డైలీ సీరియల్

జ్వాలాముఖి.. మంత్రాలదీవి-16

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహారాజా... కానీ ఇజాతుడు సర్వశక్తిమంతుడు... యుక్తిపరుడు... వకృటాసురుడ్ని ఎదుర్కోగల శక్తిమంతుడు... కారణజన్ముడు’’ విజయుడివైపు చూసి చెప్పాడు.
విజయుడు సుధాముల పాదాలకు నమస్కరించాడు.
విక్రముడు కూడా ముందుకు వచ్చి ‘‘గురుదేవా నాకూ అనుజ్ఞ ఇవ్వండి, నా మిత్రుడితోపాటు నేనూవెళ్తాను...’’అంటూ వినయంగా నిలబడ్డాడు.
వెంటనే విక్రముడిని వారిస్తూ విజయుడు ‘‘వద్దు మిత్రమా.. మా రాజ్యంలోనే కాదు మన మిత్ర రాజ్యాల్లోనూ జరుగుతున్న విపరీతాలను మాయాశక్తులను ఎదుర్కోవడానికి నువ్వు అండగా ఇక్కడే ఉండాలి... ప్రజాక్షేమం బాధ్యత నీకు అప్పగిస్తున్నాను.. ఇక ఆ దుష్టమాంత్రికుడి అంతు నేను తేలుస్తాను’’ చెప్పాడు.
సుధర్ములవారు విక్రముడువైపు చూసి ‘‘నీ మిత్రుడి చెప్పినది నిజం.’’ అని విజయుడి వైపు తిరిగి ‘‘నాయనా విజయా.. మాయతోడేళ్ళనుగానీ మాంత్రికుడి మాయనుకానీ ఎదుర్కోవాలంటే పులిరాజు తోడు కావాలి. అత్యుత్తమ జాతి అయిన పులికి మాయరూపంలో వున్న జంతువులు గోచరిస్తాయి. దేవుడు సృష్టించిన పులిని మాంత్రికుడి మాలో రూపుమార్చుకున్న ఏ ప్రాణీ ఎదురించలేదు. మీ రాజ్యానికి కాదు.. అన్ని రాజ్యాలకు పులిని కాపలాగా పెట్టగలవా? అంతా తెలిసే అడిగారు సుధర్ములు.
వెంటనే విజయుడికి పులిరాజు ఇచ్చిన వాగ్దానం గుర్తుకు వచ్చింది.
‘‘అవస్యం గురువర్యా... మీ ఆశ్రమంనుంచి వస్తోన్న సమయంలో నాకు పులిమిత్రుడు ఎదురయ్యాడు. మాట్లాడే శక్తివున్న పులిమిత్రుడు మాట ఇచ్చాడు’’ అంటూ జరిగిన వృత్తాంతాన్ని చెప్పాడు.
అంతా విన్న గురుదేవుడు ‘‘శుభమ్ వెంటనే నీ పులిమిత్రుడిని రప్పించు’’ అన్నారు.
ఆరోజే నడిరేయి విజయుడు మంత్రాల దీవికి వెళ్లి వకృటాసురుడిని సంహరించి జ్వాలాముఖిని ప్రసన్నం చేసుకుని సూక్ష్మరూపంలోకి తీసుకువచ్చి ఆ గుహలోనో శాంతి స్వరూపిణిగా ప్రతిష్టించాలని నిర్ణయించుకున్నాడు.
పులిని పిలుచుకురావడానికి రాయంచ చిలుక అడవికి వెళ్ళింది.
పొరుగురాజ్యాల రాజులకు ఏర్పాటుచేసిన విడిదిలో తన ప్రత్యేక మందిరంలో యువరాణి సహస్రదర్శిని అటుఇటు పచార్లుచేస్తుంది. ఆమె మనోమందిరంలో విజయుడు కనిపిస్తున్నాడు.
* * *
సహస్రదర్శిని విజయుడి ఆలోచనలోపడి తన వెనుక నిలబడివున్న చెలికత్తెను గమనించలేదు.
‘‘యువరాణీవారు దీర్ఘాలోచనలో ఉన్నారు. పరధ్యానంలో ఉన్నారా... హృదయ వల్లభుడి ధ్యానంలో ఉన్నారా? చెలికత్తె మాటలతో ఈ లోకంలోకి వచ్చింది. చిరుకోపంగా చూసింది.
‘చిరుకోపాలు నాకు చిరుమందహాసాలు కాబోయే ప్రభువులవారికీ... అంతా గమనిస్తూనే వున్నాను’’ చెలికత్తె మాటలతో ఫక్కున నవ్వి...
‘‘అదికాదులే...అన్నట్టు నీకో ముఖ్య విషయం చెప్పాలి. రహస్యం’’ గొంతు తగ్గించి చెప్పింది యువరాణి.
‘‘చెప్పండి మీరు చెప్పే ఏ విషయమూ నా పెదవి దాటదు’’అంది చెలికత్తె.
