డైలీ సీరియల్

వేదాలలో వైజ్ఞానిక విశేషాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖగోళ శాస్తమ్రు
ఋగ్వేదంలో ఖగోళ శాస్త్రానికి సంబంధించిన అంశాలు విస్తారంగా లభిస్తున్నాయి. యజ్ఞయాగాది క్రతువుల ఆచరణకు సంవత్సర, ఆయన, ఋతు, మాస, పక్ష, తిథ్యాది రూపమైన కాల నిర్ణయం చాలా ముఖ్యం గనుక, ఋగ్వేదంలో వర్ణించబడిన అనేక మహాక్రతువులు ఖగోళీయ సన్నివేశాలకు ప్రతిబింబప్రాయాలు కనుక, ఋగ్వేదంలో ఖగోళీయ ప్రసక్తులు విస్తారంగా వుండటం సహజమే. ఇలాంటి ప్రసక్తులలో పంచాంగ గణితానికి సంబంధించిన ప్రసక్తులు, వాటి వినియోగాలు మనకు మరింత సన్నిహితంగా ఉంటాయి గనుక, మనం ముందుగా వేదోక్త పంచాంగ సంబంధిత ఖగోళ విషయాలను వీలైనంత సులభమార్గంలో సంగ్రహంగా పరిచయం చేసుకునేందుకు ప్రయత్నిద్దాం. అలాగే అలాంటి గణితానికి అనుబంధంగా వేద ఋషులు వినియోగించిన కాలమాన పద్ధతులను కూడా పరిచయం చేసుకుందాం.
ప్రపంచంలోని దేశాలన్నింటిలోనూ ఏడు వారాలే ఉన్నాయి. ఈ ఏడు వారాలకీ ఏడు గ్రహాలకు సంబంధించిన పేర్లే పెట్టారు.
ఉదాహరణకు- ఆదిత్యవారము - సన్ డే. సోమవారము - మూన్ డే.
ఈ విధంగా శనివారము - సాటరన్ డే వరకు గ్రహాలమీదనే వారాల పేర్లు ఏర్పడుతున్నాయి. కొన్ని వారాల దగ్గర గ్రీకు, లాటిన్ వంటి పురాతన భాషలలోని పేర్లు కలిశాయి కనుక, గ్రహాల పేర్లు అస్పష్టంగా వున్నాయి. ఇలా, వారాలకూ గ్రహాలకూ సంబంధం ఏర్పడటానికి కారణాలు మాత్రం మన శాస్త్రాల్లోనే విస్పష్టంగా వుంటాయి. ఇది అర్థం కావాలంటే ‘పంచాంగం’ అంటే ఏమిటో తెలుసుకోవాలి.
పంచ + అంగము; అయిదు అంగాలు ఉండేది పంచాంగం. అవి ఏమిటంటే, ఒకటి తిథి; రెండు నక్షత్రము; మూడు కరణము; నాలుగు యోగము; అయిదు వారము - ఇవన్నీ కూడా సూర్యుడి యొక్క, భూమి యొక్క గమనాన్ని బట్టి ఏర్పడే లెక్కలే! ఈ విషయాన్ని లోకసామాన్యంగా అర్థం చేసుకునే తీరు వేరు, విషయాన్ని నిష్కర్షగా తెలుసుకోవాలంటే చెప్పవలసిన విషయాలలు వేరు. ఉదాహరణకు నక్షత్రాలు ఇరవై ఏడు అని అందరికీ తెలుసు. మనకు ఆకాశంలో రాత్రిపూట, కొన్ని వేల నక్షత్రాలు కనిపిస్తాయి. వాటిలో ఇది అశ్వనీ నక్షత్రము, ఇది భరణీ నక్షత్రము అని గుర్తుపట్టి చూపించే విధానం కూడా వుంది. ఆ నక్షత్రాలూ ఆ శాస్తమ్రూ వేరు. పంచాంగంలో వుండే 27 నక్షత్రాలూ- వీటి లెక్కలూ వేరు.
నక్షత్రం
