డైలీ సీరియల్

జ్వాలాముఖి... మంత్రాలదీవి--11

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘మన్నించండి నాన్నగారూ మీ మాటను స్వీకరించలేక పోతున్నాను. ఇప్పుడు మన రాజ్యం భయంతో బిక్కుబిక్కుమంటున్నది. ప్రజలు సంతోషంగా లేని సమయంలో పరిణయం భావ్యం కాదు.. కోసల ప్రజలు సుఖ సంతోషాలతో వున్నప్పుడే నాకు పరిణయం. ‘‘యువరాణి సహస్రదర్శిని చెప్పింది వినయంగా. ‘కానీ స్వయంవరానికి ఏర్పాట్లుగావించాను.. నువ్వు నామాట మీరవన్న నమ్మకంతో... పరిణయం తర్వాత నువ్వు నీ భర్త కలిసి కోసల ప్రజలను కాపాడుకోవచ్చుకదా తల్లీ... ఒక్కగానొక్క కూతురి పరిణయాన్ని చూడాలన్న మా ఆశను నీరుగార్చకు. ‘మహారాజు కూతురి చేతులు పట్టుకున్నాడు.
‘‘ఎంత మాట నాన్నగారూ... మీరు ఆజ్ఞాపించవలసివారు.. మేము శిరసా వహించాలి.. కానీ ఇది మన రాజ్య శాంతిభద్రతల సమస్యకదా... మీ మాటను అవధరిస్తాను.. కోసల రాజ్యానికి పట్టిన ఈ మహమ్మారిని ఎదుర్కొని కోసల రాజ్యం ప్రశాంతంగా ఉండేలాచేసిన వీరాధివీరుడే నా భర్త. ఈ సహస్రదర్శిని చేయిపట్టుకునే భావికోసల దేశ మహారాజు... ఏమంటారు నాన్నగారూ..’’ అడిగింది సహస్రదర్శిని.
‘‘చక్కని మాట చెప్పావు తల్లీ... యువరాణిలా మాట్లాడావు... ఇప్పటికే నీ స్వయంవరంకోసం ఎందరో యువరాజులు ఎదురుచూస్తున్నారు. మన విడిది మందిరంలో వున్నారు... ఒక మహాపురి యువరాజు తప్ప... ఇప్పుడే నేను విడిదిలో వున్న రాకుమారులకు వర్తమానం పంపుతాను... వీరులెవరో ఈ రాత్రికే తేలిపోతుంది. ఈ రాత్రి మన రాజ్యం మీద దాడిచేసే తోడేళ్ళ గుంపును ఎవరైతే తరిమికొడతారో.. వారే నా కూతురు చేయందుకోబోయే వరుడు... ‘‘సంతోషంగా చెప్పాడు మహారాజు ప్రభాకరవర్మ.
అంగీకార సూచకంగా తలూపింది సహస్రదర్శిని...
ఆంతరంగిక సమావేశంలో తమ కుమార్తెకు తమ అభిప్రాయం విశదీకరించి చర్చిస్తున్న సమయాన... పరుగుపరుగున అచటికి వచ్చిన కొందరు భటులు వగరుస్తూ ఇలా చెప్పారు.
మహారాజా మన రాజ్యంలో కొన్ని తోడేళ్లు అడుగుపెట్టి కలకలాన్ని సృష్టిస్తున్నాయి అని...
* * *
యువరాణి సహస్రదర్శిని శయనాగారం... భటులకు కూడా ప్రవేశంలేని నిషిద్ధప్రాంతం. చెలికత్తెలుకూడా పహారాకాస్తున్నారు ఆయుధాలతో... సహస్రదర్శిని ఆంతరంగిక చెలికత్తె చిన్మయి యువరాణి మందిరంవైపు వెళ్తుంది. ఆమెనెవరూ అడ్డగించడం లేదు.
ఈ సామ్రాజ్యంలో యువరాణి ఆంతరంగిక మందిరం ఆమెకు ఎప్పుడూ అబ్బురంగా కనిపిస్తోంది. ఈ దర్పం.. నగిషీలతో తీర్చిదిద్దిన రాజమణిరం... పరిచారికలు... పాలతో స్నానాలు... ధూపాలు.. వైభోగాలు... వచ్చేజన్మలో తాను రాకుమారిగా పుడితే బావుండు.. అనుకుంటుంది. ఆమె ఆలోచనలు ఎప్పుడూ అదేవిధంగా కొనసాగుతాయి.
ఆంతరంగిక మందిరం దగ్గరికి వచ్చింది. తనకన్నా మూడురెట్ల పొడవు వున్న ద్వారం... బంగారు పూతతో మెరిసిపోతోంది. చిన్మయిని చూసి అక్కడ కాపలాగావున్న చెలికత్తెలు ద్వారం తెరిచారు.
లోపలి అడుగుపెట్టింది చిన్మయి. ఎప్పుడూ ఈ మందిరం అబ్బురంగానే ఉంటుంది... యువరాణి శయనించే హంసతూలికా తల్పం కాంతులీనుతూ వుంది... చుట్టూ పట్టుతెరలు... ఆ తెరలను తొలగిస్తే కనిపించే ఉద్యానవనం... అల్లుకున్న తనూలతలు... ఆకాశంలో కనిపించే చందమామ..
