డైలీ సీరియల్

జ్వాలాముఖి... మంత్రాలదీవి -- 10

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ రాజ్యాన్ని, ప్రజలను కాపాడవలసిన బాధ్యత నీదే నాయనా.. నేను వానప్రస్థానికి వెళ్తాను’’ మహారాజు చెప్పాడు.
‘‘మహాపురి మహారాజుకు జయం జయం’’ ప్రజలు హర్షధ్వానాలు చేశారు. మహారాజు విక్రముడిని తన చెంతకు పిలిచాడు. విక్రముడు మహారాజు పాదాలను తాకాడు.
మహారాజు విక్రముడిని దగ్గరికి తీసుకుని ‘‘మీ తండ్రిగారు మహామంత్రిగా మాకు చేదోడుగా నిలిచారు. విజయుడు వెంట నువ్వు మిత్రునిగా బాధ్యతలు స్వీకరించి ప్రభుభక్తిని, స్నేహధర్మాన్ని పాటించు నాయనా... నేను మా నాన్నగారు విశ్రాంతి జీవితాన్ని వానప్రస్థంలో గడపాలని కోరుకుంటున్నాం’’అన్నాడు. ‘‘మీరు మా ప్రభువులు మీ ఆదేశాలను శిరసావహిస్తాం... విజయుడు మహారాజుగా దేశప్రజల మన్ననలను అందుకుంటాడు. నాకు ప్రాణమిత్రుడు కూడా. నా చివరి రక్తపుబొట్టువరకూ ఈ దేశంకోసం, నా ప్రాణమిత్రుడికోసం నిలబడుతాను’’ మనఃస్ఫూర్తిగా అన్నాడు.
‘‘మహారాజు విజయుడికి జై’’ పురప్రజలు జయజయ ధ్వానాలు చేసారు.
విజయుడు చేయెత్తి వాళ్ళను వారించాడు.
‘‘మహాపురి ప్రజలారా మీకు అభివందనం. ఇది పట్ట్భాషేకం చేసుకుని సంబరాలు చేసుకునే సమయం కాదు. ప్రజలు కష్టకాలంలో వున్నప్పుడు నేను మహారాజును కావడం సరికాదు. ఈ దేశపు పౌరుడిగా... యువరాజుగా నా ప్రజలను ఈ గండంనుంచి గట్టెక్కించి విజయాన్ని సాధించి నా దేశ ప్రజల కళ్ళలో ఆనందాన్ని చూసాక పట్ట్భాషేకం. అప్పటివరకు నేను యువరాజుని... మీలో ఒక్కడినే... నాన్నగారు ఈ సమస్యకు పరిష్కారాన్ని వెతుకుదాం... గురుదేవులను పిలిపిద్దాం. ‘ఎప్పుడు వినయంగా విజయుడు. ఆస్థాన పండితులను కపిలారణ్యంలో తపస్సుచేసుకుంటున్న మునివర్యులను స్వయంగా ఆహ్వానించాం. సుధర్ములవారికీ ఆహ్వానం వెళ్ళింది. తరుణోపాయం వాళ్ళు మాత్రమే చూపించగలరు
‘‘మహారాజు చెప్పాడు.
రాజభవనానికి తిరుగుముఖం పట్టారు.
తమ యువరాజు ఈ గండంనుంచి తమను గట్టెక్కిస్తాడని... మహాపురి సామ్రాజ్యం మళ్ళీ కళకళలాడుతుంది. ప్రజల్లో నమ్మకం మొదలైంది.
విజయుడుతోపాటు రాయంచ రాచనగరికి బయల్దేరింది.
* * *
విజయుడు కోట పై భాగంలో వున్నాడు. ప్రయాణిక బడలిక తీరినా రాజ్యంలోని సమస్య అతడ్ని వెన్నాడుతుంది. రాయంచ వెండిపళ్లెంలో ఉన్న జామకాయలు రుచిచూస్తోంది. అప్పుడే ప్రవేశించాడు విరాముడు. ‘‘మిత్రమా అన్యమనస్కంగా వున్నావ్... మనం తోడేళ్ళను నగర పొలిమేరల్లోకి తరిమేసి విజయం సాధించంగా’’అన్నాడు విక్రముడు.
‘‘అవి కోసల దేశ సరిహద్దుల్లోకి వెళ్లాయి. మనం మన రాజ్య సరిహద్దులనుంచి తరిమేశాం... మరి కోసల రాజ్యప్రజలు కూడా వీటి బారిన అదే ప్రమాదం వుంది కదా... కోసల రాజ్యంలోని ప్రజలను కూడా కాపాడాలని నా మనసు నాకు హితవుచెబుతోంది...’’అన్నాడు విజయుడు.
‘‘చిత్తం మిత్రమా నీ చిత్తంలో అనిపించింది నాకు సమ్మతమే’’ అన్నాడు విక్రముడు.
