డైలీ సీరియల్

పంచతంత్రం--38

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్లాక్ మనీని మోసుకువస్తున్న పాచిపట్టిన నీళ్లు.
అకస్మాత్తుగా కంపుకొట్టే నీళ్లు వచ్చిపడటంతో మురికివాడలోని జనానికి ఏం జరుగుతోందో అర్థంకాలేదు. అంతలో పదిహేను సంవత్సరాల వయసు ఉన్న ఒక పిల్లవాడు అరిచాడు.
‘‘డబ్బులు..! డబ్బులు!!’’
ఆ పిల్లవాడు అలా అరుస్తూనే ముందుకుదూకి నీళ్లల్లోనుంచి పైకి తీసాడు ఒక పాత ఐదొందల నోటు, ఒక పాత వెయ్యినోటు, రెండు కొత్త రెండువేల రూపాయల నోట్లు.
అప్పటికి జనానికి విషయం అర్థం అయింది. వెంటనే అందరూ పెద్దగా ఆనందంగా అరుచుకుంటూ నీళ్ళల్లో కొట్టుకువస్తున్న కరెన్సీనోట్లు ఏరుకోసాగారు.
* * *
కార్తీక్, జైరాం, రవి, హరీష్‌లు అంబులెన్సు దగ్గరకువచ్చారు. వేలాయుధం వెల్లికిలాపడి ఉన్నాడు. కార్తీక్ అతడి ముఖానికి ఉన్న మాస్క్ లాగేసాడు.
అతడిని కార్తీక్ గుర్తించాడు.
సినిమా హాల్‌దగ్గర నిరంజన్‌కి వెయ్యి రూపాయలకు చిల్లర ఇచ్చిన వ్యక్తి అతడు. అన్నిపనులూ తానే స్వయంగా చేసుకునే వేలాయుధం ఆరోజు నిరంజన్‌ని కలిసి వెయ్యినోటు ఇచ్చాడు.
తర్వాత బ్యాంకు సెక్యూరిటీ వ్యాన్‌వైపు కదిలాడు కార్తీక్.
ఆ వ్యాన్ డ్రైవింగ్ సీట్‌లో ఒక బ్రౌన్‌కలర్ ఎన్వలప్ పడి ఉంది. దాన్ని తెరిచి చూసాడు కార్తీక్. వెంటనే అతడి ముఖంలో చిరునవ్వు ప్రత్యక్షం అయింది.
తర్వాత కార్తీక్ తన దగ్గర ఉన్న బాల్‌రాజ్ సెల్‌ఫోన్ తీసి, దానిమీద ఉన్న తన వేలిముద్రలు కర్చ్ఫీతో తుడిచి, దాన్ని పారుతున్న నీటిలోకి విసిరాడు.
* * *
కార్తీక్ వాళ్ళ ఇంట్లో సమావేశం అయ్యారు. కార్తీక్, జైరాం, హరీష్, రవి, గోపిక.
ఆ సమయంలో వాళ్ళ తల్లిదండ్రులు అందరూ ఆ దగ్గరలోని ఆంజనేయస్వామి దేవాలయంలో ఆకుపూజ, అన్నప్రసాద సంతర్పణ చేయిస్తున్నారు.
కార్తీక్ తన దగ్గర ఉన్న ఎన్వలప్‌లోఉన్న కరెన్సీనోట్లు తీసి టీపాయ్ మీద పడేసాడు. అవి అన్నీ పాత కరెన్సీనోట్లు.
వాటిని చూడగానే గోపిక కళ్ళు పెద్దవి అయాయి. ఆమె వాటిని చేతుల్లోకి తీసుకుని పరిశీలిస్తూ చెప్పింది.
‘‘వావ్!... యాంటిక్... కరెన్సీ...!’’
‘‘వీటి వేల్యూ ఎంత ఉంటుంది...? ఓ లక్ష రూపాయలు ఉంటుందా?’’ అడిగాడు జైరాం.
‘‘వీటి వేల్యూ తెలుసుకోవాలంటే క్యాలుక్యులేటర్ కావాలి!’’అంటూ చెప్పి తన సెల్‌ఫోన్‌లో క్యాలుక్యులేటర్ ఆన్‌చేసింది గోపిక.
అదే సమయంలో కార్తీక్‌దగ్గర సెల్‌ఫోన్ మోగింది. అతడు ఫోన్ రిసీవ్ చేసుకున్నాడు.
అవతలనుంచి సాఫ్ట్‌వేర్ కంపెనీ వాళ్ళు కార్తీక్‌ని టెలిఫోన్ ఇంటర్వ్యూ చేయటం ప్రారంభించారు. కార్తీక్ జాగ్రత్తగా సమాధానాలు చెబుతున్నాడు.

-అయపోయంది

-జి.వి.అమరేశ్వరరావు