డైలీ సీరియల్

జ్వాలాముఖి.. మంత్రాలదీవి-2

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అడవి మధ్యలో అమ్మవారి కోవెలలా పర్ణకుటీరం... పచ్చిక బయళ్ళు... పరుగులు తీసే హరిణిలు... లేగదూడలు... పాడినిచ్చే ఆవులు... పూల ఫలవృక్షాలతో ఆ ఆశ్రమ ప్రాంతం నిత్యశోభితమై వుంది. అది సుధర్మ మహర్షులవారి గురుకులాశ్రమం. సకల శాస్తప్రారంగతులు సకల కళాకోవిదులు మహామహిమాన్వితులు అయిన సుధర్ముల వారివద్దకు పలు దేశాల రాకుమారులు మాత్రమేకాకుండా విద్యలపై ఆసక్తి ఉన్నవారు శిష్యులుగా చేరేవారు అక్కడ సకల విద్యలు నేర్చుకుంటారు.
సుధర్ములవారు బీద ధనిక తేడాలేకుండా అందరికీ సమానంగా విద్యలను ప్రసాదిస్తూ నిష్ణాతులను గావించేవారు.
ఆశ్రమం అనేక రకాల పక్షుల కిలకిలరావాలతో ప్రశాంత వాతావరణంతో కూడి ఆహ్లాదకరంగా అగుపించేది.
ఆ వేళ అనేక దేశాల రాకుమారులు తమ విద్యాభ్యాసం ముగించుకుని ఆశ్రమంనుండి వీడ్కోలు తీసుకునే సమయం ఆసన్నమైంది. సుధర్ములవారు అందరినీ పిలిచి తమ తమ ప్రతిభాపాటవాలను ప్రదర్శించమని కోరారు. తమతమ విద్యలలో నిష్ణాతులైన అందరూ తమ నైపుణ్యాన్ని అద్భుతంగా ప్రదర్శించారు. కోసల యువరాజైన విజయుడి వంతు వచ్చింది. విజయుడు తన అనుంగు మిత్రులు చిన్ననాటి చెలికాడు అయిన విక్రముడితో కత్తియుద్ధంలో తలపడ్డాడు.
ఆశ్రమ వాసులు సహమిత్రులు ఖడ్గవిద్యలో ఆ మిత్రుల... మహావీరుల సాహసం చూడాలని తహతహలాడుతున్నారు.
విజయుడు విక్రముడు గురువుగారి పాదాలకు నమస్కరించి బరిలోకి దిగారు. రెండు కత్తులు దూసుకున్నాయి, ఖడ్గ విన్యాసం మొదలైంది.
ఇద్దరూ హోరాహోరీగా కత్తియుద్ధంలో తలపడ్డారు. ఒకరికి ఒకరు ఏ మాత్రం తీసిపోనివిధంగా తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు.
విజయుడు లాఘవంగా తన కరవాలాన్ని తిప్పుతున్నాడు. గాలినికోస్తూ కంటికి కనిపించని వేగంతో ఒడుపుగా తన నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్న తీరునుచూసి సుధర్ములవారు మాత్రమేకాక సహాధ్యాయులంతా ఆశ్చర్యపోయి చూస్తుండిపోయారు. విక్రముడు కూడా తక్కువ తినకుండా విజయుడుతో సమానంగా ఉన్నాడు.
విజయుడి కరవాలం పైకిలేచింది. విక్రముడు కరవాలాన్ని నేలకూల్చడమే లక్ష్యంగా...
సరిగా అప్పుడు ఊహించని సంఘటన ఒకటి జరిగింది.
ఎక్కడినుంచి వచ్చిన ఒక రంగురంగుల చిలుక విక్రముడు చేతిమీద వాలింది... లిప్తకాలంలో విజయుడు తేరుకున్నాడు... తన కరవాలాన్ని నేలమీదికి జారవిడిచారు.
తను ఏమాత్రం ఏమరుపాటు చూపించినా తన కరవాలం ధాటికి ఆ చిలుక శరీరం నేలకూలిపోక తప్పదు. విజయుడు గెలుస్తాడని అనుకున్న సహమిత్రులు విక్రముడు గురుదేవులు సైతం ఈ దృశ్యాన్ని చూసి విస్తుపోయారు.
సుధర్ములవారు విజయుడిని దగ్గరగా పిలిచి...
‘‘కరవాలాన్ని నేల విడిచావు... అది నీ ఓటమి అని తెలియదా? అడిగాడు.
విజయుడు వినమ్రుడై ‘‘మన్నించాలి గురుదేవా... మీకు తెలియని మానవతా ధర్మమా?
క్షత్రియధర్మంకన్నా, గెలుపుకన్నా మానవతాధర్మమే అన్ని ధర్మాలలో మిన్న అని మీరే సెలవిచ్చారు. నేను మీ శిష్యుడిని.. ఈ చిలుక ఎచటి నుంచో మన ఆశ్రమానికి అతిథిగానో

