డైలీ సీరియల్

జ్వాలాముఖి.. మంత్రాలదీవి-25

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ అస్త్రాలు గాలిలోకి వెళ్లి తిరిగి భూమివైపు ప్రయాణిస్తూ ఒక్కో అస్త్రం విడిపోయి విచిత్ర ప్రాణులను చేరాయి. అస్త్రాలు తగలగానే ఆ విచిత్ర ప్రాణులు గాలిలోనే కలిసిపోయాయి.
కపాలకుండ మరోసారి కపాలదండాన్ని గాల్లోకి లేపాడు. అప్పుడే గరుడపక్షి వేగంగావచ్చి కపాలదండాన్ని నోటకర్చుకుని గాల్లోకి ఎగిరింది. కపాలకుండ అలానే స్థాణువైపోయాడు. అతని శక్తులన్నీ కపాలదండంలోనే వున్నాయి.
అలా గాల్లోకి చూస్తుండగానే గరుడపక్షి కపాలదండాన్ని అదృశ్యవనంలోకి తీసుకువెళ్లి అందులోకి విసిరేసింది. అదే అదునుగా విజయుడు తన చేతిలో వున్న పిడిబాకును కపాలకుండ నాభివైపు విసిరాడు... గురిలో విజయుడిని ఓడించిన వాడులేడు. అతని గురితప్పలేదు. పిడిబాకు వేగంగా గాల్లోనుంచి దూసుకువెళ్లి కపాలకుండ నాభిని చీల్చింది. నాభి స్థానంలో చిన్న కుండలాంటి ఆకారం... పిడిబాకు మొన ఆ ఆకారాన్ని తగలగనే పడ్డ శబ్దం.
పెద్దగా ఆర్తనాదాలు చేస్తూ కుప్పకూలిపోయాడు కపాలకుండ.
* * *
క్షుద్ర పూజలో కూచొనివున్న వకృటాసురుడు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. అతని ముందువున్న యజ్ఞగుండంలో ఒకేసారి వచ్చి పడ్డాడు కపాలకుండ. అతని నాభిస్థానం రక్తంతో తడిసిపోయింది. యజ్ఞగుండంలో మంట చల్లారింది. గుహలో మెరుపులు ఉరుములు... కోపంగా కళ్ళుతెరిచాడు వకృటాసురుడు... ‘‘మన్నించు మహామంత్రికా.. ఆ మానవుడు సామాన్యుడు కాదు... తస్మాత్ జాగ్రత్త’’అంటూనే ప్రాణాలు విడిచాడు.
కోపంతో లేచాడు వకృటాసురుడు... నిలువెత్తు జ్వాలాముఖి విగ్రహంవైపు చూసాడు. అక్కడినుంచి ముందుకు కదిలాడు... గాల్లో వేలాడుతూ మొండం లేని తల... ఆ తలవైపు చూసి... చూపించవే ననె్నదురించు ఆ మొనగాడిని... చిటికెలో వాడిని జ్వాలాముఖికి బలి ఇస్తాను’’అంటూ తన మంత్ర దండాన్ని శూన్యంలో వేలాడుతోన్న తల చుట్టూ తిప్పాడు. ఆ తలలోవున్న నోటి భాగం తెరుచుకుంది.
* * *
విజయుడు చూస్తూ ఉండగానే కపాలకుండ పెద్దగా ఆర్తనాదంచేస్తూ మాయమయ్యాడు... అదృశ్యవనంకూడా మాయమైంది.
‘‘నీకు మరోమారు కృతజ్ఞతలు గండబేరుండమా...’’ మనఃస్ఫూర్తిగా అన్నాడు విజయుడు.
‘‘మహావీరా మీరు లోక కళ్యాణంకోసం చేస్తోన్న ఈ యజ్ఞంలో మేము సమిధలుగా మారడానికి కూడా సంసిద్ధులమే... ఇప్పుడు తక్షణ కర్తవ్యాన్ని యోచించండి.’’ గురడపక్షి అంది.
విజయుడు కొద్ది క్షణాలు కళ్ళుమూసుకున్నాడు. ఆపై గౌడపక్షివైపు చూసి... ‘‘నీవు చేయవలసిన కార్యం మరొకటి వున్నది’’ అన్నాడు.
‘‘సెలవివ్వండి మహావీర... శిరసా వహిస్తాను’’ అన్నాడు గరుడుడు.
‘‘మమ్మల్ని మంత్రాల దీవికి చేర్చాలి’’ గరుడపక్షి వైపు చూసి అన్నాడు.
