డైలీ సీరియల్

జ్వాలాముఖి... మంత్రాలదీవి--13

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యువరాణి పురుష దుస్తుల్లో ఉండడం మూలాన ఆమెను యువకుడిగా పొరపడ్డాడు.
‘గాయాలేమీ కాలేదు కదా... ఎవరు నీవు మిత్రమా... సైనికుడివలె లేవు... నూనూగు మీసాల మిత్రమా... ఏమి ఈ తెంపరితనం... నీ ప్రాణాల మీదికే వచ్చింది చూడు. మీ రాజ్యంలో పౌరులు కూడా పోరాడడం బహుబాగున్నది..’’ అంటూ చేయి అందించాడు.
యువరాణి క్షణకాలం సందేహించింది. స్ర్తి సహజ సిద్ధమైన బిడియం. తప్పనిసరిగా చేయి అందించింది. ఒక్క క్షణం యువరాణి ఒళ్ళు ఝల్లుమంది. మొదటిసారి పురుషస్పర్శ. ఆమె మనసును తాకి పరవశానికి గురి చేసింది. మునుపెన్నడూ లేని వివశత్వం.
ఈ యువకుడిని పట్టుకున్నంతనే నా దేహంలో ఈ పులకింత ఏమిటి? మనసులో అనుకున్నాడు విజయుడు. పైగా పాలమీగడతో తీర్చిదిద్దినట్టున్న చేతులు ఆసరాకు భుజం మీద చేయివేసి లేపుతున్నప్పుడు మదిలో తెలియని పులకింత వింత... ఏమిటో?
ఒక్కసారిగా ఏనుగు విజయుడి ముందు మోకరిల్లడంతో తోడేళ్ళమంద అదృశ్యమైంది... పౌరులు ఇళ్లలో నుంచి బయటకు తొంగి చూసారు.
యువరాణి క్షేమంగా బ్రతికి బయటపడడంతో చిన్మయి పరుగుపరుగున అక్కడికి వచ్చి.. విజయుడికి నమస్కరించింది. చెలికత్తె ఏదో మాట్లాడబోయేంతలో యువరాణి రహస్యం బట్టబయలు చేయవద్దన్నట్టు సైగచేసింది.
‘‘మమ్మల్ని మా ప్రజలను కాపాడినందుకు మీకు కృతజ్ఞతలు’’ చేతులు జోడించింది యువరాణి.
‘‘ఆపదలో వున్నవాళ్లను ఆదుకోవడం వీరధర్మం... క్షత్రియ ధర్మం... వీరు మహాపురి సామ్రాజ్యానికి కాబోయే భావి సామ్రాట్.. యువరాజు విజయులు..’’ అక్కడికి వచ్చి చెప్పాడు విక్రముడు.
ఒక్క క్షణము యువరాణి ఒళ్ళు ఝల్లుమన్నది. తన మేనిని తాకిన స్పర్శ ఒక వీరకిశోరానిదా... ఒక యువరాజుదా...’’
‘‘మహాపురి యువరాజ వారికి మా ప్రణామాలు...’’అంది తల వంచి యువరాణి.
‘‘అది సరేకానీ నూనూగు మీసాల యువ మిత్రమా... పోరాటంలో రాచబిడ్డను మించారు... తమరెవరు? అడిగాడు విజయుడు.
చెలికత్తె చెప్పబోయేంతలో యువరాణి... ‘‘ఈ దేశపు పౌరులం... మా రాజ్యానికి ఆపదవస్తే కాపాడుకునే బాధ్యత మాకు వున్నది కదా’’ అంది.
‘‘లెస్స పలికితివి మిత్రమా’’అంటూ అభినందన పూర్వకంగా యువరాణిని పురుషుడిగా భావించి హత్తుకున్నాడు... ఒక్క క్షణం పాలమీగడతో తయారైన శరీరాన్ని ఆలింగనం చేసుకున్నట్టు వుంది.
