డైలీ సీరియల్

వేదాలలో వైజ్ఞానిక విశేషాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దీనిలో వాయువుని నాలుగువేల రకాలుగా విభజించారు. ఈ విభాగానికి, ప్రస్తుత వైజ్ఞానిక శాస్త్రంలో వాయు విభాగానికి సంబంధం కనిపించుటలేదు. ఆనాటి శాస్త్రంలో వాయువు అనే పదాన్ని మామూలు వాయుపదార్థాలు అనే అర్థంలో మాత్రమేగాక, కొన్ని రకాల శక్తులు అనే అర్థంలో కూడా వినియోగించినట్లు కనిపిస్తోంది. భరద్వాజకృత విమాన శాస్త్ర్తము అనే పేరుతో ఇవాళ మనకు లభిస్తున్న గ్రంథంలో మొదటి అధ్యాయం మాత్రమే లభిస్తోంది. ఆ గ్రంథంలో మొత్తం వంద అధ్యాయాలున్నాయని ఈ ప్రథమాధ్యాయమే చెపుతోంది. మిగిలిన 99 అధ్యాయాలు దొరకటంలేదు. దొరుకుతున్న ప్రథమాధ్యాయంలో లోహ మిశ్రమాల గురించి చాలా వివరాలు వున్నాయి.
ఇపుడు లభిస్తున్న ఈ విమాన శాస్త్రంలోను, దానికి బోధానంద ముని రచించిన వ్యాఖ్యానంలోను ఆసక్తికరమైన విషయాలు చాలా వున్నాయి.
సుమారుగా 125 వైజ్ఞానిక గ్రంథాల పేర్లు దీనిలో ఉదహరించారు. వాటిలో కొన్ని విచిత్రకరమైన పేర్లు ఇలా వున్నాయి.
1.ముకుర కల్పము- అద్దాలమీద గ్రంథం 2.లోహతంత్రము 3.శక్తిసూత్రములు 4.అంశుబోధిని- దీనిలో కూడా ప్రథమాధ్యాయం మాత్రమే లభిస్తోంది. 5.్భస్ర్తీకాశాస్తమ్రు - భస్ర్తీక అంటే గాలి ఊదే తిత్తి 6.మూషాకల్పము- మూషా అంటే మూస 7.్ధమప్రకరణము
దీనిలో ముప్ఫై రకాల అగ్ని కుండాలను ఉదహరించారు. కొన్ని ప ఏర్లు వాటి ఆకారాన్ని బట్టి వచ్చాయి.
ఉదాహరణకు- కూర్మకుండము (తాబేలు ఆకార కుండము)
మండూక కుండము (కప్ప ఆకార కుండము)
మరికొన్ని పేర్లు ఉపయోగించే కట్టెలను పట్టి వచ్చినాయి.
ఉదాహరణకు- ఖతిరాంగార కుండము (చండ్ర బొగ్గుల కుండము) ఈ శాస్త్రంలో సుమారు ఇరవైరకాల మూసలను ప్రస్తావించారు.
ఉదాహరణకు- చుంచుపుట మూస (ఎలుక మూతి ఆకారంలో వుండే మూస) ఈ శాస్త్రంలో సుమారుగా ఇరవై రకాల గాలితిత్తులను (్భస్ర్తీకలను) చెప్పారు.
ఉదాహరణకు- త్రిముక భస్ర్తీక (మూడు గొట్టాల తిత్తి), షణ్ముఖ భస్ర్తీక (ఆరు గొట్టాల తిత్తి)
5.దీనిలో వాడిన యంత్రాల సంఖ్య 25
ఉదాహరణకు-
1.ద్రవాకర్షణ యంత్రము - ద్రవ పదార్థాలను పీల్చుకునే యంత్రము
2.్ధమోద్గమ యంత్రము- పొగను బయటకు నెట్టే యంత్రము
3.వాతాకర్షణ యంత్రము - వాయువును ఆకర్షించు యంత్రము
6.ఈ గ్రంథంలో ప్రస్తావించిన ఉప యంత్రాలు 30-
1.అంగోపసంహార యంత్రము - విమానము యొక్క అవయవాలను ముడిచే యంత్రము
2.శబ్దాకర్షణ యంత్రము- శబ్దాన్ని పీల్చుకునే యంత్రము
7.ఇవికాక ఈ అగంథంలో 32 రకాల సాంకేతిక ప్రక్రియలను ప్రస్తావించారు. వీటినే 32 రహస్యాలు అన్నారు. వీటిలో కొన్ని మంత్ర తంత్ర విద్యలకు సంబంధించినవిగా వున్నాయి. మిగిలినవి మాత్రం కేవలం సాంకేతికాలే. అయితే అవి పూర్తిగా అర్థం కావటంలేదు.
8.ఈ గ్రంథంలో చెప్పిన దర్పణాలు 30 రకాలుగా వున్నాయి.
ఉదాహరణకు-
1.విద్యుత్ వేగోపసంహర దర్పణము - విద్యుత్తరంగాలను పీల్చుకునే దర్పణము
2.ప్రతిబింబార్క కిరణాకర్షణ దర్పణము- ప్రతిబింబించిన సూర్యుని కిరణాలను పీల్చుకునే యంత్రము.
