డైలీ సీరియల్

జ్వాలాముఖి...మంత్రాలదీవి--21

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తన స్వహస్తాలతో రాసిన ఆ లేఖను యువరాణి సహస్రదర్శిని తలకింద పెట్టాడు. రాయంచ ఇదంతా గమనిస్తూనే వున్నది. ఒక్క క్షణం తన మానసచోరిణి వంక చూసి కిందికి వంగి ‘ఆమె విశాలమైన నుదురుమీద కురులను పక్కకు జరిపి చుంబించాడు.’
ఇది పరిణయానికి ముందు నా ప్రేమ కానుక.
ఆ దృశ్యాన్ని చూసిన రాయంచ తల తిప్పుకున్నది. వారి ప్రేమ తాలూకు స్వచ్ఛత అన్యోన్యత చూసి ఆనందపునిట్టూర్పు విడిచింది.
విజయుడు యువరాణి అధిరోహించి వచ్చిన అశ్వంవైపు చూసి ‘అశ్వరాజమా... యువరాణి సహస్రదేవిని మీ రాజ్యానికి క్షేమంగా తీసుకువెళ్లవలసిన బాధ్యత నీదే సుమా’ అన్నాడు దాని తలమీద చేయివేసి.
ఆ అశ్వరాజం అంగీకార సూచకంగా తలను నిలువుగా ఆడించింది.
తాను వెంటనే ఇక్కడినుంచి బయల్దేరాలి. యువరాణి నిద్రలేస్తే తన వెంట వస్తానని మారాంచేయవచ్చు. విజయుడు మరోసారి యువరాణి వంక చూసాడు. అనంతరం రాయంచ వైపుచూసాడు. విజయుడి చూపులను గ్రహించిన రాయంచ వచ్చి అతని భుజాలమీద వాలింది.
‘‘మిత్రమా... చూసావా యువరాణి సహస్రదర్శిని సాహసం... నన్ను వెన్నంటి వచ్చినది. ప్రమాదపు అంచులలోకి యువరాణిని తీసుకువెళ్ళుట భావ్యంకాదు. అందుకే బాధ కలిగినా కఠిన నిర్ణయం తీసుకొనక తప్పలేదు... యువరాణి ఈ అడవి సరిహద్దుదాటేవరకూ నువ్వు ఓ కంట కనిపెట్టు... అడవి దాటిన ఉత్తరక్షణం నువ్వు తిరిగి వచ్చేయ్...’’అని చెప్పాడు.
‘‘సంతోషం మిత్రమా.. ప్రేయసి మనసు తెలుసుకున్నావు. తన రక్షణ ఆకాంక్షించావు... నిశ్చింతగా నువ్వు ముందుకువెళ్ళు.. నేను యువరాణి ఈ అడవి సరిహద్దు దాటేవరకూ వుంది.. అడవి దాటించి నిన్ను చేరుకుంటాను’’ అన్నది.
విజయుడు సంతృప్తిగా తలాడించి.. మరొక్కమారు సహస్రదర్శినిణి కనులారా చూసి ఎందుకు కదిలాడు. పంచకల్యాణి విజయుడి తీసుకుని ముందుకు కదిలింది.
* * *
ఒక్కసారిగా ఆ మహావృక్షం కూకటివేళ్లతో ఎవరో పెకిలించినట్టు ఊగిపోయినది.. పెద్ద వికటాట్టహాసం.. ఆ మహావృక్షాన్ని చీల్చుకుని బయటకు వచ్చాడు కపాలకుండ. ఒక్కసారిగా రెండుగా చీలిపోయిన ఆ మహావృక్షం తిరిగి ఒక్కటిగా అతుక్కుంది.. నిలువెత్తు బలిష్టమైన దేహం... మేడలో కపాలమాల... చేతిలో కపాలదండం.. భయానకమైన రూపం. అతను అడుగులు వేస్తుంటే భూమి కంపిస్తున్నది. ముక్కును ఎగబీలుస్తూ ముందుకు అడుగులువేస్తున్నాడు. అతని పాదాలకు అడ్డుగా వచ్చింది ఒక కాలసర్పం... పొడవాటి బలమైన సర్పం. దాని కోరలు మొనదేలి వున్నాయి. ఆ సర్పం కపాలకుండ కాలుకు చుట్టుకుంది. తన కాలుకు అడ్డుగా చుట్టుకున్న ఆ సర్పాన్ని చూసి కోపోద్రిక్తుడయ్యాడు కపాలకుండ.. ‘‘ఎంత అహంకారమే.. ఈ కపాలకుండ అడుగులకే అడ్డుపడుతావా... చూడు నినే్నం చేస్తానో’’ అంటూ ఆ సర్పాన్ని చేతిలోకి తీసుకున్నాడు. ఆ సర్పం తన వాడిఅయిన కోరలను కపాలకుండ శరీరంలోకి దించింది.
మరుక్షణం కపాలకుండ దేహం నీలివర్ణంలోకి మారింది. ఒళ్ళంతా విషం నిండినది. నోట్లోనుంచి నురుగు... అతి ప్రమాదకరమైన పాషాణం అతని శరీరంలోకి ప్రవేశించినది.
