డైలీ సీరియల్

వేదాలలో వైజ్ఞానిక విశేషాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉదాహరణకు- సంవత్సరం యొక్క పొడుగు 365 రోజులకంటే కొంచెం ఎక్కువనీ, 366 కంటే తక్కువనీ, ఆనాటివారికి తెలుసు. ఒక సంప్రదాయంలో 354 రోజులుండే చాంద్ర సంవత్సరానికి, అధికంగా 11 రోజులను కలపటం వుండేది. ఒకానొక గ్రంథం ప్రకారం ఋతువుల ఆవృత్తిని పూర్తిచేయాలంటే, 360కిపైన మరో 5 రోజులు కలపాలి. 4 రోజులు మరీ తక్కువనీ, 6 రోజులు మరీ ఎక్కువనీ, ఆ గ్రంథంలో వుంది.
వైదిక క్రతువులు సామాన్యంగా ఒక యజ్ఞవేదిక దగ్గర ఆచరించబడుతూ వుంటాయి. చాంద్రమాన సౌరమాన సంవత్సరాల పొడవుల సమన్వయానికి సంబంధించిన ఖగోళీయ సంఖ్యలను బట్టి, ఆ యజ్ఞవేదికల రచన వుంటుంది. ఈ వేదికలు ప్రపంచాన్ని ప్రతీకాత్మకంగా ప్రతిబింబిస్తాయి. సృష్టిలోని భూమి, చోటు, ఆకాశము అనే మూడు అంశాలను ప్రతిబింబిస్తూ మూడు వేదికలుంటాయి. భూమికి ప్రతీక అయిన వేదిక గుండ్రంగానూ, చోటుకు (అంతరిక్షానికి) ప్రతీక ఐన దానిని అర్ధవృత్తంగానూ, ఆకాశానికి (లేక స్వర్గానికి) ప్రతీక ఐన దానిని నలుచదరంగానూ నిర్మిస్తారు. ఆనాటి జ్యామితిలో (జామెట్రీలో) వృత్త వైశాల్యాన్ని చతురస్ర వైశాల్యానికీ, చతురస్ర వైశాల్యాన్ని వృత్త వైశాల్యానికీ సమం చేసే ప్రక్రియలు మనకు కనిపిస్తాయి. అవి భూమినీ, స్వర్గాన్నీ, సమీకరించే ప్రయత్నంలోంచి వెలువడినవే. అతిపురాతన జ్యామితిలో పరిశీలింపబడిన సమస్యల్లో ఇలాంటివి వున్నాయి.
ఈ అగ్నివేదికలు మూడింటినీ మొత్తం 360 ఇటుకలతో నిర్మిస్తారు. వీటిలో భూవేదిక చుట్టూ 21, స్థలవేదిక చుట్టూ 78, ఆకాశవేదిక చుట్టూ 261, ఇటుకలుంటాయి. ఆ విధంగా పైమూడూ వేదికలకూ 21,78,261 అనే సంఖ్యలు ప్రతీకలౌతున్నాయి.
ప్రధాన వేదికను 5 పొరలుగా నిర్మిస్తారు. దాని వౌలిక చతురస్రాకారాన్ని గరుడ, కూర్మాది రూపాలుగా మారుస్తూ వుంటారు. ఇలాంటి 5 పొరల వేదికలను విభిన్నాకారాలుగల వేయి ఇటుకలతో నిర్మిస్తారు. ఇలాంటి నిర్మాణాలు జరగాలంటే ఎన్నో జ్యామితీయ, బీజగణితీయ సమస్యలకు పరిష్కారాలు కావాలి.
ఆ సమస్యలను సమన్వయించుకుంటూ యజ్ఞవేదీ నిర్మాణంలో ఆకారాలను, ఇటుకల సంఖ్యలను, అమరికలనూ నిర్ణయం చేశారు. ఈ నేపథ్యంలో వైదిక యుగాల నాటి వాళ్ళకు యజ్ఞవేదుల నిర్మాణంలో వాడే ఇటుకల సంఖ్య, వాటి గణిత శాస్ర్తియత, వాటి ఇంజనీరింగ్ కూర్పు, తెలియటమే కాదు, ఆ ఇటుకలు వేలాది సంవత్సరాలు చెక్కు చెదరకుండా మనగలిగే విధంగా, గట్టిగా తయారుచేసే విధానం కూడా తెలుసు.
