డైలీ సీరియల్

యువర్స్ లవ్వింగ్లీ...16

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హరితకి ఎలా చెప్పాలో అర్థం కాలేదు. ‘‘కాలేజ్‌లో ర్యాగింగ్ చేసారు. సీనియర్ అమ్మాయిలు కాదు.. వాళ్ళడిగిన చెత్త ప్రశ్నలకి కూడా సమాధానం చెప్పలేకపోయినందుకు మా జూనియర్సే నన్ను ర్యాగింగ్ చేస్తున్నారు. అంతా నీ వల్లే..’’’ అంటూ జరిగినదంతా చెప్పింది.
హరిత చెప్పింది విని వస్తోన్న నవ్వునాపుకోవడానికి కష్టపడింది సుమతి. ‘‘అయినా అదేం ర్యాగింగూ? అవేం ప్రశ్నలూ? మా కాలంలో మగ పిల్లలు కూడా అలా మాట్లాడేవారు కాదు!’’ అంది ఆశ్చర్యంగా.
తల్లి వంక ఒకసారి కోపంగా చూసి విసవిసా నడుచుకుంటూ తన గదిలోకి వెళ్లి దఢాలున తలుపు వేసుకుంది హరిత. డ్రెస్ మార్చుకుంటూ అద్దం ముందు నిలబడి బ్రా విప్పి ఆసక్తిగా దానిమీద వున్న నెంబర్‌ని మొదటిసారిగా పరిశీలించి చూసింది. అలా చేస్తుంటే విచిత్రంగా ఆమెలో అప్పటిదాకా వున్న కోపం, విసుగూ అన్నీ మాయమైపోయాయి. ఆ ‘తెలుసుకోవడం’ ఏదో కొత్తగా, థ్రిల్లింగా అనిపించసాగింది.
***
మర్నాడు కాలేజీకి బయలుదేరబోతున్న హరితని పిలిచాడు తండ్రి సుదర్శనరావు.
‘‘నిన్న చెప్పడం మర్చిపోయాను.. మా ఫ్రెండు రావుగారమ్మాయి లక్ష్మి మీ కాలేజీలోనే చదువుతోంది. ఎలక్ట్రానిక్స్ థర్డ్ ఇయర్. నీకేమయినా అవసరమైతే ఆ అమ్మాయి సహాయం తీసుకో, రావుకి చెప్పాను’’ అన్నాడాయన.
‘‘సరే నాన్నా’’ అంటూ గబగబా వెనక్కి తిరిగి వెళ్లిపోబోతుంటే సుమతి వచ్చింది గదిలోకి.
‘‘సరేనని బుర్ర ఊపడం కాదు. ఆ అమ్మాయి పేరు, డిపార్ట్‌మెంటూ గుర్తుపెట్టుకో. కాలేజీలో సీనియర్స్ తెలిసిన వాళ్ళుండడం మంచిది. ఎప్పుడో అవసరం వచ్చినపుడు కలిస్తే బావుండదు. ఇవాళే ఒకసారి ఆ అమ్మాయి క్లాసుకి వెళ్లి పరిచయం చేసుకో.. అర్థమైందా?’’ అంది లంచ్ బాక్స్ హరిత బేగ్‌లో సర్దుతూ. హరిత తల్లిని తినేసేలా చూసింది. ఇంక ఆ విషయాన్ని తను మర్చిపోయినా ఆమె మర్చిపోదు. రోజూ కాలేజీకి వెళ్ళే ముందు రెండుసార్లూ, వచ్చాక రెండు సార్లూ గుర్తుచేస్తుంది. ‘ఆ అమ్మాయిని కలుసుకున్నావా?’ అంటూ, తన ప్రాణం తీస్తుంది. అందుకే మర్చిపోకుండా ఆ అమ్మాయిని కలుసుకోవాలనుకుని తండ్రి చెప్పిన పేరూ వివరాలూ మరోసారి మనసులో మననం చేసుకుంది.
****
క్లాసులు ఇంకా మొదలవ్వవని చెప్పడంతో అందరూ కాలేజ్ అంతా తిరుగుతూ చూస్తూ గడిపారు ఆ రోజు చాలాసేపు. మధ్యాహ్నం అవుతుండగా వచ్చి ఆ గుంపులో చేరారు మగపిల్లలు.
‘‘ఇప్పటిదాకా ఎక్కడికి పోయారు?’’ వాళ్ళతో చనువుగా అందొక అమ్మాయి.
‘‘మా ఖర్మ.. ర్యాగింగ్ అంటూ హాస్టల్‌కి తీసుకెళ్ళి మాతో అడ్డమైన పనులూ చేయించారు. ఎలాగో తప్పించుకుని వచ్చాం’’ అన్నారు వాళ్ళు.
