డైలీ సీరియల్

జ్వాలాముఖి.. మంత్రాలదీవి-14

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘తెలుసు తెలుసు... మీ మనసూ తెలుసు... ఇప్పుడు మీ మనసు మనసులో లేదనీ తెలుసు..’’అంది యువరాణి సిగ్గుతో తలొంచుకుని. నా గుట్టు రట్టుచేయకు.. యువరాజా వారికి అప్పుడే ఈ వార్త చేరవేయకు... మా మంచి చిలుకవుకదూ’’ అంది రాయంచను బ్రతిమిలాడుతూ...
‘‘మీ మురిపాన్ని నేనెందుకు కాదంటాను... మాటిస్తున్నాను... నా నోటితో నేను చెప్పను..’’ అంటూ గాల్లోకి ఎగిరింది రాయంచ.
విజయుడి వైపుచూస్తూ అంతఃపురానికి బయల్దేరింది యువరాణి.
* * *
అప్పుడప్పుడే వెలుగురేఖలు విచ్చుకుంటున్నాయి. భూమిమీద సూర్యకిరణాలు పరుచుకుంటున్నాయి. అంతఃపురంలో యువరాణి సహస్రదర్శిని తన అంతఃపురంనుంచి బయట ప్రపంచాన్ని చూస్తుంది. భటులు అటుఇటు తిరుగుతున్నారు. ప్రజాజీవనం మొదలయింది. చాలాకాలం తర్వాత ప్రజలు సంతోషంగా వున్నారు. తోడేళ్ళ దాడిలో గాయపడ్డ రాకుమారులకు రాజవైద్యులు వైద్యం చేస్తున్నారు. ఇద్దరు అపరిచిత వీరులు తోడేళ్ళ మందను తరిమికొట్టారని వారు వచ్చినట్టు వచ్చి మాయమైపోయారని జనం చెప్పు కుంటున్నారు. యువరాణి మారువేషంలో వచ్చిన విషయం బయటకు పొక్కలేదు.
యువరాణి సహస్రదర్శినికి యువరాజు విజయుడిరూపం కళ్ళలో నిలిచిపోయినట్టనిపించింది.
ఎంత చక్కగా మాట్లాడాడు. అతని స్పర్శ తగలగానే తాను పులకించిపోయింది. అతనికి తన గురించి చెప్పాలనే కోరికను బలవంతాన అణుచుకుంది. ఆ మహావీరుడి మాటల్లో ఎంత అర్థముంది. ‘‘వీరత్వాన్ని చూసి కాకుండా.. మసును వ్యక్తిత్వాన్నిచూసి ప్రేమించాలట’’ ఔరా మహావీరా... ఎంత అద్భుతంగా చెప్పావ్.. ఆ మహావీరుడిని చూడవలెనన్న కోరిక బలపడింది.
తన వెనుక అడుగుశబ్దం వినిపించింది. చెలికత్తె చిన్మయి... ఎప్పుడు వచ్చిందో తననే గమనిస్తోంది కాబోలు...
‘‘ఏమిటే నావైపే అలా చూస్తున్నావ్... నాలో విశేషమేమైనా కనిపించిందా? అడిగింది సహస్రదర్శిని. చిన్మయితో యువరాణి చనువుగా ఉంటుంది.
‘‘అవును యువరాణి మీ మదిని ఎవరో కొల్లగొట్టినట్టు...’’అని ఆగింది. యువరాణి బుగ్గలు ఎరుపెక్కాయి.
‘‘నా మదిని కొల్లగొట్టినట్టా? తనలోతను గొణుక్కుంటున్నట్టు అనుకుంది యువరాణి.
‘‘అవును యువరాణివారు.. మానసచోరుడు... మారువేషంలో వచ్చిన మహాపురి వీరుడు... స్వయంవరానికి ముందే ఏ మదిలోనే పాణిగ్రహం జరిగినట్టు... ప్రభువులకు చెబితే తక్షణమే వివాహము జరిపిస్తారు... అప్పుడీ చెలికత్తె గుర్తుంటుందో...లేదో...’’ యువతిని మొహంలోకి చూస్తూ అంది.
‘‘అబ్బా ఆపవే... తర్జని చూపి సున్నితంగా ముద్దుగా మందలించింది.
అప్పుడే మహారాజు లోనికి ప్రవేశించారు.. భటులు బయట కాపలాగా వున్నారు.
‘‘తండ్రిగారికి ప్రణామములు’’ నమస్కరించి యువతిని సహస్రదర్శినికి చెలికత్తె చిన్మయి దూరంగావెళ్ళి నిలబడింది.
