డైలీ సీరియల్

జ్వాలాముఖి.. మంత్రాలదీవి-1

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అది కపిలారణ్యం అని పిలువబడే దుర్గమమైన దట్టమైన అరణ్యం. ఎటు చూసినా ఆకసాన్ని అంటే మహావృక్షాలు. వాటి నడుమ అల్లిబిల్లిగా అల్లుకున్న లతలు తీగలతో నిండి ఉంది. అక్కడికి సుమారు అరక్రోసు దూరంలో బల్లపరుపుగా ఉన్న ఎత్తయిన ప్రదేశం. ఆ ప్రదేశం పై భాగంలో కొండ శిఖరంలా అగుపించే నిటారైన ప్రాంతం ఎంతో కాలంగా ఆకులు కప్పబడినట్టు ఉంది చుట్టూ అనేక లతలు తీగలు దట్టంగా అల్లుకుని ఉన్నాయి.
ఒక్కసారిగా ప్రకృతి కనె్నర్ర చేసినట్టు భూమి కంపించడం మొదలైంది. అరణ్యంలోని జంతువులు భీతిగా పరుగులు తీశాయి. పక్షులు ఆ ప్రదేశం నుంచి భయంతో ఆకాశంలోకి ఎగిరాయి.
ప్రచండమైన వేగంతో గాలి దుమారం మొదలైంది. వాయుదేవుడు మనోవేగాన్ని మించి పరుగులు తీస్తున్నట్టుంది. ఆ ఈదురుగాలికి చెట్లు వణికిపోయాయి. మహావృక్షాలు భయంతో ఊగిపోవడం మొదలుపెట్టాయి.
ఆ ప్రచండ వేగానికి వృక్షాలు నేలరాలుతున్నాయి. లతలు తీగలు విరిగిపడిన కొమ్మలు అన్నీ శరవేగంగా కొట్టుకుపోతున్నాయి.
పెద్ద రాతి గుహ... యుగాల వయసు ఉందనిపించేలా వున్న గుహ... ఆకులతో ఆ గుహ కప్పబడి వుంది. అక్కడ ఒక గుహవున్న ఆనవాలు కూడాలేదు. అటువైపు అడవిలో నివసించేవారు కూడా రావడానికి సాహసించరు. ఆ గుహలో ఒక భీకరమైన అతి పురాతనమైన మహాశక్తి స్వరూపిణి జ్వాలాముఖిదేవి విగ్రహం వుంది. గుహ మధ్య భాగంనుండి జ్వాలాముఖిదేవి తల ఆకాశాన్ని తాకినట్టు వుంది. మెడ భాగం వరకు గుహలో తల భాగం గుహ పైభాగం నుంచి... అక్కడ ఒక భీకరమైన అతి పురాతనమైన అమ్మవారి విగ్రహం బయల్పడింది. అత్యంత భీకరమైన రూపంతో నోటినుండి వెలువడుతున్న జ్వాలల రూపంతో చూపరులకు భీతి కొలిపేలా ఉంది. కుడి హస్తం అభయమిస్తున్నట్టుగా వామహస్తంలో జ్వాలలతో గావించబడిందా అన్నట్టుండే జ్వాలాపుష్పం ఉంది.
ఆ ఛాయలకు కూడా ఎవరూ రాకుండా జ్వాలాముఖిదేవి తన తీక్షణమైన చూపులతో చూస్తున్నట్టు ఉన్నది... ఆకులతో కప్పబడి ఉన్నందున గుహ కనిపించకుండా పోయినది. తల భాగం కనిపిస్తుంది.
ప్రచండమైన గాలి... దానికితోడు దుమారం... మహావృక్షాలు పెళపెళమంటూ నేల కూలుతున్నాయి. ఆ గుహ ప్రాంతాన్ని ఆనుకుని వున్న మహపురి సామ్రాజ్యం కోసల రాజ్యం.. కుంతల రాజ్యం ప్రజలు ఈ ప్రకృతి వైపరీత్యాన్ని చూసి వణికిపోయారు.
ఆ ప్రచండమైన గాలులకు గుహమీద వున్న ఆకులు వృక్షాలు కొట్టుకుపోయాయి... ఒక్కసారిగా ఆకాశంలో మెరుపులు... ఆ మెరుపుల్లో ఆ గుహాభాగం తొలిసారి దర్శనమిచ్చింది... గుహమార్గం స్పష్టంగా కనిపిస్తోంది. ఆకాశాన్ని తాకుతున్నట్టున్న జ్వాలాముఖి అమ్మవారి తల...
అమ్మవారి ఉగ్రరూపాన్ని చూసి భయపడిన వరుణదేవుడు జ్వాలాముఖిదేవిని శాంతింప చేయడానికి కుంభవృష్టిని కురిపించాడు.. అమ్మవారి తలను అభిషేకిస్తున్నట్టు.
తలకిందుగా నీళ్లు గుహలోకి వచ్చి చేరాయి... గుహ మొత్తం నీటితో నిండిపోయింది... ఉరుములు మెరుపులతో ఆ ప్రాంతం ఒక్కసారిగా కంపించింది.
అదే సమయంలో మంత్రాల దీవిలో మహాక్షుద్ర మంత్రికుడు వకృటాసురుడు తన ముందువున్న విచిత్ర దర్శినిలో ప్రకృతి ప్రళయాన్ని చూసి వికటాట్టహాసం చేసాడు. పొడువాటి గడ్డం... మెడలో కపాలమాల... చేతిలో మంత్రదండం... మంత్రదండం పిడి భాగంలో కోరలు దాచిన పాము తల... జ్వాలాముఖి కొలువైన ప్రాంతానికి కొన్ని క్రోసుల దూరంలో వున్న ద్వీపకల్పంలో మంత్రాలదీవిని చేరే సాహసం ఏ శక్తికీ లేదు. క్షుద్రోపాసనతో క్షుద్రశక్తులను ఆవాహన చేసుకుని... భూమండలాన్ని తన గుప్పెట్లో పెట్టుకోవాలని మరణహోమాన్ని సృష్టిస్తున్నాడు. అందులో భాగమే ఈ ఉత్పాతం....
ఈ ప్రళయాన్ని ప్రమాదాన్ని ఆపి జ్వాలాముఖిదేవిని ప్రసన్నంచేసుకునే వీరుడికోసం పంచభూతాలు ఎదురుచూస్తున్నాయి.
-సశేషం

- శ్రీ సుధామయి