డైలీ సీరియల్

జ్వాలాముఖి.. మంత్రాలదీవి-15

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కపిలారణ్యంలో తపస్సు చేసుకుంటున్న మునులు ఋషులు వచ్చారు.
సుధర్ములవారిని సకల రాచమర్యాదలతో వేదోచ్ఛారణల మధ్య సభామంటపానికి తోడ్కొని వచ్చారు.
విజయుడు విక్రముడు గురువుగారి పాదాలకు నమస్కరించారు.
మునులు ఋషులు తపోముద్రలో వున్నారు.
సుధర్ములవారు దివ్యదృష్టితో వీక్షిస్తున్నారు.. విశాలమైన సభా మంటపంలో రాజులువున్నారు. సుధర్ములు చెప్పబోయే విషయం గురించి అందరూ ఎదురుచూస్తున్నారు.
రాకుమారుడు విక్రముడు వెళ్లినరోజు జరిగిన ఉత్పాతాన్ని గుర్తుచేసుకున్నాడు సుధర్ములు.
***
సభామంటపంలో నిశ్శబ్దం ఇన్నాళ్లుగాప్రజల సుఖసంతోషాలను హరిస్తున్న మహమ్మారి మాయ ఏమిటో సుధర్ములువారు చెప్పే ఆ రహస్యాన్ని తెలుసుకోవాలనే ఉత్సుకత.
సుధర్ములు ఋషుల వంక మునివర్యుల వంక చూసారు. వాళ్ళు చేతిని చెప్పమన్నట్టుగా చూసారు. సుధర్ములు గొంతు విప్పారు.
***
ఇది మహామాయ... క్షుద్రమాయ... దుష్టమాంత్రికుడు వకృటాసురుడు ప్రపంచాన్ని జయించాలని, జ్వాలాముఖిదేవిని తన ఆధీనంలో ఉంచుకోవాలని చేస్తోన్న ప్రయత్నం.
మహారాజు సుధర్ములవారి వంక చూసారు. సుధర్ములవారు కొనసాగించారు.
‘‘మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే వకృటాసురుడు ఎవరో చెప్పాలి... వకృటాసురుడు ఒక క్షుద్రమంత్రికుడు... తపస్సుతో కొన్ని శక్తులను వశం చేసుకున్నాడు. మరణం లేనట్టి.. జీవితాన్ని కోరుకున్నాడు. ఆదిశక్తి పరాశక్తి జగన్మాత అసురులను సంహరించాక శాంతి స్వరూపిణిగా ఐంది. తన ఉగ్రరూపాన్ని జ్వాలాముఖిగా ప్రతిబింబంగా మిగిల్చింది.
కుంభాసురుడు అనే రాక్షసుడు ప్రజలను హింసించడం మొదలుపెట్టాడు.. మహాద్వీపంలోని ఉత్తరగుహలో సూక్ష్మరూపంలో వున్న జ్వాలాముఖి దేవిని భక్తులు ప్రార్థించారు... ఈ విషయం తెలుసుకున్న కుంభాసురుడు జ్వాలాముఖీదేవి వెలుపలికి వచ్చి తనను సంహరించకుండా ఉండేందుకు తన శక్తులతో గుహాద్వారాన్ని మూసివేయించి కినె్నర కింపురుష గంధర్వులను అణాశక్తులను బంధించి కాపలాగా పెట్టాడు.
జ్వాలాముఖిదేవి ఉగ్ర స్వరూపిణిగా మారింది. తనను అడ్డగించే శక్తులపై కనె్నర్ర చేసింది. రాక్షస మాయచేత బందీలైన కినె్నర కింపురుష గంధర్వులు జ్వాలాముఖిదేవి ఆగ్రహానికి శాపానికి గురయ్యారు. జ్వాలాముఖిదేవి ఉగ్రరూపాన్ని చూసి మహాద్వీపం వణికిపోయింది. కొండగుహ పైభాగాన్ని చీల్చుకుని జ్వాలాముఖిదేవి తల బయటకు వచ్చింది... తల భాగం గుహ వెలుపలికి వచ్చి ఆకాశంవైపు పెరుగుతూ వచ్చింది... వృత్తాకారంలో మహావేగంతో తిరుగుతూ ఆగ్రహజ్వాలలు వెదజల్లింది... నలుమూలలు జ్వాలలతో కుంభాసురుడిని చుట్టుముట్టాయి. అగ్నిదేవుడు జ్వాలాముఖిదేవి ముందు సాగిలపడ్డాడు... ప్రకృతి వణికిపోయినది... కుంభాసురుడు జ్వాలాముఖిదేవి జ్వాలాగ్రహాల్లో మాడిమసైపోయాడు. అయినా జ్వాలాముఖిదేవి అహరహం చల్లారలేదు... ఆ ఉగ్రరూపం అలానే ఉండిపోయింది.
