డైలీ సీరియల్

పంచతంత్రం--37

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాటిల్లో కొన్ని బుల్లెట్స్ ఇంకా మిగిలి ఉన్నాయ్.
బుల్లెట్స్ రెండూ గురితప్పి గాలిలోకి దూసుకుపోయాయి.
రివాల్వర్ల శబ్దం వింటూనే షాక్ అయ్యారు నిరంజన్, వేలాయుధం.
పోలీసులు తమను సరౌండ్ చేశారు అనుకున్నారు.
వాళ్ల ఊహలను పటాపంచలుచేస్తూ వినపడింది బాల్‌రాజ్ కంఠస్వరం.
‘‘ఒరే నిరంజన్!... నీకు చావు మూడిందిరా!’’
ఒక మొండి గోడచాటున నిలబడి అరిచాడు బాల్‌రాజ్.
బాల్‌రాజ్ కంఠం వినగానే షాక్‌అయాడు నిరంజన్.
అతడు పాదరసంలా మూవ్‌అవుతూ అంబులెన్స్‌వైపు కదిలాడు.
అతడిని అనుసరించాడు వేలాయుధం.
ఈలోపు మరోసారి రివాల్వర్స్ పేల్చాడు బాల్‌రాజ్. అదే సమయంలో పఠాన్, హరేరామ్‌లు కూడా నాటు పిస్తోళ్లు పేల్చారు.
నిరంజన్ వీపులో దిగాయి రెండు బుల్లెట్స్. అతడుకెవ్వున అరుస్తూ నేలమీద కూలిపోయాడు. అదే సమయంలో మరో రెండు బుల్లెట్స్ వేలాయుధం తలమీదగా దూసుకుపోయాయి. అతడు అంబులెన్స్ వెనక్కు దూకి, దుస్తుల చాటునుంచి రివాల్వర్ బయటికి లాగాడు.
* * *
శరీరంలోని బలాన్ని మొత్తం ప్రయోగిస్తూ మొండి గోడని బలంగా నెడుతున్న కార్తీక్ అతడి స్నేహితుల కృషి ఫలించింది. పైనుంచి కిందికి నిట్టనిలువునా ఆ గోడ చీలింది. ఆ చీలికలోంచి మెల్లగా నీళ్లు ప్రవహించటం మొదలైంది.
కార్తీక్, జైరాం, హరీష్, రవి మరింత బలంగా గోడను నెట్టసాగారు.
ఈసారి గోడ ఒక్కసారిగా కూలిపోయింది. నీళ్లు శరవేగంగా దిగువకు ప్రవహించసాగాయి.
అక్కడికి ఇంకా దిగువన ఉన్నారు నిరంజన్, మొదలైనవాళ్లు.
* * *
నిరంజన్ కూలిపోవటం, వేలాయుధం అంబులెన్స్ వెనక్కి తప్పుకోటం బాల్‌రాజ్, అతడి అనుచరులు గమనించారు.
అంతలో నీళ్లుపారుతున్న శబ్దం బాల్‌రాజ్, అతడి అనుచరుల చెవులకు సోకింది. బాల్‌రాజ్ తలతిప్పి చూశాడు. ఎగువనుంచి వేగంగా దూసుకు వస్తున్నాయి పాచిపట్టిన నీళ్లు.
బాల్‌రాజ్ ఒకసారి అంబులెన్సు, సెక్యూరిటీ వ్యాన్ ఉన్న వైపు చూసాడు. అక్కడ నేలమీద పెట్టి ఉన్నాయ్ కరెన్సీ నోట్లతో నిండుగా ఉన్న అట్టపెట్టెలు.
అతడు చూస్తుండగానే నీళ్లు వచ్చేశాయ్.
అట్టపెట్టెలు నీళ్లతోపాటు మెల్లగా కదలసాగాయి.
బాల్‌రాజ్, పఠాన్, హరేరామ్‌లకు పరిస్థితి అర్థం అయింది.
ఇంకొద్ది నిమిషాలు ఆగితే డబ్బు మొత్తం కొట్టుకుపోతుంది. వెంటనే ఆత్రంగా తను దాక్కున్న చోటునుంచి బయటికివచ్చాడు బాల్‌రాజ్.
అతడిని అనుసరిస్తూ పఠాన్, హరేరామ్‌లు కూడా బయటికి వచ్చారు.
సరిగ్గా అప్పుడు కదిలాడు నిరంజన్. అతడు వేగంగా లేచి తన చేతిలోని రివాల్వర్ గురిచూసి పేల్చాడు. అదే సమయంలో వేలాయుధం కూడా అంబులెన్సు వెనకనుంచి ఇవతలకు వచ్చి రివాల్వర్ పేల్చాడు. బాల్‌రాజ్, పఠాన్, హరేరామ్‌ల శరీరాల్లోకి దూసుకుపోయాయి బుల్లెట్స్.
పఠాన్, హరేరామ్‌లు వెంటనే ప్రాణాలువదిలారు.
తన ప్రాణంపోయే ముందు నిరంజన్, వేలాయుధంల వైపు గురిచూసి తన చేతుల్లోని రెండు రివాల్వర్స్‌నీ పేల్చాడు బాల్‌రాజ్. అతడి గురితప్పలేదు. గుండెల్లో దిగిన బుల్లెట్స్‌తో మరణించారు నిరంజన్, వేలాయుధం.
శత్రువులు అందరూ హతమారటంతో కార్తీక్, జైరాం, హరీష్, రవిల ముఖాలు చిరునవ్వుతో విచ్చుకున్నాయి. అప్పటికి కిందికి ప్రవహిస్తున్న నీటి ఉధృతి పెరిగింది.
ఆ నీటితోపాటు డబ్బుతోనిండిన అట్టపెట్టెలు కూడా కొట్టుకుపోసాగాయి. అవిఅలా కొట్టుకుపోతూ రాళ్లకు ఢీకొంటూ మందుకుసాగాయి. రాళ్లను గుద్దుకోవటంతో అట్టపెట్టెలు చిరిగిపోయాయి. వాటిల్లో ఉన్న బ్లాక్‌మనీ అంతా బయటపడింది. చెరువుకట్టకు దిగువన ఉన్నదో మురికివాడ. ఆ మురికివాడ మధ్యలోంచి ప్రవహించసాగాయి

-సశేషం

-జి.వి.అమరేశ్వరరావు