ఆశ్రయాన్ని కోరో... దారితప్పో వచ్చి ఉంటుంది. నా గెలుపుకోసం రావాలని ఝుళిపిస్తే చిలుక ప్రాణం కోల్పోతుంది... నా కరవాలం ధాటికి నా మిత్రుడి హస్తం నేల రాలితే... నాకు గెలుపుకన్నా ఒకరి ప్రాణం కాపాడడం రాజధర్మం కదా ఆచార్యా.. అది మానవ ధర్మం కదా? చేతులు జోడించి అన్నాడు.
‘‘నీ సూక్ష్మబుద్ధికి.. నీ మానవతా ధర్మానికి మిక్కిలి సంతోషం నాయనా... నీ తండ్రిగారు నాకు అప్పగించిన బాధ్యతను నెరవేర్చాను.. అస్తశ్రస్త్ర విద్యల్లో నిష్ణాతుడివి అయ్యావు.. సకల విద్యాపారంగతుడివిగా ఈ ఆశ్రమం నుంచి వెళ్తున్నావు..
నీవు అన్ని విద్యలతోపాటు నేను నేర్పించని మానవతా విద్యను కూడా అభ్యసించావంటూ నీ ఉన్నతమైన మనసుకు కడు సంతోషం. నాయనా విజయ ఇప్పుడు నేను నీకొక మంత్రాన్ని ఉపదేశిస్తాను.. ఈ మంత్ర ప్రభావముచేత నీవు కోరుకున్నది సంప్రాప్తిస్తుంది. ఆపద సమయంలో నిన్ను ఆదుకుంటుంది. ఈ మంత్రం ఒక్కసారి మాత్రమే పనిచేస్తుంది... ఇలా దగ్గరకు రా నాయనా.. నాకు నా గురుదేవులు వారికి వారి గురుదేవులు ఉపదేశించిన ఈ మంత్రోపదేశం ఈ మంత్రశక్తి ఇప్పుడు నీకు ధారపోస్తున్నాను... స్వీకరించు’’ మంత్రాన్ని ఉపదేశిస్తాను. అది నీకు అత్యవసర సమయాలలో ఒక్కసారి మాత్రమే ఉపయోగపడుతుంది విజయుడు చేతులు జోడించాడు.. దుదములు కళ్ళు మూసుకున్నాడు. కమండలంలోని మంత్ర జలని విజయుడి దోసిట్లోకి పడు... వేనవేల కాంతులతో మంత్రజలం విజయుడు దోసిలిలోనుంచి నేలమీద పడకుండా అదృశ్యమై పోసాగింది.
విజయుడిలో చిన్న గగుర్పాటు.. తెలియని గొప్పశక్తి తనలోకి వచ్చి చేరినట్టు అనిపించింది. అతని శరీరాన్ని ఒక కాంతి వలయం చుట్టేసింది... గురుదేవుల పెదవులు మంత్రాలను ఉచ్చరిస్తున్నాయి. అవి గాలిలో ప్రయాణించి విజయుడి కర్ణ్భేరిని తాకాయి.
***
‘‘బయల్దేరండి నాయనలారా... విక్రమా నీ మిత్రుడికి చేదోడుగా వుండి మిత్ర ధర్మాన్ని పాటించు.. మీ మైత్రి కలకాలం వర్ధిల్లుగాక.. అని విజయుడి వైపు తిరిగి..
-సశేషం

- శ్రీ సుధామయి