‘‘నా ప్రాణాలు సైతం అర్పిస్తాను. కానీ మహావీరా... మంత్రాల దీవి చేరాలంటే ఒకే మార్గం... సముద్రాన్ని దాటి ఆవలకు వెళ్ళాలి. సముద్రంలో వకృటాసురుడు సృష్టించిన దుష్టశక్తులు ఉంటాయి. అదియును కాక సముద్ర ప్రయాణం మిక్కిలి కష్టం. చాలా కాలం పడుతుంది.. నేను మా ఇలవేల్పు గరుత్మంతుడిలా బలవంతుడను శక్తివంతుడను కాను’’ తన నిస్సహాయతను వెలిబుచ్చాడు.
విజయుడు ఆలోచిస్తూ వున్నాడు. రాయంచ కూడా దీనికి పరిష్కారం ఏమిటా? అని యోచిస్తున్నది. అప్పుడు స్ఫురణకు వచ్చినది. వెంటనే రాయంచ విజయుడివైపు చూసి...
‘‘మిత్రమా... మరిచితివా గురుదేవుల మాట... ఆపద సమయంలో నువ్వు కోరుకున్న తీరే మార్గం...’’అంటూ గుర్తుచేసింది.
విజయుడి మదిలోని ఆలోచన కూడా అదే. ఒకే ఒకసారి ఉపయోగించగల మంత్రం.
విజయుడు కళ్ళుమూసుకున్నాడు. గురుదేవుడ్ని ప్రార్థించాడు. అనంతరం గరుడపక్షి వైపు తిరిగి ‘‘మిత్రమా గరుడా... ఏకాగ్రతగా కళ్ళు మూసుకుని నీ ఇష్టదైవానిర్వర్తించు. నేను నా గురుదేవుడు నాకు ఉపదేశించిన మంత్రాన్ని పఠిస్తాను.. ఆ మంత్రప్రభావం చేత నీకు మమ్మల్ని వాయుమార్గంలో సముద్రాన్ని దాటించే శక్తి వస్తుంది.’’ అని చెప్పాడు.
గరుడపక్షి కళ్ళు మూసుకుంది. విజయుడు పద్మాసనములో కూచొని గురుదేవుడిని స్మరించాడు.
‘‘గురుదేవా... మంత్రాల దీవికి వెళ్ళవలెనంటే సముద్రాన్ని దాటాలి... నా మిత్రుడు గరుడికి ఆ శక్తికి ప్రసాదిస్తే ఆకాశమార్గంలో మంత్రాల దీవికి చేరుతాం. నన్ను అనుగ్రహించు గురుదేవా’’ అంటూ గురుదేవుడు ఉపదేశించిన మంత్రాన్ని పఠించాడు. ఆ మంత్ర ప్రభావం చేత చెట్లు వుయ్యాలలూగాయి. ప్రకృతి చల్లబడింది. క్రమక్రమంగా గరుడపక్షి పరిణామం పెరుగుతూ వచ్చింది. చూస్తూ ఉండగానే విజయుడి ఎత్తులోకి వచ్చింది గరుడపక్షి. పొడవాటి రెక్కలు... భీకరమైన ఆకారం..
సాక్షాత్తు గరుత్మంతుడే అక్కడికి వచ్చినట్టు ఉంది.
గరుడపక్షి తన రూపాన్ని తనే నమ్మలేకపోయింది. ‘మహావీరా ధన్యోష్మిని.. మీ ఆజ్ఞకు బద్ధుడిని.. మిమ్మల్ని మంత్రాలదీవికి చేర్చడానికి సదాసిద్ధం’’ అంది.
* * *
రాయంచ ఆ అద్భుతాన్ని అలానే చూస్తూ ఉండిపోయింది. విజయుడు పరమానంద భరితుడు అయ్యాడు. పంచకళ్యాణి వైపు తిరిగి ‘‘పంచకళ్యాణి నువ్వు మన రాజ్యానికి తిరిగి వెళ్ళు.. మాంత్రికుడిని సంహరించి జ్వాలాముఖిదేవి అనుగ్రహంతో తిరిగివస్తాను. నేను కుశలమే అని మహాపురి వాసులకు తెలియజేయి. ఈ గరుడమిత్రుడు నావెంటే ఉంటాడు’’అని చెప్పాడు.
‘‘వెళ్ళు వెళ్ళు పంచకళ్యాణి మిత్రమా... వెళ్ళేప్పుడు కోసల రాజ్యానికి వెళ్లడం మర్చిపోకు... మన విజయుడు కుశలం యువరాజుకు తెలియజేయి...’’అని విజయుడి వైపు తిరిగింది.
యువరాజు విజయుడు తన కంఠంలో వున్న హారాన్ని పంచకళ్యాణికి ఇచ్చాడు.

-సశేషం

- శ్రీ సుధామయి