డైలీ సీరియల్

జ్వాలాముఖి.. మంత్రాలదీవి-19

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆకాశంలో వెనె్నల పహారా కాస్తున్నది, విజయుడు చెట్టుకింద నిద్రిస్తున్నాడు. వెనె్నల వెలుగు విజయుడి మీద పడి నిండు చంద్రుడిలా గోచరిస్తున్నాడు.
రాయంచను అనుసరిస్తూ వచ్చిన అశ్వం ఆ చెట్టుదగ్గరికి రాగానే ఆగిపోయింది. పంచకల్యాణి యువరాణి సాహసాదేవి అధిరోహించిన అశ్వంని చూసింది. అది గమనించిన రాయంచ పంచకల్యాణి దగ్గరికి వెళ్లి ‘‘మిత్రమా మన యువరాజుపై మారులుపోయి, మనసును ఇచ్చేసుకున్నది చిన్నది... యువరాణి సహస్రదర్శిని...’’ అని చెప్పింది.
పంచకల్యాణి బోధపడినది అన్నట్టు సకిలించకుండా వౌనం వహించింది.
అశ్వం దిగి యువరాణి సహస్రదర్శిని విజయుడిని చేరింది. నిండు పున్నమి చంద్రుడిలా వున్న అతని మోమును చూస్తూ అలాగే ఉండిపోయింది.
యువరాణీవారు... చూపులతో ఆకలి తీరదు... మీకోసం మధురఫలాలు అదిగో ఆ వృక్షం దగ్గర వున్నవి... ముందు ఆకలి తీర్చుకొనండి!... మరో చిన్న విన్నపం ఈ రేయి యువరాజు వారికీ మీరే కాపలా... వీరికి నిద్రాభంగం కాకుండా చేసుకొనుట మీ కర్తవ్యం...
మనసులోనే రాయంచకు కృతజ్ఞతలు చెప్పుకుంది. తన మనసైన వాడి దగ్గర గడిపే అద్భుత అవకాశం ‘‘ఇదిగో పంచకల్యాణీ... యువరాణివారి అశ్వరాజమా మీరలా చల్లగాలికి విహరించండి.. లేదా విశ్రమించండి.. మీకు మళ్ళీ విశ్రాంతి దొరికే అవకాశం ఎప్పుడు కలుగుతుందో’’ చెప్పింది రాయంచ.
రాయంచ అలా చల్లగాలితో ముచ్చటిస్తూ ఆకాశ విహారం చేస్తోంది.
పంచకల్యాణి, యువరాణి సహస్రదర్శిని అశ్వం రెండూ దాహార్తి తీర్చుకోవడానికి సరస్సు దగ్గరికి వెళ్లాయి.
* * *
ఆ అడవిలోకి ప్రవేశించాడు ఒక చోరుడు. బాటసారులను భయపెట్టి వారి నగలు వారిదగ్గర వున్న వరహాలు దోచుకుంటూ ఉంటాడు. అతనికి కంటికి చెట్టుకింద విశ్రమిస్తున్న విజయుడి మీద పడింది. అపుడే అలా చెట్టు చాటుకు వెళ్లి తన దుస్తులను సరిచేసుకుంటుంది యువరాణి. యువరాజు విజయుడు తనను గుర్తించకుండా పలు జాగరూకతలు తీసుకుంటుంది.
ఒరలో కరవాలాన్ని తీసి చూసుకుంది. ఆపద సమయంలో తనను కాపాడే కరవాలం...
చెట్టుచాటునుంచి వచ్చే సమయానికి చోరుడు విజయుడిని సమీపించాడు.
నిద్రాభంగం చేయకుండా ఆభరణాలు తస్కరించాలని చోరుడి పథకం. ఏమాత్రం ప్రమాదం ఎదురైనా ఎదుర్కోవడానికి అతడి చేతిలో పిడిబాకు వుంది.
విజయుడిని సమీపించి అతడి కంఠంలోవున్న హారాన్ని దొంగిలించాలని కిందికి వంగాడు.
అప్పుడే యువరాణి సహస్రదర్శిని ప్రమాదాన్ని పసిగట్టి ఆ చోరుడిని ఎదుర్కొన్నది.
ఊహించని ఈ పరిణామాన్ని చూసి బిత్తరపోయిన చోరుడు తెగించాడు. పిడిబాకుతో విజయుడి మీద దాడి చేయబోయాడు. సహస్రదర్శిని కోపంతో ఊగిపోయినది. తన ప్రియ వల్లభుడి శరీరంలో పిడిబాకు దిగితే సహించగలదా...?
కావాలని మెరుపువేగంతో తిప్పింది. కేవలం భయపెట్టి చిన్నచిన్న దారిదోపిడీలు చేసే ఆ చోరుడికి ఖడ్గవిద్యలో ప్రావీణ్యం వున్న యువరాణి సహస్రదర్శినిని ఎదుర్కోవడం అసాధ్యం అని అర్థమయింది.
చీమ చిటుక్కుమన్నా నిద్రలేచే విజయుడు కళ్ళుతెరిచాడు. చివరి ప్రయత్నంగా విజయుడి మీద దాడిచేయబోయిన చోరుడు విజయుడు కళ్ళు తెరిచేసరికి భయపడిపోయారు. అప్పటికే యువరాణి సహస్రదర్శిని విజయుడిని కాపాడే ప్రయత్నంలో విజయుడికి అడ్డుగా నిలిచింది.
విజయుడి శరీరాన్ని గాయం చేయవలసిన పిడిబాకు సహస్రదర్శిని భుజాన్ని గాయం చేసింది.
చోరుడు భయంతో పారిపోయాడు.
* * *
యువరాజు విజయుడు ఆకు పసరుతో గాయానికి మందు వేస్తానన్నాడు. యువరాణి వినయంగా ‘‘చిన్న గాయమే కదా యువరాజా’’ అంది ఆమె భయం ఆమెది. తనను ఎక్కడ గుర్తిస్తాడోనన్న భయం ‘‘అసలు నువ్వుక్కడికి ఎలా వచ్చావు. ఆరోజు కొసలార్జ్యంలో తటస్థపడ్డావు... మహాపురిలో మాయతోడేళ్లతో పోరాడి మాకు ఉపకారం చేసావ్. ఇప్పుడిలా మా వెంటపడి వచ్చావ్. చూస్తే నూనూగు మీసాల యువకుడివి.. మా వెంట రావడానికి కారణమేమిటి? యువకుడి వేషంలోవున్న సహస్రదర్శినిని అడిగాడు. ‘‘మీలాంటి మహావీరుడితో సాహచర్యం చేస్తే నా వీరత్వానికి ఒక అర్థం ఉంటుంది. అని రాజ్యాలు సుఖసంతోషాలతో వుండాలని ఒంటరిగా ఆ మాంత్రికుడిని ఎదుర్కోవడానికి వెళ్తున్నారు... ఉడుత సాయం చేయకూడదా వీరకుమారా? పురుష స్వరాన్ని అనుకరిస్తూ అన్నది యువరాణి.
‘‘్భషైన ఆలోచనే... ప్రశస్తమైన నిర్ణయమే.. కానీ ఇది బలప్రదర్శనకాదు. ప్రమాదాలతో చెలగాటం. నీమీదే ప్రాణాలు పెట్టుకున్న నీ తల్లిదండ్రులకు ఎరుకచేసి వచ్చి ఉండవు... వెనుతిరిగి వెళ్ళు’’ అనునయంగా చెప్పాడు విజయుడు.
-సశేషం

- శ్రీ సుధామయి