డైలీ సీరియల్

యువర్స్ లవ్వింగ్లీ...5

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దీన్ని బట్టి ఇక్కడికి భరణితోపాటూ వచ్చిన వాళ్ళకి భరణి మరణంతో సంబంధముందన్న విషయం అర్థవౌతోంది. అది నా అనుమానానికి రెండో కారణం’’.
అంతటి విపత్కర పరిస్థితుల్లోనూ పరిస్థితుల్ని అంత బాగా విశే్లషించిన అతడి తెలివితేటలకి ఆశ్చర్యపోయాడు రవీంద్ర. అతడన్నదాంట్లో నిజం లేకపోలేదు. ఆ విషయాన్ని అప్పటికే పరిశీలించాడు. బెడ్‌రూమ్‌లోనూ వాష్ రూమ్‌లోనూ, మిగిలిన గదుల్లో సూక్ష్మదృష్టితో గమనించి చూస్తే అక్కడ భరణితో పాటూ ఒక అమ్మాయి తిరిగిన ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి. పోర్టికోలో పార్కు చేసిన భరణి కారుని కూడా పరిశీలించాడు. అందులో కూడా ఒక అమ్మాయి కూర్చుని వచ్చిన ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి. అయితే పూర్తిగా నిర్థారణ కాకుండా ఆయనతో ఆ విషయం చెప్పడమెందుకులే అని ఆగాడు.
‘‘నేను చెప్పదలుచుకున్నది కూడా అదే. మీ అనుమానం సహేతుకమైనది. పైకి సహజ మరణంలా కనిపిస్తున్నా. మీ అబ్బాయి మరణం వెనుక ఏదో మెలిక వుంది. మామూలు పరిశోధనకి అందని మెలిక.. అందుకే మేము ఈ కేసులో నేర పరిశోధనలో ప్రత్యేక శిక్షణా అనుభవం వున్న ఒక ప్రైవేట్ డిటెక్టివ్ సహాయం కూడా తీసుకోదల్చుకున్నాం. అది చెప్పడానికే మిమ్మల్ని పిలిచాను’’ అన్నాడు రవీంద్ర.
భుజంగరావు ముఖం కొంచెం ప్రసన్నంగా మారింది. ‘‘డిటెక్టివా? ఎవరతను?’’ అన్నాడు.
‘‘పాణి అనీ, తెలుగువాడే. ముంబాయిలో స్థిరపడ్డాడు. క్లిష్టమైన కేసులని డీల్ చేసిన డిటెక్టివ్‌గా మంచి పేరు ఉంది. ఏదో కేసు నిమిత్తం హైదరాబాద్ వచ్చి ఊర్లోనే ఉన్నాడని తెలిసింది. అతడితో మాట్లాడి వెంటనే రమ్మని చెప్పాను. దారిలో ఉన్నాడు. అతడు వచ్చి శవాన్ని చూడగానే పోస్టుమార్టమ్‌కి పంపిద్దాం’’ అన్నాడు.
ఈసారి ‘శవం’ అన్నమాట అలవాటైనట్టుగా భుజంగరావు పెద్దగా రియాక్షన్ చూపించకపోయేసరికి అతడిమీద జాలిగా అనిపించింది రవీంద్రకి.
****
డిటెక్టివ్ పాణి శవాన్ని పరిశీలిస్తుంటే కేసు తాలూకు వివరాలు బ్రీఫ్‌గా చెప్పాడు ఎస్సై రవీంద్ర అతడికి.
‘‘ఇప్పటివరకూ ఎవరినైనా అనుమానంమీద అరెస్టు చేసారా?’’ అడిగాడు పాణి.
‘‘్భరణికిగానీ, భుజంగరావుగారికి కానీ ఉన్న శత్రువుల గురించి మనకి పూర్తిగా తెలియదు. గెస్ట్‌హౌస్ వాచ్‌మెన్ తిరుపతయ్యని అదుపులోకి తీసుకున్నాం’’.
‘‘ఎక్కడున్నాడు అతడు?’’
‘‘క్రింద గదిలో ఉన్నాడు’’
‘‘నేను ఒకసారి అతడితో మాట్లాడాలి’’ అన్నాడు పాణి.
గదిలో ఇద్దరు కానిస్టేబుళ్ళు కుర్చీలో కూర్చుని బాతాఖానీ కొట్టుకుంటుంటే ఒక మూలగా రెండు కాళ్ళూ ముడుచుకుని, తలపాగా కట్టుకనే తువ్వాలుని విప్పి చేత్తో పట్టుకుని నేలమీద ఏదో ఆలోచిస్తూ కూర్చున్న తిరుపతయ్య వంక చూసాడు పాణి.
