డైలీ సీరియల్

జ్వాలాముఖి.. మంత్రాలదీవి-23

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పక్కనే ఉన్న పొడవాటి కొమ్మను చేతిలోకి తీసుకున్నాడు.
చిన్న కర్రను సైతం కరవాలంగా మార్చగల యోధుడు విజయుడు.
ఎప్పుడైతే పొడవాటి కొమ్మను గాల్లోకి లేపాడో అప్పుడే ఆ పొడవాటి కొమ్మ విజయుడి చేతిలోనుంచి అదృశ్యమైంది.
ఒక్క క్షణం గురుదేవుడు ఉపదేశించిన మంత్రం గుర్తొచ్చింది. ఆపద సమయంలో అనివార్యం అనుకున్నపుడు ప్రయోగించవలసిన మంత్రం.
ఒక సర్పాన్ని ఎదుర్కోవడం కోసం ప్రయోగించాలా? విజయుడిలో పట్టుదల పెరిగింది. ఒంటి చేత్తో అవలీలగా సింహాలను ఎదుర్కోగల తను వెనుకడుగు వేయకూడదు. ధైర్యాన్ని కోల్పోకూడదు’’ అనుకున్నాడు. సర్పాన్ని తన చేతులతో మట్టుబెట్టాలని నిర్ణయించుకున్నాడు.
మనసులో గురుదేవుడిని, తన ఇష్టదైవాన్ని ప్రార్థించాడు.
సర్పం అతని ఎదురుగా నిలబడింది.. పడగ ఎత్తింది. కాటువేయడానికి సిద్ధపడింది.
* * *
రాయంచ గాల్లోకి ఎగురుతున్న గరుడ పక్షిని సమీపించింది. గరుడ పక్షి వేగానికి గాలి సైతం సాహో అంటున్నది. తన ఎదురుగా నిలిచిన రాయంచను చూసి లిప్తకాలం ఆశ్చర్యానికి లోనైంది గరుడపక్షి. తన వేగంతో పోటీపడి.. ఎదురుగా తనముందు ధైర్యంగా నిలిచిన చిలుకను చూసి ‘ఇది మామూలు చిలుక కాదు’ అనుకున్నాడు.
‘‘గండబేరుండమా వందనాలు’’ రాయంచ పలికింది.. గరుడపక్షికి ఎదురు నిలిచి..
‘‘ముందు మన్నించాలి మీ మార్గానికి అడ్డుగా నిలిచాను. కానీ తప్పలేదు మిత్రమా’’ అన్నది.
‘‘నీ మాటలు నీ తేజస్సుచూస్తే నువ్వు సాధారణ చిలుకలా లేవు.. ఈ గరుడపక్షి వేగాన్ని అందుకుని ధైర్యంతో నాకు ఎదురు నిలిచావు. నా వలన నీకు కావలసిన సాయం ఏమున్నది? గరుడపక్షి అడిగింది.
‘‘నీ ఆలోచనకు నీ గొప్ప మనసుకు జోతలు మిత్రమా... నా మిత్రుడు మహాపురి యువరాజు చిన్న ఆపదలో చిక్కుకున్నాడు. పోరాడే వ్యవధి లేదు. నేను నీ సాయం అర్ధిస్తున్నాను? రాయంచ చిలుక చెప్పింది ‘మీ యువరాజుకు శక్తిసంపన్నుడు... అలాంటి మహావీరుడికి నా అవసరమా? గరుడపక్షి అన్నది’.
‘‘మహాపురి యువరాజు విజయుడు... క్షుద్ర మాంత్రికుడు వకృటాసురుడిని సంహరించి జ్వాలాముఖిదేవిని ప్రసన్నం చేసుకుని సకల మానవాళిని కాపాడే బృహత్తర ప్రయత్నంలో కార్యార్థిఅయి బయల్దేరాడు. అదృశ్యవనంలో కపాలకుండ మాయచేత ఒంటరిగా ఆయుధాలు లేకుండా మహాసర్పంతో పోరాడుతున్నాడు. కాలయాపన మరింత ప్రమాదకరం. ఆ సర్పాన్ని ఎదుర్కొనే శక్తి నీకు మాత్రమే యున్నది.. ఈ చిన్న ఉపకారం చేసిన యెడల... ‘‘చిలుక మాటలు పూర్తికాకుండానే ‘‘ఎంత మాట మిత్రమా... విజయుడి శక్తిసామర్థ్యాలు లోక విదితాలు. సుధర్ములవారి ప్రియశిష్యులు... లోక కల్యాణంకోసం తన ప్రాణాలనే పణంగాపెట్టిన వీరుడికి ఈ చిన్నసాయం చేయలేనా... పద మిత్రమా... కపాలకుండను ఎదుర్కొనే శక్తిలేదు కానీ ఆ సర్పం పీచమణిచివేస్తా’’
