డైలీ సీరియల్

జ్వాలాముఖి.. మంత్రాలదీవి-4

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘్భష్ మిత్రమా... మాకు నువ్వు రక్ష... కాపలా...’’ నవ్వి రాయంచను తన భుజాలమీద పెట్టుకున్నాడు. తర్వాత విక్రముడు విజయుడు చెట్టుకింద విశ్రమించారు. నిద్రలోకి జారుకున్నారు. రాయంచ చిలుక పరిసరాలను గమనిస్తోంది.
***
ఆ అడవిలో దక్షిణంవైపు ఒక గుడారం వుంది. లోపల బందిపోట్లు వున్నారు.. పేరుమోసిన గజదొంగలు.. హిగ్గారీలుగా పేరుపడిన నర రూప హంతకులు... దారికాచి దోచుకుంటారు. అడవిమార్గంలో ప్రయాణించే వారిని ముఖ్యంగా పురుషులకు స్ర్తిరూపంలో ఆకర్షించి వారిదగ్గర వున్న ధనాన్ని దోచుకుంటారు. రాజ్యాలు మారుతూ అడవి ప్రాంతంలో తమ బసఏర్పాటుచేసుకుంటారు. స్ర్తిలరూపంలో మారువేషాలలో ఉండడం మూలాన రాజభటులునుంచి తప్పించుకోవచ్చన్న ఉపాయం వారిది. ముగ్గురు గజదొంగలు తమ రూపాలను మార్చుకుంటున్నారు. స్ర్తిలవలే అలంకరించుకుని ముఖాన్ని వస్త్రంతో కప్పేశారు. కేవలం వారి కళ్ళుమాత్రమే కనిపిస్తున్నాయి. స్ర్తిల వస్తధ్రారణలో ఉండడంమూలాన వారిని పోల్చుకోవడం కష్టం.
***
నలుగురు బాటసారులు అడవి మార్గంలో వస్తున్నారు...
వారి తలపాగాల్లో వరహాల మూటలు వున్నాయి. పేరుమోసిన నగల వర్తకులు. రాజు ఆస్థానంలో వుండే ప్రముఖులకు ఆభరణాలు విక్రయించి వచ్చిన సొమ్మును వరహాలుగా మార్చుకుని వస్తున్నారు. దారిలో మధువు సేవించారు... అడవిగుండా తమ నగరానికి చేరుకోవడానికి బయల్దేరారు.
మధువు మత్తులో వారికి గాజుల గలగలలు వినిపించాయి. తలలు తిప్పిచూస్తే గుడారం బయట నృత్యాన్ని చేస్తున్నారు. కొందరు మహిళలు.
మధువు మత్తులో చితె్తైపోయారు.. ఆటపాటల్లో చేయి కలిపారు. వారు ఇచ్చిన పానీయం తాగి మత్తులోకి జారుకున్నారు. వాళ్ళు పూర్తిగా మత్తులోకి జారుకోకుండానే స్ర్తిల వేషంలో వున్న గజదొంగలు నగల వర్తకులను సోదాచేయడం మొదలుపెట్టారు..
వర్తకుల మత్తు దిగిపోయింది. పక్కనేవున్న నీటిమడుగులో తలలు పెట్టారు.. మత్తు దిగిపోయింది. వెంటనే పారిపోవడం మొదలుపెట్టారు.
హిగ్గారీలు చేజిక్కిన సొమ్మును చేజార్చుకోరు... ప్రాణాలు తీసయినా సాధించుకుంటారు... వర్తకులను ఆయుధాలతో వెంబడించారు.
వర్తకులు పరుగెడుతూనే ప్రాణభయంతో రక్షించండి... రక్షించండి అంటూ అరుస్తున్నారు.
***
ఒక్కసారిగా ఉలికిపాటుతో కళ్ళుతెరిచాడు విజయుడు. అతనితోపాటే విక్రముడు కూడా...
చెవులు రిక్కించారు. అప్పటికే రాయంచ చిలుక ఆ ఆర్తనాదాలు వినిపించిన వైపు గాల్లోకి ఎగిరి వెనక్కి తిరిగొచ్చింది.. విజయ విక్రములకు ఆర్తనాదాలు వినిపించిన వైపు దారి చూపించింది.
వర్తకులు ప్రాణభయంతో పరుగెత్తుకు వస్తున్నారు. విజయుడు అక్కడికి చేరుకున్నాడు. విక్రముడు ఒరలోనుంచి కత్తి దూశాడు. విజయుడి చేయి కరవాలం పిడిని బిగించి పట్టుకుంది.
ఏ క్షణమైనా అతని చేయి కరవాలాన్ని గాల్లోకి ప్రయోగించడానికి సిద్ధంగా వుంది. అతని ఖడ్గ్ధాటిని ఆపగల శక్తి ఎవరికీ లేదు.
***
‘‘మీ ప్రాణాలకు మా ప్రాణాలు అడ్డు...’’ వర్తకులకు అభయమిచ్చాడు విజయుడు.
స్ర్తిల వేషంలో వున్న హిగ్గారీలు తమ బొడ్లలో వున్న విషం పూయబడిన పిడిబాకులు బయటకుతీశారు. విజయుడు ఒరలోనుంచి కరవాలాన్ని తీసి ఆగిపోయాడు. ఎదురుగా వున్నది స్ర్తిలు.. స్ర్తిల మీద ఆయుధాన్ని ప్రయోగించాడు...
