డైలీ సీరియల్

పంచతంత్రం-34

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాల్‌రాజ్, పఠాన్‌ల దగ్గరకు వస్తున్నాడు హరేరామ్.
అతడు కొంత దూరంలో ఉండగానే బాల్‌రాజ్ ముక్కుపుటలకు సోకింది చౌకబారు సెంటుకంపు. అతడు బాల్‌రాజ్‌తో మెల్లిగా అన్నాడు.
‘‘అన్నా! వీడి దగ్గర్నించి వస్తోంది చీపు సెంటుకంపు. ఇలాంటి కంపే ఎక్కడో వాసన పీల్చా!’’
హరేరామ్‌కు సెంట్ కొట్టుకునే అలవాటు ఉంది. అక్కడికి వచ్చే ముందు సెంట్ కొట్టుకుని వచ్చాడు. బాల్‌రాజ్ కోపంగా చెప్పాడు.
‘‘నోరుముయ్యి! వాడు ఎవడు అనుకుంటున్నావు? ఇంటర్నేషనల్ స్మగ్లర్... అది చీపు సెంటు కాదు. ఇంపోర్టెడ్ కాస్ట్లీసెంటు.’’
బైరాగి టెన్షన్‌గా కనుకొనలగుండా ఆ పరిసరాలను పరిశీలిస్తున్నారు. అతడికి మహేంద్ర కనిపించలేదు.
మరోవైపు జైరాం సెల్‌ఫోన్‌లో ఎప్పటికప్పుడు కార్తీక్‌కు పరిస్థితి వివరిస్తున్నాడు.
హరేరామ్ ఒకసారి బాల్‌రాజ్, పఠాన్, బైరాగిలవైపు చూసాడు. తన దగ్గర ఉన్న బాక్స్ వాళ్లతో ఎవరికి అందించాలో అతడికి అర్ధంకాలేదు. ఈ విషయం గ్రహించిన బాల్‌రాజ్ ఒక అడుగు ముందుకు వేసి ఆ బాక్స్ అందుకున్నాడు.
సరిగ్గా అదే సమయంలో దుర్గారావ్ చేతిలోని రివాల్వర్ పేలింది. అతడు బాల్‌రాజ్‌ని ఎయిమ్ చేసి రివాల్వర్ పేల్చాడు. కానీ అదే సమయంలో బాల్‌రాజ్ ముందుకు కదలటంతో బుల్లెట్ గురితప్పి, బాల్‌రాజ్ వీపును రాచుకుంటూ దూసుకుపోయింది.
బుల్లెట్ సౌండ్ వినటంతోనే ఠక్కున నేలమీదకు జారిపోయాడు బాల్‌రాజ్. అదే సమయంలో మహేంద్ర రివాల్వర్ పేల్చాడు. ఈసారి బులెట్ పఠాన్ భుజంలో దిగింది. కెవ్వున అరిచి నేలమీద పడిపోయాడు పఠాన్. ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది అని ఊహించని హేరామ్ తను కూడా నేలమీద బోర్లాపడిపోయాడు. మరోవైపు గుట్టల వెనక దాక్కుని, తమకు బులెట్స్ తగలకుండా జాగ్రత్తపడుతున్నారు హరిష్, జైరాం, రవి.
ఈలోపు ప్యాంటు పాకెట్‌లోంచి ఒక నాటు తుపాకిని బయటకు లాగాడు బాల్‌రాజ్. దాన్ని తమ మీదికి కాల్పులు జరిపిన వైపు ఎయిమ్ చేసి ఫైర్ చేశాడు. బుల్లెట్ దుర్గారావ్, మహేంద్రల తలమీదుగా దూసుకుపోయింది.
బాల్‌రాజ్ అతడి అనుచరుల దగ్గర కత్తులు, చాకులు ఉంటాయి అనుకున్నారు దుర్గారావ్, మహేంద్ర. కానీ వాళ్ళ దగ్గర నాటు తుపాకులు ఉంటాయి అని వాళ్ళు ఊహించలేదు.
