డైలీ సీరియల్

జ్వాలాముఖి.. మంత్రాలదీవి-31

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘అంత మాట వద్దు మిత్రమా... లోక కల్యాణంకోసం నువ్వుచేసే ఈ యజ్ఞంలో మేమూ భాగస్వాములం అయ్యాం. తల్లి అనుగ్రహానికి పాత్రులం అయ్యాం... ఆజ్ఞాపించు మిత్రమా’’అంది రాయంచ.
‘‘జ్వాలాముఖీదేవి భీకర ఉగ్రరూపం కనిపించకుండా నీతటి చిలుకలన్నీ జ్వాలాముఖీదేవి శిరస్సును తమ దేహాలతో కప్పివేయాలి. తల్లి బిడ్డలను అనుగ్రహిస్తుందే తప్ప, బిడ్డలపై గ్రహించాడన్న నమ్మకం నాకుంది. భక్తితో దేవి వారిని ప్రసన్నంచేసుకునే ధైర్యంవున్న చిలుకను ఆహ్వనించు అన్నాడు.
వెంటనే క్షణకాలం కూడా ఆలస్యం చేయని రాయంచ చిలుక ఎలుగెత్తి పిలిచింది.
‘చిలుకల్లారా నా మిత్రులారా... జ్వాలాముఖీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి అందరూ తరలిరండి... మన జన్మసార్థకం చేసుకుందాం...’’ అని విన్నవించింది.
విజయుడు అలానే చూస్తోండిపోయాడు.
రాయంచ చిలుక గరుడపక్షి వైపు చూసి ‘‘మిత్రమా దూరప్రాంతంలో వున్న చిలుకలనీ గరుద్వేగంతో కొనిరావా...’’అని అడిగింది.
గరుడపక్షి ఆకాశంలోకి ఎగిరింది. జరుగబోయే అద్భుతాన్ని వీక్షించాడని దేవతలూ ఎదురుచూస్తున్నారు. సమయం గడిచిపోతుంది. చీకట్లు ముసిరితే అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడం సాధ్యమే... మళ్ళీ ఏ వకృటాసురుడో పుట్టుకొస్తాడు. అలా విజయుడు ఆలోచిస్తూనే ఒక్కసారి విస్మయానికి గురయ్యాడు. ఆకాశం మొత్తం చిలుకల్తో నిండిపోయింది. గరుడిమీద వేనవేల చిలుకలు సముద్రాలు దాటి వస్తున్నాయి. కోసల మహాపురి ఇత్యాది రాజ్యాలు ఈ చోద్యాన్ని, అద్భుతాన్ని వీక్షిస్తున్నాయి... చీకట్లు ముసరకముందే జ్వాలాముఖీదేవి గరుడ శిరస్సును భక్తితో చుట్టేసాయి చిలుకలు.. ఏం జరుగుతుందో అనే ఆతృతతో మునులు ఋషులు సైతం ఎదురుచూస్తున్నారు.
జ్వాలాముఖీదేవి అనుగ్రహిస్తుందా? గ్రహిస్తుందా?
రాయంచ జ్వాలాముఖీదేవి శిరస్సుభాగాన నిలిచింది.
ఒక్కసారిగా మెరుపులు ఉరుములు... చీకట్లు ముసిరేవేళ వెలుగురేఖలు జ్వాలాముఖీదేవి సూక్ష్మరూపంలో ప్రసన్నవదనంతో కొలువుతీరింది.
గుహముందు ప్రత్యక్షమైంది.
‘‘నీ అకుంఠిత దీక్షకు, మానవతా ధర్మానికి మిక్కిలి సంతోషించాను. విజయుడా నువ్వు కారణజన్ముడవు... నీ పేరు యశోచంద్రికలతో చిరస్థాయిగా నిలుస్తుంది. రాయంచ చిలుక గరుడపక్షి, పులి, నీ సహవాసంతో శాపవిముక్తులయ్యారు...’’ అంది.
అప్పటికే రాయంచ చిలుక యక్షకన్యగా మారింది. మహాపురిలో వున్న పులి గంధర్వుడిగా మారాడు. గరుడపక్షి యక్షుడయ్యాడు.
‘‘నీ సాహసంతో బుద్ధి కుశలతతో రాజధర్మాన్ని పాటించావు. మానవతా ధర్మాన్ని నిర్వర్తించావు. ప్రజారంజక పాలనతో పృథ్వీ ఉన్నంతవరకు విజయుడనే నామధేయంతో చిరంజీవిగా సుధర్మ హృదయాన చిరస్థాయిగా నిలుస్తుంది. తథాస్తు’’అంటూ దీవించింది జ్వాలాముఖీదేవి.
దేవతలు విజయుడి మీద పుష్పవర్షాన్ని కురిపించారు.
* * *
కన్నుమూసి తెరిచేలోగా విజయుడు మహాపురిలో వున్నాడు. సహస్రదర్శినితో పరిణయం జరిగింది. అతి వైభవంగా మహాపురి కోసల రాజ్యాలకు మహారాజుగా పట్ట్భాషక్తుడు అయ్యాడు విజయుడు.

*
అయిపోయంది

- శ్రీ సుధామయి