డైలీ సీరియల్

జ్వాలాముఖి... మంత్రాలదీవి -- 17

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ యువకుడు సంతోషపడిపోయాడు.
ప్రజల్లో ఒక మహిళా చేతిలో ముద్దులొలికే బాబు వున్నాడు. గుక్కపెట్టి ఏడుస్తున్నాడు. పులి ఆ తల్లి దగ్గరికివెళ్లి ‘‘అమ్మా మీకు అభ్యంతరం లేకపోతే మీ బిడ్డను నా వీపుమీద కూచోబెట్టండి. మీ బిడ్డ ఏడుపు మానిపించే పూచీనాది’ అంది.
ఆ తల్లి భయం భయంగా సుధర్ములవైపు చూసింది.
‘‘్భయం లేదు’’ అన్నట్టు అభయహస్తం చూపించారు సుధర్ములు.
విజయుడు ఆ తల్లి దగ్గరికి వెళ్లి ‘‘మహాపురి యువరాజుగా మీకు మాట ఇస్తున్నాను. మీ బిడ్డను నా మిత్రుడు ఏమీచేయడు. నన్ను నమ్మండి’’ అన్నాడు.
ఆ బిడ్డను తన వీపుమీద కూచోబెట్టుకుని ఆ సభామందిరం మొత్తం తిప్పింది. అల్లరి రాయంచ ఆ బిడ్డ భుజం మీద వాలింది.
పులి మీద బిడ్డ... బిడ్డ భుజం మీద రాయంచ.. ఆ దృశ్యం మహాపురి వాసులకు కన్నుల పండువుగా వుంది. అప్పటివరకూ గుక్కపట్టి ఏడ్చిన బిడ్డ ఏడుపు మానివేసాడు. కిలకిలా నవ్వుతున్నాడు.
ఈరోజునుంచి పులి మీకు రక్షా... విక్రముడు మిమ్మల్ని కనిపెట్టుకు వుంటాడు... విజయుడు మంత్రాల దీవికి వెళ్లి వకృటాసురుడిని సంహరించి, జ్వాలాముఖీదేవి ప్రసన్న సూక్ష్మరూప విగ్రహాన్ని గుహలో ప్రతిష్టించి విజయుడై తిరిగి వస్తాడు.
విజయుడు తిరిగి వచ్చేవరకు మీరు ఆలయాల్లో పూజలు జరిపించండి. చాముండీదేవిని పూజించండి.. మీకు రక్ష... సుధర్ములు చెప్పారు...
తిరిగి విజయుడి వైపు చూసి నడిరేయి దాటక ముందే ‘‘రాజ్యం పొలిమేర దాటాలి...’’ అని చెప్పాడు.
విజయుడు వినయంగా తల వంచి ‘‘చిత్తం గురుదేవా... నన్ను ఆశీర్వదించండి’’ అంటూ గురువుగారి పాదాలకు నమస్కరించాడు.
‘‘విజయోస్తు.. విజయుడిపై తిరిగిరా... నీ సాహసం పృథ్విలో యవస్సుగా మిగిలిపోతుంది’’ అన్నాడు. ఋషులు మునివర్యులు ఆశీర్వదించారు.
* * *
చీకట్లు ముసురుకున్నాయి. విజయుడు కోటపైభాగాన వున్నాడు. భక్తిశ్రద్ధలతో పూజచేసి మంత్రాలదీవికి వెళ్లడానికి సిద్ధంగా వున్నాడు. మంత్రాలదీవికి వెళ్లేముందు రాజ్యం పొలిమేరలు దాటేవరకు చేతికి రక్తం అంటకూడదని సుధర్ములు సెలవిచ్చారు...
ఈ రాత్రి తమ రాజ్యంమీద తోడేళ్ళు దాడిచేస్తాయా? పులి మిత్రుడు చేసే సాహసాలు విక్రముడి తెగింపు చూడాలి. తాను మంత్రాలదీవికి వెళ్లినా తన రాజ్యం తాను వచ్చేవరకు ప్రశాంతంగా ఉంటుందన్న భావనతో తాను వెళ్ళాలి. మదినిండా ఏవేవో ఆలోచనలు. అతని ఆలోచనలు అలా సాగుతుండగానే ఒక్కసారిగా కలకలం. యువరాజు విజయుడి వీరత్వం కట్టలు తెంచుకుంటుంది.
రాజభవనములో ప్రమాద ఘంటికలు మోగించారు పుర ప్రజలు వెలుపలికి రాకూడదని.
ఈ ఏర్పాటు చేయించింది విజయుడే. ప్రమాదం తెలియక బయటకువస్తే ప్రమాదం పొంచి ఉంటే ప్రమాదమే కదా.. పొలిమేరల్లో ఏదో అలజడి... ఆ వార్త వేగులద్వారా చేరిన వెంటనే విక్రముడు కదనరంగంలోకి దిగాడు.
పులి పురవీధుల్లోకి వచ్చింది. పెద్దగాలి దుమారం... పెద్దపెద్ద ధ్వనులు... వింతైన ధ్వనులు. విక్రముడు కరవాలాన్ని పైకెత్తాడు.. పులి లంఘించడానికి సిద్ధంగావుంది. ఒక్కసారిగా పదుల సంఖ్యలో తోడేళ్ళు... ఉత్తరంవైపునుంచి వింత జంతువులు...