ఇటుకలు- హరప్పా శిథిలాలలో దొరికిన ఇటుకల గట్టితనం, నాణ్యత గురించి చెప్పుకోవాల్సి వుంది. బ్రిటీష్ వారు ముల్తాన్ నుంచి లాహోరు వరకు 19వ శతాబ్దంలో నిర్మించిన రైలు మార్గంలో వాటిని బాలస్ట్స్ (అడ్డబద్దీలు)గా వాడారు.
ఏటేటా వచ్చే వరదనీటిని అదుపు చేసి, వ్యవసాయానికి అనుకూలంగా సారవంతమైన ఒండ్రుమట్టితోపాటు వరదనీటిని ప్రవహింపజేయడం కోసం గట్టి ఇటుకలతో వరద కట్టలు కట్టి నదీ ప్రవాహాలను మళ్లించగలిగారు. ఆ వరద కట్టలు కట్టడంలో ఈ కాల్చిన ఇటుకలు వాడారు. పచ్చి ఇటులు వాననీటికీ, వరదనీటికీ మనే్నవి కాదు. కానీ ఈ కాల్చిన ఇటుకలు వాన నీటినీ, వరద నీటినీ ఎక్కువగా ఇంకనిచ్చేవి కాదు.
ఈ ఇటుకలలో ‘గడ్డి’ వంటి బైండింగ్ మెటీరియల్ వాడేవారు కాదు. అయినా ఈనాటికీ చెక్కు చెదరకుండా వుండటమే కాక, అయిదువేల యేళ్ళు గడిచినా ఈ నాటికి కూడా వాడకానికి పనికివచ్చేటంత గట్టిగా మన్నుతూ వున్నాయి.
క్రీ.శ.6వ శతాబ్దానికి చెందిన ‘కపిల వాత్స్యాయనుడు’ వ్రాసిన ‘మయమతము’, ‘కలామూలశాస్తమ్రు’ అనే గ్రంథాలలో ఈ ఇటుకల తయారీ గురించి అనేక శాస్ర్తియాంశాలు పేర్కొనబడి వున్నాయి.
ఆయన మట్టి రకాలని పేర్కొని, ఇటుకలకు ఏయే రకాల మట్టి పనికొస్తుందో వివరిస్తూ ఇలా చెప్పాడు.
క్షీరద్రుమ కదంబామ్రాభయాక్షత్వక్ జలై రపి
త్రిఫలాంబుభి రాసిక్త్వా మర్దయేత్ మాసమాత్రకమ్
మేడి వంటి పాల చెట్టు, కడిమి చెట్టు, మామిడిచెట్టు, కరక్కాయ చెట్టు, తాండ్ర చెట్టు (అక్షము) బెరడులను, నీళ్లు, త్రిఫల జలాలలో నానబెట్టి, నెల రోజులు మర్దించాలి. (త్రిఫలాలు అంటే కరక, తాటి, ఉసిరి లేక ద్రాక్ష కాశ్మీరీ ఖర్జూరాలు, లేక జాజీ లవంగ పూగాలు)ఇలా తయారైన మట్టితో మూసపోసిన ఇటుకలు ఎన్ని రకాలో వివరించి, వాటి వివిధ కొలతలు కూడా ఇచ్చాడు. బట్టీల్లో ఒకటినుండి నాలుగు మాసాల దాకా కాల్చిన తర్వాత, ఆ ఇటుకలను నీళ్ళలో ముంచి తీసి వాడుకోవాలని చెప్పాడు.
సున్నం- ఇటుకలతో కట్టలు కట్టడానికి కావలసిన పదార్థం సున్నం. ఈ సున్నాన్ని ఎలా తయారుచేయాలో, ఏయే పదార్థాలు ఏయే పాళ్ళల్లో వాడాలో కూడా ఆ గ్రంథాల్లో వివరించాడు.
‘‘పంచాంశం మాషయూషం స్యాత్ నవాష్టాంశం గుడం దధి
ఆజ్యం ద్వ్యంశంతు, సప్తాంశం క్షీరం, చర్మషడంశకమ్
త్రైఫలం దశభాగం స్యాత్, నారికేళం యుగాంశకమ్
క్షౌద్ర మేకాంశకం, త్య్రంశం కదళీఫల మిష్యతే ఇంకావుంది...

కుప్పా వేంకట కృష్ణమూర్తి