వెంటనే రియాక్ట్ అవుతూ రివాల్వర్ పేల్చాడు దుర్గారావ్. బులెట్ దూసుకువచ్చి బాల్‌రాజ్ చేతిలోని రివాల్వర్‌కి తగిలింది. రివాల్వర్ ఎగిరి దూరంగా, రాతి బండల చాటున దాక్కుని వున్న హరీష్ పక్కన పడింది.
ఇపుడు బాలరాజ్ దగ్గర ఆయుధం లేదు.
ఈలోపు దుర్గారావ్ పేల్చిన ఒక బుల్లెట్ బాల్‌రాజ్ తలమీదుగా దూసుకుపోయింది.
హరీష్‌కు కొద్దిసేపటి క్రితం ఫోన్‌లో కార్తీక్ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి.
‘‘గొడవ జరిగి, ఒకళ్ళనొకళ్లు చంపుకోవాలి..’’
ఈ మాటలు గుర్తుకురాగానే మెరుపులా తాను దాక్కున్న ప్రదేశం నుంచి కదలి, నేలమీద పడి వున్న నాటు పిస్తోలు అందుకుని దాన్ని గురిచూసి, బలంగా విసిరాడు. అది నేరుగా వెళ్లి బాల్‌రాజ్ పక్కన పడింది.
క్షణకాలం బిత్తరపోయాడు బాల్‌రాజ్. దూరంగా వెళ్లిపడిన పిస్తోలు తిరిగి వెనక్కి వచ్చి ఎలా పడిందో అతడికి అర్థం కాలేదు. వెంటనే అతడు దాన్ని ఎయిమ్ చేసి పేల్చాడు.
బాల్‌రాజ్ పేల్చిన బుల్లెట్స్ నేరుగా దుర్గారావు తలలోకి దూసుకుపోయాయి. క్షణంలో అతడిలో ప్రాణం పోయింది.
ఈ హఠాత్ పరిణామానికి షాక్ అయ్యాడు మహేంద్ర.
మహేంద్ర దాక్కున్న వైపు చూస్తూ-
‘‘అక్కడ ఇంకొకడు ఉన్నాడు..!’’ అంటూ అరిచాడు నేలమీద పడి ఉన్న పఠాన్.
ఈ అరుపు వింటూనే ఉలిక్కిపడ్డాడు హరేరామ్.
అతడు పఠాన్ గొంతు గుర్తుపట్టాడు.
వేగంగా ఆలోచిస్తున్నాడు మహేంద్ర.
‘‘తను ఒక్కడు.. వాళ్ళు నలుగురు.. వాళ్ళకు అడ్డుగా బండరాళ్ళు ఉన్నాయ్. తను తలపైకి లేపితే వాళ్ళు తనను కాల్చేస్తారు.. ఎలా తప్పించుకోవటం?’’
హరేరామ్ వైపు చూసి బైరాగితో చెప్పాడు బాల్‌రాజ్.
‘‘ఆ రివాల్వర్ పేల్చినవాడు ఈ వేలాయుధం మనిషేమో?.. ముందు ఈ వేలాయుధాన్ని లేపేద్దాం’’ అన్నాడు బాల్‌రాజ్.
పక్కన పడుకుని ఉన్న హరేరామ్ భయంగా అన్నాడు.
‘‘నేను వేలాయుధాన్ని కాదు..’’
ఆ మాటలు వినగానే అన్నాడు పఠాన్.
‘‘వీడి గొంతు.. మన.. హరేరామ్ గొంతులాగా ఉంది’’
వెంటనే అన్నాడు హరేరామ్.
‘‘అవును అన్నా! నేను హరేరామ్‌నే!’’ అంటూ ముఖానికి వున్న మాస్క్ తీసి, తలపైకి లేపి వాళ్ళకు తన ముఖం చూపించాడు.
అతడిని చూసి బైరాగి, బాల్‌రాజ్, పఠాన్‌లు షాక్ అయ్యారు.
ఈలోపు వెంటనే రివాల్వర్ పేల్చాడు మహేంద్ర.
మహేంద్ర రివాల్వర్ నుంచి వెలువడిన బుల్లెట్ హరేరామ్ తలమీద ఉన్న టోపీని ఎగరకొట్టింది. బుల్లెట్ ప్రభావానికి హరేరామ్ నెత్తిమీద జుట్టు కాలింది.

-సశేషం

-జి.వి.అమరేశ్వరరావు