రుతువులు మారాయి. ఆకులతో జ్వాలాముఖిదేవి శిరస్సును కప్పివేసినది భయంతో భీతిల్లిన ప్రకృతి... ఇది గడిచిన చాలాకాలానికి వకృటాసురుడు తపస్సుచేసి దుష్టశక్తులను తన వశంచేసుకున్నాడు. అయిననూ మరణంలేని జన్మ సువిశాల విశ్వాన్ని పాలించేశక్తి కావాలంటే సృష్టిలోని సమస్తశక్తులను తనలో లీనంచేసుకున్న, పరాశక్తి ఆత్మరూపమైన జ్వాలాముఖిదేవిని ప్రసన్నం చేసుకోవాలి. కానీ ఉగ్రరూపంలోవున్న జ్వాలాముఖిదేవి ప్రసన్నరూపంతో సూక్ష్మరూపంలోకి వచ్చినప్పుడే అది సాధ్యం... జ్వాలాముఖిదేవిని సూక్ష్మరూపంలోకి తీసుకురావటం అసాధ్యం అని తెలుసుకున్న వకృటాసురుడు జ్వాలాముఖిదేవికి సమస్త విశ్వాన్ని బలిఇచ్చి ఆమె ఆగ్రహజ్వాలలు ఉపసంహరించేలాచేసి ఆమెను ప్రసన్నం చేసుకుని తనకు కావలసిన వరాలను పొందాలని నిర్ణయించుకున్నాడు.
ఆ కారణంచేత జ్వాలాముఖిదేవి కొలువైనచోటునుంచి కనుచూపుమేరలో వున్న అన్ని రాజ్యాలను స్మశానాలుగా మార్చాలనుకున్నాడు. తన క్షుద్రమాయల చేత విధ్వంసాన్ని సృష్టిస్తున్నాడు...’’
అందరూ ఊపిరిబిగపట్టి సుధర్ములవారు చెప్పేది వింటున్నారు.
మరి దీనికి పరిష్కారంలేదా గురువర్యా? అడిగాడు మహాపురి మహారాజు
‘‘ఉంది మహారాజా...కానీ అది మిక్కిలి సాహసంతో కూడుకున్నది’’ సుధర్ములు చెప్పారు.
‘‘మనమంతా ఐకమత్యంగా వకృటాసురుడిని ఎదురిద్దాం... మన సైన్యంతో దండెత్తుదాం’’ ప్రభాకరవర్మ చెప్పాడు మిగతా రాజ్యాల రాజులు కూడా ముక్తకంఠంతో సై అన్నారు.
సుధర్ములవారు గంభీరంగా చెప్పారు.
‘‘వకృటాసురుడిని బలంతో ఎదుర్కోవడం సాధ్యంకాదు.. అతని దగ్గర ఎన్నోశక్తులు వున్నవి భుజబలం బుద్ధిబలం సంకల్పసిద్ధి. అస్తహ్రస్త్ర విద్యల్లో ఆరితేరి అతడిని ఎదుర్కొనే వీరుడివల్లనే సాధ్యం.
అలాంటి మహావీరుడు ఎక్కడున్నాడు. ఎవరు ఈ సాహసాన్ని చేయగలిగే మహాప్రతాపశాలి? అందరూ గుసగుసలాడుకున్నారు.
‘‘గురువర్యులు మహాతపస్సు శక్తివంతులైన ఋషులు మునివర్యులు మా తండ్రిగారు అనుమతిస్తే నేను వెళ్తాను. ‘‘కరువళ్ళని చూసి వినయంగా అప్పుడు సభామంటపం మధ్యభాగంలోకి వచ్చి సభాసదులు హర్షధ్వానాలు చేసారు. మహారాజు కాసింత ఆందోళనగా చూసాడు.
అదే సభామంటపములో వున్న యువరాణి సహస్రదర్శిని సభామంటపంలో నిలబడి శౌర్యప్రతాపాలతో మాట్లాడుతున్న విజయుడి వంక చూసింది.
అప్రయత్నంగా ఆమె మనసు ఆనంద డోలికల్లో తేలియాడింది.
***
వివిధ రాజ్యాలనుంచి వచ్చిన రాజులు కూడా తమ హర్షామోదాలను తెలియజేసారు. మహాపురి మహారాజు సుధర్ముల చెంతకువెళ్లి ‘‘ముక్కుపచ్చలారని నా బిడ్డ అతథాశక్తివంతుడు మాయలమారి అయిన ఆ క్షుద్ర మాంత్రికుడిని ఎదుర్కొనగలడా? ఒక్కగానొక్క బిడ్డ. మీరు అనుమతిస్తే నేను వెళ్తాను’’ అన్నాడు.
సుధాములవారు చిన్నగా నవ్వి ‘‘తాటకి సంహారానికి రామచంద్రుడిని పంపించమని విశ్వామిత్రులవారు అడిగినప్పుడు దశరథుడు కూడా మీలాగే ఆందోళన చెందాడు.. మీకు మీ బిడ్డ ఇంకా పసివాడుగా కనిపిస్తారు

-సశేషం

- శ్రీ సుధామయి