సుశిక్షితులైన సైనికులు కత్తులుదూశారు. గురుదేవుడి ఆజ్ఞకు కట్టుబడి కట్టలు తెంచుకుంటోన్న ఆవేశాన్ని అణుచుకున్నాడు విజయుడు.
విక్రముడి కరవాలం గాలిని చీలుస్తుంది. గురుదేవుడు మంత్రించి ఇచ్చిన కరవాలం...
తోడేళ్ళ తలలను వేరు చేస్తున్నాయి. అంతలోనే అవి తిరిగి ఒకటిగా అతుక్కుంటున్నాయి...
పులి గాల్లోకి లేచింది... మొదటిసారి తన కళ్ళను తనే నమ్మలేకపోతున్నారు విజయుడు. పులి రెండింతలుగా మారింది.. దాని గాండ్రింపునకు తోడేళ్ళు ఒక్కసారిగా బెదిరిపోయాయి. పులి కళ్ళకు తోడేళ్ళ నిజరూపాలు కనిపిస్తున్నాయి. వాటిని క్షుద్రశక్తులుగా గుర్తిస్తుంది పులి... తన నోటిని తెరిచింది. పులి బలం ముందు మాయా జంతువుల బలం నిలవడం లేదు.
మరోపక్క విక్రముడు శక్తివంచన లేకుండా మాయ జంతువులను సంహరిస్తూనే వున్నాడు. అయినా అవి బ్రతుకుతూనే వున్నాయి.
ఒక్కసారిగా రాయంచ చిలుక విక్రముడి భుజంమీద వాలింది. కరవాలం గాల్లోకి ఎత్తబోయిన విక్రముడు ఆగాడు. రాయంచ విక్రముడి చెవి దగ్గరికి వెళ్లి.
‘ఒకేసారి వరుసగా మూడుసార్లు తోడేళ్ళ తలలు ఒకే వేటుతో నరికివేయాలి. అప్పుడు ఆ తోడేళ్ళు తిరిగి బ్రతకవు’’ అని చెప్పింది.
విక్రముడు మనసులో గురుదేవుడిని స్మరించి కరవాలాన్ని పైకెత్తి అవిశ్రాంతంగా నరకడం మొదలుపెట్టాడు..
తెగిన తోడేళ్ల తలలు అతుక్కునే లోపే కరవాలంతో తోడేళ్ళ శిరస్సును తిరిగి నరికి వేస్తున్నాడు.
మరోవైపు పులి ఉత్తరంవైపునుంచి వచ్చిన వింత జంతువులను చీల్చి చెండాడింది. పులినోటికి చిక్కిన జంతువులు గాల్లోనే అదృశ్యమవుతున్నాయి ఆర్తనాదాలు చేస్తూ...
సరిగా అప్పుడే విజయుడికి ఓ దృశ్యం కనిపించింది. ఒక నూనూగు మీసాల యువకుడు కరవాలంతో తోడేళ్ళను ఎదుర్కొంటున్నాడు. ఒక తోడేలు యువకుడి మీదకి వచ్చింది. ఆ కంగారులో ఆ యువకుడి కరవాలం నేల జారింది. ఆ నూనూగుమీసాల యువకుడిని ఎక్కడో చూసినట్టు అనిపించింది. అప్పుడు స్ఫురణకు వచ్చింది. కోసల రాజ్యంలో చూసిన యువకుడు.. తమ రాజ్యానికి వచ్చి తమ ప్రజలకోసం... తాను చేసిన సాయానికి ఈ విధంగా రుణం తీర్చుకుంటున్నాడా?
ఇంకా అంతకుమించి ఆలోచించలేకపోయాడు. ఆలస్యమైతే ఆ యువకుడి ప్రాణాలు తోడేలుకు బలైతాయి. కింకర్తవ్యము.
‘‘అతని మస్తిష్కం, చురుగ్గా పనిచేస్తుంది. కోట బురుజులో అలంకారంగావున్న అతిపెద్ద కరవాలం... దాన్ని లాగి గురిచూసి ఆ యువకుడు వున్నవైపు విసిరి వాయుదేవుడిని మనసారా ప్రార్థించాడు.
ఆ కరవాలం గాల్లో ప్రయాణించింది. చేతిలోనుంచి జారిపడిన కరవాలాన్ని కిందకి వంగి తీసుకునే వ్యవధి లేదు. చేయి గాల్లోనే వుంది. తోడేలు మీదికి దుమకబోతుంది. అప్పుడే విజయుడు విసిరిన కరవాలం యువకుడి వేషంలోవున్న యువరాణి సహస్రదర్శినిని చేరింది. లిప్తకాలం ఆశ్చర్యం... ఆ వెంటనే తేరుకుని ఆ కరవాలాన్ని అందుకుని తోడేలు శిరస్సును మొండంనుంచి వేరుచేసింది. ఆ శిరస్సు తిరిగి అతుక్కునేలోపే పులి ఆ శిరస్సును నోటకరుచుకుని పొలిమేరల బయటకు గిరాటువేసింది.

- శ్రీ సుధామయి