ఒక్క క్షణం కపాలకుండ కళ్ళు ఎర్రబడ్డాయి. రక్తపువర్ణాన్ని పులుముకున్నాయి. ‘‘ఓసీ సర్పమా... నేను వకృటాసురుడి చేతిలోని మహాశక్తిని కపాలకుండుడిని... ననే్న నీ పాషాణంతో హతమార్చాలని చూస్తావా... చూడు నినే్నం చేస్తానో’’అంటూ ఆ సర్పాన్ని చేతుల్లోకి తీసుకుని తన చేతిలోకల దండాన్ని ఆ సర్పం చుట్టూ తిప్పి ‘‘గాలిలో వేలాడుతూ అగ్నికీలల్లో మాడిపోతూ వుండు’’అని గాల్లోకి విసిరేసాడు.
ఆ సర్పం గాల్లో వేలాడుతూ ఉండిపోయింది. నేలమీద అగ్నికీలలు సర్పాన్ని తాకుతున్నాయి.
‘‘కపాలకుండా నా అపరాధం మన్నించు... నీ శక్తి తెలియక పొరపాటు చేశాను. ఈ క్షణంనుంచి నేను నీ బానిసను. నువ్వు చెప్పినట్టు చేస్తాను. ఈ అగ్నికీలలు బాధనుంచి నన్ను విముక్తం చేయి’అని వేడుకుందాం కపాలకుండ ఒక్క క్షణం యోచించి... సరే? నాతోపాటు రా... నేను చెప్పినట్టు వినాలి. లేదా నీకు అగ్నికీలల్లో దహనం తప్పదు’’ హెచ్చరించి తన చేతిలోని కపాలదండాన్ని గాల్లోకి తిప్పాడు. సర్పం నేలమీద పడింది. అగ్నికీలలు అదృశ్యమయ్యాయి.
* * *
యువరాణి సహస్రదర్శిని బద్ధకంగా ఒళ్ళువిరుచుకుని కళ్ళుతెరిచి చూసి కంగారుపడినది. విజయుడు లేదు.. పంచకల్యాణి కనిపించడం లేదు.. తన చేతికి తామరాకు తగిలింది. కొలనులో వుండవలసిన తామరాకు ఇక్కడికి ఎలా వచ్చినది? అని యోచిస్తూ ఉండగానే తామరాకుమీద విజయుడు రాసిన అక్షరాలు కనిపించాయి. ఆ లేఖను చదువుతుంటే గుండె లయ తప్పినట్టు అనిపించింది.
సంతోషం బాధ రెండూ ఒకేసారి కలిగాయి.
యువరాజు విజయుడు తన మనసులోని ప్రణయ భావాన్ని గ్రహించి తనను కరుణించినందుకు సంతోషం కలుగుతూనే వున్నా..
తన మనసైన వాడితో కలిసి వెళ్ళకపోవడం బాధగానే అనిపించింది.
తన ప్రియవల్లభుడి మాట తనకు శిలాశాసనం.
అతని అంతరంగాన్ని శిరసా వహించాలి.
అప్పుడే రాయంచ అక్కడికి వచ్చి రాత్రి జరిగిన విశేషాలు అన్నీ వివరంగా చెప్పినది.
యువరాజు నుదురుమీద పెట్టిన అదర చుంబనంతో సహా. యువరాణి బుగ్గలు ఎరుపెక్కాయి.
‘‘సమయం లేదు యువరాణి.. మిమ్మల్ని ఈ అడవి సరిహద్దులు దాటించి.. నేను నా మిత్రుడిని చేరుకోవాలి’’అని రాయంచ తొందర చేసింది.
అలా రాయంచతో కలిసి యువరాణి తన రాజ్యానికి తిరుగుముఖం పట్టింది.
* * *
విజయుడు తాను వెళ్ళవలసిన మార్గాన్ని మననం చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. అప్పుడప్పుడు వెనక్కితిరిగి చూస్తున్నాడు. యువరాణిని అడవి సరిహద్దు దాటించి వస్తానన్న రాయంచ రాకకోసం చూస్తున్నాడు. మంత్రాల దీవికి చేరవలసిన మార్గం రాయంచకు బాగా తెలుసు.
విజయుడు అలా ఆలోచిస్తూ ఉండగానే ఒక్కసారిగా పంచకల్యాణి ఆగింది ఏదో ప్రమాదాన్ని సూచిస్తూ.. తన రెండు కళ్ళూ ఒకేసారి పైకి లేపింది. ఈ హఠాత్ పరిణామానికి కింద పడబోయిన విజయుడు చివరి క్షణంలో పడిపోకుండా ఉండగలిగాడు. మొదటిసారి పంచకల్యాణి చేష్టకు నివ్వెరపోయాడు.
ఏమైనది పంచకల్యాణి? అని మృదువుగా దాని తలమీద చేయివేసి అడిగాడు.

-సశేషం

- శ్రీ సుధామయి