరోసిన్ వేసి, నిప్పుపెడితే, మంటలు చెలరేగి ఆరోజుకి రిజిస్ట్రార్ ఆఫీసు మూతపడేది. రిజిస్ట్రేషన్స్ ఆగిపోయేవి.’’
‘‘మరి నువ్వు అక్కడ ఉన్నావ్‌గా ఇక్కడ ఎలా తగలపెడతావ్?’’
‘‘నేను ఎలా తగలపెడతాను?... ఆ పని నువ్వే చేసే దానివి.....?’’ ఈ సమాధానం వినగానే గోపిక ఆవశ్యంతో నోరుతెరిచింది.
* * *
ఎతె్తైన రాళ్ళగుట్టల మధ్య. నిర్మానుణ్యంగా, నిశ్శబ్దంగాఉన్న పోచమ్మ గుడి దగ్గర బాల్‌రాజ్, పఠాన్, బైరాగి, వేలాయుధం వేషంలో ఉండే హరేరామ్‌లకోసం ఎదురుచూస్తున్నారు రవి, జైరాం.
వాళ్ళు తమ బైక్స్‌ను పొదలచాటు పార్క్‌చేసారు.
కొద్ది నిమిషాలతర్వాత దుర్గారావ్, మహేంద్రల బైక్ అక్కడికి రావటం వాళ్ళు గమనించారు దుర్గారావ్. మహేంద్రలు కూడా తమ వాహనాన్ని చాటుగా పార్క్‌చేశారు.
కాని రవి, జైరాంలకు హరీష్ కనిపించలేదు. హరీష్ తన బైక్ దూరంగా పార్క్‌చేసి గుట్టలు, పొదల చాటునుంచి మూవ్‌అవుతూ అక్కడికి కొంచెం ఆలస్యంగా చేరుకొని, రవికి తను అక్కడే ఉన్నట్టు ఎస్‌ఎంఎస్ ఇచ్చాడు. రవి దగ్గర ఉన్న ఫోన్ వైబ్రేట్ అయింది. ఆ ఎస్‌ఎంఎస్‌ను తాను చూసి జైరాంకు కూడా చూపించాడు రవి.
పోచమ్మ గుడిదగ్గర సంవత్సరానికి రెండుసార్లు జాతరలు జరుగుతాయి. ఆ సమయంలో జంతు బలులు ఇస్తారు. మిగిలిన సమయాల్లో ఆ ప్రాంతాలకు ఎవరూ రారు. చుట్టూ పడిఉన్న జంతువుల అస్థిపంజరాలు మధ్య వాళ్ళు నిశ్శబ్దంగా ఎదురుచూడసాగారు.
బాల్‌రాజ్, బైరాగి, పఠాన్‌లు ప్రయాణిస్తున్న మారుతి కారు అక్కడికి వచ్చి ఆగింది. వాళ్ళు ముగ్గురూ కిందికి దిగారు. ఆ చుట్టుపక్కల ప్రాంతాన్ని పరిశీలించి చెప్పాడు బాల్‌రాజ్.
‘‘ఇక్కడ ఎవరూ లేరు. ఇంకా ఆ వేలాయుధం రాలేదు.’’
ఈమాట వింటూ అక్కడ ఉన్న గుట్టలవైపు, పొదల వైపు చూసాడు బైరాగి.
అక్కడ చాటుగా మహేంద్ర దాక్కుని ఉన్నాడు అని బైరాగికి తెలుసు. కానీ మహేంద్రతో దుర్గారావ్ కూడా ఉన్నాడు అని అతడికి తెలియదు.
బాల్‌రాజ్ గ్యాంగ్ పోచమ్మ గుడిదగ్గరకు చేరుకొని వేలాయుధంకోసం ఎదురుచూడసాగారు.
పది నిమిషాల తర్వాత...
దూరంనుంచి వస్తున్న ఆల్టో కనపడింది. దాన్ని హరేరామ్ నడుపుతున్నాడు.
దాన్ని చూడగానే అందరూ ఎలర్ట్‌అయ్యారు. హరీష్, రవి, జైరాంలు తప్ప మిగిలినవాళ్ళు అందరూ ఆ ఆల్టోలో ఉన్నది వేలాయుధం అని అనుకుంటున్నారు.
ఆల్టోను చూడగానే మారుతిలో ఉన్న రెండు సూట్ కేసులు బయటికితీసాడు బాల్‌రాజ్.
వాటిని చూసి-
‘‘వాటి నిండా నోట్ల కట్టలు ఉన్నాయ్. మరి కొద్దిసేపట్లో అవి మన స్వంతం అవుతాయి.’’అంటూ చెప్పి రివాల్వర్ బయటకుతీసాడు దుర్గారావ్. మహేంద్ర కూడా రివాల్వర్ తీసి బాల్‌రాజ్ గ్యాంగ్‌వైపు ఎయిమ్ చేశాడు.
దుర్గారావ్ చెప్పాడు.
‘‘ఇక్కడనుంచి ఎయిమ్ సరిపోవటం లేదు... దగ్గరకు వెళ్దాం!... అందరినీ లేపేద్దాం.!’’
బండరాళ్లను చాటుచేసుకుంటూ కదులుతున్నాడు దుర్గారావ్. అతడిని అనుసరించాడు మహేంద్ర.
అలా మూవ్‌అవుతూ బాల్‌రాజ్, అతడి అనుచరులు గన్‌షాట్ రేంజ్‌లోకి రాగానే ఆగాడు దుర్గారావ్.
మహేంద్ర ఇంతకుముందు ఎప్పుడూ ఎన్‌కౌంటర్ చేయలేదు. అతడికి టెన్షన్‌గా ఉంది.
ఈలోపు హరేరామ్ డ్రైవ్‌చేస్తున్న ఆల్టోవచ్చి పోచమ్మ టెంపుల్ పక్కన ఆగింది.
అందులోంచి చేతిలో చిన్న ఐరన్‌బాక్స్ తీసుకుని కిందికి దిగాడు హరేరామ్.
బాల్‌రాజ్, పఠాన్, బైరాగిలు కూడా నిరంజన్ ఇచ్చిన డ్రెస్‌లో ఉన్నారు. ఎదురుగా ఉన్నవాడు తమకు రోజూ వంట చేసిపెట్టే హరేరామ్ అని వాళ్లకు తెలియదు.
హరేరామ్‌ను చూస్తూనే అన్నాడు బాల్‌రాజ్.
‘‘జాగ్రత్తగా ఉండండి!.... వేలాయుధం చాలా డేంజరస్ ఫెలో...!!’’
పఠాన్, బైరాగి టెన్షన్‌గా తలలు ఊపారు.
అదే సమయంలో..
‘‘ఈ ముగ్గురూ ఎవరు అయి ఉంటారు?.... తాను పేపర్లలో చదివే అంతర్ రాష్ట్ర గజదొంగలు అయి ఉంటారు.’’ అని అనుకుంటున్నాడు హరేరామ్-
-సశేషం

-జి.వి.అమరేశ్వరరావు