యువరాణి ఒక్కసారిగా చిన్న ఉలికిపాటుతో వెనక్కి జరిగింది. ఆమె శరీరంలో ప్రకంపనలు.. చెలికత్తె నవ్వునాపుకుంది. యువరాణి పాట్లు చూసి నవ్వుకుంది. యువరాణిని కాపాడిన వ్యక్తి మహాపురి యువరాజు అని తెలియడంతో సంతోషంగా వుంది.
తమ యువరాణికి సరైన జోడి అని భావించింది.
‘‘మహావీరా... రాకుమారా... మీరు మా రాజ్యానికి వచ్చిన కారణం తెలుసుకోవచ్చా? మా యువరాణివారి స్వయంవరానికి విచ్చేసారేమోనని...’’అని ఆగింది చెలికత్తె.
‘‘ఒకవైపు మన రాజ్యాలు ప్రమాదంలో వున్నాయి. ఈ సమయంలో పరిణయంమీద మాకు మనసు లేదు’’ అన్నాడు విజయుడు.
‘‘ఒక్కసారి మా యువరాణి వారిని చూస్తే మీరే మనసు మార్చుకుంటారు’’ చెలికత్తె చెప్పింది.
విజయుడి సమాధానంకోసం ఎదురుచూసింది ఆత్రంగా యువరాణి సహస్రదర్శిని.
‘‘మన్నించాలి మిత్రమా... మీ యువరాణి అద్భుత సౌందర్యరాశి కావచ్చు... తన రూప లావణ్యాల గురించి విన్నాం... తన రాజ్యాన్ని కాపాడిన వారిని వివాహం చేసుకోనున్నట్టు సమాచారం వుంది. యువరాణిగా తన ప్రజల గురించి మేలుకోరి తీసుకున్న ఈ నిర్ణయం హర్షణీయమే.. కానీ వీరత్వంతోకాదు ప్రేమతో పరిణయం జరగాలి. మనసులు కలుసుకోవాలి... వీరత్వం ఒక్కటే పరిణయానికి అర్హత కాదు... ఉన్నత వ్యక్తిత్వం ఉండాలి.. మీ మహారాణికి సరైన వరుడు దొరకాలని మేము ఆకాంక్షిస్తున్నాం... మా రాజ్యంనుంచి తోడేళ్ళమంద మీ రాజ్యం మీదికి రావడానికి నేనూ ఒక కారణం అన్న భావనతో మీ రాజ్యాన్నికూడా ఈ తోడేళ్ళ మందనుంచి కాపాడవలెనన్న ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాం... సెలవ్’’ అంటూ వెనుతిరిగాడు.
యువరాణి సహస్రదర్శిని వెంటనే ‘‘మళ్ళీ మహావీరుల దర్శనం ఎప్పుడో? అని అడిగింది. విజయుడు వెనక్కితిరిగి ‘‘రేపు మా రాజ్యానికి మీ మహారాజును, యువరాణివారిని ఇతర రాజ్యాల రాజులు ఆహ్వానిస్తున్నాం... ఈ విపరీతాలకు కారణాన్ని సుధుర్ములవారు వివరిస్తారు... మీలాంటి వీరులు కూడా ఆహ్వానితులే... అందరం కలిసి శాంతి సంరక్షణకు నడుం బిగిద్దాం’’ అంటూ ముందుకు కదిలాడు.
అప్పటికే పురప్రజలు ఇళ్లనుంచి బయటకువచ్చారు. ఈ అలికిడితో తమ రహస్యం బట్టబయలు అవుతుందని చల్లగా అక్కడినుంచి జారుకున్నారు యువరాణి చెలికత్తెతో సహా... రాయంచ చిలుక యువరాణివైపు చూసి ఒక్కక్షణం యువరాణి భుజంమీద వాలి... ‘‘యువరాణి సహస్రదర్శిని మా యువరాజావారు ఎలావున్నారు...’’ అని అడిగింది.
బిత్తరపోయిన యువరాణి చిలుక వంక చూసి ‘‘మాట్లాడే చిలుకా... నా గుట్టు తెలుసుకున్నావా? అని ముద్దుగా అడిగింది.

- శ్రీ సుధామయి