మన భూమి ఒక బిందువు అనుకుని, దాన్ని కేంద్రంగా చేసుకుని ఆకాశపు అంచులదాకా ఒక పెద్ద వృత్తాన్ని గీశామనుకోండి. భూమి కేంద్రం నించి, ఒక నిట్టనిలువు గీత గీశామనుకోండి. ఆ గీత ఆ వృత్తానికి వ్యాసార్థం అవుతుంది.
ఆ వ్యాసార్థరేఖ గడియారంలో సెకండ్ల ముల్లు తిరిగినట్లుగా గబగబా ఒక చుట్టు తిరిగి వచ్చిందనుకోండి- అది ఎంత దూరం తిరిగినట్టు? వృత్తం ఎంత పెద్దదైనా లేక ఎంతచిన్నదైనా వ్యాసార్థ రేఖ యొక్క కోణగమనం 360 డిగ్రీలు మాత్రమే! ఈ 360 డిగ్రీలనూ కలిపి రాశిచక్రము అంటారు. ఈ రాశి చక్రపు అంచుమీద 13 డిగ్రీల 20 నిమిషాలకు ఒక గీటు పెట్టకుంటూ వెళ్లామనుకోండి. అవి ఎన్ని భాగాలేర్పడతాయి? ఇరవై ఏయడు భాగాలేర్పడతాయి.
అనగా 360/13.20 = 27 కాగా
13.20న27
= 27న13 20/60
= 27న13 1/3
= 27న40/3
= 9న40 = 360 డిగ్రీలు
కనుక తేలిందేమిటంటే మన చుట్టూ మనం గీసుకున్న రాశిచక్రం అనే వృత్తపరిధిమీద 13 డిగ్రీల 20 నిమిషాలు ప్రయాణం చేస్తే ఆ కోణపు చీలిక పేరు నక్షత్రం. ఇలాంటి చీలికలు 27 ఉంటాయి. కనుక మనకు మొత్తం 27 నక్షత్రాలు ఉన్నాయి.
ఆ చీలికలోకి ఏ గ్రహం ప్రవేశిస్తే, ఆ గ్రహం ఆ నక్షత్రంలో వున్నట్టు లెక్క. భూమి చుట్టూతా వుండే నవగ్రహాలు, ఒకే వృత్త పరిధిలో తిరగవు- దేని పరిధి దానిది. దేని తలం (ప్లేన్) దానిది. అయితేనేమిట? కోణగమనాన్ని లెక్కేస్తే దూరంగా ఉన్న హ్రమైనా సరే, దగ్గరగా వున్న గ్రహమైనా సరే, మన 27 చీలికల్లోనూ ఏదో ఒక చీలికలో ఉండవలసిందే! ఉదాహరణకు-
పై చిత్రంలో సూచించిన విధంగా, చంద్ర, సూర్య, శని గ్రహ కక్ష్యలు భూమి నుంచి వేరు వేరు దూరాలలో వున్నాయి. ఆ కక్ష్యలలో ఆ గ్రహాలు ఆయా నిర్దిష్ట స్థానాలలో వున్నాయి. ఆ స్థానాలు ఎంత ఎత్తున వున్నా సరే, ఎంత కిందుగా వున్నా సరే- వారందరూ ఒకే చీలికలో ఉన్నారు గనుక- అందరూ ఒకే నక్షత్రంలో వున్నట్టు లెక్క! ఈ 27 చీలికలకూ ఆకాశంలో వుండే కొన్ని నక్షత్రాల పేర్లు తీసుకుని, వీటికి పెట్టేశారు. దానికి వేరే కారణాలున్నాయి.
భూమి కేంద్ర బిందువు గనక దానికి ఏ నక్షత్రమూ వుండదు. నవగ్రహాలలో సూర్యుడి దగ్గర్నించి శనిదాకా ఏడు గ్రహాలు ప్రత్యక్షంగా ఆకాశంలో కనిపిస్తూ సంచరించే గ్రహాలు. రాహు కేతువులు- అలాంటి ప్రత్యక్ష గ్రహాలు కావు. అవి ఖగోళ గణిత శాస్తప్రు లెక్కలవల్ల ఏర్పడిన రేఖాగణిత బిందువులు- ఆ వివరాలు తరువాత చెప్పుకుందాం. అందువల్ల అసలైన గ్రహాలు ఏడే. వీటిని బట్టే ఏడు వారాలు వచ్చాయి. వాటి దగ్గరకు తరువాత వద్దాం.

ఇంకావుంది...

--కుప్పా వేంకట కృష్ణమూర్తి