Others

వేదాలలో వైజ్ఞానిక విశేషాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యుని చుట్టూ భూమి తిరుగుతున్నదన్నా లేక భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నాడన్నా లేక ఇద్దరూ ఒకరి చుట్టూ ఒకరు తిరుగుతున్నారన్నా కాలగణనానికి కావలసినది వాటి మధ్యలోగల సాపేక్ష వేగము మాత్రమే. అందువల్లే మన మహర్షులు మన నిత్యానుభవమునకు సన్నిహితముగా ఉంటుందనే దృష్టితో, భూమి చుట్టూ సూర్యుడు తిరుగుగతున్నాడనుకుని ఆ సాపేక్ష వేగాన్ని లెక్కలోకి తీసుకుని ఒకసారి సూర్యుడు భూమి చుట్టూ తిరగటానికి పట్టే కాలానికి ‘సంవత్సరము’ అని పేరు పెట్టారు. దీన్ని చిన్న విభాగాలుగా చేస్తే రోజులు, పక్షాలు, నెలలు, వంటి కొలతలు వస్తాయి. వీటిని మానవులు వాడుకుంటారు. దాన్ని పెంచుకుంటూ పోతే, అనగా ఈ మానవ సంవత్సరాన్ని ప్రమాణంగా (యూనిట్) తీసుకుని దానిని పెంచుకుంటూపోతే, ‘బ్రహ్మాయువు’ను లెక్క కట్టవచ్చు.
మానవునికి వాని కాలమానము ప్రకారము సగటున వందేళ్ళు ఆయుష్యము ఉన్నట్టే బ్రహ్మదేవునకు కూడా ఆయన కాలమానములో వందేళ్లు ఆయుష్షు వున్నది. దానిలో ప్రస్తుతము బ్రహ్మ పదవిలో వున్న ఆయనకు యాభై సంవత్సరాలు గడిచి యాభై ఒకటవ సంవత్సరంలో మొదటి రోజు నడుస్తున్నది.
బ్రహ్మదేవుడి జీవితంలో ఆయన కాలమానము ప్రకారం జరిగే ఒక్క రోజుకు ‘కల్పం’ అని పేరు. మానవుడి కాలమన ప్రకారం అది 432,00,00,000 అంటే 432 కోట్ల మానవ సంవత్సరాలు అవుతుంది. దీనిని గుర్తుపెట్టుకోవటానికి 4, 3, 2 అంకెలు గుర్తుపెట్టుకుంటే చాలు. పక్కన ఏడు సున్నాలు వేస్తే అది కల్పకాలమవుతుంది.
మనకు వారానికి ఏడు రోజులు ఉన్నట్లే బ్రహ్మదేవునికి ఏడు కల్పాలు వున్నాయి. వాటిపేర్లు. 1.పార్థివ కల్పము 2.కూర్మకల్పము 3.శే్వత వరాసకల్పము 4.సావిత్రీ కల్పము 5.ప్రళయకల్పము 6.విరాహకల్పము 7.బ్రహ్మకల్పము. వీటిలో ఇపుడు శే్వత వరాహ కల్పము నడుస్తోంది. ఈ కల్పాన్ని 14 మన్వంతరాలుగా విభజించారు. వాటి పేర్లు- 1.స్వాయంభువము 2.స్వారోచిషము 3.త్తమము, 4.తామసము 5.రైవతము 6.చాక్షుషము 7.వైవస్వతము 8.సూర్య సావర్ణికము 9.దక్షసావర్ణికము 10.బ్రహ్మసావర్ణికము 11.్ధర్మసావర్ణికము 12.రుద్రసావర్ణికము 13.దేవసావర్ణికము 14.ఇంద్రసావర్ణికము. వీటిలో ఇపుడు ఏడవదైన వైవస్వత మన్వంతరము నడుస్తోంది. ఈ పేర్లు శబ్ద కల్పధ్రుమం నుంచి స్వీకరింపబడినాయి.
వరాహమిహిరుడు చెప్పిన భూకంప లక్షణాలు
క్రీ.శ. ఆరవ శతాబ్దానికి చెందిన, విరాహమిహిరుడిచే రచింపబడిన బృహత్సంహితలో, భూకంపాల గురించి ఈ విధంగా వర్ణింపబడి వుంది. ఈ పద్ధతి ప్రకారం ఒక రోజుని నాలుగు భాగాలుగా విభజించి, ఒక్కొక్క భాగానికి ఒక్కొక్క అధిదేవతని ప్రతిపాదించి, రోజులో భూకంపం వచ్చే సమయాన్నిబట్టి, ఆయా భాగాన్ని అనుసరించి, భూకంపాలను కూడా నాలుగు రకాలుగా పేర్కొన్నారు.
కాగా, భూకంప లక్షణాలను విశే్లషించడానికి పరిగణనలోకి తీసుకోవలసిన విషయాలు ఎనిమిది అని వారన్నారు. అవి ఏవంటే-
1. రోజులోని భాగము
2. ఆ భాగానికి గల అధిదేవత
3. ఆ దేవతకి ప్రతిపాదింపబడిన నక్షత్రాలు
4. భూకంపం సంభవించడానికి ఒక వారంరోజుల ముందు వచ్చే మార్పులు
5. జనంపై కలిగే ప్రభావము
6. ఏయే ప్రాంతాలు ప్రభావితం కావచ్చో ఆ వివరాలు
7. భూకంపం సంభవించిన తరువాత, దాని ప్రభావం వుండే కాలము
8. అది ప్రభావితం చేసే వైశాల్యము
వారు చెప్పిన నాలుగు రకాల భూకంపాలు ఈ విధంగా ఉన్నాయి.

--ఇంకావుంది...

--కుప్పా వేంకట కృష్ణమూర్తి