డైలీ సీరియల్

వేదాలలో వైజ్ఞానిక విశేషాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మార్కండేయ పురాణంలో ఒక చోట సంకేతాత్మకమైన కథ ఒకటి వుంది. అది పరాశక్తి పెద్ద సేనతో వచ్చి రాక్షసులమీద యుద్ధం చేస్తోంది. రాక్షసరాజు వచ్చి ‘‘ఇంతమందిని సహాయం పెట్టుకొని యుద్ధం చేస్తున్నావు. ఇదేమి పరాక్రమం?’’ అని హేళన చేశాడు. దానికి దేవి నవ్వి- ‘‘నీకు చూడటం చేతకాదు. వీరంతా నాలోంచివచ్చిన శక్తులే. ఇపుడు చూడు’’ అంటూ అందర్నీ తనలోకి కలిపేసుకొని, ఒక్కతెగా నిలబడి రాక్షసులను సంహరించింది.
ఈ కథ కూడా శక్తిలోంచి పదార్థం పుట్టి, మళ్లీ శక్తిలో కలిసిపోవటమనే వైజ్ఞానిక సత్యాన్ని నిరూపిస్తోంది. ఐతే, ఈ సత్యాన్ని వైజ్ఞానిక ప్రయోజనాల కోసం వాడుకున్న వివరాలు కావాలంటే, మనకు ఇంకా కొంత పురాతన వైజ్ఞానిక సాహిత్యం దొరకవలసి వుంది.
10. వేదాలలో ఇంజనీరింగ్
ఏ నాగరికతయొక్క గొప్పతనానికైనా ప్రాతిపదిక ‘శాశ్వతత్వమే’. శాశ్వతమైన భవనాలు, రోడ్లు, బావులు, నగరాలు మొదలైననీ ఇలాంటి సూచికలే. ప్రణాళికాబద్ధమైన వివిధ నిర్మాణాలూ, కట్టడాలూ దృఢంగా కలకాలం నిలిచి వుండాలంటే సువ్యవస్థితమైన ఇంజనీరింగ్ శాస్త్ర పరిజ్ఞానం వుండాలి. ఆ పరిజ్ఞానం గ్రంథాలలో అక్షర రూపంలోవుండటమే కాక, ఆ అయరాలా ఆ పరిజ్ఞానాన్ని వినియోగించి నిర్మించిన నిర్మాణాలు సాక్ష్యంగా నిలిచి వుండాలి.
ఈ రెండు పరీక్షలకూ నిలిచిన అద్భుతమైన ఇంజనీరింగు శాస్త్రం వేదకాలం నుంచి వుండేదని చెప్పటానికి అనేక ఆధారాలున్నాయి.
అథర్వ వేదంలోని శాలానిర్మాణ సూక్తంలోని అనేక మంత్రాలలో స్థిరమైన నిర్మాణాల ప్రస్తావన వుంది.
స్థిరమైన నిర్మాణాలు చేటప్టడానికి ప్రధానంగా కవాలసినది భూమిని గురించిన శాస్ర్తియ పరీక్ష.
‘‘పూర్వం భూమిం పరీక్షేత పశ్చాత్ వాస్తు ప్రకల్పయేత్వల్మీకేన సమాయుక్తా, భూమిరస్థి గణైస్తు యా
రంధ్రాన్వితా చ భూర్వర్జ్యా గర్తౌ ఘైశ్చ సమన్వితా అని మత్స్య పురాణం 253వ అధ్యాయం 11వ శ్లోకం నిర్దేశిస్తోంది.
చీమల పుట్టలు, ఎముకలు, కలుగులు, కన్నాలు, బొందలు లేక గుంటలు వున్న భూమిని నిర్మాణానికి పరహరించాలి అని దీని అర్థం. క్రీ.శ. 6వ శతాబ్ది నాటి విశ్వకర్మ విరచిత వాస్తు శాస్త్ర గ్రంథంలోని 5వ శ్లోకం ఇలా చెబుతోంది.
