డైలీ సీరియల్

వేదాలలో వైజ్ఞానిక విశేషాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరుణ మండల భూకంపం
ఇది రాత్రిలోని ద్వితీయార్థంలో వస్తుంది. వరుణుడు దీనికి అధిదేవత. రేవతి, పూర్వాషాడ, ఆర్ద్ర, ఆశే్లష, మూల, ఉత్తరాభాద్ర, శతభిషం దీనికి సంబంధించిన నక్షత్రాలు.
పౌష్ణా ప్యార్ద్ర శే్లషా మూలా హిర్బున్ధ్య వరుణ దేవాని
మండల మేతత్ వారుణ మస్యాపి భవన్తి రూపాణి
ఒక వారం ముందునుంచే ఈ భూకంపానికి సంకేతాలుగా విచిత్రమైన మెరుపులు వస్తాయి. తూనీగల్లాంటి కీటకాలు గుంపులు గుంపులుగా తిరుగుతాయి. మబ్బులు నీలి రంగులో ఉండి, ఆహ్లాదకరమైన సన్నపాటి జల్లులు కురిపిస్తాయి.
దీనివల్ల సముద్రయానం చేసేవారికి ప్రమాదం. ఇది పంజాబ్, బుందేల్‌ఖండ్ (మధ్యప్రదేశ్ ఉత్తరభాగం), కుక్కుర (రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాలు), కిరాత (అస్సాం), విదిశ (మధ్యప్రదేశ్) ప్రాంతాలను తత్‌క్షణం ప్రభావితం చేస్తుంది.
ఈ విషయాలే కాకుండా, భూమికి ఉత్తరం వైపు వాలు ఉండడంవల్ల భూకంపాలు ఉత్తరార్ధ భాగాన ఎక్కువగానూ, తరచూ వస్తూ ఉంటాయని వరాహమిహరుడు చెప్పాడు. ఈ విషయాలు 80 శాతం నిజమని చరిత్ర నిరూపిస్తోంది.
భూకంపాల అధ్యయనం విషయంలో అధునాత పద్ధతులకు, వరాహ మిహిరాదుల పురాతన పద్ధతులకు, గణనీయమైన విభేదాలున్నప్పటికీ, ఇప్పటికీ 1500 సంవత్సరాలకు వెనుకే మన దేశంలో భూకంపాల పరిశీలనలు బహు గంభీరంగా మాత్రమేగాక, అత్యంత క్రమబద్ధంగా జరిగాయనటానికి రుూ వరాహమిహిరుడి వ్రాతలే చాలు. భూకంపాలకు కేంద్ర బిందువు వుంటుందనీ, ఆ కేంద్రం నుంచీ ప్రకంపనలు 200 యోజనాల దాకా, అంటే సుమారు 1800 మైళ్లదాకా వ్యాపించే సావకాశంవుంటుందనీ, ఆ ప్రకంపనలు ఒకేసారిగా గాక వారం రోజులకు పైబడి విడతలవారీగా వస్తాయనీ వారు గుర్తించి గ్రంథస్థం చేస్తున్నారంటే, వారి పరిశీలన సామర్థ్యాన్ని తక్కువగా అంచనా వేసే వీలు లేదు. రవాణా సౌకర్యాలే లేని ఆ రోజులలో వారు అంత దూర తీరాలలో భూకంపాల ప్రభావాలను ఎలా నమోదు చేసుకోగలిగారనేది ఒక పెద్ద ప్రశ్న. అదీగాక, ఆనాడు వారు ఉదహరించిన నగరాలకు,ప్రాంతాలకు, ఈనాటి పేర్లేమిటో నిర్ణయించటం ఒక పెద్ద సమస్య. దీనికి తోడు వరాహమిహిరాదులు ఉట్టంకించిన పూర్వ గ్రంథాలలో ఒక్కటీ ఈనాడు లభ్యం కాకపోవడం మరో సమస్య. ఏది ఏమైనప్పటికీ, ఆనాటి వారి పరిశీలనలో ఖగోళాంశాలు ప్రధాన భాగంలో నిలిచాయి. అధునాతన పరిశీలనలో వాటికి స్థానమే లేదు. ఇది గాక, భూకంపాలను విభజించిన వాయు, అగ్ని, ఇంద్ర, వరుణ పదాలకు ఆనాటి వారి దృష్టిలోగల వైజ్ఞానిక అంతరార్థాలను కూడా అవగతం చేసుకోగలిగితే గానీ, వారి పరిశీలనను మనం డీకోడ్ చేసినట్లు కాదు. ఆ డీకోడింగ్ జరిగితే, వరాహమిహిరుడు ‘బృహత్సంహిత’లో పేర్కొన్న భూకంపానికి, వ్యవసాయానికి, మొక్కల పెంపకానికి, జలవనరుల రక్షణకి సంబంధించిన అనేక విషయాలు ఈనాటికీ ఉపయోగకరం కావచ్చు. ఈ గ్రంథానికి శాస్తజ్ఞ్రులు తగిన ప్రాముఖ్యం ఇవ్వడం జరిగితే ఎంతో ప్రయోజనకరంగా వుంటుంది.
గణిత శాస్తమ్రు
ఎక్కడ ఎప్పుడు గణితశాస్త్రం వికసిస్తుందో అక్కడ, అప్పుడు భౌతిక విజ్ఞాన శాస్త్రాలన్నీ వికసిస్తాయి. ఇది చరిత్ర నిరూపించిన సత్యం. కాబట్టి ఒకానొక దేశంలో, ఒకానొక సమయంలో, వివిధ విజ్ఞాన శాఖల వికాసం ఏ స్థాయిలో వున్నదో తెలుసుకోవాలంటే, అప్పటి గణితశాస్త్ర వికాస స్థాయిని తెలుసుకుంటే చాలు. దానిని బట్టి మిగిలినవి మనం ఊహించవచ్చు.
ఏ దేశంలో అయినా సరే, గణిత శాస్త్రం అంకెలతో మొదలవుతుంది. ఎంత పెద్ద అంకెలను తయారు చేయగలిగితే, గణితశాస్త్రం అంత పెద్దగా పెరుగుతున్నట్లు లెక్క.
ప్రొఫెసర్ డాక్టర్ సి.హెచ్.వాన్ పండితుడు గ్లింప్లెస్ ఆఫ్ ది హిస్టరీ ఆఫ్ మేథమేటిక్స్ (గణితశాస్త్ర లఘు చరిత్ర) అనే గ్రంథం వ్రాశాడు. దానిలో ఆయన ఇలా చెప్పాడు.
‘‘గ్రీకు భాషలో అతి పెద్ద అంకె 10,000 (కూజ్ఘజూ) అంతకంటే పెద్ద అంకెల గణనం ఈ రోజుల్లో వున్న దాఖలాలు లేవు. 287 బి.సి నాటి ఆర్కిమెడిస్ క్యాలిక్యులేషన్ ఆఫ్ సౌండ్ (ఇసుకరేణు గణనం) అనే గ్రంథం రచించాడు. ఈ గ్రంథంలో ఆయన పదివేల అంకెకు పైన కూడికలలు చేసే విధానాలను నిర్మించడానికి కృషిచేశాడు.

--ఇంకావుంది...

--కుప్పా వేంకట కృష్ణమూర్తి