డైలీ సీరియల్

యువర్స్ లవ్వింగ్లీ...14

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ దారిలో నడుస్తుంటే హరితకి ఏదో తెలియని బెరుకుగా అనిపించింది. కాళ్ళు ఒణుకుతున్నట్టనిపించింది. ఆ రోజు మొదటిరోజు కావడంతో అడ్మిషన్ తీసుకోవడానికి వచ్చిన ఫ్రెషర్స్ తప్ప సీనియర్స్ పెద్దగా రాలేదు. అడ్మిషన్‌కి సంబంధించిన ప్రోసెస్ అంతా కావేరే పూర్తిచేయించింది హరితతో. తమతోపాటూ చేరిన వాళ్ళందరినీ గబగబా పరిచయం చేసుకుని వాళ్ళ వివరాలన్నీ సేకరించింది. హరితకి కూడా అందరినీ పరిచయం చేసింది.
‘‘ఎందుకు భయపడతావు!’’ అంది హరిత బెరుకుని గమనించి.
‘‘కొత్తవాళ్ళతో మాట్లాడాలంటే నాకెందుకో కొంచెం ఇబ్బందిగా వుంటుంది’’ గిల్టీగా అంది.
కావేరి నవ్వేసింది. ‘‘ఇవాళ ఫ్రెషర్స్‌ని చేర్చడానికి వాళ్ళతోపాటూ చాలామంది పేరెంట్స్ కూడా రావడంతో సీనియర్స్ మన జోలికి రాకుండా తమ పనేదో తాము చూసుకుని వెళ్లిపోతున్నారు. అందుకే వాతావరణం ప్రశాంతంగా వుంది. రేపట్నుంచీ ర్యాగింగ్ మొదలౌతుంది. నీలా భయపడేవాళ్ళని చూస్తే ముందే లోకువ కట్టేస్తారు. నువ్వు కొంచెం ధైర్యంగా వుండాలి’’ అంది.
ఆ తర్వాత చాలాసేపు అందరూ గ్రూపులు గ్రూపులుగా చేరి తమ పాత కాలేజీల సంగతులు, కొత్త కాలేజీ విశేషాలు మాట్లాడుకున్నారు. ఆ గ్రూపుల్లో అమ్మాయిలతోపాటూ అబ్బాయిలు కూడా చేరడం, చాలామంది అమ్మాయిలు ఏ మాత్రం బిడియం లేకుండా వాళ్ళతో మాట్లాడడం హరితకి కొత్తగా, ఆశ్చర్యంగా అనిపించింది.
వాళ్ళల్లో ఒకబ్బాయి తనవంక అదేపనిగా చూడడం, తను అతనివంక చూసేసరికి చూపులు తిప్పేసుకోవడం గమనించింది హరిత. తెల్లగా పొడుగ్గా స్టైల్‌గా వున్నాడు. మాట్లాడుతూనే, మధ్య మధ్యలో అతడు తనని ఇంకా చూస్తున్నాడా లేదా అని అప్రయత్నంగానే గమనించసాగింది హరిత.
ఆ రోజు అందరూ కలిసి క్యాంటీన్ ఎక్కడుందో వెదుక్కుంటూ వెళ్లి లంచ్ చేశారు. సాయంత్రందాకా టైమెలా గడిచిందో తెలియదు. వాళ్ళందరి పరిచయంతోనూ హరితకి తనలోని బిడియం క్రమంగా కరుగుతున్నట్లనిపించింది.
‘‘హే గాళ్స్... కమ్ దిస్ సైడ్’’ ఆజ్ఞాపూరితంగా వినిపించిన స్వరానికి ఉలిక్కిపడినట్లుగా తల తిప్పి చూసింది హరిత. ఎదురుగా సిమెంటు బెంచీ మీద ఒకళ్ళ భుజాలమీదొకరు చేతులు వేసుకుని కూర్చుని వున్న అమ్మాయిలు కొంతమంది కనిపించారు.
వాళ్ళు పిలిచింది తమనేనా కాదా అన్న సందేహంతో హరిత కావేరి వైపు చూసింది. కావేరి అదేం పట్టించుకోకుండా ముందుకు నడవబోయింది.
‘‘మిమ్మల్నే పిలుస్తుంటే వినబడ్డం లేదా?’’ ఈసారి మరింత కరుగ్గా వినిపించిందా కంఠం.
ఈసారి కావేరి కొద్దిగా ఖంగారుపడినట్లు కనిపించింది. ‘‘సీనియర్సేమో.. ఎందుకొచ్చిన గొడవ? వెళ్ళొద్దాం పదండి’’ అంది.
అందరూ భయపడుతూనే వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. జైల్లోకి అడుగుపెట్టిన కొత్త ఖైదీలని పాత పోలీసులు చూసినట్లు వీళ్ళ వంక చూసారు వాళ్ళు. ‘‘సీనియర్స్ పిలుస్తుంటే అలా వెళ్ళిపోవడమేనా?’’ అంది వాళ్ళలో జీన్స్ ప్యాంట్, టీషర్ట్ వేసుకున్న అమ్మాయి సీరియస్‌గా చూస్తూ.
