డైలీ సీరియల్

జ్వాలాముఖి.. మంత్రాలదీవి-24

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనసులో మరోసారి దేవుడిని ప్రార్థించి గాల్లోకి ఎగిరి తన నోటితో సర్పాన్ని నోట కర్చుకుని గాల్లోకి ఎగిరాడు... అదృశ్యవనాన్ని దాటి వచ్చాడు. సర్పాన్ని నేలమీద జారవిడిచాడు.
ఎప్పుడైతే అదృశ్యవనం దాటి వచ్చిందో శాపం తన యథారూపానికి వచ్చింది.
వెంటనే అక్కడికి వచ్చిన విజయుడు తన కరవాలంకోసం చూస్తున్నంతలోనే గాల్లోనుంచి ఎగిరి అతని చేతుల్లోకి వచ్చింది కరవాలం...
విజయుడు కరవాలాన్ని బిగించి పట్టుకుని తన గురుదేవుడిని మనసులో తల్చుకుని తనమీదకి వస్తోన్న సర్పాన్ని కరవాలంతో రెండుముక్కలు చేసాడు. సర్పం రెండుభాగాలుగా విడిపోయి నేలమీద గిలగిలా కొట్టుకుని మాయమైంది.
ఆ స్థానంలో ఒక సర్పకన్య ప్రత్యక్షమైంది.
‘‘నన్ను శాపవిముక్తురాలిని చేసిన మహావీరుడికి ఆగర్భ శత్రువైనను నన్ను సంహరించక ప్రాణాలతో నేలమీదికి జారవిడిచి గరుడపక్షికి, నా శాప విమోచనానికి కారణమైన రాయంచకు వందనాలు’’అంది సర్పకన్య. విజయుడు ఆశ్చర్యంగా చూసాడు.
‘‘మహావీర నా పేరు సర్పముఖి... నాగలోకవాసిని... తపస్సు చేస్తోన్న మునిపుంగవుడిని కన్నుమిన్నుకానక ఆటపట్టించాను.. అడవిలో నాగలోకం జాడ కానరాక మామూలు సర్పంలా జీవించమని శాపం పెట్టాడు. ఒక మహావీరుడి కరవాలం స్పర్శతో నా శాపజీవితం అంతమవుతుంది శాప విమోచనాన్ని చెప్పాడు. కాపలావుండే నన్ను బంధించి మిమ్మల్ని తుదముట్టించమన్నాడు..మీ కరవాల స్పర్శతో నేను నా పూర్వరూపాన్ని పొందాను. నేను చేయగల సాయం ఏమైనాఉంటే సెలవివ్వండి’’ సర్పముఖి అంది.
అప్పుడు విజయుడు ‘‘నావలన మీరు పూర్వరూపం పొందినందుకు మిక్కిలి సంతోషంగా వున్నది. మంత్రాల దీవికి సులువుగా వెళ్లేమార్గం చూపించండి... వ్యవధి లేదు... వకృటాసురుడి సంహారం... జ్వాలాముఖీదేవి ప్రసన్నరూపం రెండూ ఏకకాలంలో జరిగిపోవాలి. ఈ విశ్వానికి వకృటాసురుడి పీడ విరగడఅవ్వాలి’’ అన్నాడు.
‘‘మహావీరా మీకు జయం కలుగుతుంది.. ఇక్కడినుంచి దక్షిణంవైపు వెళ్తే సముద్రం వస్తున్నది. సముద్రం దాటగలిగితే మంత్రాల దీవి చిటికెలో చిక్కేను’’ చెప్పింది సర్పముఖి.
విజయుడు ఒక్క క్షణం ఆలోచనలో పడద్దు... సముద్రాన్ని దాటడం ఎలా?
అదే సమయంలో సర్పముఖి మాట్లాడుతూ ‘‘మహావీరా ముందు కపాలకుండ అడ్డుతొలగించుకోండి... అతని ప్రాణం అతని నాభిలోవున్న చిన్న కుండలో వున్నది... మీకు జయం జయం.. నాకిక సెలవు ఇప్పించండి’’ అంది.
విజయుడు చేతులు జోడించాడు. సర్పముఖి అదృశ్యమైంది.
గరుడపక్షి విజయుడివైపు చూసి ‘‘మహావీరా సర్పముఖికి శాపవిమోచనం కలిగించారు... మీరు కారణజన్ములు... నేను మీకు ఏవిధంగా సాయపడగలనో సెలవివ్వండి’’ అంది.