వాళ్ళలో అంతకుముందు రోజు తనని చూపులతో తినేసేలా చూసిన అబ్బాయి కూడా వుండడం గమనించింది హరిత. అతడు హరితని గమనించి కళ్ళతోనే పలకరించాడు. మళ్ళీ చూపుల బాణాలు వదలడం మొదలుపెట్టాడు. ఈసారి పరిశీలనగా చూసిందతన్ని హరిత. అతడి చురుకైన కళ్ళలో ఏదో ఆకర్షణ వున్నట్టనిపించింది. ఎవరితో మాట్లాడుతున్నా మధ్య మధ్యలో తను కూడా అతడివంక చూడకుండా వుండలేకపోయింది ఆమె.
సాయంత్రం అంతా ఇళ్ళకి బయలుదేరుతుంటే అతను హరిత పక్కకి వచ్చి ‘హాయ్’ అన్నాడు. హరితకి గుండెలు దడదడలాడాయి అతని పలకరింపుకి.
‘‘అయాం వరుణ్.. మెకానికల్ ఇంజనీరింగ్’’ అన్నాడు అతను.
హరిత ఒక్క క్షణం తడబడింది. తమనెవరైనా గమనిస్తున్నారేమోనని చుట్టూ చూసింది. వాళ్ళంతా ఇదేం పట్టనట్లుగా ఎవరి కబుర్లలో వాళ్ళూ వున్నారు. అప్రయత్నంగానే ‘‘నా పేరు హరిత..
ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్’’ అంది.
ఆమె మాటలు పూర్తయ్యేలోగానే అతను చిన్నగా నవ్వుతూ చేయి చాచాడు కరచాలనం కోసం. హరితకేం చేయాలో అర్థం కాలేదు. అంతకుముందు చదివినదంతా ఆడపిల్లల స్కూల్లోనూ, కాలేజీలోనూ కావడంతో అబ్బాయిలతో ఎప్పుడూ మాట్లాడలేదు.
ఆమె ఏదో ఆలోచించేలోగానే సగం గాల్లోకి లేపిన ఆమె చేతినందుకుని ఏ మాత్రం తడబాటు లేకుండా సున్నితంగా నొక్కి వదిలేశాడు.
హరిత గుండె ఒక్క క్షణం ఆగి మళ్లీ కొట్టుకోవడం మొదలుపెట్టింది.
‘‘రేపు మళ్లీ కలుద్దాం.. బాయ్’’ అని చెప్పి వెళ్లిపోయాడు అతడు అందరితోపాటూ.
హరిత మాత్రం ఈలోకంలో లేనిదానిలా కావేరితోకలిసి బస్సెక్కింది. కొద్దిసేపే అయినా ఆ స్పర్శ చాలాసేపు తన చేతిని అంటి పెట్టుకున్నట్లుగానే అనిపించింది హరితకి. అంతలోనే ఆమెకి తల్లి గుర్తుకు వచ్చింది. తను అబ్బాయిలతో మాట్లాడవద్దని హెచ్చరించి పంపిన తన కూతురు మొదటిరోజే ఒకబ్బాయితో చేయి చేయి కలిపి కరచాలనం చేసిందని తెలిస్తే ఎలా ఫీలవుతుంది? ఆలోచిస్తూనే ఆమె ఇంటికి చేరుకుంది.
ఇంట్లోకి అడుగుపెడుతుంటే అప్పుడు గుర్తొచ్చిందామెకి తన తండ్రి చెప్పిన రావుగారమ్మాయి లక్ష్మిని కలుసుకోలేదన్న సంగతి!
***
‘‘నీ ఒంటరితనం పోగొట్టుకోవాలనుకుంటే పరిచయాలని పెంచుకోవడమే మార్గం. రోజూ నీ అంతట నువ్వుగా వీలైనంతమంది కొత్తవాళ్ళతో మాట్లాడడం మొదలుపెట్టు. ఒక్క నెల రోజుల తర్వాత నీ స్నేహితుల సంఖ్య లెక్కపెట్టుకుంటే నీకే ఆశ్చర్యంగా వుంటుంది’’ హరితకున్న బిడియాన్ని గమనించి సలహా ఇచ్చింది కావేరి.
ఆమె మాటలవల్ల హరిత క్రమక్రమంగా తన బిడియాన్ని పోగొట్టుకుంది. అందరితోనూ మాట్లాడసాగింది. కావేరే కాకుండా మరికొంతమంది అమ్మాయిలు కూడా హరితకి బాగా దగ్గరయ్యారు. కొత్తగా ఏర్పడ్డ స్నేహితులవల్ల ఆమెకి మరికొంత ధైర్యం వచ్చింది. సీనియర్స్ ర్యాగింగ్ చేస్తున్నారు.

ఇంకా ఉంది

వరలక్ష్మి మురళీకృష్ణ