డైలీ సీరియల్

జ్వాలాముఖి.. మంత్రాలదీవి-8

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంటి కన్ను మర్రిచెట్లు దాటిన తర్వాత మాయాకొలను ఆవరించి ఉంది. ఆ మాయాకొలను మంచు ప్రదేశంలా అగుపిస్తుంది. ఆ ప్రదేశం మీద అడుగుపెడితే అది కొలనులా మారిపోయి అందులో ఉన్న మాయామొసళ్లకు ఆహారమైపోతారు.
అది ఒక పెద్ద రాక్షసుడు నోరు తెరిచినట్టుగా ఉండే గుహ. ఆ గుహకు కాపలాగా భస్మాక్షుడు అనే కోరల రాక్షసుడిని వకృటాసురుడు నియమించాడు. భస్మాక్షుడు వాడి కోరలతో మాత్రమే అంతం అవుతాడని వకృటాసురుడికి మాత్రమే తెలిసిన రహస్యం.
* * *
మంత్రాల దీవి నడిబొడ్డులో పెద్ద గుహ నల్లటి బండరాతి గుహ, ఆ గుహముందు భస్మాక్షుడు తనకు ఎవరు ఆహారం అవుతారా? అని ఎదురుచూస్తున్నట్లుంది.
ఒక్కసారిగా ఉన్నట్టుండి గాలి దుమారం.. చెట్ల ఆకులు గాలికి ఎగురుతున్నాయి. ప్రేతాత్మలు భయంతో వణుకుతున్నాయి. భస్మాక్షుడు తన భారీ వికృతరూపాన్ని వదిలి సూక్ష్మరూపంలోకి వచ్చి చేతులు జోడించి నిలబడ్డాడు గుహముందు.
భీకరమైన సుడిగాలి... ఆ సుడిగాలి నుంచి అక్కడ ప్రత్యక్షమయ్యాడు వకృటాసురుడు.
పొడువైన దేహం.. పొడువాటి గడ్డం. చేతిలో మంత్రదండం... చూపుల్లో క్రూరత్వం... ఎర్రగా ఉన్న కళ్ళు...
‘‘సాహో మహామంత్రికా సాహో...’’ భస్మాక్షుడు వకృటాసురుడి ముందు సాగిలపడ్డాడు.
భీకరమైన తన మంత్రదండాన్ని గాల్లోకి లేపి ‘‘హిం హిం హిం హిమోహి’’అన్నాడు వెంటనే గుహా ద్వారానికి అడ్డుగావున్నా బండరాయి అదృశ్యమైంది.
గుహలోపలకి నడిచాడు. గుహలోపల అస్థిపంజరాలు గాల్లో వేలాడుతున్నాయి. వికృత రూపంవున్న ఆకారాలు కళ్ళుతెరిచాయి. ఎదురుగా నిలువెత్తు జ్వాలాముఖి విగ్రహం... విగ్రహం ముందు హోమగుండం... హోమగుండం ముందు పులి చర్మం...
వకృటాసురుడు తన మంత్ర దండాన్ని గాల్లోకి లేపాడు. మరుక్షణం హోమగుండంలో అగ్ని రాజుకుంది. వకృటాసురుడు జ్వాలాముఖి విగ్రహం ముందు నిలబడి..
‘‘మహాశక్తీ జ్వాలాముఖి... నిన్ను ప్రసన్నం చేసుకోవాలన్న నా కోరిక ఎప్పుడు సిద్ధించేను... ఈ భూమండలానికి నేనే మహా ఎలుకను కావాలె... నన్ను జయించు వీరుడు కానీ నా ప్రాణం హరించు శక్తి కానీ ఎవరికీ లేకుండా వుండవలె.. నా మంత్రశక్తుల ముందు అందరూ మోకరిల్లవలె...’’ అన్నాడు.
‘‘వకృటాసుర... ఆసి అసాధ్యమైన తెలియదా... నీ కోరిక నెరవేరాలంటే నువ్వేం చేయాలో నీకు తెలియదా? ఆ గుహలో ఆ మాటలు ప్రతిధ్వనించాయి.
