డైలీ సీరియల్

జ్వాలాముఖి... మంత్రాల దీవి--20

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అప్పుడే రాయంచ ఏమీఎరగనట్టు వచ్చింది. వస్తూనే ‘‘ఈ నూనూగు మీసాల యువకుడు ఎవరు మిత్రమా? అని అడిగినది. యువరాణి సహస్రదర్శిని చిన్నగా నవ్వుకున్నది.
కోసల రాజ్యపు పౌరుడు... నాతోపాటు మంత్రాల దీవికి వస్తాడట.. నువ్వైనా చెప్పు’’అని యువరాణి వైపు తిరిగి ‘‘నా మిత్రుడు’’అని పరిచయం చేసాడు.
‘‘నేనేమీ చెప్పగలను యువరాజా... మీరూ మీరూ చూసుకునుడు... అయినా మీకుతోడు వుండిన బావుండును కదా? రాయంచ అన్నది.
విజయుడు యువరాణివైపు చూసి ఒక్క క్షణం తల విదిలించి...
‘‘ఈ రాత్రి విశ్రమిద్దాం... రేపు ఉదయం ఆలోచిద్దాం.. ప్రయాణ బడలిక తీర్చుకో మిత్రమా... ఆకలిగా వున్నచో ఆ వృక్షందగ్గర ఫలములు వున్నవి’’ విజయుడు చెప్పాడు.
‘‘తెలుసు తెలుసు’’ అన్నది యువరాణి.
‘‘తెలుసునా... ఎటుల?’’
యువరాణి వెంటనే కంగారుపడిపోయి... ‘‘ఊహించాను’’అన్నది.
విజయుడు నిద్రలోకి జారుకున్నాడు... రాయంచ వైపు చూసి మనసులోనే మరోమారు కృతజ్ఞతలు తెలుపుకున్నది యువరాణి.
* * *
యువరాజు విజయుడు కళ్ళు తెరిచాడు. ఓసారి చుట్టూ పరికించి చూసాడు. దట్టమైన అడవిలో క్రూర జంతువుల ప్రమాదం పొంచి ఉంటుంది.
రాయంచ దగ్గరలోవున్న జామచెట్టుమీద నిద్రపోతుంది. అశ్వాలు విశ్రమిస్తున్నాయి. యువకుడి వేషంలో వున్న యువరాణి దగ్గరికి వెళ్ళాడు... మొహానికి వస్త్రం అడ్డుగా వున్నది.
ఆ మోములో చంద్రబింబం కనిపిస్తున్నది. ఆ యువకుడు యువకుడు అనే విషయం నమ్మలేకపోతున్నాడు. ఆ శరీరాన్ని అప్రయత్నంగా స్పృశించినప్పుడు ఒక అద్భుతమైన పరిమళం... ఆ పరిమళం పారిజాత వృక్షంకన్నా మిన్ననా? గులాబీ రేకుల వంటి పెదవులు... అతని ఆలోచనలు మధురోహలను ఆహ్వానిస్తున్నవి.
ఒక్క క్షణం తల విదిల్చాడు. తను ఇలా ఆలోచిస్తున్నాడేమిటి? విజయుడిలో చిన్నపాటి పశ్చాత్తాపం. రాయంచ వాస్తవానికి నిద్రలో లేదు.. యువరాజు తన మిత్రుడు పడుతున్న సంఘర్షణ గమనించింది.
తగిన సమయం ఆసన్నమైనది. ఇలాంటి సంఘర్షణకు లోనవ్వడం ఈ సమయంలో సమయోచితం కాదు. తన మిత్రుడి శంకను తొలగించాలి.
యువరాణి సహస్రదర్శినికి ఇచ్చిన మాట తప్పకుండా...
రాయంచ రివ్వున గాల్లోకి ఎగిరింది. యువరాణిని సమీపించింది... యువరాణి శరీరానికి ఆచ్ఛాదనగా వున్న వస్త్రాన్ని తన చిలుక ముక్కుతో తొలిగించినది.
యువరాణి సంపూర్ణ సౌందర్యం వెనె్నల వెలుగులో ప్రతిఫలిస్తుంది. మన్మధుడికే చక్కిలిగిలి పుట్టించే మేని సొబగులు ప్రకృతితో పోటీపడుతున్నవి.