‘‘నువ్వేనా ఈ గెస్ట్‌హౌస్‌కి వాచ్‌మెన్‌వి? అతడికి దగ్గరలో వున్న ఒక కుర్చీలో కూర్చుంటూ అడిగాడు.
‘‘అవును బాబయ్యా....’’ అంటూ గబగబా లేచి నిలబడ్డాడు తిరుపతయ్య.
‘‘లేవాల్సిన అవసరం లేదు కూర్చో’’ అంటూ తన పక్కనే వున్న మరో కుర్చీ చూపించాడు పాణి.
‘‘్ఫరవాలేదు బాబయ్యా. తమరు ఆడగండి’’ నిలబడే చేతులు కట్టుకుంటూ అన్నాడు, అతడు ఇంటరాగేషన్‌కి సిద్ధపడుతున్నవాడిలా. అతడి ధోరణికి పాణి మనసులోనే నవ్వుకున్నాడు.
‘‘ఎన్నాళ్లనుంచీ పనిచేస్తున్నావు ఇక్కడ?’’
‘‘నాలుగైదేళ్లనుంచీ- ఈ గెస్ట్‌హౌస్ కట్టిన దగ్గరనుంచీ ఇక్కడే పనిచేస్తున్నానయ్యా. మొదట గెస్ట్‌హౌస్ కన్‌స్ట్రక్షన్ వాచ్‌మెన్‌గా వున్నాను. నా పని నచ్చి, అయ్యగారు కన్‌స్ట్రక్షన్ అయ్యాక కూడా ననే్న ఉండమన్నారు. అప్పటినుంచీ ఇక్కడే పనిచేస్తున్నాను’’.
‘‘నీ కుటుంబం ఎక్కడ ఉంటుంది?’’
‘‘పక్కనే లింగంపేట అని చిన్న పల్లెటూరు ఉందయ్యా. మావాళ్ళంతా అక్కడే ఉంటారు. నేనూ అక్కడ్నించే రోజూ పనికివస్తాను’’.
‘‘ఇక్కడ ఏమేం పనులు చేస్తూ వుంటావు నువ్వు?’’
‘‘ఒక పనంటూ కాదు. గెస్ట్‌హౌస్‌కి సంబంధించిన అన్ని పన్లూ నేనే చూస్తాను. తాళం చెవులు నా దగ్గరే వుంటాయి. ప్రతిరోజూ గెస్ట్‌హౌస్ శుభ్రం చేయడం, ఇక్కడ మొక్కలకి నీళ్ళు పెట్టి, గడ్డిని కత్తిరించడం లాంటి పన్లు చేస్తాను. ఏ సమయంలో అతిథులు వచ్చినా గెస్ట్‌హౌస్‌ని సిద్ధంగా ఉంచడమే నా పని.
ఉదయానే్న వచ్చి సాయంత్రం దాకా ఆ పనీ ఈ పనీ చూసుకుని రాత్రికి ఇంటికి వెళ్లిపోతాను. అవసరమైతే గెస్ట్‌హౌస్‌కి వచ్చిన వాళ్ళకెప్పుడైనా భోజనాల ఏర్పాట్ల కోసం అప్పుడప్పుడు మా ఇంటివాళ్ళు వస్తూ వుంటారు’’.
‘‘రోజూ పన్లోకి ఎన్నింటికి వస్తుంటావు?’’
‘‘ఆరూ ఆరున్నర మధ్యలో వస్తాను. గెస్ట్‌హౌస్‌లో అతిథులెవరైనా ఉంటే ఇంకా తొందరగా వస్తాను’’.
‘‘ఈరోజు ఉదయం ఎన్ని గంటలకి వచ్చావు?’’
‘‘రోజూలాగే ఉదయానే్న వచ్చి, గదులు శుభ్రం చేసి వెళ్లిపోయాను’’
‘‘గదులు మాత్రమే శుభ్రం చేస్తావా? బాత్రూములు కూడానా?’’
‘‘బాత్రూములు కూడా రోజూ శుభ్రం చేస్తానండీ. ఎవరు ఉన్నా లేకపోయినా మొత్తం శుభ్రం చేయడం నా అలవాటు’’.
‘‘ఇవాళ నువ్వేదో పనిమీద సిటీకి వెళ్ళేవన్నారు?’’
‘‘అవునండీ. మొన్నామధ్యన ఎల్.బి.నగర్ బిగ్ బజార్లో షాపింగ్ చేసినపుడు వాళ్ళేదో గిఫ్ట్ కూపన్లిస్తే వాటిమీద మా పేరూ, ఫోన్ నెంబరూ రాసి డబ్బాలో వేసాం. వాళ్ళు ఫోన్ చేసి లాటరీలో మాకేదో బహుమతి వచ్చిందనీ, వచ్చి తీసుకోమని చెప్పారు.
అందుకే మా అమ్మారుూ నేనూ వెళ్ళాం. తిరిగి నాలుగింటికి వచ్చాను. రాగానే మా అమ్మాయిని ఇంటికి పంపేసి మొక్కలకి నీళ్ళు పెట్టడానికి మళ్లీ గెస్ట్‌హౌస్‌కి వచ్చాను’’
‘‘ఉదయం గెస్ట్‌హౌస్‌కి తాళం ఎవరు వేశారు?’’
‘‘శుభ్రం చేయడం అయిపోయాక నేనే తాళం వేసాను’’

ఇంకా ఉంది

వరలక్ష్మి మురళీకృష్ణ