‘‘ఈ వార్త విన్నావాతల్లీ... రాత్రివేళ మన అజేయంలోకి ప్రవేశించిన మాయతోడేళ్ళను ఎవరో వీరులువచ్చి తరిమికొట్టారట... మన వేగుల చెప్పారు... చూస్తూ ఉండగానే అదృశ్యమైపోయారుట...స్వయం వరానికి వచ్చిన వీరులు తీవ్రగాయాల పాలయ్యేరు. రాజవైద్యులు ఉపశమనానికి ఔషధాలు వాడుతున్నారు...’’మహారాజు చెప్పాడు.
‘‘రాత్రి వచ్చిన వీరుల్లో ఒక వీరాధివీరుడు మహాపురి యువరాజు విజయుడు అని చెప్పాలన్న కోరికను అణుచుకుంది.
‘‘అలాఅయినచో ఆ వీరుడుకదా మీ అల్లుడు’’వెంటనే అంది తలొంచుకుని సహస్రదర్శిని.
‘‘కానీ ఆ వీరుడెవరో తెలియదు... అతను రాచబిడ్డో కాదో...’’
‘‘మన్నించాలి నాన్నగారు... స్వయంవరం వీరులకోసమే కాదు. వారి పదవులకు కాదుకదా.. అయిననూ ఆ వీరుడెవరో... ‘‘ఏమీ తెలియనట్టున్నది. అప్పుడే విజయుడి గురించి చెప్పాలనుకోలేదు. కోవెల చెప్పిన విజయుడు తన రాకను స్వీకరించకపోతే... తమకు ఆహ్వానం అందినది కాబట్టి మహాపురికి వెళ్ళి తన మానస చోరుడిని తనువు చూడాలనుకుంది.’’
‘‘ఒక ముఖ్యమైన విషయం తల్లీ రేపు మేము మహాపురికి బయల్దేరు తున్నాం. మహాపురి మహారాజావారి ఆహ్వానాన్ని పంపించారు. ఉదారములవారు... మునివర్యులు ఆస్థాన జ్యోతిష్యులు విచ్చేస్తున్నారుట.. పొరుగు రాజ్యాల్లో సంభవిస్తున్న విపరీత పరిణామాల కారణాలు విశదీకరిస్తారుట’’
‘‘నాన్నగారు నాదొక మనవి... నేను కూడా మహాపురికి వస్తాను... మన సామ్రాజ్యంలోనూ మహాపురిలోనూ మన పొరుగు రాజ్యాల్లో సంభవిస్తున్న వినాశాల వెనుక దుష్టశక్తులో... మాయలో వున్నాయి కదా... వాటి గురించి తెలుసుకోవాలన్న కోరిక వుంది.’’
కూతురు వంక చూసి ‘‘అలాగే తల్లీ ఈ రాజ్యానికి నువ్వే కాబోయే మహారాణివి... ప్రయాణానికి సిద్ధంగా వుండు’’అని చెప్పి వెనుతిరిగారు.
మహారాజు వెళ్లిపోగానే చిన్మయి యువరాణి దగ్గరికి వచ్చింది. దూరం నుంచే ఆ సంభాషణ విన్నది.
‘‘యువరాణివారు పెళ్ళికిముందే మెట్టినింటికి వెళ్తున్నారన్నమాట... కాదుకాదు ఉన్నమాట’’
అప్రయత్నంగా యువరాణి సహస్రదర్శిని బుగ్గలు ఎరుపెక్కాయి.
తన ప్రియవల్లభుడిని చూడబోతున్నారన్న ఆనందం యువరాణి మొహంలో ప్రస్ఫుటమయింది.
యువరాణి స్వయంవరానికి వచ్చిన రాకుమారులు తిరుగు పయనమయ్యారు. తమ ఓటమికి ఒప్పుకుంటూ... రథము సిద్ధమయింది. మహారాజు ప్రభాకరవర్మ యువరాణి సహస్రదర్శినితో కలిసి మహాపురికి బయల్దేరారు. ఆ రాజరథం వెనుకే చెలికత్తెలు అంగరక్షకులు బయల్దేరారు.
* * *
మహాపురి రాజ్యంలో రాజమందిరం మంత్రోచ్ఛరణలతో మారుమోగిపోయింది. మహాపురి మహారాజు ఆహ్వానంమేరకు పొరుగు రాజ్యాల రాజులు వచ్చారు. పొరుగురాజ్యాల రాజులలో ఎలాంటి పొరపొచ్చాలు లేవు. దానికి కారణం మహాపురి మహారాజు. రాజులంతా సఖ్యంగా ఉండాలని ఒకరికొకరు కలిసిమెలిసి పోవాలని అప్పుడే అన్ని రాజ్యాలు సుభిక్షంగా వుంటాయని చెప్పారు. మహారాజు మాటను అందరూ మన్నించారు. ఇప్పుడు ఈ విపత్కర పరిస్థితినుంచి మహాపురి మహారాజే తమని కాపాడగలరని వారి విశ్వాసం. పండితుల సలహామేరకు మహాయజ్ఞం జరుగుతుంది.
-సశేషం

- శ్రీ సుధామయి