‘‘సారీ అండీ.. మమ్మల్ని కాదనుకున్నాం’’ అంది కావేరి నవ్వడానికి ప్రయత్నిస్తూ.
‘‘సరే.. సరే.. మీ పేర్లు చెప్పండి?’’
అందరూ గబగబా తమ పేర్లూ తాము అంతకుముందు చదివిన కాలేజీ పేర్లు చెప్పసాగారు. ఆ జీన్స్ ప్యాంట్ అమ్మాయి ముఖం చిట్లించి ‘‘ఆగండాగండి.. పేర్లు చెప్పారు కానీ నెంబర్లు చెప్పరేం?’’ అంది వాళ్ళని వారిస్తూ.
‘‘ఏ నెంబరు? మా రోల్ నెంబరా?’’ అమాయకంగా అడిగారు. ఆ మాటకి ఏదో పెద్ద జోక్ విన్నట్లు ఆ గుంపంతా గొల్లుమని నవ్వారు పొట్టలు చేత్తో పట్టుకుని.
‘‘రోల్ నెంబరు కాదమ్మా, మీ.. నెంబరు! నా పేరు రేఖ, థర్టీసిక్స్. దీని పేరు రమణి, థర్టీ ఫోర్. ఆ బక్కపలచదుందే దాని పేరు స్నేహ, ట్వంటీ ఎయిట్. ముద్దుగా టెన్నిస్ కోర్ట్ అంటాం’’ అంది జీన్స్ ప్యాంట్ వేసుకున్న అమ్మాయి వివరిస్తూ. ఆమె చెప్పిందేమిటో అర్థమవ్వగానే సిగ్గుతో చితికిపోయినట్లనిపించింది వాళ్ళకి. తలలు దించుకున్నారు.
‘‘సిగ్గుపడ్డది చాలు. మిగతాది పెళ్లిపీటలమీద పడుదురుగాని.. అసలంటూ అప్పటికి సిగ్గన్నది మిగిలితే. చెప్పండమ్మా..’’ అంది జీన్స్ ప్యాంటమ్మాయి దగ్గరగా వస్తూ.
ఇంక లాభం లేదనుకుని గొంతు విప్పి తన పేరూ నెంబరూ చెప్పింది కొంచెం ధైర్యం కలిగిన ఒకమ్మాయి. దానితో మిగిలిన వాళ్ళు కూడా సిగ్గువిడిచి చెప్పడం మొదలుపెట్టారు.
మరో అమ్మాయి తన పేరూ నెంబరూ చెప్పగానే ‘‘చూస్తుంటే అంత సీనున్నట్లు లేదు.. బిల్డప్పులొద్దమ్మా.. వున్నది చెప్పు చాలు’’ అన్నారు సీనియర్స్. ఆ మాటలకి మిగిలిన వాళ్ళంతా గొల్లుమని నవ్వులు. ఆ అమ్మాయికి మాత్రం కళ్ళల్లో నీళ్ళు తిరిగినట్లైంది వాళ్ళ నవ్వులకి.
హరిత వంతు వచ్చేసరికి ఆమెకి గొంతు పెగల్లేదు. ఒళ్ళంతా చెమటలు పట్టినట్లైంది. పిటీ ఏమిటంటే ఆమెకి తన.. నెంబరెంతో తనకే తెలియదు. అండర్ గార్మెంట్స్ కావాలన్నా తల్లే వెళ్లి తీసుకువస్తుంది. తనంతట తాను షాపుకి వెళ్లి తెచ్చుకోవాలంటే సిగ్గు. అలాంటి వాతావరణంలో పెరిగిందామె.
‘‘పేరు హరిత..’’ అంటూ నీళ్ళు నమలసాగింది. కాళ్ళు ఒణకసాగాయి సన్నగా.
‘‘నెంబరమ్మా.. నెంబరెంత?’’ అంది జీన్స్ ప్యాంట్ సీనియర్ రెట్టిస్తూ.
ఎంతో కొంత చెప్పి వదిలించుకోవాలన్న ఆలోచన కూడా హరితకి రాలేదు. ‘తెలియదు..’ అంది వణుకుతున్న కంఠంతో.
అంతే.. అందరూ గొల్లుమన్నారు. ఆగకుండా అలా రెండు నిమిషాలపాటూ నవ్వుతూనే వున్నారు. హరిత ముఖం తెల్లగా పాలిపోయింది. కావేరి హరిత వంక జాలిగా చూసింది.
‘‘తెలియదా?’’’ అంటూ మళ్లీ నవ్విందా జీన్స్ ప్యాంట్ అమ్మాయి. హరిత అందం, అమాయకత్వం ఆమెని రెచ్చగొట్టాయి.
‘‘పోనీ నేను చెప్పనా?’’ అంది హరితకి దగ్గరగా వచ్చి ఆమె భుజంమీద చెయ్యి వేస్తూ. ఆ స్పర్శలో వున్న తేడాకి హరితకి ఒళ్ళు గగుర్పొడిచినట్లైంది. భయంతో కళ్ళు మూసుకుంది.

ఇంకా ఉంది

వరలక్ష్మి మురళీకృష్ణ