ఆమె మనోదర్పణంలో వున్న విజయుడు స్వప్నంలో కనిపించి గిలిగింతలు పెట్టినట్టు కిలికించితాలు సృజించినట్టు.. కోటి మన్మధ వీణలు శతకోటి సరాగాల శృంగార భావనలను రాగాలుగా ఆలపించినట్టు.. ఎదలయ లయబద్ధంగా వినిపిస్తున్నది.
యువరాణిని పురుషుడిగా భావించి పక్కనే విశ్రమిద్దామని వచ్చిన విజయుడికి ఒకేసారి రెండు వెనె్నలలను చూసిన భ్రాంతి కలిగినది.
ఏక కాలంలో వెనె్నల ఉండగానే తన పక్కనే ఉన్న ఈ వెనె్నల ఎవరు?
యువరాణి సహస్రదర్శిని సౌందర్యం కోటి వెనె్నలల సమానమైనది.
* * *
విజయుడి మనసులో కిలికించితాల కలవరం... అదీ కొన్ని ఘడియలు.... కర్తవ్యం విజయుడిలోని వీరుడికి మార్గాన్ని నిర్ధేశించింది. మెల్లిమెల్లిగా ఒక్కో విషయం అవగతమవుతుంది. యువరాణి సహస్రదర్శిని తనను కోరుకుంటుంది. పట్టమహిషి కావాలనుకుంటుంది. యువరాణి కోరికతో లవలేస్యమైనను తప్పిదం లేదు.. కానీ ఇది సమయంకాదు.. తనతోపాటు తీసుకువెళ్లడం అంటే ప్రమాదానికి చేరువచేయడమే..
యువరాజు విజయుడు ఒక నిర్ణయానికి వచ్చాడు..
దూరంగా ఒక కొలను కనిపిస్తున్నది. అక్కడికి వెళ్ళాడు. ఒక తామరాకును సుతారంగా చేతిలోకి తీసుకున్నాడు. యువరాణి సహస్రదర్శిని ముఖారవిందంలా వుంది తామరాకు... తామరాకు మీద నీటి చందాన అన్న నానుడికి సరిపోయేలా పట్టుకుంటే.. ముట్టుకుంటే జారిపోయేలా వున్న సహస్రదర్శిని సౌందర్యాన్ని, అంతకుమించి ఆమె వ్యక్తిత్వాన్ని గుర్తుకు చేసుకున్నాడు. ఒరలో ఓ పక్కనవున్న పచ్చల పిడిబాకును తీసాడు. బాకు మొనతో తన మనసులోని భావాలను ప్రణయ కూజితాలను చెక్కుతున్నాడు.
‘‘యువరాణి సహస్రదర్శినికి. మీరు మారువేషంలో వచ్చి నా మనసును తస్కరించారు. మీలాంటి వ్యక్తిత్వం, ధైర్యం, అనురాగం వున్న సౌందర్యరాశిని వదిలివేసి వెళ్తున్నందుకు మన్నించండి. ఈ ఎడబాటు మన కలయికకు సహచరి. ప్రమాదపు అంచుకు మిమ్మలను తీసుకువెళ్లడం భావ్యము కాదు. మీలాంటి సాహస సౌందర్యరాశి. కోసలరాజ్యానికి మహాపురికి అవసరం.. అక్కడ మాయ జంతువుల విధ్వంసాన్ని ఎదుర్కోవడానికి మీరు భాగస్వాములు కావాలి.
గురుదేవులు అప్పగించిన పనిని పూర్తిచేసుకుని వకృటాసురుడిని సంహరించి, జ్వాలాముఖిదేవిని ప్రసన్నం చేసుకుని విజయుడిని, సార్థక నామధేయుడినై... తిరిగి వస్తాను.
అప్పటివరకూ మన రాజ్యాలు ప్రశాంతంగా ఉండేలా చూసుకునే బాధ్యత మీమీద కూడా వున్నది. నామీద గౌరవంతో, ప్రేమతో తిరిగి వెళ్తారని, నా మాటను మన్నిస్తారని భావిస్తున్నాను.
నీకు మనసైనవాడు...

-సశేషం

- శ్రీ సుధామయి