9.దీనిలో ప్రస్తావించిన లోహ మిశ్రమముల సంఖ్య 40. వీటిలో కొన్ని ఈనాటికీ కష్టసాధ్యాలే.
అయినా వీటిలో కొన్నిటిని డా. సి.ఎస్.ఆర్.ప్రభు, తదితరులు తయారుచేసి పేటెంట్ హక్కులను కూడా పొందారు కనుక, ఇవి కేవల ఊహాజనితాలని భావించేందుకు వీలు లేదు.
10.ఇది వాయుయానమా? రోదసీ యానమా?
ఈ గ్రంథంలో వాయుయానమే, తన ప్రయాణం మధ్యలో క్రమక్రమంగా రోదసీ యానంగా మారిపోతుంది. ఇది ఎలా సాధ్యమో మనం ఊహించలేము.
11.విమానాలలో రకాలు -
ఈ గ్రంథంలో నాలుగు రకాల విమానాలను వర్ణించారు.
1.శకున విమానము (పక్షిఆకారంలో వుండే విమానము)
2.సుందర విమానము (అందమైన విమానము)
3.రుక్మ విమానము - బంగారు విమానము- ఇది ఈనాటి స్పేస్ క్రాఫ్ట్‌ను పోలి వున్న నిలువు ఆకారంగలది
(ఇదే వాయుయానం నుంచి రోదసీ యానంలోకి మార్పు చెందుతుంది అనిపిస్తోంది)
4.త్రిపుర విమానము (మూడంతస్తుల విమానము)
12.ఈ గ్రంథంలో విమానం ప్రయాణిస్తూ ఉండగానే, గొడుగు ముడుచుకున్నట్లుగా దాని అవయవాలు కొన్ని ముడుచుకుపోయే ప్రక్రియలు, అలాగే రంగులు మారే ప్రక్రియలు వర్ణింపబడినాయి.
హద్దులు - ఈ విమాన శాస్త్రంలో నగరాల నుంచి నగరాలకు వెళ్ళే విమానాలను, వ్యాపార వినియోగార్థమై ఉపయోగపడే విమానాలను, యుద్ధ విమానాలను కూడా ప్రస్తావించారు. కానీ మన పురాతన సాహిత్యమైన పురాణాలలోగానీ, వేదాలలోగానీ ఇలాంటి విమానాలు ఉపయోగంలో ఉన్నట్లు ఎక్కడా కనపడటంలేదు.
ఆ సాహిత్యంలో విమానాల ప్రసక్తి వున్నా, చాలా కొద్ది మంది మాత్రమే విమానాలు వున్నట్లు కనిపిస్తోంది. యుద్ధ విమానాలు, వ్యాపార విమానాల ప్రస్తావనే లేదు.
గమనిక: రైట్ సోదరులు ఆధునిక విమానాన్ని ఆవిష్కరించేందుకు ముందే మహారాష్టల్రోని శ్రీ శివరామ్ బాపూజీ తల్పడే అనే ఆయన విమాన శాస్త్ధ్రారంగా ఒక విమానాన్ని నిర్మించి, బరోడా మహారాజుగారి సమక్షంలో దాని ద్వారా విమానయానం చేసి చూపించాడనీ, ఈ విషయాన్ని అప్పటి మరాఠీ వార్తాపత్రికలు ప్రచురించాయనీ, కానీ అప్పటి ఆంగ్లేయ పరిపాలకులు ఆ వార్తలను అణగద్రొక్కేసి, తల్పడేగారి దగ్గరవున్న సంపూర్ణ విమాన శాస్త్ర గ్రంథాన్ని కొనేసుకున్నారని, స్థానికులు చెపుతున్నారు.
ఈనాడు దొరుకుతున్న విమాన శాస్త్ర ప్రథమాధ్యాయంలో ఉదహరింపబడిన గ్రంథాలలో ఏదీ దొరకటంలేదు. ఇదివరకే చెప్పుకున్నట్లుగా అంశుబోధిని అనే గ్రంథంలో ప్రథమాధ్యాయం మాత్రం దొరుకుతోంది.
10.కిరణశాస్తమ్రు
ఈ శాస్త్రంలో దొరుకుతున్న ప్రధాన గ్రంథం పైన చెప్పుకున్న అంశుబోధిని. దీనిలో సూర్య కిరణాలను వైద్యపరంగానూ, ఫొటోలు తీసుకునేందుకు, వ్యవసాయపరంగాను, కృత్రిమ వర్షపాతపరంగాను వినియోగించుకునే విధానాల ప్రస్తావన వుంది. ఈ గ్రంథంలో ప్రథమాధ్యాయమే లభిస్తున్నప్పటికీ దానిలో వున్న విషయాలు ఆశ్చర్యకరంగా వున్నాయి కనుక వాటిని గురించి కొద్దిగా ప్రస్తావించుకుందాము.

ఇంకావుంది...