‘‘మీరెవరో మహావీరుల్లా వున్నారు... మమ్మల్ని వీరి బారినుంచి కాపాడండి.’’ వర్తకులు మొరపెట్టుకున్నారు. రాయంచ విజయుడు చెవిదగ్గర వాలి’’ ఆలస్యంచేయకు మిత్రమా... నీ కరవాలంతో వారి తలలు ముక్కలు అవ్వాలి’’ అన్నది.
‘‘నేను మహిళల మీద ఆయుధాన్ని ప్రయోగించను’’ విజయుడు అన్నాడు.
రాయంచకు విషయం బోధపడింది.
హిగ్గారీలు పిడిబాకులు గాల్లోకి దూశారు. అవి విజయ విక్రముల ప్రాణాలను హరించివేయడానికి సిద్ధంగా వున్నాయి.
విక్రముడు విజయుడి ఆదేశాలకోసం ఎదురుచూస్తున్నాడు.
రాయంచ స్ర్తిల వేషంలోవున్న హిగ్గారీలలో ఒక గజదొంగను సమీపించి ముఖానికి అడ్డుగావున్న వస్త్రాన్ని తన ముక్కుతో తొలగించింది. దట్టమైన గుబురుమీసాలు వున్న హిగ్గారీ ముఖం కనిపించింది విజయుడికి. అప్పటివరకు స్ర్తిలు అనే భావంతో వున్న విజయుడు చురుగ్గా కదిలాడు.. మెరుపువేగంతో కరవాలాన్ని తిప్పాడు. గాలిని చీల్చుకుంటూ వెళ్లిన ఆ కరవాలం పిడిబాకును రెండుముక్కలు చేసింది. పిడిబాకు పట్టుకున్న చేతిని శరీరంనుంచి వేరుచేసింది.
ఎప్పుడైతే విజయుడు కరవాలం గాలిలోకి విసిరాడో చిచ్చరపిడుగులా రెచ్చిపోయాడు విక్రముడు. చూస్తుండగానే(హిగ్గారీలు) గజదొంగలు నేలకు ఒరిగి ప్రాణాలు విడిచారు.
***
‘‘మహావీరులకు కృతజ్ఞతలు.. తమరెవరో తెలుసుకోవచ్చా వీరుల్లారా’’ అడిగారు వర్తకులు.
‘‘ఈ దేశానికి కాబోయే మహారాజు. యువరాజు’’అని చెప్పబోయాడు విక్రముడు. కానీ విజయుడు వారించాడు... ‘‘మేమూ మీవలె బాటసారులం... మధువు మత్తు మంచిదికదా.. దారిలో గజదొంగలు వుంటారు. మీ పిల్లాపాపలు మీకోసం ఎదురుచూస్తూ వుంటారు. మధువుకు మగువకు బానిసలు కావద్దు’’ హెచ్చరించాడు విజయుడు.
తలలు వంచుకుని మన్నింపు కోరి ‘‘ఎప్పుడూ మధువు ముట్టుకోమని ప్రమాణం చేసి అక్కడినుంచి కదిలారు.
***
‘‘మిత్రమా ఏ గురించి చెప్పబోతే వారించారు’’ సందేహంగా అడిగాడు విక్రముడు.
‘‘మనం ఎవరో చెబితే గుట్టురట్టు అవుతుంది. మనం ముందు దేశ సంచారం చేద్దాం. ప్రజల కష్టసుఖాలు విచారిద్దాం. ఈ అడవిలో బాటసారులకు రక్షణలేదని తెలిసింది. ఇక్కడ సైనికులను వుంచవలసిన అవసరం వుంది. సైనికుల గస్తీ తప్పనిసరి’’ చెప్పాడు విజయుడు.
ఈలోగా విక్రముడు ప్రాణాలు కోల్పోయిన వారిని పరిశీలించి ‘‘మిత్రమా.. ప్రమాదం పొంచి వుంది’’అంటూ హెచ్చరించాడు ఒరమీద చేయివేసి
‘‘ఏమంటున్నావు మిత్రమా... ప్రమాదమా?
‘‘అవును మిత్రమా మీచేతిలో మరణించిన వీరు హిగ్గారీలు అనే అతి క్రూరమైన గజదొంగలు.. విషం పూసిన పిడిబాకులతో మెరుపువేగంతో దాడిచేస్తారు... మహిళారూపంలో మగువల బలహీనత వున్న ధనికులైన బాటసారులను కనిపెట్టి... ఆకర్షణతో మోసంచేసి నిలువుదోపిడీ చేస్తారు. ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడరు... మహారాజుగారు.. మంత్రివర్యులైన మా తండ్రిగారు ఒకప్పుడు వీరిని తరిమికొట్టారు... దేశాలు తిరుగుతూ వేషాలుమారుస్తూ వుంటారు.. అడవుల్లో గుడారాల్లో వీళ్ళు నివాసం ఏర్పరచుకుంటారు’’ తనకు తెలిసిన సమాచారం చెప్పాడు.
అప్పటికే రాయంచ గాలిలో ఎగురుకుంటూ వెళ్లి ఆ గుడారాన్ని పసిగట్టి వచ్చి విజయుడికి చెప్పింది.
***
హిగ్గారీల పీడ విరగడచేయాలనీ నిశ్చయించుకున్న విక్రమ విజయుడు అశ్వాలను ముందుకు దూకించారు. రాయంచ పంచకల్యాణి తలమీద దర్జగా కూచుంది.
***

-సశేషం

- శ్రీ సుధామయి