‘‘యువరాజు విజయులతోపాటు మేమూ మంత్రాలదీవికి వేళ్దామని అనుకుంటున్నాం... నాన్నగారికి ఇప్పుడే చెబితే ఆటంకపరుస్తారు.. నెమ్మదిగా మన రాజ్యానికి వెళ్ళాక ఈ విషయాన్ని ప్రభువుల చెవిన వేయాలి’’ అంది
‘‘నేనా. ప్రభువులవారు ఆగ్రహిస్తే..’’్భయంతో కళ్ళు పెద్దవిచేసి అంది.
‘‘నేను లేఖ రాసి ఇస్తాను... దానిని తర్వాత నాన్నగారికి ఇవ్వు... నీకు మాట రానిస్తానా?
‘‘నాకో సందేహం.. అడగమంటారా?
‘అడుగు’ అన్నట్టు చూసింది యువరాణి.
‘ఈ సాహసం వెనుక కారణం తెలుసుకోవచ్చా?
యువరాణి సహస్రదర్శిని బుగ్గలు ఎరుపెక్కాయి.
‘‘నా మనోవల్లభుడి సాహసాలు కనులారా చూద్దామని... నాకు చేతనైన సాయం చేద్దామని... అర్థం పరమార్థము దాగివున్నాయిలే’’ నవ్వుతూ చెప్పింది యువరాణి.
* * *
సంధ్య చీకట్లు ముసరకముందే మహాపురి పురవీధుల్లో అద్భుత దృశ్యం గోచరించింది. మహాపురిలోకి పులిరాజు వస్తున్నాడు... పులిమీద స్వారీచేస్తున్నట్టు రాయంచ చిలుక. కొందరు పౌరులు భయంతో పరుగెత్తారు.. పిల్లలు ఏడ్పులంకించుకున్నారు. పులి మాత్రం ఎవరికీ ఎటువంటి హానిచేయకుండా కోటలోకి ప్రవేశించింది. కోట పైభాగం నుంచి ఈ దృశ్యాన్ని చూసిన మహారాజు సైతం ఆశ్చర్యానికి లోనయ్యాడు.
రాజదర్బార్‌లోకి రాజసంగా ప్రవేశించింది పులి. యువరాణి సహస్రదర్శిని సైతం ఆశ్చర్యానికి లోనైంది. పులి సరాసరి సుధర్ములవారి దగ్గరికి వచ్చి వారి పాదాలను తలతో తాకింది.
సుధర్ములు కళ్ళుమూసుకుని ‘‘శాపవిమోచనం ప్రాప్తిరస్తు’’ అని మనసులో అనుకుని కళ్ళుతెరిచి..
‘‘నీతో మహాపురి వాసులకు ఇతర రాజ్యాలకూ పనిబడింది. యువరాజు విజయుడు తిరిగివచ్చేవరకూ, విక్రముడికి తోడుగానేకాదు... ఈ రాజ్యానికి కాపలాగా ఉండాలి. మాయా జంతువులను పసిగట్టి వాటిని తరిమివేయాలి. ఇది నీవల్ల మాత్రమే సాధ్యమవుతుంది’’అంటూ పులి తలమీద చేయిపెట్టి చెప్పాడు.
‘‘గురుదేవుల ఆజ్ఞ శిరసావహిస్తాను. నా మిత్రుడికి ఇచ్చిన మాట నెరవేరుస్తాను’’ పులి అంది.
విజయుడి ముందుకు వచ్చి.
‘‘పులి మిత్రమా మీకు మహాపురి స్వాగతం పలుకుతుంది. నీవు మా అతిథివి మాత్రమేకాదు... మాకు సాయంచేసే నేస్తానివి కూడా.. ముందు మా ప్రజల భయాన్ని పోగొట్టు మిత్రమా’’ అన్నాడు.
సభాసదులు ప్రజలు ఈ వింతను విప్పారిత నేత్రాలతో చూస్తున్నారు.
పులి సభాసదులవైపు ప్రజలవైపు చూసి ‘‘మిత్రులాలా... ఆ దేవుడి దృష్టిలో సృష్టిలో మీరు మానవులు మేము జంతువులం అంతే తప్ప భేదభావం లేదు. నేను మీ మిత్రుడిని... నన్ను మీ మిత్రుడిగా భావించండి’’అంది. మాట్లాడే పులిని చూసి విస్తుపోయారు ప్రజలు. సభాసదులనుంచి ఒక వ్యక్తి భయపడుతూ పులిదగ్గరికి వచ్చాడు. పులి ఆ యువకుడి పక్కనే నిలబడిన ఆ యువకుడు ధైర్యంచేసి పులి తలమీద చేయివేసాడు. పులి ఈమారు కూడా ఏమనలేదు. పైగా తన పంజాతో కరచాలనం చేసింది.

-సశేషం

- శ్రీ సుధామయి