ప్రతీరోజు యువరాణికి ఈ దృశ్యాన్ని వీక్షించడం బాగా గుర్తు చిన్మయికి.
ఆమె కళ్ళు యువరాణి వారిని అనే్వషిస్తున్నాయి. అప్పుడే ఆమెకా దృశ్యం కనిపించింది. అపరిచిత వ్యక్తి.. వీపుభాగం కనిపిస్తోంది. యువరాణివారి ఆంతరంగిక మందిరంలో అపరిచితుడా.. అందులోనూ పురుషుడు... ఎంత తెంపరితనం.. భటులు ఏంచేస్తున్నారు..? అందరి కళ్ళుకప్పి ఎలా ప్రవేశించాడు. చెలికత్తె చిమ్మెయి గోడకువున్నా కరవాలాన్ని అందుకుని ‘‘ఓరుూ దుస్సాహసి... ఎంత తెంపరితనం.. యువరాణివారి మందిరంలోకి ప్రవేశించే సాహసం చేసావ్... ఎవర్నువ్వు? అంటూ కరవాలాన్ని అపరిచిత వ్యక్తి వీపుకు ఆనించింది.
అపరిచిత వ్యక్తి వెనక్కి తిరిగి చిన్మయివైపు చూసింది..
చిన్మయి చేతిలోని కరవాలం నేల జారింది... యువరాణి వారు.. మీరా?
పురుషుడి దుస్తుల్లో వుంది యువరాణి సహస్రదర్శిని... నూనూగు మీసాలు... తల చుట్టూచుట్టిన ఆచ్చాదనా వస్త్రం..
‘‘అవును చిన్మయి.. ఇది రహస్యం.. బయటకు పొక్కనీయకు. అంతఃపుర రహస్యం సుమా’’ హెచ్చరిస్తున్నట్టు అంది.
‘‘కారణం తెలుసుకోవచ్చా యువరాణీ...’’ ఉత్సుకతతో అడిగింది.
‘తోడేళ్ళ మంద మన రాజ్యంమీదికి వచ్చింది. ప్రతీరోజు ఏదో ఒక ఉపద్రవము... మహారాజువారికీ విశ్రాంతి అవసరం.. యువరాణిగా నా ప్రజలకోసం పోరాడక తప్పదు... సైనికులే కాదు.. ప్రజలను కాపాడే బాధ్యత మామీద కూడా వుంది... అలాగే మాకోసం ఈరోజు మాయ తోడేళ్లతో పోరాడే వీరుల శౌర్యసాహసాలు చూడాలి... వారి వీరత్వాన్ని వీక్షించాలి... పోరాడాలి..’’
అలానే చూస్తూ ఉండిపోయింది చిన్మయి. ఇప్పటివరకూ తాను కూడా రాకుమారిగా పుట్టాలనుకున్నది. కేవలం ఆ రాజవైభోగాలు చూసి.. రాణివాసం అంటే వైభోగాలుకాదు ప్రజలను కాపాడే రక్షాబంధాలు...అని అర్థమైంది. యువరాణి మనసులోని ఆలోచనకు ముగ్ధురాలైంది.
‘‘యువరాణివారు అనుమతిఇస్తే నేనూ మీతోపాటు వస్తాను... మీకు నేర్పిన కత్తిసాము శత్రువుల మీద ప్రయోగిస్తాను.. మీ బాటలో నడుస్తాను’’ వినయంగా తల వంచి అంది.
చెలికత్తె భుజం తట్టింది.
ఇద్దరూ పురుష వేషాల్లో ద్వార పాలకు భటుల కళ్ళుకప్పి రాజప్రాసాదం వెలుపలికి వచ్చాడు.
అప్పటికే కలకలం మొదలైంది.
తోడేళ్ళ మంద విరుచుకుపడి బీభత్సం సృష్టిస్తుంది.
* * *
కోసలరాజ్యంలో అలజడి మొదలైంది.. పురప్రజలు తమ గృహాలువీడి బయటకు రావడంలేదు. చీకటి పడిందంటే భయంతో వణికిపోతున్నారు. ఎప్పుడు ఏ విచిత్ర జంతువు తమమీద దాడి చేస్తుందేమోనని భయపడిపోతున్నారు. సైనికులు శక్తివంచన లేకుండా పోరాడుతూనే వున్నారు.
కోసల రాజ్య మహారాజు ప్రభాకరవర్మ విడిదిలోవున్న వివిధ దేశాల రాకుమారులకు వర్తమానాన్ని పంపించాడు. జంతువుల బారినుంచి ఎవరైతే కోసల రాజ్యప్రజలను కాపాడుతారో.. వారికి అద్భుత సౌందర్యరాశి కోసలరాజ్య యువరాణితో పరిణయం. కోసలరాజ్య ప్రభువుగా పట్ట్భాషేకం జరుపబడుతుందన్నది ఆ వర్తమానం సారాంశం.
సహస్రదర్శిని అపురూప సౌందర్య రాశి.. అందులోనూ కోసల రాజ్యానికి ఏకైక వారసురాలు.. రాజ్యం.. అద్భుత సౌందర్యం తమ వశం అవుతుందని రాకుమారులు తోడేళ్ల మందను ఎదుర్కోవడానికి సిద్ధపడ్డారు.

-సశేషం

- శ్రీ సుధామయి