డైలీ సీరియల్

యాజ్ఞసేని-133

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘రూపంలో నాయంతటివాడు లేడని ఇతని భావం. నేనొక్కడినే అందంలో అందరినీ మించినవాడనని కూడా ఇతనికి మనస్సులో వున్నది గాబట్టి పడిపోయాడు’’.
భీమసేనా! నీవు రా! వీరా ఎవరికి ఏది విధింపబడివుందో దాన్ని అతడు తప్పక అనుభవించాలి’’ అని సమాధానం చెప్పాడు ధర్మరాజు.
ఆ తరువాత అర్జునుడు తనవారంతా పడిపోవడం చూసి శోకసంతుప్తుడై తానూ పడిపోయాడు. అర్జునుడు ఎవ్వరూ ఎదిరింపలేనివాడు. ఇంద్రుని వంటి తేజస్సు గలవాడు. పురుష శ్రేష్ఠుడైన అర్జునుడు పడిపోవడం చూచి భీమసేనుడు ధర్మరాజుతో
‘‘ధర్మరాజా! ఈ మహాత్ముడు సరదాకు కూడా అసత్యమాడినట్లు గుర్తులేదు. మరి ఏ పరిణామంగా యితడు నేలపై బడ్డాడు?’’ అని అన్నాడు.
‘‘భీమా! ఒక్క రోజులో శత్రువులనందరినీ దహించివేస్తానని అర్జునుడు అన్నాడు. కాని ఆ పని చేయలేదు. అందువల్ల తనను తాను శూరుడనుకొనే అర్జునుడు పడిపోయాడు. ఈ అర్జునుడు ఇతర ధనుర్ధారులందరినీ అవమానించాడు. దాని ఫలితమే యిది. శ్రేయస్కాముడు అలా ప్రవర్తింపదగదు’’ అని యుధిష్ఠిరుడు ముందుకు సాగాడు.
అంతలో భీమసేనుడు తనే పడిపోయాడు. నేలబడిన భీముడు ధర్మరాజును అడిగాడు- ‘‘రాజా! చూడు. నీకు ప్రియుడినైన నేను పడిపోయాను. నీకు తెలిస్తే నేను ఏ కారణం చేత పడిపోయానో చెప్పుము?’’ అని-
‘‘నీవు ఎక్కువ తింటావు. ఇతరులను ఏమీ పట్టించుకోకుండా నీ బలంతో ప్రగల్భిస్తుంటావు. అందువల్ల నేలపై పడిపోయావు’’ అని అన్నాడు ధర్మరాజు.
అలా అంటూ భీముని వైపు చూడకుండానే యుధిష్ఠిరుడు వెళ్లిపోయాడు.
వారితో వచ్చిన ‘కుక్క’ కూడా ధర్మరాజును అనుసరించి నడవసాగింది.
కొంత తడవుకు అలా పోతున్న ధర్మరాజు వద్దకు భూమ్యాకాశాలను దద్దరిల్లజేస్తూ ఇంద్రుడు రథం పైన వచ్చాడు. వచ్చి ‘రథాన్ని ఎక్కుము’ అని ధర్మరాజుతో అన్నాడు. అప్పుడు శోకసంతుప్తుడైయున్న ధర్మరాజు ఇంద్రునితో-
‘‘దేవేంద్రా! నా సోదరులందరూ ఇక్కడ పడిపోయారు. నాతోపాటు వారు గూడా రావాలి. సురేశ్వరా! నా సోదరులు లేకుండా నేను స్వర్గానికి రావడానికి ఇష్టపడడంలేదు’’.
‘‘సుఖాలకు తగిన సుకుమారి ఈ రాజకుమారి ద్రౌపది. ఆమె కూడా రావాలి. దానిని నీవు అనుమతించుము’’ అని అన్నాడు ధర్మరాజు.
‘‘యుధిష్ఠిరా! ద్రౌపదితో కలిసి నీ సోదరులందరూ స్వర్గానికి వెళ్లిపోయారు. వారిని అక్కడ చూడవచ్చును. బాధపడవద్దు. వారు మానవ శరీరాన్ని వీడి స్వర్గానికి వెళ్ళారు. నీవు ఈ శరీరంతోనే స్వర్గానికి చేరగలవు.. సందేహం లేదు’’ అని ఇంద్రుడు ధర్మరాజును రమ్మన్నాడు.
దేవేంద్రా! నీవు భూత భవిష్యత్తులకు నిర్దేశికుడవు. ఈ ‘కుక్క’ నేను హస్తిన నుండి బయలుదేరినపుడు మిక్కిలి దృఢమైన భక్తితో అందరికంటే ముందుగా నన్ను వెంబడించి వచ్చింది. నిత్యమూ భక్తితో నన్ను సేవిస్తుంది. నాతోపాటు అదికూడా రావాలి. నా బుద్ధి క్రూరంగా ప్రవర్తింపలేదు.’’ అని ధర్మరాజు అనగా.
‘‘రాజా! నీవు నేడు అమర్త్యాన్ని, నాతో సమానత్వాన్ని, మహాసిద్ధిని, పూర్ణసంపదను, స్వర్గసుఖాలను పొందావు. ఈ కుక్కను విడిచిపెట్టుము. దానికి దివ్యత్వంయెలా కలుగుతుంది? నీవు ఆలోచిస్తున్న విధానం అసాధ్యంగా వున్నది. అలా ప్రవర్తించడం క్రూరత్వంగాదు’’ అని అనగా
ఆర్యా! ఆర్యుడు అమర్యాదగా ప్రవర్తించలేడు. దీనిని విడవటం కష్టం. భక్తజనాన్ని వీడి రావలసినంత సంపదతో కలయిక నాకు అవసరంలేదు’’అని ధర్మరాజు సమాధానమిచ్చాడు.
‘‘కోపం ధర్మాలను నశింపజేస్తుంది. అందుచేత ఓ కురుశ్రేష్ఠుడా నీవు కోపగించకుండా వినుము. కుక్కలకు స్వర్గంలో చోటు లేదు. ఈ కుక్కను వదిలివేస్తే నీకు యేపాపమూ రాదు. కోపపడకు, శుభసందర్భం కలిగినపుడు దానిని దూరంచేసికొనటం తగినపని కాదు.
యజ్ఞదీక్షలో వున్నవాడు కుక్కను తాకితేనే వారు ఆశించిన పుణ్యం నశిస్తుందనీ నీకు తెలియదా? అలాంటప్పుడు యింతగా నీవెందుకు నిర్భందం చేస్తున్నావు? ఈ కుక్కను వదలి వేయుము. దీనిని వదలటం వలన నీకు స్వర్గప్రాప్తి, సౌఖ్యం లభిస్తుంది.
ద్రౌపది, భీమార్జున నకులసహదేవులను వదలివేయటానికి సిద్ధపడ్డావే? ఈ కుక్కను విడిచిపెట్టటానికి యెందుకు వెనుకాడుచున్నావు?’’అని అన్నాడు ఇంద్రుడు.తప్పుడు మార్గం కాదనేటటువంటి ఆలోచనతో విన్నవించుకొంటున్నాను. భీమాదులు, ద్రౌపది చనిపోయారు. నేను వారిని గౌరవించి యెంత యేడ్చినా వారు మరలిరారు గదా? అట్లాకాకుండా నావెనుకనే వచ్చి చచ్చిపోకుండా నిలిచిన ఈ కుక్కను వదలివెయ్యడం తప్పనడం సమంజసం కాదు. నీవే ఆలోచించుము.

..........................ఇంకావుంది

త్రోవగుంట వేంకట సుబ్రహ్మణ్యము