‘‘కపాలకుండ బలం అదృశ్యవనంలో రెట్టింపుఅవుతుంది... కపాలకుండను ఇక్కడికి తీసుకువస్తే అతడిని సంహరించడం తేలిక..’’ తన ఆలోచన చెప్పాడు విజయుడు.
‘‘అర్థమైనది మహావీరా... చిటికెలో మీరుచెప్పిన కార్యం నెరవేరుస్తాను’’అని చెప్పి గరుడపక్షి గాల్లోకి ఎగిరింది.
విజయుడు రాయంచ వైపు చూసి ‘‘మిత్రమా నీకు ఈ విజయుడు రుణపడిపోతున్నాడు.’’ మనఃస్ఫూర్తిగా అన్నాడు.
* * *
కునికిపాటు నుంచి ఉలిక్కిపాటుతో కళ్ళు తెరిచాడు కపాలకుండ... ఎదురుగా సర్పం జాడలేదు. విజయుడు కనిపించలేదు... నిద్ర తెచ్చిన చేటును గుర్తుచేసుకుని కలవరపాటుతో పైకిలేచాడు. అప్పుడే అతనికి చెవులకు భీకరమైన శబ్దం వినిపించింది. తలెత్తి చూసాడు కపాలకుండ. అతడికి ఆకాశంనుంచి తన వైపే ఎగురుకుంటూ వస్తోన్న గరుడపక్షి కనిపించింది. అది తన వైపే చూస్తూ వుంది.
‘‘గండబేరుండమా ఎంత గర్వం... నన్ను చూసి భయంతో పారిపోకుండా... నా తలమీదుగా ఎగురుతున్నావా? చూడు నినే్నం చేస్తానో...’’అంటూ కపాలదండాన్ని గాల్లోకి లేపాడు.
గరుడపక్షి నవ్వి ‘‘మూర్ఖుడా నువ్వు ననే్నంచేస్తావు... నువ్వు వకృటాసురుడికి బానిసవు... ననే్నమీ చేయలేవు... చేతనైతే నన్ను సమీపించు’’అంటూ అదృశ్యవనంలో వున్న ఒక బండరాయి మీద నిలబడి అన్నది.
‘‘అక్కడే కదలక మెదలక వుండు... నిన్ను నామరూపాలు లేకుండా చేస్తాను’’అంటూ వేగంగా పెద్దపెద్ద అంగలువేస్తూ బండరాయివద్దకు చేరాడు. గరుడపక్షి ఆ బండరాయి నుంచి మరో బండరాయిని చేరింది... ఆవేశంలో ఆలోచనను విస్మరించిన కపాలకుండ ముందుకు నడిచాడు. అలా ఒక్కో బండరాయిని దాటుతూ అదృశ్యవనం వెలుపలికి వచ్చాడు.
అక్కడ కరవాలాన్ని దూసి విజయుడు ఎదురుపడ్డాడు. ‘‘ఓరీ మాయావి.. దుష్టమాంత్రికుడి బానిస... నీవు ఆయువు మూడింది... నా చేతిలో నీకు మరణం తప్పదు. నన్ను వేడు... కనికరించి వదిలివేస్తాను’’ విజయుడు అన్నాడు.
కపాలకుండ కోపం తారాస్థాయికి చేరింది.
‘‘ఓరుూ అల్ప మానవా...ననే్న ప్రాణభిక్ష కోరమందువా... నీ ఆయువు మూడింది... నీ తలను మా గురువుకు కానుకగా సమర్పిస్తాను... కాచుకో’’అంటూ కపాలదండం కరవాలంగా మారింది. రెండు కత్తులు దూసుకున్నాయి. విజయుడు ఒడుపుముందు కపాలకుండ కరవాలం నిలవలేకపోయింది. అతడి ఆవేశం మరింత తారాస్థాయికి చేరింది.
కరవాలాన్ని పైకిలేపాడు. కరవాలం కపాలదండంగా మారింది. కాపాలదండాన్ని గాలికి విసిరాడు... గాలిలోనుంచి విచిత్ర ప్రాణులు పుట్టుకొచ్చాయి.
విజయుడు పంచకళ్యాణి దగ్గరికి వెళ్ళాడు. అంబుల పొదిలోనుంచి అస్త్రాలు తీసాడు. గురుదేవుడిని స్మరించి అస్త్రాలను సంధించాడు. -సశేషం

- శ్రీ సుధామయి