వర్ణ గంధ రసాకార దిక్ శబ్ద స్పర్శ నైరపి
పరీక్షైై్యవ యథా యోగ్యం గృహ్ణీయాత్ ద్రవ్యముత్తమం
ఎక్కడ నిర్మాణం జరుగుతోందో ఆ స్థంలోని మట్టి రంగు, రుచి, వాసన, శబ్దము, ధ్వని, స్పర్శ, దిక్కు-వీటన్నింటినీ పరిశీలించి దానిని బట్టి అనుగుణమైన భవన నిర్మాణ పదార్థాలను సేకరించుకోవాలి.
క్రీ.పూ. 5వ శతాబ్ది నాటి కాశ్యప శిల్పం అనే గ్రంథంలో, ఒకానొక భూమి భవన నిర్మాణానికి అనుకూలమైనదా, కాదా అని తెలిపే పరీక్షా విధానం ఇలా తెలుపబడింది.
‘‘రత్ని మాత్రమితే గర్తే పరీక్ష్యఖాత పూరణే
అధికే శ్రీయామాప్నోతి న్యూనే హానిం సమే సమం
(రత్ని అనగా పిడికిలి తక్కువగా వున్న మూర. చిటికెనవేలు చాచిన మూర కొలత అరత్ని)
రత్ని ప్రమాణంతో (చేతి పొడుగు) గుంట తవ్వి, ఆ మట్టితోనే ఆ గుంటను పూడ్చాలి. మట్టి మిగిలితే ఆ భూమి భాగ్యప్రదం, తక్కువైతే హానికరం. సమంగా సరిపోతే సాధారణం అని అర్థం! భవన నిర్మాణ విషయంలో ఈ సూత్రం ఇప్పటికీ పాటింపబడుతోంది.
నిర్మాణ రంగంలో ఇటుకలు కూడా చాలా ప్రాధాన పాత్ర వహిస్తాయి.
హరప్పా నాగరికతలోని ఇంజనీరింగు అద్భుతాలలో ఆనాడు వాడిన ఇటుకల్ని కూడా చెప్పుకోవచ్చు. ఉత్తరం నుంచి దక్షిణానికి సుమారు 950 మైళ్ళు వ్యాపించిన ఈ నాగరికతలోని ఇంజనీరింగు నిర్మాణాలన్నీ శాస్ర్తియమైనవి, ప్రామాణికమైనవి అని చెప్పటానికి వాటిలో వాడిన ఇటుకలు కూడా ఒక ఆధారం! ఆ రోజులలో ఆయా ప్రాంతాలలో విభిన్న నిర్మణాలలో వాడిన ఇటుకలనీన ఒకే కొలత, ఒకే రూపం కలిగివున్నాయి.
ముఖ్యంగా చెప్పుకోవలసిందేమిటంటే, ఆ ఇటుకలు 5 రకాల విభిన్న కొలతలలో దొరుకుతున్నప్పటికీ, వాటి పొడుగు, వెడల్పు, ఎత్తుల నిష్పత్తి 4:2:1గా స్థిరంగా వుంది. దీన్ని బట్టి ఆనాటి ఇటికల పరిమాణంలో పాటింపబడిన ప్రామాణిక విలువల వెనుక శాస్ర్తియ ఇంజనీరింగు సూత్రాలున్నాయని గుర్తించవచ్చు.
వేదాలలో రకరకాల యజ్ఞయాగాది క్రతువులలో నిర్దిష్ట ప్రమాణాలు, ఆకారాలు గల వేదికల నిర్మాణం వర్ణింపబడివుంది. ఈ నిర్మాణాలకోసం విభిన్న పరిమాణాలూ, ఆకారాలు గల ఇటుకలను స్వీకరించాలని మాత్రమేగాక, ఎన్ని ఇటుకలు స్వీకరించాలో ఆ సంఖ్య కూడా నిర్దేశింపబడి వుంది. ఆ సంప్రదాయాలు ఇప్పటికీ అనుసరింపబడుతూనే వున్నాయి.
శుల్బసూత్రాలు మొదలైన యజ్ఞవేదీ నిర్మాణ సూత్రాలలో ఈనాటికి కూడా అంతుపట్టని సైనే్స కాక, గణిత శాస్త్ర విజ్ఞానం కూడా వుంది. ఇంకావుంది..

- కుప్పా వేంకట కృష్ణమూర్తి