చెప్పి అదృశ్యవనంవైపు తిరిగింది గరుడపక్షి.
రాయంచ ఎప్పటిలానే గరుడపక్షి భుజాలమీద కూచుంది. వాయువేగంతో అదృశ్య వనానికి కదిలింది గరుడపక్షి.
* * *
పొడవైన బలమైన సర్పం విజయుడిని కాటువేయడానికి పడగ విప్పింది. కోరలు బయటకు తీసింది.
విజయుడు ఒంటిచేత్తో సర్పాన్ని ఎదుర్కోవాలని సిద్ధమయ్యాడు. అదే సమయంలో పెద్దగా గాలి వీచింది.
సర్పం భయంతో తలెత్తింది... తన శత్రువు, తనకన్నా బలమైన శత్రువు... అందులోనూ ఉత్తమజాతి గరుడపక్షి ఆగమనం.
సర్పం ఆత్మరక్షణలో పడింది.
కపాలకుండ అగ్నికీలల్లో మరణమా? గరుడపక్షి నోటికి ఆహారమా? తేల్చుకోవాల్సిన సమయం పరిస్థితి ఎదురయ్యాయి.
అప్పుడే భీకరాకారంతో గరుడపక్షి అక్కడికి వచ్చింది. కపాలకుండ కునుకు తీస్తూనే వున్నాడు.
తీక్షణమైన చూపులతో గరుడపక్షి సర్పంవైపు చూసింది. గరుడపక్షికి సర్పానికి మధ్య పోరుమొదలైంది... గరుడపక్షి శక్తిముందు సర్పంశక్తి నిలువలేకపోతుంది. తనకు మరణం అనివార్యం అని తేలింది. విజయుడు ఇంకా విభ్రాంతిలోనే వున్నాడు. రాయంచవైపు కృతజ్ఞతాపూర్వకంగా చూసాడు. తన పరిస్థితిని తెలుసుకుని గరుడపక్షిని తీసుకువచ్చిన ఆలోచనకు ముగ్ధుడవుతున్నాడు.
కపాలకుండా విజయుడితో పోరాడేముందు చెప్పిన మాటలు గుర్తొచ్చాయి సర్పానికి.
‘‘ఆపద సమయంలో నేను చెప్పియున్న మంత్రం పఠించు. నీ బలం రెట్టింపు అవుతుంది’’ ఆ మాటలు గుర్తుకురాగానే సర్పం కపాలకుండ చెప్పిన మంత్రాన్ని పఠించింది. ఒక్కసారిగా సర్పం శరీరం రెండింతలు అవుతూ వస్తుంది. బలం రెట్టింపుఅవుతోంది. గరుడపక్షి కూడా తన శక్తిని పూర్తిగా ఉపయోగించి పోరాడుతుంది. రాయంచ సర్పం బలం పెరగడం గమనించింది. మనసులో తనను ఆశీర్వదించిన సుధర్ములవారిని తలుచుకుంది. కొద్ది ఘడియల్లోనే విషయం అవగతమైంది. రాయంచ రివ్వున గరుడపక్షిని చేయండి. దాని చెవిదగ్గర వాలి చెప్పింది.
ఈ అదృశ్యవనం దాటేలా సర్పాన్ని తీసుకురా మిత్రమా.. ఈ అదృశ్యవనంలో దాని శక్తిరెట్టింపు అవుతుంది. నువ్వెలాగైనా ఆ సర్పం అదృశ్యవనం దాటి వచ్చేలా చేయగలిగితే చాలు. మిగతా కార్యాన్ని మన మిత్రుడు విజయుడు చూసుకుంటాడు అని చెప్పింది.
గరుడపక్షి మనసులో దేవదేవుడిని తల్చుకుని వేడుకున్నాడు. ‘‘నిన్ను నా భుజాలమీద తీసుకువెళ్లే అదృష్టాన్ని, నీ వాహనాన్ని నిలిచినా భాగ్యాన్ని కలిగించవు.
ఈ మాయా సర్పాన్ని నోట కర్చుకుని ఈ అదృశ్యవనాన్ని దాటే శక్తిని అనుగ్రహించు ప్రభూ.’’
ఆ విధంగా దేవుడిని ప్రార్థించగానే కొత్త శక్తివచ్చి చేరినట్టు అనిపించింది గరుడపక్షికి. -సశేషం

- శ్రీ సుధామయి