డైలీ సీరియల్

వేదాలలో వైజ్ఞానిక విశేషాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాయుమండల భూకంపం
ఇది రోజులోని మొదటి భాగంలో వస్తుంది. దీనికి వాయుదేవుడు అధిదేవత. ఉత్తర ఫల్గుని, హస్త, చిత్త, స్వాతి, పునర్వసు, మృగశిర, అశ్విని దీనికి సంబంధించిన నక్షత్రాలు
చత్వార్యార్యమ్ణాద్యని ఆదిత్యం మృగశిరో శ్వయుక్ చేతి
మండల మేత ద్వాయవ్యస్య రూపాణి సప్తాహాత్
అంటే దిన ప్రథమ భాగంలో, ఈ నక్షత్రాల్లో భూకంపం వస్తే, అపుడు ఆ కంపానికి వాయువు కారణమని చెప్పబడుతుంది.
ఈ రకమైన భూకంపం సంభవించడానికి కొద్ది రోజుల ముందునుంచే బలమైన గాలులు వీస్తూ, రోజంతా చిత్ర విచిత్రమైన పొగలు దట్టంగా వ్యాప్తి చెందుతాయి. ఆ గాలుల తాకిడికి వృక్షాలు కూకటివేళ్ళతో సహా పెకలించబడతాయి. అడవులు, పంట పొలాలు నాశనవౌతాయి. వీటి వనరులు తగ్గుతాయి. సూర్యకాంతి మందగిస్తుంది. మనుష్యులలో అంటువ్యాధులు ప్రబలి, ఊపిరితిత్తుల, గొంతు సంబంధ వ్యాధులు ఎక్కువౌతాయి. కొన్ని సందర్భాలలో, మతిభ్రమణం కూడా కనిపించవచ్చు.
వైశ్యులు, వ్యాపారులు, క్షత్రియులు, వైద్యులు, మహిళలు, కళాకారులు ఎక్కువగా ప్రభావితమవుతారు. ఇది ఎక్కువగా ప్రభావితం చేసే ప్రాంతాలు సౌరాష్ట్ర (గుజరాత్), కురు (్ఢల్లీ ప్రాంతం), మగధ (బీహార్), దశార్ణ (హర్యానా- హిమాచల ప్రదేశాల తూర్పు సరిహద్దులలో - హిమాలయ పాద ప్రాంతాలు), మత్స్య (మధుర దక్షిణభాగం), దీని ప్రభావం రెండు నెలల వరకు, 200 యోజనాల మేర ఉంటుంది.
అగ్ని మండల భూకంపం
ఇది రోజులోని ద్వితీయార్థంలో వస్తుంది. దీనికి అగ్ని అధిదేవత. పుష్యమి, కృత్తిక, విశాఖ, భరణి, మఖ, పూర్వాభాద్ర, పూర్వఫల్గుని నక్షత్రాలు దీనికి సంబంధించినవి.
పుష్యాగ్నేయ విశాఖా భరణీ పిత్య్రాజ భాగ్య సంజ్ఞాని
వర్గో హౌతభుజోయం కరోతి రూపాణి అథైతాని
ఇది సంభవించడానికి ముందు, ఆకాశమంతా అగ్నిగుండంలా వెలుగుతూ వుంటుంది. ఉల్కాపాతాలతో ఆకాశమంతా నిండి వుంటుంది. బలమైన గాలులతో కూడుకున్న కార్చిచ్చులు రగుల్కొంటాయి. వాతావరణంలో వేడి విపరీతంగా పెరిగి, మబ్బులు తగ్గి జలసంపద క్షీణిస్తుంది. ఇది సంభవించడానికి సుమారు ఒక వారం ముందునుంచే మనుష్యులలో విషజ్వరాల వంటి అంటు రోగాలు వస్తాయి. రాజ్యపాలనపరమైన సమస్యలు కూడా ఎదురౌతాయి. ఇది ఎక్కువగా ప్రభావితం చేసే ప్రాంతాలు అశ్మక (మహారాష్ట్ర), అంగ (బీహార్), బాలిక, తంగన, వంగ (బెంగాల్), ద్రవిడ (తమిళనాడు). ఈ భూకంపం ప్రభావం 45 రోజుల వరకు, 110 యోజనాల వరకు విస్తరించి ఉంటుంది.
ఇంద్ర మండల భూకంపం
ఇది రాత్రిలోని మొదటి భాగంలో వస్తుంది. ఇంద్రుడు దీనికి అధిదేవత. అభిజిత్, శ్రవణం, ధనిష్ఠ, రోహిణి, జ్యేష్ఠ, ఉత్తరాషాఢ, అనురాధ దీని నక్షత్రాలు.
అభిజిత్ శ్రవణం ధనిష్ఠా ప్రాజాపత్యేన్ద్ర వైశ్య మైత్రాణి
సురపతి మండల మేతత్ భవన్తి చాప్యస్య రూపాణి
ఈ భూకంపానికి రెండు వారాల ముందునుంచే పర్వత ప్రమాణమైన మబ్బులు ఉరుములు, మెరుపులతో కూడి వస్తాయి. తూనీగల సమూహాలు గుంపుల గుంపులుగా తిరుగుతాయి. జంతువులు వింతగా ప్రవర్తిస్తాయి. మనుష్యులలో గొంతు, నోటి సంబంధిత అంటు వ్యాధులు, నీళ్ళ విరేచనాలు వంటి అనారోగ్యాలు అధికవౌతాయి. సాధారణంగా ఈ రకమైన వ్యాధి లక్షణాలు ఉత్తరాయణంలో ఎక్కువగా కనిపిస్తాయి (ప్రస్తుత శాస్త్ర పరిశోధనలు ఈ మార్పులు నిజమని ధ్రువీకరించాయి).
ఉన్నత కుటుంబాలకు చెందిన పురుషులకు ఈ భూకంపంవల్ల హాని వాటిల్లుతుంది. ఇది వచ్చిన తరువాత, ఆయా ప్రాంతాలలో మంచి మార్పులు చెప్పుకోదగ్గ రీతిలో కానవస్తాయి. వర్షపాతం పెరిగి జలవనరులు వృద్ధి చెందుతాయి. ఇది సాధారణంగా సంభవించే ప్రాంతాలు కాశి, యుగంధర (కురుక్షేత్ర), పౌరవ (గుజరాత్, ఝీలమ్ నదీ ప్రాంతాలు), అర్బుద (వౌంట్ అబు), సౌరాష్ట్ర (గుజరాత్), మాలవ దేశాలు (మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ల సంధి).
ఇది 108 యోజనాల విస్తీర్ణంలో, 7 రోజుల వరకు ప్రభావితం చేస్తుంది.

--ఇంకావుంది...

--కుప్పా వేంకట కృష్ణమూర్తి