వకృటాసురుడు తల తప్పి ఆ మాటలు వినిపించినవైపు చూసాడు.. ఆ గుహలో ఉత్తరం వైపు బండరాయిమీద రెండు కళ్ళు కనిపిస్తున్నాయి.. నోరు కదిలినపుడు అగ్నిజ్వాలలు వస్తున్నాయి. వకృటాసురుడు అటువైపు వెళ్లి ‘‘ఏయ్ ద్వారపాలకీ. అగ్నికీలకీ నాకే అసాధ్యమందువా?’’ అన్నాడు తీక్షణంగా చూస్తూ.
‘‘నీకు తెలియదా వకృటాసురా.. కొండ గుహలో వున్న జ్వాలాముఖి.. తలభాగం గుహాభాగం నుంచి మొదలై ఆకాశాన్ని తాకుతూ ఉంటుంది. భయంకర రూపంతో ఉగ్రజ్వాలాముఖిగా వుండే మహాశక్తి ప్రసన్న జ్వాలాముఖిగా తన విశ్వరూపం సూక్ష్మరూపంగా మారి.
గుహలోపలకి రాలే. అపుడు ఆ జ్వాలాముఖిని ఈ నట్రాలదేవికి తీసుకువచ్చి ప్రతిష్ఠించవలె.. అపుడు కదా జ్వాలాముఖి నీ అధీనంలోకి వచ్చి నీ కోరిక తీరుస్తుంది..’’
పెద్దగా వికటాట్టహాసం చేశాడు వకృటాసురుడు.
‘‘అందుకే కదే ద్వారపాలకీ.. ఆ జ్వాలాముఖి ప్రసన్నం కావాలంటే ఉగ్రజ్వాలాముఖిని అనుకుని వున్న సమస్య సామ్రాజ్యాలను అందులోని ప్రజలను వారి సుఖశాంతులను బలి ఇస్తున్నాను.. మహాబలి ఇస్తున్నాను. ఇంక నాకు తిరుగులేదు.. మహాపురి కోసల రాజ్యాలు మశానం అవుతున్నాయి.. వారిని భయభ్రాంతులకు గురిచేస్తూ వారి ఆనందాలను హరించివేస్తూ ఆ మహా సామ్రాజ్యాలను స్మశానాలుగా మారుస్తున్నాను. జ్వాలాముఖికి బలి ఇస్తున్నాను.. ఇక నాకు తిరుగులేదు.. తిరుగులేదు.. తిరుగులేదు.. హహహ వికటాట్టహాసం చేస్తూనే వున్నాడు. అపుడు గుహలో దక్షిణభాగాన వున్న గాలిలో వేలాడే ఒక తల నోరు విప్పింది.
‘‘విర్రవీగకు వకృటాసురా.. నీ అంతు చూడడానికి ఒక మహావీరుడు వస్తున్నాడు’’
వకృటాసురుడు ఆ వేలాడే తల దగ్గరికి వెళ్లి ‘‘నీ శారుూరామ్ నుంచి మొండెం వేరుచేసినా నీ అహం చావలేదేవె.. వుండు నీ తలను వేయి ముక్కలు చేస్తాను..’’ అంటూ మంత్రదండాన్ని గాల్లోకి లేపాడు.
‘‘వకృటాసురా.. నీ ప్రతాపం నా మీద కాదు.. చూడు నిన్ను జయించువీరుడు.. ఎక్కడున్నాడో చూడు.. హిహిహి’’ అంటూ తన నోరు తెరిచింది.
అందులో కరవాలాన్ని పైకి లేపి కనిపించాడు విజయుడు..
‘‘చూడు వకృటాసురా.. అతడే నిన్ను జయించు వీరుడు. అతడికి ఎదుర్కో.. హిహిహి’’ ఆ తల నోరు మూసుకుంది.
‘‘నన్ను జయించునది ఈ అర్భకుడా.. కపాలకుండా..’’ అంటూ గట్టిగా పిలిచాడు.
‘‘ఆజ్ఞా దేవరా’’ అంటూ బలిష్ఠమైన వికృత రూపం వున్న వ్యక్తి ప్రత్యక్షమయ్యాడు.
‘‘వెళ్ళు.. నన్ను ఎదురించే ఆ అర్భకుడిని ముప్పతిప్పలు పెట్టు.. రాజ్యం పొలిమేరల్లో అతడిని సంహరించి అతడి తలను జ్వాలాముఖికి కానుకగా ఇవ్వు’’ అన్నాడు.
కపాలకుండ మాయమయ్యాడు.
* * *
-సశేషం

- శ్రీ సుధామయి