Others

వేదాలలో వైజ్ఞానిక విశేషాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భూమి వయస్సు
మనం నివశిస్తున్న ఈ భూమి వయస్సెంత?
ఈ ప్రశ్నకు సమాధానం చెప్పుకోవాలంటే, మనం పూర్వం చెప్పుకొన్న కొన్ని విషయాలను పునరుక్తి చేయక తప్పదు. ఐనా వీలైనంత తక్కువ పునరుక్తితో మనం ముందుకు సాగుదాం.
భూమి వయస్సును ఆధునిక శాస్తజ్ఞ్రులు సుమారుగా 200 కోట్ల సంవత్సరాలు అని చెబుతున్నారు.
మన నిత్య సంకల్పంలో- అద్యబ్రహ్మణః ద్వితీ పరార్థే శే్వత వరాహ కల్పే- వైవస్వత మన్వంతరే అష్టావింశతి తమే మహాయుగే- కలియుగే- అని చెపుతున్నాము. ఈలెక్కకు అర్థమేమిటి?
మన సాంప్రదాయిక పంచాంగాలు తీసి చూస్తే ‘సృష్ట్యాది గతాబ్దాః’ అని ఒక మాట వుంటుంది.
మహాకల్పంలో: చతుర్ముఖ బ్రహ్మణః ఏక పంచాశద్వత్సరే, ప్రథమ మాసే, ప్రథమ పక్షే, ప్రథమ దివసే, అహని, ద్వితీయ యామే, తృతీయ ముహూర్త, ప్రథమ ప్రణవకాలే, శే్వత వరాహ కల్పే, వైవస్వత మన్వంతరే, సప్తవింశతి మహాయుగేషు గతేషు- అష్టవంశతి తమ మహాయుగే- కలియుగే ప్రథమ పాదే అని చెపుతున్నారు. అది క్రీ.శ.2012 నాటికి 195 కోట్ల 58 లక్షల 85 వేల 113 సంత్సరాలు. ఇవి పౌర సంవత్సరాలు. ఈ సంఖ్య వీరికెలా వచ్చింది?
దివ్యైర్వర్ష సహస్రైర్ద్వా - దశభిర్దైవతం యుగమ్
360 మానవ సంవత్సరాలు న12,000 = 43,20,000 = చతుర్యుగి = దేవయుగం
ఇలాంటి చతుర్యుగాలు 71 కలిస్తే ఒక మన్వంతరం.
చతుర్యుగి న71 = 43,20,000ప71 = 30 కోట్ల 67 లక్షల 20వేలు = 30,67,20,000
‘మన్వంతరం తు దివ్యానాం యుగానామేక సప్తతిః’
ఒక మన్వంతరం గడిచాక సంధికాలం వుంటుంది. అది ఒక కృతయుగానికి సమం. ఇప్పటికి ఆరు (6) మన్వంతరాలు గడిచాయి. ఆ మన్వంతర సంధులు కూడా వేసుకుంటే- ఇప్పటి భూమి వయస్సు 195 కోట్లు చిల్లరకు వస్దో. ఈ నాటి వైజ్ఞానికులు అనేక గణనలు చేసి దీన్ని ఈనాడు 200 కోట్లుగా (సుమారు) చేసి చెపుతున్నారు.
ఇంతకూ, కల్పాలు, మన్వంతరాలు, యుగాలు- ఇవన్నీ ఎలా వచ్చాయి?
అణుకాలం - అణుదేశం
ఒక్క అణువు యొక్క నిడివిని అణుదేశం అనుకుంటే, ఒక అణువు మరో అణువును దాటటానికి పట్టే కాలం పేరు అణు కాలం. కాగా మన మహర్షుల లెక్కలో దేశకాలాలు రెండూ ఒకే బీజం నుంచి మొలిచిన రెండు మొక్కల వంటివి. ఆశ్చర్యకరంగా, అత్యంత అధునాతనమైన ఐన్‌స్టీనియన్ కానె్సప్టులు, దేశకాలాల అభిన్నత్వాన్ని అంగీకరిస్తున్నయనే విషయాన్ని మనం గమనించాలి.
కాలమనగా- సృష్టిలో రెండు వస్తువులనుండి కనీసం వాటిలో ఒకదానికైనా చలనము ఉంటే ఆ చలనాన్ని సంఘటన లేక సన్నివేశము అని పిలుస్తున్నారు. అలాంటి సన్నివేశాలు కనీసం రెండు వుంటే, వాటిలో వెనుకది ఏదో, తరువాతిది ఏదో నిర్ణయించే ప్రమాణము పేరు కాలము. వెనుక ముందులను నిర్ణయించటం మాత్రమే కాక, ఎంత వెనుక, ఎంత ముందు అని కొలిచే కొలత పేరు కూడా కాలమే.
ఈ సృష్టికి ముందు పరమాత్మ ‘ఏకమేవా ద్వితీయం’గా ఉన్న సన్నివేశంలో కాలానికి తావు లేదు. ఆ పరమాత్మలో సృష్టి జరగాలని సంకల్పం కలగటం, సృష్టి మొదలవటం, కాలం మొదలవటం ఈ మూడూ ఒకే క్షణంలో సంభవిస్తాయి. అందువల్ల కాలమనేది ఎప్పుడు మొదలయినదో దానిని కాలంలో కొలచి చెప్పటం సాధ్యం కాదు.
సృష్టి ఎపుడు మొదలయినదో అప్పటినుంచి కాలాన్ని కొలిచేందుకు సావకాశమున్నది. మహాత్ములైన మన మహర్షులు కాలాన్ని అప్పటి నుండే కొలిచారు. ఒక సృష్టికి- ప్రళయానికి మధ్యగల కాల వ్యవధికి ‘బ్రహ్మాయువు’ అని పేరు పెట్టారు. దానిని కొలిచేదెలా?
దానిని కొలిచేందుకు అనేక మార్గాలుండవచ్చు. భూమిపైన నివశిస్తున్న మనకు సూర్య గమనం ద్వారా కాలాన్ని కొలవటమే సులువు. అందుకే మన మహర్షులు ఆ కొలతనే తీసుకుని సృష్టి మొదటి దాకా కాలాన్ని కొలిచే విద్యను మనకు నేర్పారు.

--ఇంకావుంది...

--కుప్పా వేంకట కృష్ణమూర్తి