మునివర్యులు... సుధర్ములు... ఆస్థాన పండితులు మరుసటిరోజు సమావేశమవుతారు. రాజ్యంలో జరుగుతున్నా విపరీత పరిణామాలు మూలలను శోధిస్తారు. సుధర్ములవారు మార్గాన్ని నిర్దేశిస్తారు... ఈలోగా ఈరాత్రి మారువేషాల్లో కోసల రాజ్యానికి వెళ్లి అక్కడి పరిస్థితులను అంచనావేయాలి. తానూ తరిమిన తోడేళ్ళ గుంపు అక్కడ ఎలాంటి విధ్వంసం సృష్టిస్తుందో.. అదే నిజమైతే తాను తన మిత్రుడు కలిసి ఆ ప్రమాదంనుంచి కోసల ప్రజలను గట్టెక్కించాలని నిర్ణయించుకున్నాడు. విక్రముడు, సరేనన్నాడు.. రాయంచ తానూ వస్తానంది.
* * *
మహాపురి రాజ్యం నిద్రలోకి జారుకుంది. యువరాజు విజయుడు తమకు వున్నాడన్న ధీమాతోవున్నది. సైనికులు రెట్టించిన ఉత్సాహంతో కాపలా పెంచారు. గస్తీ తిరుగుతున్నారు. విజయుడు విక్రముడు మారువేషాలు ధరించారు... కోటనుంచి బయటకు వచ్చారు. కోసల వైపు ప్రయాణం సాగించారు. సూర్యుడు ఉదయించేలోపు తమ రాజ్యానికి చేరుకోవాలి... సుధర్ములు... మునులు ఆస్థాన పండితులు చెప్పే పరిష్కార మార్గాన్ని, ఈ ఉత్పాతానికి సంబంధించిన మూలాలు తెలుసుకోవాలి. తమ రాజ్యాలే కాదు.. మిత్ర రాజ్యాలు కూడా ప్రశాంతంగా ఉండాలి.. ఈ దృఢ సంకల్పంతో ఆ రాత్రి కోసల ప్రజల కష్టాలు ప్రత్యక్షంగా తెలుసుకోవడానికే మిత్రుడితో కలిసి బయల్దేరాడు.
* * *
కోసల రాజ్యం పాడిపంటలతో సుఖశాంతులతో మహాపురి రాజ్యానికి సమానంగా వర్ధిల్లిన రాజ్యం. మహారాజు ప్రభాకరవర్మకు ఒక్కగానొక్క గారాలపట్టి యువరాణి సహస్రదర్శిని. లేకలేక కలిగిన సంతానం. ఈశ్వరేచ్ఛగా భావించాడు. కొడుకులు లేరన్న బెంగను వదిలేసాడు. కూతురిని గారాబంగా పెంచాడు. మగబిడ్డకు సమానంగా అన్ని విద్యలు నేర్పించాడు. యుద్ధకళల్లో ఆరితేరింది. ఎన్నో రాజ్యాల యువరాజులు సహస్రదర్శిని మీద మనసుపారేసుకున్నారు. అద్భుత సౌందర్యరాశి. దానికితోడు మంచితనం వినయం పెద్దలంటే గౌరవం. ప్రజల మీద అభిమానం యువరాణిని ప్రజలు అభిమానించేలా చేసింది.
అంతఃపురంలో మహారాజు ప్రభాకరవర్మ ఎదురుగా నిలబడి వుంది సహస్రదర్శిని.
కోసల రాజ్యంలో తోడేళ్ల దాడితో అల్లకల్లోలం జరుగుతున్న ఆ సమయంలో...
కోసల దేశపు ఏకైక రాకుమారి యువరాణి సహస్రదర్శిని అంతఃపురంలో తన తల్లిదండ్రులతో కలిసి సమావేశంలో ఉంది. మహారాజు మహారాణి కలిసి తమ కుమార్తెకు స్వయంవరం నిర్వహించి పరిణయం జరిపించి రాజ్యపు అధికారాలు బాధ్యతలు అప్పగించి వానప్రస్థం స్వీకరించాలని నిర్ణయించుకున్నారు. ‘తల్లీ మాకు వయసు మీద పడుతున్నది. వానప్రస్థం మమ్మల్ని ఆహ్వానిస్తున్నది. శేష జీవితం ప్రశాంతంగా గడపడానికి ఇదే అనువైన సమయం. కుమారుడవైన ఈ దేశపు భావి మహారాణివైనా నువ్వే.. నీకు స్వయంవరం జరిపించి నీ మనసు గెలుచుకున్న వరుడినితో పాణిగ్రహణం చేయించి ఈ రాజ్య బాధ్యతలను నీ బాధ్యతలను కోసల దేశపు బాధ్యతను నా అల్లుడికి అప్పగించి ఈ భవబంధాలనుంచి విముక్తుడిని అవుతాను. ఈ రాజ్యభారాన్ని మోసే శక్తి ఇక నాకు లేదు తల్లీ’’ మహారాజు చెప్పాడు.
-సశేషం

- శ్రీ సుధామయి